2-11-2021 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ”(లేదా...)“సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
సమస్య :సాయము జేయువాడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్ ( పాండవుల వద్దకు వస్తున్న శల్యుని మధ్యలో ఆపి సపర్యలు చేసి తన వైపు త్రిప్పుకున్న దుర్యోధనునికి కొరివితో తలగోకుకున్నట్లయింది )ధ్యేయము పంచపాండవుల దిక్కున నుండుట శల్యరాజుకున్ ;మాయగ సత్కృతిన్ సలిపి మంచిగ మారుపు జేసి రాజరా జాయన గర్ణు సారథిగ నాజిని దోడ్పడ గోర ; నట్లనెన్ ;సాయము జేయువాడె కద శత్రువు ; దప్పదు కీడు ; నమ్మినన్ .( ధ్యేయము - లక్ష్యము ; ఆజి - యుద్ధము )
పిల్లకుందేలుసింహంబుపీచమణచదారిఁజూపించికూపంబుదరినిఁజేర్చెతోంగిఁజూచినమ్రుగరాజుఁద్రోసెనపుడుసాయమందించువాడెపోశత్రువనగ
అడగక మునుపే కలుపుకు, యమితముగనువలపు జూపి జేరువయగు, వలదని యనసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగతదుపరి తెలియు ఖలుడని తథ్యముగనుఉత్త ముడని పించుకొనును యుర్విని బొరి సాయ మొనరించువాఁడె పో; శత్రువనఁగకష్టపు ఫలితముల దోచు కర్కశుడును,మనమెదిగినచో జూడలేని మనుజుడు గద!
మంచి తనమును గల్గిన మానవుండు సాయ మొనరించు వాడెపో :: శత్రువనగ కక్ష సాధింప గా జూచి గాసి గూర్ప నెంచు చుండును సతతమ్ము నీతి మాలి
పాయకకౌరవాదులకుభావనమిత్రుడుసౌబలుండెగామాయనుమర్మమున్దెలిపిమార్గముఁదప్పగఁజసెనేగదాదాయలతోడియుద్ధమునధర్మమువీడిరిమేనయల్లురున్సాయముఁజేయువాడెగదశత్రువుఁదప్పదుకీడునమ్మినన్
తేటగీతిసౌరి రథమున శల్యుఁడు సాదియౌచుగురిని తప్పంగఁ దెగడుచుఁ గ్రుంగదీసె!పాండవేయులు గెలువంగ వక్రరీతిసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ!!సుయోధనునితో శకుని :ఉత్పలమాలఆయన నొక్కనిన్ విజయుఁడార్తిగఁ గోరెనటన్న మోదమే?శ్రేయము గూర్చునంచు హరిసేనకు నొప్పిన రాజరాజ! యామాయలమారి వైరులకు మారణహోమపు వ్యూహకర్తయైసాయముఁ జేయువాఁడె కద! శత్రువు!! దప్పదు కీడు నమ్మినన్!!!
"రైలు" "టిక్కెట్టు"దెచ్చెద రయముగానుపెద్ద 'క్యూ'లోన నిలబడవద్దు మీరుడబ్బులిమ్మని మోసగాడైన నాడుసాయమొనరించు వాడెపో శత్రువనగ.
జిమ్మ రీతి నధోగతి చెంది యుండ ,సీమ నొక తారకాణము జేయబోవప్రగతి నడ్డుకొ నెడు ప్రతి పక్ష ములకుసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగజిమ్మ = అధికము
ఉత్పలమాల:రాయినిఁజూపి రత్నమని రాసుల కొద్ది ధనమ్ము కూడ గం జాయిని నమ్మరమ్మనుచు జాలమునన్బడవైచి మిత్రుడై న్యాయ విరుద్ధ కార్యముల నాశలు పెంచుచనుంగు ధూర్తుడై “సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్”-కటకం వేంకటరామ శర్మ.
స్వర్గ తుల్య మటంచును వారవనితపొందు మద్యపానమ్ములే ముదమటంచు పనికి మాలిన వానికి వలయు ధనముసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ.
