7, నవంబర్ 2021, ఆదివారం

సమస్య - 3895

8-11-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యము కర్ణామృతమని పలుకుట తగునా”
(లేదా...)
“పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే”

41 కామెంట్‌లు:


  1. విద్యార్థి యొకడు వ్రాసిన
    గద్యమునే బట్టిపెట్టి గడగడ మనుచున్
    హృద్యముగా చదువగ విని
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా?

    రిప్లయితొలగించండి
  2. హృద్యపు భావ మనోహర
    పద్యము కర్ణామృత మని పలుకుట తగు:నా పద్యము గొప్ప యనుచు కవి
    మద్యము సేవించు చనుట మాన్యంబగునే !

    రిప్లయితొలగించండి
  3. సోద్యము కాదే!నిజమిది
    పద్యము కర్ణామృతమని పలుకుట; తగునా
    విద్యావంతుల్ చదవక
    యాద్యంతము, లోతు గనక, యాక్షేపించన్

    రిప్లయితొలగించండి


  4. ఆద్యులు వ్రాసినట్టి యొక వ్యాసము గైకొని పాటకుండటన్
    గద్యమె యైననేమనుచు కంఠము నెత్తి జనాళి మెచ్చగా
    హృద్యముగా పఠించెనని యివ్విధి వానిని ప్రస్తుతించుచున్
    పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే.

    రిప్లయితొలగించండి
  5. విద్యలదేవిసందిటనువెల్గులజిమ్ముచుజంటలీభువిన్
    పద్యముపాటయున్గలసిభావమునెమ్మదికందళింపగా
    మద్యముగ్రోలువారివలెమాటలువేయునుపల్కనేలనో
    పద్యముకర్ణపేయమనువాక్కునుబల్కుటసత్యదూరమే

    రిప్లయితొలగించండి
  6. గద్యముచిన్నయసూరిది
    హృద్యంబైనడచుటగనిహర్షంబొదవన్
    విద్యాగంధమునింపగ
    పద్యముకర్ణామృతమనిపలుకుటతగునా

    రిప్లయితొలగించండి
  7. కందం
    సద్యశుడు జాషువా కడు
    హృద్యమ్ముగ వ్రాసెనన హరిశ్చంద్రుని పా
    త్రాద్యంతము జీవించక
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా?

    ఉత్పలమాల
    సద్యశమందె పండితులు జంటకవీశులు గూర్చినంత సం
    వేద్యముగాగ భారతపు ప్రీతినొసంగెడు నాటకమ్మదే
    హృద్యమనంగ గానమున నింపగు రాగములొప్పకున్నఁ ద
    త్పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే!

    రిప్లయితొలగించండి
  8. హృద్యంబౌ పద్యపునై
    వేద్యంబే వీనులకది విందొనగూర్చున్
    గద్యమువలె చదివిననా
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా

    రిప్లయితొలగించండి
  9. మద్యముసేవించి పిదప
    హృద్యంబగుపద్యమొకటి శృతిరహితముగా
    విద్యాహీనుడుపాడగ
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా

    రిప్లయితొలగించండి
  10. మద్యము త్రాగితి వేమో !
    సద్యము యతి లేనిదాని చదివిన గూడన్
    చోద్యముగ నుండె , నీకా
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా !

    రిప్లయితొలగించండి
  11. హృద్యము గాక పోవుటయు, నర్థసమన్వయ గ్రాహ్య శక్తిలో
    మాంద్యత వల్ల,చాలనసమానత వెల్గును జూచె, సత్యమే!
    గద్యము పద్యమెద్దులగు కాడికి, కొందరు "కాదు కాదులే!
    పద్యము కర్ణపేయమనువాక్కును బల్కుట",సత్యదూరమే!

    రిప్లయితొలగించండి
  12. సేద్యము చేసి నిత్యమును చెన్నగు పూర్వపు కావ్య రత్నముల్
    వేద్యుల సంగడిన్, మదిని విద్దెల తల్లికి మ్రొక్కి భక్తితో,
    హృద్య పదమ్ములన్ బొదగి యింపుగ వ్రాయ, ప్రజాళి మెచ్చుచున్
    పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే ?

    రిప్లయితొలగించండి
  13. హృద్యము కాక పోవుటయు, నర్థసమన్వయ గ్రాహ్య శక్తిలో
    చోద్యపు మాంద్యమున్ గలుగు చూపరి మాటలు సైచవచ్చునా?
    గద్యము పద్యమెద్దులగు కాడికి, కొందరు "కాదు కాదులే!
    పద్యము కర్ణపేయమనువాక్కును బల్కుట",సత్యదూరమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

      తొలగించండి
    2. ఆద్యము లేక పాటవము, నర్థసమన్వయ గ్రాహ్య శక్తిలో
      చోద్యపు మాంద్యమున్ గలుగు చూపరి మాటలు సైచవచ్చునా?
      గద్యము పద్యమెద్దులగు కాడికి, కొందరు "కాదు కాదులే!
      పద్యము కర్ణపేయమనువాక్కును బల్కుట",సత్యదూరమే

      తొలగించండి
  14. సద్యశకారకంబు గన ఛందపు రీతుల నందగించెడిన్
    పద్యము వెల్గు హృత్కమలవాసిని భారతి వాగ్విలాసమై;
    విద్యను గారవంబిడక పేర్చిన డాంబికమౌ పదాళినా
    పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే

    రిప్లయితొలగించండి
  15. ఆద్యుల మాటయె యీయది
    పద్యము కర్ణామృతమని,పలుకుట తగునా
    పద్యము కర్ణక ఠోరము
    గద్యము వినసొంపు మదికి కవివరులారా!

    రిప్లయితొలగించండి
  16. పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్యదూరమే
    మద్యము ద్రగువానివలె మాటలు బల్కుట ధర్మమే గిరీ!
    పద్యము శాశ్వతంబునిక భవ్యతగూర్చును నెల్లవారికిన్
    పద్యము గద్యముల్ సదువు పండిత లోకము కర్ణపేయతన్

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. సద్యస్స్ఫూర్తి నుడువ నన
      వద్యము హృద్యమ్ముగఁ బరవశమై చెపుమా
      విద్యాధిక! యిది తగదా
      పద్యము కర్ణామృత మని పలుకుట తగునా


      హృద్య ముదావ హార్థ యుత నృత్య సుచోదక కాహళీ మహా
      వాద్యర వానుగుణ్య పరిపాలిత తాళ విశేష బద్ధ రా
      జద్యమ కా ద్యలంకృత విచక్షణ శబ్ద సరాగ యుక్తమౌ
      పద్యము కర్ణ పేయ మను వాక్కును బల్కుట సత్య దూరమే?

      తొలగించండి
  18. పద్యము కర్ణ పేయమను వాక్కును బల్కుట సత్య దూరమే
    మద్యము గొన్న మానిసికి! మన్నన జేకొని వంద లేండ్లుగా
    హృద్యముగా మనమ్ముల మఱింతగ హత్తుకు పోయినట్టి యీ
    పద్యమె తెన్గు వారలకు వాణి యొసంగిన యాణి ముత్యమౌ!

    రిప్లయితొలగించండి
  19. ఉ:

    సేద్యము జేతు పద్యమని చిత్తము మేరకు నాలపించుచున్
    సద్యము నల్లినాడనని సాధన గొప్పదటంచు దెల్ప గన్
    మద్యపు మత్తులో నొకడు మారుగ నివ్విధి వెళ్ల గక్కనై
    పద్యము కర్ణ పేయమను వాక్కును బల్కుట సత్యదూరమే


    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. కందం
    పద్యపు గానము విని యనె
    పద్యము కర్ణామృతమని ,పలుకుట తగునా
    విద్యా బుద్దులు నేర్వక
    పద్యపు ఛందస్సు కష్ట పాఠ్యమ్మనుచున్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  21. హృద్యము గపద్య విద్యల
    సద్యుల శిక్షణ నెరపసు సాధ్యము యనగన్
    గద్యముగ దలచి చదివిన
    పద్యము కర్ణామృతమని పలుకుట తగునా?!!

    రిప్లయితొలగించండి
  22. సేద్యము చేసి,తీరుగను సృష్టిని జేయగ సాధ్యమేయనన్,
    హృద్యముగా మదిన్ నిలిచి హత్తుకు పోయెడి పద్యమల్లియున్
    గద్యపు రీతినన్ చదువు కావ్యము ,కంఠశోషయై
    పద్యము కర్ణపేయమను వాక్కును బల్కుట సత్య దూరమే !!

    రిప్లయితొలగించండి