7-11-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పాపివని తిట్టె సీతను పవనసుతుఁడు”(లేదా...)“పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై”
హనుమకిచ్చెనుసీతమ్మహారమోకటినీరసంబునునిదియంచునెంచివీడెరామనామమురుచిఁజూచిరామబంటుపాపివనితిట్టెసీతనుపవనసుతుఁడు
స్త్రీపరుడైన రావణుడు శీలవతిన్ జెరపట్టినందుకే యా పొలిదిండి గాంచగనె యాగ్రహ మందున నూగిపోవుచున్ బాపివటంచు తిట్టెగద పావని, సీతను నిర్దయాత్ముడై పాపెను రామభద్రునకు పంక్తిముఖుండను బాధతోడనే.
తేటగీతిమంచి మాటలు జెప్పిన మౌన ముద్రనున్న రావణ బ్రహ్మను న్యూన బఱచిధైర్య మిచ్చి ప్రాణముల వదల వలదనెపాపివని తిట్టె ,సీతను పవనసుతుడు.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.(క్రమాలంకార పూరణ)
మారు వేషము ధరియించి మాయ జేసి యపహరించి తి లంకేశ యవని సుతను పాపి వని తిట్టె :పవన సుతుడు గాంచె సీత ను లంకలో కన్నులార
పరసతిని చెరబట్టిన పంక్తిముఖునిపాపివని తిట్టె, సీతను పవన సుతుడుశోక మూర్తిగ వనమందు చూచినంతకలత చెందె గాన పలికె కఠినముగను.
రావణాసురు మందిర ప్రాంగణమునహనుమవెదకుచు నిదురించు నతివఁగాంచిజనకసుతయని యెంచితామనమునందుపాపివని తిట్టె సీతను పవనసుతుఁడు
తాపముఁజెందుచున్హనుమతాల్మినివీడుచురావణాసురున్దాపునసుందరిన్గనినధర్మమురోసెనుసంశయాత్ముడైఆఁపెనుసీతగాభ్రమసిహాయనిక్రుంగుచుదీనుడయ్యెగాపాపివటంచుఁదిట్టెగదపావనిసీతనునిర్దయాత్ముడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రమణి సీతను వేధించ రక్క సొకతెపాపివని తిట్టె; సీతను పవనసుతుఁడుపిలువ, రాను రానని తెగబలికె కలికి,వత్తుననె, రావణుడు జావ నెత్తురొలికి.
రమణి జానకిని వెదుక లంక కేగిదశముఖుడు జేసిన పనికి తనివి దీరపాపివని తిట్టె ; సీతను పవనసుతుఁడుకౌతుకము బర్చె రాముడు కలియు ననుచు
రావణుడు అశోక వనములో రాత్రిపూట దీపాల వెలుగు లో సీతను కలుసు కొంటాడు. చెట్ల కొమ్మల మధ్యలో నుండి హనుమ గ్రహించి తన ఆలోచనను తెలిపే ఈ ప్రయత్నము: ఉ: దీపపు కాంతులందు కడు త్రెవ్వన, జానకి చెంత మోహమున్ పాపపు నోట రావణుడు బాలము తీర్చుమటన్ననుగ్రతన్పాపి వటంచు దిట్టెనట పావని;;సీతను నిర్ధయాత్ముడై కోపము చేయుటిట్లు గన కోసల రాముడు శాస్తి చేయడేవై. చంద్రశేఖర్
వాయు పుత్రుడు రావణ బ్రహ్మనుగనిపాపివని తిట్టె; సీతను పవనసుతుఁడుగాంచి రామ సందేశ మందించి మరలెదాశరథి దిక్కు లంకను తగుల బెట్టి
కోపవివేకశూన్యుడు ప్రకోపితమన్మథమోహబద్ధలంకాపరిపాలనాధిగతగర్వకృతాంధ్యుడు మూఢబుద్ధియై వేపథుదేహసంగతను విశ్రుతసాధ్విని రావణుం డహో!పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడైకంజర్ల రామాచార్య.
