1-11-2021 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్”(లేదా...)“రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్”(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
యత్నములన్నియుజేసివినూత్నపుపోకడపదములనూదుచునుండన్రత్నాంగికవితచిక్కదురత్నములునీవుదాకఱాలుగమారెన్
యత్నించి నేర్వ బోతివిపత్నీ! కారును నడుపగ, పైపై కెగిరెన్రత్నమ్మా! కారు పగిలెరత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
యత్నముతోడుతన్తనయుయాజియునుత్తముగాగచూడగన్రత్నపుపొందికన్కనగరాజిలునుంగరమెక్కడుండెనోరత్నపుసాలభంజికయురాగముమీరగవీధికెక్కెనేరత్నములెల్లమారినవిఱాలుగనీచెయిదాకినంతనేగుణనిధినిర్వాకమిది
కందంపత్నీసమేతుఁడవునైయత్నించి హరీ! కలువ నహల్యాదుల తత్పత్నులు భర్తల మదిలోరత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్! ఉత్పలమాలపత్నిని గల్గియుండి పెఱవారల భార్యల నింద్ర! గూడితే!యత్నమునందహల్య సతులాదిగ నెందరినో రమించఁ దత్పత్నులు నిందలన్ బొగుల వారలు భర్తలమానసమ్ములన్రత్మములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
పత్నిని గని మగ డిట్లనె "రత్నమ్ము ల హార మొకటి రమణీ గొంటిన్ యత్నించి తాకి తీ వది రత్నమ్ములు నీవు దాక రా లు గ మారెన్ "
యత్నము లెన్నియుజేసినపత్నీ,మనసుతుడు మారు భాగ్యము లేదేనూత్నపుటాలోచనలే,రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్!
నూత్నోత్సాహము తోడైయత్నములేఫలమొసంగి హాయినొసగె నోపత్నీ మునిశాపంబునరత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
నూత్నముగా వ్యాపారమురత్నా! చేసితివిగాని రాబడిలేకన్ యత్నము వ్యర్థంబాయెనురత్నములు నీవుదాఁక ఱాలుగ మారెన్.
యత్నము చేసి నేర్చితివి యా కనుకట్టను విద్య దానితో సుత్నిని బేకభుక్కముగ సోమము పోసనమయ్యె గాదుటే హత్నువు జేతబట్ట నది యందుకమయ్యెను చిత్రమేమనన్ రత్నము లెల్ల మారినవి ఱాలుగ నీచెయి దాకినంతటన్.
పత్ని యిడిన నా నందనరత్నములను నీకిడి జయలక్ష్ముల సలుపన్యత్నము జేయనొసగ నారత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
సమస్య :రత్నములెల్ల మారినవి రాలుగ నీచెయి దాకినంతటన్ ( నాస్తికపు వ్రాతల భర్త - దైవభక్తురాలైన భార్య )ఉత్పలమాల ------------యత్నముతోడ దేవతల నందర మిక్కిలి యీసడించుచున్ నూత్నపు దృష్టియంచు మది నొవ్వగ జేయుచు వ్రాయు చుంటివే !పత్నిని చూడ నాస్తికత పండిన మంగళమూర్తి ; మూర్ఖుడా !రత్నములెల్ల మారినవి రాలుగ నీచెయి దాకినంతటన్ .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉత్పలమాల:రత్నములంటిబిడ్డలను రాపిడిబెట్ట సుదూర దేశమున్యత్నముసేసి విద్య కయి నాశ్రమ మందు వసింపజేయ తావత్నగరమ్ము దుష్ట సహవాసపు మత్తున మున్గి భ్రష్టులై రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్”-కటకం వేంకటరామశర్మ.
నూత్న విధానమందున ననూనముగా ధనమొంద నెంచుచున్యత్నముఁ జేయ నీదగు ప్రయత్నము నిష్ఫల మయ్యెఁ గాంచు మోపత్ని! నిజమ్ము నెంచి పరివర్జనఁ జేయవు, నీదు చెయ్దులన్ రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
నూత్నముగా లిఖించితిని నూఱు మనోజ్ఞములైన పద్యముల్పత్ని పఠించి మెచ్చుకొని పంపుమనెన్ గద శంకరయ్యకున్యత్నముతోడ దోషముల నాతఁడు సూపఁగఁ బల్కి తీవిధిన్రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్.
పత్నిగ దలచెడు నీదౌయత్నమును నిరాకరింప యాసిడుదాడిన్యత్నించి చంప వనితారత్నమ్ములు నీవుదాక రాలుగ మారెన్
యత్నమ్మున సఫలతతోరత్నములుగ బండఱాలురంజన గూర్చున్యత్నపు పొల్లతనమ్మునరత్నమ్ములు నీవు దాఁకఱాలుగ మారెన్
నూత్నములు కొన్ని యుండఁగఁ బ్రత్నమ్ములు నుండఁ గొన్ని పంక కరములన్ యత్నించి వాని ముట్టినరత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్రత్న కిరీట భాసిత నరర్షభ! కృష్ణ ! మురారి! మేఁతకై యత్నములం ద్యజించి తమి నప్పుడు గాంచి తవాంగుళీ లసన్నూత్న విశేష రాగ సుమనోహర వంశము మోవి నుంచ,గోరత్నము లెల్ల మారినవి ఱాలుగ, నీ చెయి దాఁకి నంతటన్
పత్నీ! నీకని దెచ్చినరత్నాలుబొదిగి నదండ లక్ష్మీ ప్రతిమన్ యత్నము వ్యర్ధమ యౌనటురత్నమ్ములు నీవుదాక ఱాలుగ మారెన్
నూత్నవధూటి !మా యిలు నోములపంటవ టంచు నమ్మి నీయత్నముచేత గేహమతి యద్భుత రీతిగ మారి గొప్పగానూత్న విరాజమానముగునుంగదయంచు దలంచి నామయోరత్నములెల్ల మారినవి రాలుగ నీ చెయి తాకినంతనే
రత్నము లెల్ల మారినవి ఱాలుగ నీచెయి దాకినంతనేయత్నము నెంతజేసినను నాపగ రానిది నీప్రయత్నమున్ నూత్నమ యమ్మ యాసరము నొవ్వగ జేసితివేమి యిట్లుగారత్నపు నాణ్యమున్ నెఱిగీ రంజిల బోవగ నిట్లుసేతువా?
కందంయత్నము తో పద్యములనునూత్నము నే వ్రాయగా జనుల దీర్పది యున్ప్రత్నపు పద్యములనుచున్రత్నమ్ములు నీవు దాక ఱాలుగ మారెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్ప్రత్నపు-పురాతనపు.
యత్నమునందుపేక్ష నిసుమంతయు జూపక నిష్ఠతోడుతన్నూత్న విధానముల్ నెరప నోరిమిజూపుచు ఱాయియైనతారత్నముగాదె! నీవుననురక్తిని జూపని కారణంబునన్రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
రత్న విభూషణంబొకటి రమ్యముగా దనరింపబూనినన్నూత్న ప్రయోగమయ్యది మనోవ్యధనే మిగిలించెనో సఖీయత్నములెంత జేసినను యాతన మాత్రమె దక్కెనయ్యయో రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
యత్నములన్నియుజేసివి
రిప్లయితొలగించండినూత్నపుపోకడపదములనూదుచునుండన్
రత్నాంగికవితచిక్కదు
రత్నములునీవుదాకఱాలుగమారెన్
యత్నించి నేర్వ బోతివి
రిప్లయితొలగించండిపత్నీ! కారును నడుపగ, పైపై కెగిరెన్
రత్నమ్మా! కారు పగిలె
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
యత్నముతోడుతన్తనయుయాజియునుత్తముగాగచూడగన్
రిప్లయితొలగించండిరత్నపుపొందికన్కనగరాజిలునుంగరమెక్కడుండెనో
రత్నపుసాలభంజికయురాగముమీరగవీధికెక్కెనే
రత్నములెల్లమారినవిఱాలుగనీచెయిదాకినంతనే
గుణనిధినిర్వాకమిది
కందం
రిప్లయితొలగించండిపత్నీసమేతుఁడవునై
యత్నించి హరీ! కలువ నహల్యాదుల త
త్పత్నులు భర్తల మదిలో
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్!
ఉత్పలమాల
పత్నిని గల్గియుండి పెఱవారల భార్యల నింద్ర! గూడితే!
యత్నమునందహల్య సతులాదిగ నెందరినో రమించఁ ద
త్పత్నులు నిందలన్ బొగుల వారలు భర్తలమానసమ్ములన్
రత్మములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
పత్నిని గని మగ డిట్లనె
రిప్లయితొలగించండి"రత్నమ్ము ల హార మొకటి రమణీ గొంటిన్
యత్నించి తాకి తీ వది
రత్నమ్ములు నీవు దాక రా లు గ మారెన్ "
యత్నము లెన్నియుజేసిన
రిప్లయితొలగించండిపత్నీ,మనసుతుడు మారు భాగ్యము లేదే
నూత్నపుటాలోచనలే,
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్!
నూత్నోత్సాహము తోడై
రిప్లయితొలగించండియత్నములేఫలమొసంగి హాయినొసగె నో
పత్నీ మునిశాపంబున
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
రిప్లయితొలగించండినూత్నముగా వ్యాపారము
రత్నా! చేసితివిగాని రాబడిలేకన్
యత్నము వ్యర్థంబాయెను
రత్నములు నీవుదాఁక ఱాలుగ మారెన్.
రిప్లయితొలగించండియత్నము చేసి నేర్చితివి యా కనుకట్టను విద్య దానితో
సుత్నిని బేకభుక్కముగ సోమము పోసనమయ్యె గాదుటే
హత్నువు జేతబట్ట నది యందుకమయ్యెను చిత్రమేమనన్
రత్నము లెల్ల మారినవి ఱాలుగ నీచెయి దాకినంతటన్.
పత్ని యిడిన నా నందన
రిప్లయితొలగించండిరత్నములను నీకిడి జయలక్ష్ముల సలుపన్
యత్నము జేయనొసగ నా
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
సమస్య :
రిప్లయితొలగించండిరత్నములెల్ల మారినవి
రాలుగ నీచెయి దాకినంతటన్
( నాస్తికపు వ్రాతల భర్త - దైవభక్తురాలైన భార్య )
ఉత్పలమాల
------------
యత్నముతోడ దేవతల
నందర మిక్కిలి యీసడించుచున్
నూత్నపు దృష్టియంచు మది
నొవ్వగ జేయుచు వ్రాయు చుంటివే !
పత్నిని చూడ నాస్తికత
పండిన మంగళమూర్తి ; మూర్ఖుడా !
రత్నములెల్ల మారినవి
రాలుగ నీచెయి దాకినంతటన్ .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండిరత్నములంటిబిడ్డలను రాపిడిబెట్ట సుదూర దేశమున్
యత్నముసేసి విద్య కయి నాశ్రమ మందు వసింపజేయ తా
వత్నగరమ్ము దుష్ట సహవాసపు మత్తున మున్గి భ్రష్టులై
రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్”
-కటకం వేంకటరామశర్మ.
నూత్న విధానమందున ననూనముగా ధనమొంద నెంచుచున్
రిప్లయితొలగించండియత్నముఁ జేయ నీదగు ప్రయత్నము నిష్ఫల మయ్యెఁ గాంచు మో
పత్ని! నిజమ్ము నెంచి పరివర్జనఁ జేయవు, నీదు చెయ్దులన్
రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
నూత్నముగా లిఖించితిని నూఱు మనోజ్ఞములైన పద్యముల్
రిప్లయితొలగించండిపత్ని పఠించి మెచ్చుకొని పంపుమనెన్ గద శంకరయ్యకున్
యత్నముతోడ దోషముల నాతఁడు సూపఁగఁ బల్కి తీవిధిన్
రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్.
పత్నిగ దలచెడు నీదౌ
రిప్లయితొలగించండియత్నమును నిరాకరింప యాసిడుదాడిన్
యత్నించి చంప వనితా
రత్నమ్ములు నీవుదాక రాలుగ మారెన్
యత్నమ్మున సఫలతతో
రిప్లయితొలగించండిరత్నములుగ బండఱాలురంజన గూర్చున్
యత్నపు పొల్లతనమ్మున
రత్నమ్ములు నీవు దాఁకఱాలుగ మారెన్
నూత్నములు కొన్ని యుండఁగఁ
రిప్లయితొలగించండిబ్రత్నమ్ములు నుండఁ గొన్ని పంక కరములన్
యత్నించి వాని ముట్టిన
రత్నమ్ములు నీవు దాఁక ఱాలుగ మారెన్
రత్న కిరీట భాసిత నరర్షభ! కృష్ణ ! మురారి! మేఁతకై
యత్నములం ద్యజించి తమి నప్పుడు గాంచి తవాంగుళీ లస
న్నూత్న విశేష రాగ సుమనోహర వంశము మోవి నుంచ,గో
రత్నము లెల్ల మారినవి ఱాలుగ, నీ చెయి దాఁకి నంతటన్
పత్నీ! నీకని దెచ్చిన
రిప్లయితొలగించండిరత్నాలుబొదిగి నదండ లక్ష్మీ ప్రతిమన్
యత్నము వ్యర్ధమ యౌనటు
రత్నమ్ములు నీవుదాక ఱాలుగ మారెన్
నూత్నవధూటి !మా యిలు నోముల
రిప్లయితొలగించండిపంటవ టంచు నమ్మి నీ
యత్నముచేత గేహమతి యద్భు
త రీతిగ మారి గొప్పగా
నూత్న విరాజమానముగునుంగద
యంచు దలంచి నామయో
రత్నములెల్ల మారినవి రాలుగ నీ
చెయి తాకినంతనే
రత్నము లెల్ల మారినవి ఱాలుగ నీచెయి దాకినంతనే
రిప్లయితొలగించండియత్నము నెంతజేసినను నాపగ రానిది నీప్రయత్నమున్
నూత్నమ యమ్మ యాసరము నొవ్వగ జేసితివేమి యిట్లుగా
రత్నపు నాణ్యమున్ నెఱిగీ రంజిల బోవగ నిట్లుసేతువా?
కందం
రిప్లయితొలగించండియత్నము తో పద్యములను
నూత్నము నే వ్రాయగా జనుల దీర్పది యున్
ప్రత్నపు పద్యములనుచున్
రత్నమ్ములు నీవు దాక ఱాలుగ మారెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
ప్రత్నపు-పురాతనపు.
యత్నమునందుపేక్ష నిసుమంతయు జూపక నిష్ఠతోడుతన్
రిప్లయితొలగించండినూత్న విధానముల్ నెరప నోరిమిజూపుచు ఱాయియైనతా
రత్నముగాదె! నీవుననురక్తిని జూపని కారణంబునన్
రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్
రత్న విభూషణంబొకటి రమ్యముగా దనరింపబూనినన్
రిప్లయితొలగించండినూత్న ప్రయోగమయ్యది మనోవ్యధనే మిగిలించెనో సఖీ
యత్నములెంత జేసినను యాతన మాత్రమె దక్కెనయ్యయో
రత్నములెల్ల మారినవి ఱాలుగ నీ చెయి దాఁకినంతటన్