ప్రాయము తిర్గిరానిదని వాసి సుఖమ్ముల బొందమంచు సారాయము గ్రోలుటన్ మరియు గ్రామణి బొందుటె సౌఖ్యమంచు రూపాయలు లేకపోయెనని బాధయె వీడుమటంచు సొమ్ములన్ సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
జాయయె వీడెనంచు నవసాదము జెందెడు వానిజేరి సారాయము మేలుగూర్చునని గ్రామణి పోందది బాధ తీర్చగన్ హాయిగ గాంచవచ్చు నమరాలయ మంచును దుష్పథమ్ముకై సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
మాయని మచ్చయయ్యె మద మచ్చరికంబున గెంటివేయగా,బాయని నేస్తమున్ విడువ బాపమటంచు దలంపడెవ్విధిన్సోయి నెఱింగి రాజు తుది శోకము బాలవ నెన్నికందునన్సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్.యజ్ఞభగవాన్ గంగాపురం.
మిత్రునకు మిత్రుడగు తన మిత్రునిగనుశత్రువుకుమిత్రుడేతన శత్రువగునుమిత్రుడైనను తనయొక్క శత్రువునకుసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
ద్వేష భావన లేమియు తెలియనీడుస్నేహితునివలె నభినయించి వెనుక మనవైరులకు తదుపరి వైరి వర్గమునకుసాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
చేయిని జాచి యర్ధిలుచు,జెప్పిన పిన్నును మోసగించులే,సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్,హేయము వాని చేష్టలిల, యేమన,డబ్బుల నేటియమ్ములోమాయను జేసి దోచు, మరి మార్చును కార్డును నేర్పుతోడుతన్
ఉ:ఆయువు పోయువాడు పరమాత్మనె యివ్విధి నింద జేతువేశ్రేయము గూర్చయజ్ఞుడికి శిక్షనువేయు గ్రహింప నీతినైన్యాయము గాదు బల్కుటగు నాలుక తోచిన రీతి నిట్లనన్సాయముజేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్వై.చంద్రశేఖర్
న్యాయ విహీను డీ శకుని యంతరమీ వెరుగంగలేవు మీపై యెన లేని ప్రేమ హిత భావముతా నటియించు గాని యన్యాయమె చేయు వీడు వినుమా!'విదురుండు వచించె', రాజ మీసాయము జేయువాడె కద శత్రువునమ్మియు మోసపోకుమా!
కాయముపెంచుగామనకుఖాయముగానిల స్వీటులే సుమీమాయముచేయుగామననుమాటుగదాగుచుతీయదన్నమేదాయనిరోగమైయటులదాచుచువైరముతీయగానిలన్సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
తేటగీతిరాజకీయ వైరములలో సాజ క్రమముపదవి బొంది ప్రముఖుడై విపక్ష మాశ్రయించి ,తనకు మొదటి నుండి యెంత గానొసాయ మొనరించు వాడె పో శత్రు వనగ!ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
మంచి మిత్రుడు గబరిగణించ దగునుసాయమొనరించువాడెపో,శత్రువనగకీడు నొనరించు నెప్పుడు వీడువాడనుదలచక నేరికైనను ,నొవ్వజేయు
హాయను మిత్రుడున్ నిరతి హర్షము తోడను నెల్లవేళలన్ సాయము జేయువాడెకద,శత్రువు దప్పదు కీడునమ్మినన్ బాయక నెల్లవేళలను భద్రముతోడను నుండమేలగున్ సాయముజేయుచో మనకు శంకరుడిచ్చును భోగభాగ్యముల్
ఎంచి విత్తమ్ము ధర్మమ్ముఁ ద్రుంచి త్రుంచి నించి ద్వేషమ్ము మాటలు దంచి దంచి మించి పగవారి కనిశమ్ము పొంచి పొంచి సాయ మొనరించు వాఁడె పో శత్రు వనఁగమాయలు పన్ని మిక్కుటము మంతన మింపుగఁ జేసి భండనన్యాయ మొకింత యేని మది నక్కట యెన్నక మించి సంధి నేఁ జేయ నెదం దలంతు నని చెప్పుచు యుద్ధము, కూర్చి వింటినిన్సాయముఁ, జేయు వాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్ [సాయము = బాణము]
కాయము పెంచి మానసముఁ గాంక్ష ఘటిల్లగ దుష్టుడై యలప్రాయమునందు కన్నియకు భాగ్యములందున నాశ చూపి యాత్మీయునిగా నటించుచును దేవత యంచును మోసగింపగాసాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
ధ్యేయమ దొక్కటై నమదితీరుగ లేకను నాకతాయిగామాయగ మాటలన్ పలికి మంచిగ వేషము వేయువారలౌప్రాయము నందు పోకిరిగ భామల వెంటను తిర్గువారికేసాయము జేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్!!గార బమ్ముగా బెంచగా కడుపు తీపిబుద్ధి మతులను జెప్పకన్ బోధ పరచిసోమరిగ పెంచి వదలగా ,సొత్తులిచ్చిసాయ మొనరించు వాడెపో శత్రువనగ!!