తేటగీతిపంక్తికంఠుని సతిఁగాంచి పావని యనిభ్రమసి పిదపఁ దా లెంపలు వైచు కొనుచుఁ'దప్పు క్షమియింపఁ గోరెను', దనను తానుపాపివని తిట్టె, 'సీతను పవనసుతుఁడు'ఉత్పలమాలఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు దూరముంచెడున్బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై!
పావని = పవిత్రురాలు
సవరించిన పూరణ:ఉత్పలమాలఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు నన్నుకాదనన్బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై! (పావని = పవిత్రురాలు)
పాపపు దృష్టితో పరుల భార్యనుచూచిన పంక్తికంధరున్కోపముదందడింప కపికుంజరు డాత్మగతంబుగా మహాపాపి వటంచుఁ దిట్టెఁ గద, పావనిసీతను దుష్టబుద్ధితోనీపగిదిన్ చెఱంగొనిన నిక్కటులంగొని దెచ్చినట్టులే
చూపెద స్వర్గమున్ భువిని సుందరి! యెగ్గు మటంచుఁ బ్రేలగాభూపతి రావణాసురుడు భూసుత తోడ, తిరస్కరింపగానాపతి భక్తితత్పర, సుమాస్త్రుని కీలల లోన నెట్టితేపాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై
పాపము మోసపుచ్చి పర పత్నినిజేకొని వచ్చితీవు చీయీపని చేయ నీకు మది యేవిధియొప్పెనటంచు బత్నియేపాపివటంచు దిట్టెగద, పావని సీతనునిర్దయాత్ముడై కోపముతోడ రావణుడు కోమలగాత్రిని తెచ్చె లంకకున్
తనను గాంక్షించు రావణు గినిసి మిగులపాపివనితిట్టె,సీతను పవనసుతుడుకోరెనిమ్మని యేదేని గుర్తు కొఱకుననగ నంగుళీయకమును నతని కిచ్చె
వెదకి లంకలోఁ దనరారు వీధు లిండ్లు కాననమ్ములు కోనలు గాన రాక కలఁత సెంది తనను దాను గాంచ కున్న, పాపి వని తిట్టె, సీతను పవన సుతుఁడు పాపము జానకీ సతికిఁ బట్టెను దుర్గతి యివ్విధమ్ముగం గోపము నూని మిక్కుటము ఘోర దశాస్యుఁడు, పల్కు మారుతీ, నీ పురి లోన రామ సతినిం గన వచ్చితి నన్న రోసి నిన్పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావని సీతను నిర్దయాత్ముఁడై [పావని = పవిత్రురాలు]
ఆపగరాని దుఃఖమున నారటి నొందుచు రావణున్ గసిన్ పాపివటంచు దిట్టెగద పావని,సీతను నిర్దయాత్ముడైరేపులు మాపులున్ననక ఱేయియు ప్రొద్దుల మానకుండగాదాపును జేరుచున్మరుని దాహము దీర్చుమ యంచు గోరెడిన్
అవనిజను గాంచి లంకలోనాంజనేయుడాగ్రహముజెంది యా రావ ణాసురున్నిపాపివని తిట్టె, సీతను పవన సుతుడుగాంచియాయశోక వన రూక్షమ్ము క్రింద
శాపవశంబునందసుర జన్మమునొందిన రావణుండు వాంఛాపరుడై హరించి యటు జానకినా వనమందునుంచగాపాపి వటంచుఁ దిట్టెఁ గద; పావని సీతను నిర్దయాత్ముఁడైతాపసి సీమకంపె గుణధాముడహా రఘురామునేమనున్
హనుమకిచ్చెనుసీతమ్మహారమోకటి
రిప్లయితొలగించండినీరసంబునునిదియంచునెంచివీడె
రామనామమురుచిఁజూచిరామబంటు
పాపివనితిట్టెసీతనుపవనసుతుఁడు
రిప్లయితొలగించండిస్త్రీపరుడైన రావణుడు శీలవతిన్ జెరపట్టినందుకే
యా పొలిదిండి గాంచగనె యాగ్రహ మందున నూగిపోవుచున్
బాపివటంచు తిట్టెగద పావని, సీతను నిర్దయాత్ముడై
పాపెను రామభద్రునకు పంక్తిముఖుండను బాధతోడనే.
