10, నవంబర్ 2021, బుధవారం

సమస్య - 3898

11-11-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా"
(లేదా...)
"రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే"

26 కామెంట్‌లు:

  1. పణముగబెట్టుచుజీవిక
    అణగారినకోరికమహర్షిగజనుడే
    ద్వీపముమణినిన్జేరగ
    రణమడిగినభక్తజనులరక్షింపుముమా

    రిప్లయితొలగించండి
  2. అణు వణువు న పర మాత్ముడు
    గుణ వంతుడు గల డ టంచు కోవిద మణి యై
    ప్రణుతించి వేడు కొనుచు శ
    రణ మడిగిన భక్త జనుల రక్షింపు ము మా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదం లో గుణ వంతులు గల డటంచు కోవిద మ ణు లై అని సవరణ చేయడమైనది

      తొలగించండి

  3. అణువణువున గలవనుచును
    ప్రణవాక్షర రూపుడవని పలువిధములుగా
    ప్రణతుల నందగజేసి శ
    రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా.

    రిప్లయితొలగించండి
  4. ప్రణవంబిచ్చినశక్తినికరముతాప్రాణంబుబ్రహ్మంబునై
    అణగారంగనుబాహ్యకోరికలునేకాంతంబునందుండగా
    పణమున్బెట్టుచుజన్మలన్తిరముతాభావింపనీసన్నిధిన్
    రణమున్గోరుచుఁగోల్చుభక్తులనునార్యారక్షసేయంగదే

    రిప్లయితొలగించండి
  5. కందం
    అణువణువున నీ పొడఁగని
    ప్రణతుల నిను వేడుకొనుచు బాధలలోనన్
    వినతించి మోకరిల్లి శ
    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా!

    మత్తేభవిక్రీడితము
    ప్రణవమ్మౌ నిను శాంకరీ! మిగుల నారాధించి సద్భక్తిమై
    ప్రణతుల్ సేయుచు బాధలన్ మునిగి స్తోత్రంబుల్ పఠింపంగ మా
    వినతుల్ వీనులఁ జేరవే జనని! తప్పింపంగ రాకున్నఁ బ్రే
    రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా! రక్ష సేయంగదే!

    రిప్లయితొలగించండి
  6. సమస్య :

    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా

    ( తెలియక చేసిన తప్పులను మన్నింపుమని
    అమ్మనేగా కోరవలసింది )

    కందము
    .............

    క్షణమైనను మరువక న
    క్షీణపు దీక్షను మనమున క్షేమపు దక్షా
    యణివగు నిను దుష్కృతసై
    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ( సవరించిన పూరణ )
      క్షణమైనను మరువము ; వీ
      క్షణ సేయుము మమ్ముల;నిక క్షమతో దక్షా
      యణి ! దయ గొని దుష్కృత సై
      రణమడిగిన భక్తజనుల రక్షింపు ముమా!

      తొలగించండి


  7. క్షణమైనన్ విడి యుండలేక నిను, సాక్షాత్కారమున్ గోరుచున్
    బ్రణవమ్మందున నిల్చియుందువను విశ్వాసమ్ము తోచేసెడిన్
    ప్రణతుల్ గైకొని పాపభారమునునే భంగించు ధీరత్వ వా
    రణముం గోరుచు గొల్చు భక్తులను నార్యా రక్షసేయంగదే.

    రిప్లయితొలగించండి
  8. అణువణువున నీవేగద
    ఫణిభూషణ! నీ కరుణకు పాత్రతనొందన్
    క్షణమొక యుగమని వేచి శ
    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా

    రిప్లయితొలగించండి
  9. కష్టాలలో నున్న భక్తులు ఆవేశం లో పార్వతిని దూశించినప్పటికీ వారి భావన వెలుగు చూపించమని, కష్టాలు తొలగించమని, తారణము అనగా చిన్న పడవ , రక్షగా కోరుతారని చెప్పే ప్రయత్నము:


    మ:

    క్షణికావేశము తోడ దూషణలు లక్ష్యంబేమి లేకుండగన్
    ఘృణి జూపంగను వేడనై, యెలమి మగ్గింపంగ కష్టంబులన్
    మణి మాణిక్యము గోరరైతి రకటా, మన్నింపగా నెంచి తా
    రణముం గోరుచు గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే

    తారణము=చిన్న పడవ , ఆపదల నుండి కాపాడుటకు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  10. గణపతి సుతుగా బడసిన
    ఘన హిమరాట్సుత శివాని గౌరీదేవీ
    మనమున నమ్మి భజించి శ
    రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా!

