31-10-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో"
(లేదా...)
"పాయసముం దమిం గొనిన వారికి సంతు లభించు టెట్టులో"
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో"
(లేదా...)
"పాయసముం దమిం గొనిన వారికి సంతు లభించు టెట్టులో"
చేయునువింతలుదేవుం
రిప్లయితొలగించండిడీయగజన్మంబరయగఠీవినిస్రుష్టిన్
హాయననాశ్చర్యంబన
పాయసముంగోనినసంతుఁబడయుదురెటులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సృష్టిన్' టైపాటు.
ప్రాయము దాటిన సతులకు
రిప్లయితొలగించండిసాయము జేయంగదలచి సాధువొకండున్
మాయపు మాటలవిని యా
పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాయనిజన్మబంధములుపట్టుచులాగగజీవుడంతలో
రిప్లయితొలగించండితోయమునన్నమున్దినినతోడుతఁజేరునుతల్లిదండ్రులన్
మాయగదోచునీవిధముమాటునదేవునిమర్మమేమిటో
పాయసముందమింగోనినవారికిసంతుగలుంగుటెట్టులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితీయని మాటల తోడను
రిప్లయితొలగించండివేయి విధమ్ములనొకండు విదితము గాగన్
మాయలు జేయును గాదే
పాయసముo గొనిన సంతు బడయుదురెటు లో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమాయయ దేమిటొ తెలుపుము
జాయా! శిశువెట్లు దొరకు శాకినముననన్
తోయలి నవ్వుచు నడిగెను
పాయసముంగొనినసంతుఁ బడయుదు రెటులో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిమాయ యదేమొ తెల్పుమని మాన్యుడు రాముడు కోరెనిట్లుగా
జాయను, సూనలెవ్విధిని శాకినమందు లభింతురో యనన్
బ్రేయసి సీత తానడిగె పెన్మిటి నిట్టుల హాస్యమాడుచున్
బాయసముందమిం గొనిన వారికి సంతుగలుంగు టెట్టులో.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితోయదు మదికిన్ జెప్పగ
తొలగించండిపాయసముం గొనిన, సంతుఁ బడయుదు రెటులో?
వాయసమును తెలుపున గని
రాయిని గొనికొట్ట,కూలె,రండన్నట్లే!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండితీయగ నడిగెను రాముని
జాయ ధరణిసుత వెఱన నిజమనుచు వింటిన్
తోయజలోచనులందరు
పాయసముంగొనిన సంతు బడయుదు రెటులో?
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
వెఱ-ఆశ్చర్యం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాయల యోగి యొక్కడునమాయకు
రిప్లయితొలగించండిలంగడు మోసగించుచున్
బాయసమమ్ముచుండె నది భామలు
సంతతి లేని వారలున్
బాయక తిన్నచో గలుగు భాసుర
సంతని చెప్పుచుండె నా
పాయసముందమింగొనిన వారికి
సంతు గలుంగునెట్టులో!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండినాయన పొలమ్ము దున్నఁగ
తోయలి జనియించె ననుచు దూరెడురామున్
బాయక యనెఁ గుజ "తల్లులు
పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో?"
ఉత్పలమాల
"ఓయమ! భూమి దున్నగనె యొప్పుల కుప్పవు గల్గితెట్లు సీ
తా!" యని రామచంద్రుఁడనఁ దగ్గక మానిని పల్కెనిట్లు" నా
థా! యినవంశరాజమ! గతంబున వింటి నయోధ్య సీమలో
పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?"
👌
తొలగించండి🙏🙏🙏
తొలగించండివాయసమేవిధి పిండముఁ
రిప్లయితొలగించండిబాయక ప్రేతాత్మకిడును బలిహరణముగా
ప్రాయము మీరినపిమ్మట
పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజాయసహితులై కఠుతర
రిప్లయితొలగించండిమౌ యాగమ్ములు సలుపుచు మంత్రఫలంబౌ
కాయను పండును దొరకొను
పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివివాహానంతరం సీతారాముల వేళాకోళము.