తేటగీతి
రిప్లయితొలగించండిమంచి మాటలు జెప్పిన మౌన ముద్ర
నున్న రావణ బ్రహ్మను న్యూన బఱచి
ధైర్య మిచ్చి ప్రాణముల వదల వలదనె
పాపివని తిట్టె ,సీతను పవనసుతుడు.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(క్రమాలంకార పూరణ)
మారు వేషము ధరియించి మాయ జేసి
రిప్లయితొలగించండియపహరించి తి లంకేశ యవని సుతను
పాపి వని తిట్టె :పవన సుతుడు
గాంచె సీత ను లంకలో కన్నులార
రిప్లయితొలగించండిపరసతిని చెరబట్టిన పంక్తిముఖుని
పాపివని తిట్టె, సీతను పవన సుతుడు
శోక మూర్తిగ వనమందు చూచినంత
కలత చెందె గాన పలికె కఠినముగను.
రావణాసురు మందిర ప్రాంగణమున
రిప్లయితొలగించండిహనుమవెదకుచు నిదురించు నతివఁగాంచి
జనకసుతయని యెంచితామనమునందు
పాపివని తిట్టె సీతను పవనసుతుఁడు
తాపముఁజెందుచున్హనుమతాల్మినివీడుచురావణాసురున్
రిప్లయితొలగించండిదాపునసుందరిన్గనినధర్మమురోసెనుసంశయాత్ముడై
ఆఁపెనుసీతగాభ్రమసిహాయనిక్రుంగుచుదీనుడయ్యెగా
పాపివటంచుఁదిట్టెగదపావనిసీతనునిర్దయాత్ముడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరమణి సీతను వేధించ రక్క సొకతె
తొలగించండిపాపివని తిట్టె; సీతను పవనసుతుఁడు
పిలువ, రాను రానని తెగబలికె కలికి,
వత్తుననె, రావణుడు జావ నెత్తురొలికి.
రమణి జానకిని వెదుక లంక కేగి
రిప్లయితొలగించండిదశముఖుడు జేసిన పనికి తనివి దీర
పాపివని తిట్టె ; సీతను పవనసుతుఁడు
కౌతుకము బర్చె రాముడు కలియు ననుచు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరావణుడు అశోక వనములో రాత్రిపూట దీపాల వెలుగు లో సీతను కలుసు కొంటాడు. చెట్ల కొమ్మల మధ్యలో నుండి హనుమ గ్రహించి తన ఆలోచనను తెలిపే ఈ ప్రయత్నము:
తొలగించండిఉ:
దీపపు కాంతులందు కడు త్రెవ్వన, జానకి చెంత మోహమున్
పాపపు నోట రావణుడు బాలము తీర్చుమటన్ననుగ్రతన్
పాపి వటంచు దిట్టెనట పావని;;
సీతను నిర్ధయాత్ముడై
కోపము చేయుటిట్లు గన కోసల రాముడు శాస్తి చేయడే
వై. చంద్రశేఖర్
వాయు పుత్రుడు రావణ బ్రహ్మనుగని
రిప్లయితొలగించండిపాపివని తిట్టె; సీతను పవనసుతుఁడు
గాంచి రామ సందేశ మందించి మరలె
దాశరథి దిక్కు లంకను తగుల బెట్టి
రిప్లయితొలగించండికోపవివేకశూన్యుడు ప్రకోపితమన్మథమోహబద్ధలం
కాపరిపాలనాధిగతగర్వకృతాంధ్యుడు మూఢబుద్ధియై
వేపథుదేహసంగతను విశ్రుతసాధ్విని రావణుం డహో!
పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై
కంజర్ల రామాచార్య.
తేటగీతి
రిప్లయితొలగించండిపంక్తికంఠుని సతిఁగాంచి పావని యని
భ్రమసి పిదపఁ దా లెంపలు వైచు కొనుచుఁ
'దప్పు క్షమియింపఁ గోరెను', దనను తాను
పాపివని తిట్టె, 'సీతను పవనసుతుఁడు'
ఉత్పలమాల
ఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్
రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!
నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు దూరముంచెడున్
బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై!
పావని = పవిత్రురాలు
తొలగించండిసవరించిన పూరణ:
తొలగించండిఉత్పలమాల
ఏపని కేగుచుంటినను యింగితమేమియు లేని రాముఁడున్
రూపసి వైననిన్ను మృగలోచననున్ వనవాసిఁ జేసెనే!
నీపద పీఠి సౌఖ్యముల నింపెడు రావణు నన్నుకాదనన్
బాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై!
(పావని = పవిత్రురాలు)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాపపు దృష్టితో పరుల భార్యనుచూచిన పంక్తికంధరున్
రిప్లయితొలగించండికోపముదందడింప కపికుంజరు డాత్మగతంబుగా మహా
పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావనిసీతను దుష్టబుద్ధితో
నీపగిదిన్ చెఱంగొనిన నిక్కటులంగొని దెచ్చినట్టులే
చూపెద స్వర్గమున్ భువిని సుందరి! యెగ్గు మటంచుఁ బ్రేలగా
రిప్లయితొలగించండిభూపతి రావణాసురుడు భూసుత తోడ, తిరస్కరింపగా
నాపతి భక్తితత్పర, సుమాస్త్రుని కీలల లోన నెట్టితే
పాపి వటంచుఁ దిట్టెఁ గద పావని సీతను నిర్దయాత్ముఁడై
పాపము మోసపుచ్చి పర పత్నిని
రిప్లయితొలగించండిజేకొని వచ్చితీవు చీ
యీపని చేయ నీకు మది యేవిధి
యొప్పెనటంచు బత్నియే
పాపివటంచు దిట్టెగద, పావని సీతను
నిర్దయాత్ముడై
కోపముతోడ రావణుడు కోమల
గాత్రిని తెచ్చె లంకకున్
తనను గాంక్షించు రావణు గినిసి మిగుల
రిప్లయితొలగించండిపాపివనితిట్టె,సీతను పవనసుతుడు
కోరెనిమ్మని యేదేని గుర్తు కొఱకు
ననగ నంగుళీయకమును నతని కిచ్చె
వెదకి లంకలోఁ దనరారు వీధు లిండ్లు
రిప్లయితొలగించండికాననమ్ములు కోనలు గాన రాక
కలఁత సెంది తనను దాను గాంచ కున్న,
పాపి వని తిట్టె, సీతను పవన సుతుఁడు
పాపము జానకీ సతికిఁ బట్టెను దుర్గతి యివ్విధమ్ముగం
గోపము నూని మిక్కుటము ఘోర దశాస్యుఁడు, పల్కు మారుతీ,
నీ పురి లోన రామ సతినిం గన వచ్చితి నన్న రోసి ని
న్పాపి వటంచుఁ దిట్టెఁ గద, పావని సీతను నిర్దయాత్ముఁడై
[పావని = పవిత్రురాలు]
ఆపగరాని దుఃఖమున నారటి నొందుచు రావణున్ గసిన్
రిప్లయితొలగించండిపాపివటంచు దిట్టెగద పావని,సీతను నిర్దయాత్ముడై
రేపులు మాపులున్ననక ఱేయియు ప్రొద్దుల మానకుండగా
దాపును జేరుచున్మరుని దాహము దీర్చుమ యంచు గోరెడిన్
రిప్లయితొలగించండిఅవనిజను గాంచి లంకలోనాంజనేయు
డాగ్రహముజెంది యా రావ ణాసురున్ని
పాపివని తిట్టె, సీతను పవన సుతుడు
గాంచియాయశోక వన రూక్షమ్ము క్రింద
శాపవశంబునందసుర జన్మమునొందిన రావణుండు వాం
రిప్లయితొలగించండిఛాపరుడై హరించి యటు జానకినా వనమందునుంచగా
పాపి వటంచుఁ దిట్టెఁ గద; పావని సీతను నిర్దయాత్ముఁడై
తాపసి సీమకంపె గుణధాముడహా రఘురామునేమనున్