    రిప్లయితొలగించండి
  11. ఘనుడౌ పర్వతరాజపుత్రి! ,జననీ కాత్యాయనీ! భైరవీ!
    నిను సద్భక్తి భజింప వాంఛితములన్నీడేర్చు దాక్షాయణీ!
    పెను జంజాటము లందుచిక్కుకొని నిర్వేదంబు నొందన్నివా
    రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే

    రిప్లయితొలగించండి
  12. క్షణ కాలము నీ ముద్దుల
    గణేశుని విడి , నిను వేడగ నడరి గుడిలో
    గణగణమని మ్రోగించి శ
    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా

    రిప్లయితొలగించండి
  13. గణపతి తల్లీ! హిమసుత
    ప్రణతులు నీకిడి కొలిచెద పార్వతి మాతా!
    గుణహీనులు జేసి తపము
    రణ మడిగిన, భక్తజనుల రక్షింపు ముమా!

    రిప్లయితొలగించండి
  14. మత్తేభము:
    క్షణికావేశము నేరవృత్తులకు బీజంబై మదింజేరగా
    గుణహీనంబను నీరముల్జిలికి శాఖోత్పత్తి గావించ దా
    రుణవృక్షంబుగ విస్తరించె! తరు దుర్మోహంబుగూలన్ నివా
    "రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే"
    -కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  15. కందము:
    గణపతి మాతా దయగను !
    ప్రణవమ్మే మూలమనుచు, భారపు బ్రతుకుల్
    క్షణభంగుర మనితెలిసి శ
    "రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా"
    -కటకం వేంకటరామ శర్మ.

    రిప్లయితొలగించండి
  16. అణువణువున యున్నావని
    అణకువతో నిన్ను గొలిచి యారాటముతో
    జననీ! గావుమనంచు శ
    రణ మడిగిన భక్తజనుల రక్షింపుముమా!!!

    రిప్లయితొలగించండి
  17. కందం
    క్షణ భంగుర జీవితమని
    క్షణ మొదలక రామ జపము సలిపెడి విభుడౌ
    గణి కోరిక మన్నించి, శ
    రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    గణి-వేదాధ్యయనము చేయు వాడు

    రిప్లయితొలగించండి
  18. ప్రణతులివె వేగొనుచును శ
    రణమడిగిన భక్తజనుల రక్షింపుముమా!
    క్షణమైనను నిను వీడక
    ప్రణతులతో నిన్నుగొలుతు పర్వతపుత్రీ!

    రిప్లయితొలగించండి
  19. ప్రణతుల్ సేయుదు నెల్లవేశలను యోవారాణశీఱేడ!వా
    రణముంగోరుచు గొల్చుభక్తులనునార్యా రక్షసేయంగదే
    యణగుంజేయుడు నాదుకోరికలు బాహాటంబుగాసాయన్
    క్షణమున్ వీడక నిన్నునేగొలుతు నోసామీ దయంగావవే

    రిప్లయితొలగించండి
  20. వ్రణ సన్నిభముగ నాప
    ద్గణములు బాధించు చుండ గతిఁ గానక దా
    రుణముగఁ దపించుచుండ శ
    రణ మడిగిన భక్తజనుల రక్షింపు ముమా


    మణిమన్మాన్య కిరీట ధారిణి! జగన్మాతా! సుదీనార్త యం
    త్రణ దీక్షా రత దేవి! సంతత భవన్నామైక సచ్చింతనా
    ర్పణ సద్బుద్ధి విశుద్ధ చిత్తమునఁ బాపారణ్య శశ్వద్విదా
    రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే

    రిప్లయితొలగించండి
  21. వణికించెన్ భువినీ విషాణువిటులుత్పాతంబుగా మారె మా
    రణహోమంబున మానవాళి కడతేర్చంబూనెనోయమ్మ త
    క్షణమే నీ కరుణా కటాక్షమున తీక్ష్ణంబైన బాధా నివా
    రణముం గోరుచుఁ గొల్చు భక్తులను నార్యా రక్ష సేయంగదే

    రిప్లయితొలగించండి