న్యాయముదప్పకెన్నడు సనాతనధర్మమునాచరింపగాసాయముఁ జేయువాఁడు నిజ సన్నిహితుండతడెన్నడేనియున్మాయలమారియౌచు నపమార్గమునందున సంచరించుటన్సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
సమస్య :
రిప్లయితొలగించండిసాయము జేయువాడె కద
శత్రువు దప్పదు కీడు నమ్మినన్
( పాండవుల వద్దకు వస్తున్న శల్యుని మధ్యలో ఆపి సపర్యలు చేసి తన వైపు త్రిప్పుకున్న దుర్యోధనునికి కొరివితో తలగోకుకున్నట్లయింది )
ధ్యేయము పంచపాండవుల
దిక్కున నుండుట శల్యరాజుకున్ ;
మాయగ సత్కృతిన్ సలిపి
మంచిగ మారుపు జేసి రాజరా
జాయన గర్ణు సారథిగ
నాజిని దోడ్పడ గోర ; నట్లనెన్ ;
సాయము జేయువాడె కద
శత్రువు ; దప్పదు కీడు ; నమ్మినన్ .
( ధ్యేయము - లక్ష్యము ; ఆజి - యుద్ధము )
పిల్లకుందేలుసింహంబుపీచమణచ
రిప్లయితొలగించండిదారిఁజూపించికూపంబుదరినిఁజేర్చె
తోంగిఁజూచినమ్రుగరాజుఁద్రోసెనపుడు
సాయమందించువాడెపోశత్రువనగ
అడగక మునుపే కలుపుకు, యమితముగను
రిప్లయితొలగించండివలపు జూపి జేరువయగు, వలదని యన
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
తదుపరి తెలియు ఖలుడని తథ్యముగను
ఉత్త ముడని పించుకొనును యుర్విని బొరి
సాయ మొనరించువాఁడె పో; శత్రువనఁగ
కష్టపు ఫలితముల దోచు కర్కశుడును,
మనమెదిగినచో జూడలేని మనుజుడు గద!
మంచి తనమును గల్గిన మానవుండు
రిప్లయితొలగించండిసాయ మొనరించు వాడెపో :: శత్రువనగ
కక్ష సాధింప గా జూచి గాసి గూర్ప
నెంచు చుండును సతతమ్ము నీతి మాలి
పాయకకౌరవాదులకుభావనమిత్రుడుసౌబలుండెగా
రిప్లయితొలగించండిమాయనుమర్మమున్దెలిపిమార్గముఁదప్పగఁజసెనేగదా
దాయలతోడియుద్ధమునధర్మమువీడిరిమేనయల్లురున్
సాయముఁజేయువాడెగదశత్రువుఁదప్పదుకీడునమ్మినన్
తేటగీతి
రిప్లయితొలగించండిసౌరి రథమున శల్యుఁడు సాదియౌచు
గురిని తప్పంగఁ దెగడుచుఁ గ్రుంగదీసె!
పాండవేయులు గెలువంగ వక్రరీతి
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ!!
సుయోధనునితో శకుని :
ఉత్పలమాల
ఆయన నొక్కనిన్ విజయుఁడార్తిగఁ గోరెనటన్న మోదమే?
శ్రేయము గూర్చునంచు హరిసేనకు నొప్పిన రాజరాజ! యా
మాయలమారి వైరులకు మారణహోమపు వ్యూహకర్తయై
సాయముఁ జేయువాఁడె కద! శత్రువు!! దప్పదు కీడు నమ్మినన్!!!
"రైలు" "టిక్కెట్టు"దెచ్చెద రయముగాను
రిప్లయితొలగించండిపెద్ద 'క్యూ'లోన నిలబడవద్దు మీరు
డబ్బులిమ్మని మోసగాడైన నాడు
సాయమొనరించు వాడెపో శత్రువనగ.
జిమ్మ రీతి నధోగతి చెంది యుండ ,
రిప్లయితొలగించండిసీమ నొక తారకాణము జేయబోవ
ప్రగతి నడ్డుకొ నెడు ప్రతి పక్ష ములకు
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
జిమ్మ = అధికము
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిరాయినిఁజూపి రత్నమని రాసుల కొద్ది ధనమ్ము కూడ గం
జాయిని నమ్మరమ్మనుచు జాలమునన్బడవైచి మిత్రుడై
న్యాయ విరుద్ధ కార్యముల నాశలు పెంచుచనుంగు ధూర్తుడై
“సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్”
-కటకం వేంకటరామ శర్మ.
రిప్లయితొలగించండిస్వర్గ తుల్య మటంచును వారవనిత
పొందు మద్యపానమ్ములే ముదమటంచు
పనికి మాలిన వానికి వలయు ధనము
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ.
రిప్లయితొలగించండిప్రాయము తిర్గిరానిదని వాసి సుఖమ్ముల బొందమంచు సా
రాయము గ్రోలుటన్ మరియు గ్రామణి బొందుటె సౌఖ్యమంచు రూ
పాయలు లేకపోయెనని బాధయె వీడుమటంచు సొమ్ములన్
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
రిప్లయితొలగించండిజాయయె వీడెనంచు నవసాదము జెందెడు వానిజేరి సా
రాయము మేలుగూర్చునని గ్రామణి పోందది బాధ తీర్చగన్
హాయిగ గాంచవచ్చు నమరాలయ మంచును దుష్పథమ్ముకై
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
మాయని మచ్చయయ్యె మద మచ్చరికంబున గెంటివేయగా,
రిప్లయితొలగించండిబాయని నేస్తమున్ విడువ బాపమటంచు దలంపడెవ్విధిన్
సోయి నెఱింగి రాజు తుది శోకము బాలవ నెన్నికందునన్
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్.
యజ్ఞభగవాన్ గంగాపురం.
మిత్రునకు మిత్రుడగు తన మిత్రునిగను
రిప్లయితొలగించండిశత్రువుకుమిత్రుడేతన శత్రువగును
మిత్రుడైనను తనయొక్క శత్రువునకు
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
ద్వేష భావన లేమియు తెలియనీడు
రిప్లయితొలగించండిస్నేహితునివలె నభినయించి వెనుక మన
వైరులకు తదుపరి వైరి వర్గమునకు
సాయ మొనరించువాఁడె పో శత్రువనఁగ
చేయిని జాచి యర్ధిలుచు,జెప్పిన పిన్నును మోసగించులే,
రిప్లయితొలగించండిసాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్,
హేయము వాని చేష్టలిల, యేమన,డబ్బుల నేటియమ్ములో
మాయను జేసి దోచు, మరి మార్చును కార్డును నేర్పుతోడుతన్
ఉ:
రిప్లయితొలగించండిఆయువు పోయువాడు పరమాత్మనె యివ్విధి నింద జేతువే
శ్రేయము గూర్చయజ్ఞుడికి శిక్షనువేయు గ్రహింప నీతినై
న్యాయము గాదు బల్కుటగు నాలుక తోచిన రీతి నిట్లనన్
సాయముజేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
వై.చంద్రశేఖర్
న్యాయ విహీను డీ శకుని యంతర
రిప్లయితొలగించండిమీ వెరుగంగలేవు మీ
పై యెన లేని ప్రేమ హిత భావము
తా నటియించు గాని య
న్యాయమె చేయు వీడు వినుమా!
'విదురుండు వచించె', రాజ మీ
సాయము జేయువాడె కద శత్రువు
నమ్మియు మోసపోకుమా!
కాయముపెంచుగామనకుఖాయముగానిల స్వీటులే సుమీ
రిప్లయితొలగించండిమాయముచేయుగామననుమాటుగదాగుచుతీయదన్నమే
దాయనిరోగమైయటులదాచుచువైరముతీయగానిలన్
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
తేటగీతి
రిప్లయితొలగించండిరాజకీయ వైరములలో సాజ క్రమము
పదవి బొంది ప్రముఖుడై విపక్ష మాశ్ర
యించి ,తనకు మొదటి నుండి యెంత గానొ
సాయ మొనరించు వాడె పో శత్రు వనగ!
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మంచి మిత్రుడు గబరిగణించ దగును
రిప్లయితొలగించండిసాయమొనరించువాడెపో,శత్రువనగ
కీడు నొనరించు నెప్పుడు వీడువాడ
నుదలచక నేరికైనను ,నొవ్వజేయు
హాయను మిత్రుడున్ నిరతి హర్షము తోడను నెల్లవేళలన్
రిప్లయితొలగించండిసాయము జేయువాడెకద,శత్రువు దప్పదు కీడునమ్మినన్
బాయక నెల్లవేళలను భద్రముతోడను నుండమేలగున్
సాయముజేయుచో మనకు శంకరుడిచ్చును భోగభాగ్యముల్
ఎంచి విత్తమ్ము ధర్మమ్ముఁ ద్రుంచి త్రుంచి
రిప్లయితొలగించండినించి ద్వేషమ్ము మాటలు దంచి దంచి
మించి పగవారి కనిశమ్ము పొంచి పొంచి
సాయ మొనరించు వాఁడె పో శత్రు వనఁగ
మాయలు పన్ని మిక్కుటము మంతన మింపుగఁ జేసి భండన
న్యాయ మొకింత యేని మది నక్కట యెన్నక మించి సంధి నేఁ
జేయ నెదం దలంతు నని చెప్పుచు యుద్ధము, కూర్చి వింటినిన్
సాయముఁ, జేయు వాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
[సాయము = బాణము]
కాయము పెంచి మానసముఁ గాంక్ష ఘటిల్లగ దుష్టుడై యల
రిప్లయితొలగించండిప్రాయమునందు కన్నియకు భాగ్యములందున నాశ చూపి యా
త్మీయునిగా నటించుచును దేవత యంచును మోసగింపగా
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్
ధ్యేయమ దొక్కటై నమదితీరుగ లేకను నాకతాయిగా
రిప్లయితొలగించండిమాయగ మాటలన్ పలికి మంచిగ వేషము వేయువారలౌ
ప్రాయము నందు పోకిరిగ భామల వెంటను తిర్గువారికే
సాయము జేయువాడెకద శత్రువు దప్పదు కీడు నమ్మినన్!!
గార బమ్ముగా బెంచగా కడుపు తీపి
బుద్ధి మతులను జెప్పకన్ బోధ పరచి
సోమరిగ పెంచి వదలగా ,సొత్తులిచ్చి
సాయ మొనరించు వాడెపో శత్రువనగ!!
న్యాయముదప్పకెన్నడు సనాతనధర్మమునాచరింపగా
రిప్లయితొలగించండిసాయముఁ జేయువాఁడు నిజ సన్నిహితుండతడెన్నడేనియున్
మాయలమారియౌచు నపమార్గమునందున సంచరించుటన్
సాయముఁ జేయువాఁడె కద శత్రువు దప్పదు కీడు నమ్మినన్