13-11-2021 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్”(లేదా...)“సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నోరారా మంచిదనుచుధారాళంబుగ బలుకరు,తప్పుల కొరకైయారా తీతురు మరినిస్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
దారా సుతుండ్రకన్ననుసారమె ముఖ్యంబనుచును చరియించెడు ఖట్వారూఢులు వారలె నిస్సారమతులు, మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్.
చారు మనోహర భావము సార యుత పదము లొసంగు సందేశముతో పేరిమి ముదమీయగ ని స్సార మతులు మెచ్చు కొనరు సత్కావ్య మ్మున్
కందంపేరు బడయఁ గవివరుడనిచేరిచి ప్రాసాక్షరములఁ జెప్పుచు 'తవికల్'నేరుచుట శూన్యమన నిస్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్ఉత్పలమాలపేరిచి ప్రాసలన్ వరుస వేడుక జేయు కవిత్వ పంక్తులన్గూరిచితంచుఁ దా కలుపుగోలుగ నుండెడు పాండితీవరున్జేరుచు నిల్లుగట్టి చెవిఁ జిక్కక స్పందన మూల్గెనిట్టులన్, "సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ !"
భూరిగ భోగభాగ్యముల బొందగనెంచుచు వాసి సంపదల్ గోరుచు నాలుబిడ్డలన గూరిమి వీడి యనారతమ్ము బేజారని యెంచకన్ సతము శ్రామికుడై శ్రమియించుచున్ సదా సారమున్ గ్రహింపగల సజ్జనులొప్పరు సత్కవిత్వమున్.
వారలుఋషులునుకాగావేరుగభావముమనసునవెదుకగలేకన్పారమునంటగవేదపుసారమతులుమెచ్చుకొనరుసత్కావ్యముల్
సారములోననారసియుసంగములేకనుసన్మునీంద్రుడైవేరుగలేనిభావమునవేద్యముగాగనుసత్యమీభువిన్వారిజపత్రనేత్రుగనిపారముఁజూచినపండితుండునాసారమునున్గ్రహింపగలసజ్జనులోప్పరుసత్కవిత్వమున్
సార రహితమగు రచననుసారమతులు మెచ్చుకొనరు; సత్కావ్యమ్మున్వారూ వీరూ మరియున్పారంగతులూ పొగుడుచు పఠియింతురుగా
సమస్య :సారమునున్ గ్రహింపగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ ( లోకంలో కొందరు భుజశక్తిప్రియులైన సుజనులే ఉంటారు . వారికి కవిత్వం వంటివి నచ్చవు . )చేరుచు నుందురే బలము చేతుల నిండుగ నున్నవారినే ;కేరుచు జూతురే యరుల కేల్గవ నోర్చుచు గెల్చువారినే ;పోరక జెప్పుచుంటినిదె -పొంగుచు కేవలమల్లయుద్ధదో స్సారమునున్ గ్రహింపగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ .( మల్లయుద్ధదోస్సారము - కుస్తీలలో భుజశక్తి )
తోరముగ పేరడీలిడపేరోలగముల కవులకు విత్తము లీయన్మారమని యెంత జెప్పినసారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్సారమతి = ధనము నందు ఇచ్ఛ కలవాడు
ధారణ చేసినన్ కడు బుధానుల కావ్యము లాస్థతో నసాధారణమైన పాటవము దక్కును వాణి యొసంగ దీవెనల్ప్రేరణ మన్యభాషపయి పెంపెసలారగ తెల్గు పైని నిస్సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
నేరము-ఘోరము కథలనుసారవిహీనంబులైన సాహిత్యంబుల్జోరుగ పఠియించెడునిస్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
కందంజోరుగ జేసిరి రచనలుసారమతులు ,మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్ధారాళముగ కవిత్వపుధారలు వెలయించలేని తార్కిక కవులున్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
ఉ:నేరుగ వ్రాయలేక కడు నెమ్మది మీద సమీకరించనైకోరిన రీతి పద్యములు గొప్పగ నల్లితి నంచు బల్క నాతీరు పరీక్ష జేయనది తేరగ సంగ్రహ మన్న ప్రాజ్ఞ తోసారమునున్ గ్రహింపగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్వై. చంద్రశేఖర్
నారీమణి యొలుకఁగ శృంగారము చెక్కిలిని మీటఁగాఁ బోఱఁ డహో నేరని విధమ్ముగా నిస్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్క్షార విలీన కోమలము చందము సౌరభ హీన పుష్ప వద్ధారము భంగి ఘోరతమ హాలహ లైక కణప్రపూరితక్షీరము భంగి శబ్ద పరికీర్తిత మైనను భావ జాల నిస్సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
సారము లులేని రచననుసారమతులు మెచ్చుకొనరు,సత్కావ్యమ్మున్ నోరార చదువు చుందురువారును వీరలును ననకప్రజలెల్లరున్
సారము లేని పద్యమును సత్కవి వోలెను నెట్టివేళలన్ సారమునున్ గ్రహింపగల సజ్జనులొప్పరు, సత్కవిత్వమున్వారును వీరునున్ ననక భావితరంబులవారునున్ ధరన్ బ్రేరణ గల్గగా జదువ పెంపును నొందును భాష తప్పకన్
సారవిహీనమౌ కథలు సత్యవిదూరపు సన్నివేశముల్ పేరిమిమీర దుర్జనులు వీడక జూచెదరట్టి పొత్తముల్ “సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు, సత్కవిత్వమున్”కోరి పఠింతురెల్లపుడు కొందలపాటును నొందకుండగన్
పారీణతగల కవులిటతీరుగకావ్యములువ్రాయధీమతితోడన్సారస్వత మెరుగని నిస్సారమతులుమెచ్చుకొనరుసత్కావ్యమ్మున్
సౌరుగ డాంబికంపు పదబంధములన్ దగ గూర్చి వ్రాసినన్సారమొకింతలేక యది చక్కని కావ్యమనంగరాదొకో సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు; సత్కవిత్వమున్శారద సత్కృపాకలిత సౌభగమంచు గణింతురెన్నడున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండినోరారా మంచిదనుచు
తొలగించండిధారాళంబుగ బలుకరు,తప్పుల కొరకై
యారా తీతురు మరిని
స్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
రిప్లయితొలగించండిదారా సుతుండ్రకన్నను
సారమె ముఖ్యంబనుచును చరియించెడు ఖ
ట్వారూఢులు వారలె ని
స్సారమతులు, మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్.
చారు మనోహర భావము
రిప్లయితొలగించండిసార యుత పదము లొసంగు సందేశముతో
పేరిమి ముదమీయగ ని
స్సార మతులు మెచ్చు కొనరు సత్కావ్య మ్మున్
కందం
రిప్లయితొలగించండిపేరు బడయఁ గవివరుడని
చేరిచి ప్రాసాక్షరములఁ జెప్పుచు 'తవికల్'
నేరుచుట శూన్యమన ని
స్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
ఉత్పలమాల
పేరిచి ప్రాసలన్ వరుస వేడుక జేయు కవిత్వ పంక్తులన్
గూరిచితంచుఁ దా కలుపుగోలుగ నుండెడు పాండితీవరున్
జేరుచు నిల్లుగట్టి చెవిఁ జిక్కక స్పందన మూల్గెనిట్టులన్,
"సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ !"
రిప్లయితొలగించండిభూరిగ భోగభాగ్యముల బొందగనెంచుచు వాసి సంపదల్
గోరుచు నాలుబిడ్డలన గూరిమి వీడి యనారతమ్ము బే
జారని యెంచకన్ సతము శ్రామికుడై శ్రమియించుచున్ సదా
సారమున్ గ్రహింపగల సజ్జనులొప్పరు సత్కవిత్వమున్.
వారలుఋషులునుకాగా
రిప్లయితొలగించండివేరుగభావముమనసునవెదుకగలేకన్
పారమునంటగవేదపు
సారమతులుమెచ్చుకొనరుసత్కావ్యముల్
సారములోననారసియుసంగములేకనుసన్మునీంద్రుడై
రిప్లయితొలగించండివేరుగలేనిభావమునవేద్యముగాగనుసత్యమీభువిన్
వారిజపత్రనేత్రుగనిపారముఁజూచినపండితుండునా
సారమునున్గ్రహింపగలసజ్జనులోప్పరుసత్కవిత్వమున్
సార రహితమగు రచనను
రిప్లయితొలగించండిసారమతులు మెచ్చుకొనరు; సత్కావ్యమ్మున్
వారూ వీరూ మరియున్
పారంగతులూ పొగుడుచు పఠియింతురుగా
సమస్య :
రిప్లయితొలగించండిసారమునున్ గ్రహింపగల
సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
( లోకంలో కొందరు భుజశక్తిప్రియులైన సుజనులే ఉంటారు . వారికి కవిత్వం వంటివి నచ్చవు . )
చేరుచు నుందురే బలము
చేతుల నిండుగ నున్నవారినే ;
కేరుచు జూతురే యరుల
కేల్గవ నోర్చుచు గెల్చువారినే ;
పోరక జెప్పుచుంటినిదె -
పొంగుచు కేవలమల్లయుద్ధదో
స్సారమునున్ గ్రహింపగల
సజ్జను లొప్పరు సత్కవిత్వమున్ .
( మల్లయుద్ధదోస్సారము - కుస్తీలలో భుజశక్తి )
తోరముగ పేరడీలిడ
రిప్లయితొలగించండిపేరోలగముల కవులకు విత్తము లీయన్
మారమని యెంత జెప్పిన
సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
సారమతి = ధనము నందు ఇచ్ఛ
కలవాడు
ధారణ చేసినన్ కడు బుధానుల కావ్యము లాస్థతో నసా
రిప్లయితొలగించండిధారణమైన పాటవము దక్కును వాణి యొసంగ దీవెనల్
ప్రేరణ మన్యభాషపయి పెంపెసలారగ తెల్గు పైని ని
స్సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
నేరము-ఘోరము కథలను
రిప్లయితొలగించండిసారవిహీనంబులైన సాహిత్యంబుల్
జోరుగ పఠియించెడుని
స్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
కందం
రిప్లయితొలగించండిజోరుగ జేసిరి రచనలు
సారమతులు ,మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
ధారాళముగ కవిత్వపు
ధారలు వెలయించలేని తార్కిక కవులున్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
ఉ:
రిప్లయితొలగించండినేరుగ వ్రాయలేక కడు నెమ్మది మీద సమీకరించనై
కోరిన రీతి పద్యములు గొప్పగ నల్లితి నంచు బల్క నా
తీరు పరీక్ష జేయనది తేరగ సంగ్రహ మన్న ప్రాజ్ఞ తో
సారమునున్ గ్రహింపగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
వై. చంద్రశేఖర్
నారీమణి యొలుకఁగ శృం
రిప్లయితొలగించండిగారము చెక్కిలిని మీటఁగాఁ బోఱఁ డహో
నేరని విధమ్ముగా ని
స్సారమతులు మెచ్చుకొనరు సత్కావ్యమ్మున్
క్షార విలీన కోమలము చందము సౌరభ హీన పుష్ప వ
ద్ధారము భంగి ఘోరతమ హాలహ లైక కణప్రపూరిత
క్షీరము భంగి శబ్ద పరికీర్తిత మైనను భావ జాల ని
స్సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు సత్కవిత్వమున్
సారము లులేని రచనను
రిప్లయితొలగించండిసారమతులు మెచ్చుకొనరు,సత్కావ్యమ్మున్
నోరార చదువు చుందురు
వారును వీరలును ననకప్రజలెల్లరున్
సారము లేని పద్యమును సత్కవి వోలెను నెట్టివేళలన్
రిప్లయితొలగించండిసారమునున్ గ్రహింపగల సజ్జనులొప్పరు, సత్కవిత్వమున్
వారును వీరునున్ ననక భావితరంబులవారునున్ ధరన్
బ్రేరణ గల్గగా జదువ పెంపును నొందును భాష తప్పకన్
సారవిహీనమౌ కథలు సత్యవిదూరపు సన్నివేశముల్
రిప్లయితొలగించండిపేరిమిమీర దుర్జనులు వీడక జూచెదరట్టి పొత్తముల్
“సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు, సత్కవిత్వమున్”
కోరి పఠింతురెల్లపుడు కొందలపాటును నొందకుండగన్
పారీణతగల కవులిట
రిప్లయితొలగించండితీరుగకావ్యములువ్రాయధీమతితోడన్
సారస్వత మెరుగని ని
స్సారమతులుమెచ్చుకొనరుసత్కావ్యమ్మున్
సౌరుగ డాంబికంపు పదబంధములన్ దగ గూర్చి వ్రాసినన్
రిప్లయితొలగించండిసారమొకింతలేక యది చక్కని కావ్యమనంగరాదొకో
సారమునున్ గ్రహింపఁగల సజ్జను లొప్పరు; సత్కవిత్వమున్
శారద సత్కృపాకలిత సౌభగమంచు గణింతురెన్నడున్