9, నవంబర్ 2021, మంగళవారం

సమస్య - 3897

10-11-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్"
(లేదా...)
"పురుషుని కంఠమందు సతి పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్"
(బండకాడి అంజయ్య గౌడ్ గారికి ధన్యవాదాలతో...)

45 కామెంట్‌లు:

  1. సరసముగ వేసె దండను

    పురుషుని మెడలోన‌ మగువ,పుస్తెను కట్టెన్

    తరుణికి పురుషుండా పం

    దిరిలో‌ నెల్లరు ను‌కాంచి దీవెన‌ లిడగన్

    రిప్లయితొలగించండి
  2. తిరిగెనుకాలచక్రమునుదీటుగనాథునితోటిచానయున్
    సరిగనున్నిరంగములసాధనఁజేయుచునుండెగాగనన్
    విరిసిననవ్యభావములవింతలులేవుగసంఘమందునన్
    పురుషునికంఠమందుసతిపుస్తెనుగట్టెనుపెండ్లిపందిటన్

    రిప్లయితొలగించండి
  3. విరిదండవేసె నప్పుడు
    పురుషుని మెడలోన మగువ, పుస్తెను గట్టెన్
    ధరణీసురుడు వచింపగ
    వరుడా వధువునకు పెండ్లి పందిట ముదమున్.

    రిప్లయితొలగించండి
  4. వరమాలవేసెను గదా
    పురుషుని మెడలోన మగువ; పుస్తెను గట్టెన్
    పరిణాయకుడే మగువకు
    మురియుచు లగ్న సమయాన పులకింతలతో

    రిప్లయితొలగించండి
  5. అరయగసగమునుతానై
    సరసముఁజూపుచుపురహరుసాన్నిధ్యమునన్
    గౌరియుఁజూపెనుతాళిని
    పురుషునిమెడలోనమగువపుస్తెనుగట్టెన్

    రిప్లయితొలగించండి
  6. సరదా కాదిది నిజమే
    సరిగనె వింటిమి గతమున జరిగిన వార్తే
    మురిపెముతో ముచ్చట గను
    పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్!!


    రిప్లయితొలగించండి
  7. సమస్య :
    పురుషుని కంఠమందు సతి
    పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్

    ( వధూవరులు సమానమనే సమరస
    భావంతో వధువు చేసిన పని )

    పరుషములైన బల్కులను
    బల్కెదరంటగ బూరుషోత్తముల్ !
    మరి యది తాళి గట్టగనె
    మాన్యత హక్కుగ వచ్చునంటగా !
    సరిసరి ! మాకు కావలెను
    చక్కని హక్క" ని వాదులాడుచున్
    బురుషుని కంఠమందు సతి
    పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్ .

    రిప్లయితొలగించండి
  8. వరునికి వేసెను దండ ను
    పురుషుని మెడ లోన మగువ : పుస్తెను గట్టెన్
    తరుణీ గళమున నాతడు
    మురియుచు నుo డ o గ వధువు మోదము తోడన్

    రిప్లయితొలగించండి
  9. కందం
    మురిపించెడు వేదికపై
    వరుఁడొక మందారమాల వధువుకు నటులే
    పరవశమున వేయఁ దిరిగి
    పురుషుని మెడలోన మగువ, పుస్తెను గట్టెన్

    చంపకమాల
    మెరిసెడు తారలున్ దిగెన? మేదినికన్న విధంబు వేదిపై
    మెరయఁగ దీపకాంతులు సమీకృతమై! విరిదండ వైచినన్
    వరుఁడట పెళ్లికూఁతు మెడ, వాల్కనులన్గని మాలవేసినన్
    పురుషుని కంఠమందు సతి, పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్

    రిప్లయితొలగించండి
  10. తమిళ నాడులో ఒకభర్త తాళి కట్టించుకొన్నాడు. దాని ఆధారంగా నా ప్రయత్నము

    చం:

    తరుణులు నుద్య మింపగను ధారుణి యందు సమాన హక్కుకై
    పిరికితనంబు వీడి పలు వేదిక లెక్కి యుపన్యసించుచున్,
    తరుణమటంచు తోచగను తప్పెటు లౌనని చిత్తగింపనై
    పురుషుని కంఠమందు సతి పుస్తెను గట్టెనుపెండ్లి పందిటన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. వరమాలను తగ వైచెను
    పురుషుని మెడలోన మగువ, పుస్తెను గట్టెన్
    పరిణయశుభలగ్నంబున
    పురుషుడు సన్నాయిడోలు మ్రోతలనడుమన్

    రిప్లయితొలగించండి
  12. మురిపెము మీర చేతగొని పూవులమాల నలంకరించె తా
    పురుషుని కంఠమందు సతి, పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్
    సరవిని వేదమంత్రముల సందడియందున పెండ్లి కూతుకున్
    వరుడతి కౌతుకంబుగను వచ్చిన బంధుజనంబు మెచ్చగన్

    రిప్లయితొలగించండి

  13. పరిణయ మందు గాంచగ వివాహపు తంతది సాగెనిట్టులన్
    శిరమును వంచి సిగ్గిలుచు శీఘ్రమె వేసెను పూలదండనే
    పురుషుని కంఠమందు సతి, పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్
    తరుణి గళమ్మునందున యధర్వుడు చెప్ప వరుండు నవ్వుచున్.

    రిప్లయితొలగించండి
  14. పరిణయమున కొనసాగెడు
    తరతరముల పాత రీతి తగదని తలచన్
    తరహా మార్చగ నెంచుచు
    పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్

    రిప్లయితొలగించండి
  15. తరుణి "తలవంపు" నచ్చక
    పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్,
    తెరపై స్త్రీ వాది యొకతె,
    నెరిగించగ స్త్రీ ప్రగతిని యింటన్ మింటన్

    రిప్లయితొలగించండి
  16. కందం
    పరిణయవేళ వధు వొకతె
    చిరు దరహాసమొలకించి చిత్ర మదనగన్
    వరుని పయిమత్తు జల్లుచు
    పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  17. అరకొర సరమును వేసెను
    పురుషుని మెడలోన మగువ,పుస్తిని గట్టెన్
    మరులను గొల్పెడు లక్ష్మికి
    నరసింహులు దశమినాడు నాతిని గనుచున్

    రిప్లయితొలగించండి
  18. విరులను గూర్చు దండను నభీష్టము మేరకు వేసె బ్రీతితో
    పురుషుని కంఠమందు సతి,పుస్తిని గట్టెను బెండ్లి పందిటన్
    నరహరిశాస్త్రి యొక్కడు సనాతనధర్మపరాయణడునౌ
    మురిపెము గొల్పు మాలతికి మోహముతోడను మెచ్చరందఱున్

    రిప్లయితొలగించండి
  19. గురుతర మౌనము దాల్చుచు
    సురుచిర మౌ నూతనంపు సూత్రము తోడం
    గర మనురక్తిఁ దలఁచి నిజ
    పురుషుని మెడలోన మగువ పుస్తెను గట్టెన్


    విరివిగ మ్రోయ వాద్యములు వెల్గఁగ గాంతులు దిక్కు లన్నిటం
    బరఁగఁగ వేద మంత్రములు పమ్మి యొకర్తుక యెత్తఁగా జడన్
    వరుఁడు వధూమణిం గని శుభమ్ముగ మూర్తిఁ దలంచి యా రమా
    పురుషుని కంఠమందు సతి పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్

    [సతి పుస్తె = సతి యొక్క పుస్తె; రమా పురుషుని మూర్తిఁ దలంచి]

    రిప్లయితొలగించండి
  20. వరముగ దక్కె నాథుడని వైచెను చక్కని పూలమాలనా
    పురుషుని కంఠమందు సతి, పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్
    తరుణికి మోదమున్ బతియు, దంపతులిర్వురి షష్టి పూర్తికిన్
    మురియుచు బంధుమిత్రులటు ముచ్చటగా జరిపింప వేడుకన్

    రిప్లయితొలగించండి
  21. అరదగు హాస్యము బెంచగ
    మరదలుగా నాటకాన మైమరపందే
    పరిహాస మాడుచు మామగు
    పురుషుని మెడలోన మగువ పుస్తెనుగట్టెన్.

    రిప్లయితొలగించండి
  22. విరిసరము వేసె ముదముగ
    పురుషుని మెడలోన మగువ , పుస్తెను గట్టెన్
    వరుడు శుభముహూర్తమ్మున
    కురిసెడు నక్షతల నడుమ గూరిమి తోడన్!!!

    రిప్లయితొలగించండి
  23. నిరతము తోడు నీడయయి నిల్చును నాదరి నాస్థతోడుతన్
    మరువగ లేను వానినని మాన్యత తోడుత మాల వేయగా
    పురుషుని కంఠమందు సతి, పుస్తెను గట్టెను పెండ్లిపందిటన్
    హరుడు కరమ్ముప్రేమమున నాహరి బ్రహ్మయు చూచుచుండగా

    రిప్లయితొలగించండి