రిప్లయితొలగించండిహాయిగ సీతతోడ నపహాసము లాడుచు బల్కెరాముడే,
తోయజ నేత్రులీ భువిని దున్నిన శీఘ్రమె సంక్రమింతురే?
మాయురె! భూవరా! మరి యమాంతము కోసల రాజ్యమందునన్
పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహాయిని పొందును నాలుక
రిప్లయితొలగించండిపాయసముం గొనిన ; సంతుఁ బడయుదు రెటులో
తాయి జనకులొకరికొకరు
పాయుచు వేరుగ వసించు పద్ధతి నుండన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివేయక ప్రశ్నలు త్రాగుము
రిప్లయితొలగించండితీయని పానకమిది క్రిత త్రేతా యుగమున్
ఖాయమది రామ కథకును
పాయసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో
(శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములో ప్రసాద పానకమిస్తూ పిల్లవాని ప్రశ్నకు తల్లి సమాధానము)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆయువు తీరినంతనె నిరామయ దేహము కుప్పకూలగా
రిప్లయితొలగించండివాయసమెవ్విధిన్ పిడచబాయక గైకొని ప్రేతకిచ్చునో
ప్రాయము మీరగన్ కుసుమబాణము త్రాణము నెట్టులిచ్చునో,
పాయసముం దమిం గొనిన, వారికి సంతు గలుంగు టెట్టులో
(ఒక నాస్తికుని మనోగతము)
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రేయసి! క్షేత్రమందునను పేటిక బిడ్డలభించె వింతగా
రిప్లయితొలగించండిరాయని కంచుఁ బల్కగను రాముడు, సీత వచించె గోముగా
రాయి పదంపు రేణువులఁ బ్రాణము గల్గి పడంతి యెట్లగున్ ?
పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈయగ మునిమం త్రించిన
రిప్లయితొలగించండిపాయసముం గోనిన సంతుబడయుదు,రెటులో
కాయది యొక్కటి కాచిన
మాయును గొడ్రాలమచ్చ మమతను బెంచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాయని రోగముల్ గలిగి భవ్యత పోవును దప్పకుండగన్
తొలగించండిపాయసముం దమింగొనువారికి,సంతుగలుంగు టెట్టులో
యాయమ నేర్వకన్ మిగుల నాత్రుత నొందుచు దైవపూజలన్
బాయక చేయుచుండె నిక బార్వతి చల్లగ చూచుటెప్పుడో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమాయని భక్తి తత్పరత మాధవు నమ్ముచు నెమ్మనమ్మునన్
రిప్లయితొలగించండిపాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు గాని గో
మాయువులౌచు పాపముల మానక నాస్తికులై చరించుచున్
పాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏ యెడ నయిన వివాహ
రిప్లయితొలగించండిప్రాయ సముం గైకొనుమ యుపాయము చేతన్
వే యేల మాట లవి పా
పా యసముం గొనిన సంతుఁ బడయుదు రెటులో
ఈయది త్రేత నా యుగమె యెవ్వరు గాంతురు ఋష్యశృంగునిం
దోయజ లోచనుండు దయతో ధరఁ బుట్టునె సంప్రదించి వే
పాయక వైద్య సత్తముని వంధ్యత కింపగు మందు వాడకే
పాయసముం దమిం గొనిన వారికి సంతులు గల్గు టెట్టులో
👌
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండి.ఉ:
రిప్లయితొలగించండిఖాయము చూలు కల్గుటయు కాలపు రీతిని కృత్రిమంబుగన్
ప్రాయము మీర ధారణకు భౌతిక సామ్యము బొందకుండగా
హేయము గాదు నొప్పనిది హే! రఘు రాముడు పుట్టు వైనమై
బాయసముం దమిం గొనిన వారికి సంతు గలుంగు టెట్టులో!
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండి