18-11-2021 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హర్షమిడును నేతకున్ జనాక్రందనలే”(లేదా...)“హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్”
వర్షము లు గురియ రైతుకు హర్ష మిడు ను : నేతకున్ జనాక్రo దనలే ఘర్షణ మనమున రేగియు శీర్షము నొప్పించు గాదె సేమంబుడు గన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వర్షంబులుముంచెత్తగశీర్షంబునువంచెచేనుచిత్తడియందున్ఘర్షణపడగారైతులుహర్షమిడునునేతలకుజనాక్రందనలే
వర్షా! కారును తోలుచుకర్షకులను చంపినట్టి ఖలులుండిన యీవర్షము నందున నిజమే హర్షమిడున్ నేతకున్ జనాక్రందనలే.
ప్రస్తుత సమాజంలో నేతల గుణము గా ప్రయత్నము: శా: వర్షింపంగదె రూప్యముల్ ప్రతిఫలంబాశింప నిస్సిగ్గుగా శీర్షంబెత్తిన ముప్పు దప్పదనుచున్ శిక్షింప వెన్నాడు. సందర్శింపంగ జనాలనున్ దురుసుగా తాడించి పీడించనైహర్షంబుం గలిగించుసర్వజన దీనాలాపముల్ నేతకున్వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ధన్యవాదములు
వర్షాభావముకాంచినన్జనులివాపోదురెల్లప్పుడాకర్షింపన్తమజీవితంబులికలేకన్కాంతులెప్పట్టునన్ఘర్షణన్జనఱేఁడులేడుగదరాఘర్మంబుచిందించినన్హర్షంబున్గలిగించుసర్వజనదీనాలాపముల్నేతకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.
కాంచినన్జనులే1వపాదంకర్షంబంందగఱేడులేడుగదరా3వపాదం
వర్షా! స్వార్థము నిండినట్టి ప్రభువుల్ పాపాత్ములే హెచ్చుగావర్షంబందున నేడు పాలకులుగా ప్రఖ్యాతులై వారలే శీర్షంబెత్తుకు తిర్గువారలు ప్రజాక్షేమంబు నే కోరరే హర్షంబున్ గలిగించు సర్వజనదీనాలాపముల్ నేతకున్.
కందంవర్షింతు వరములన నాకర్షణఁ బ్రతిపక్షనేత గద్దెనుఁ గన నిష్కర్షగ మునుపు నలిగిరనహర్షమిడును నేతకున్ జనాక్రందనలేశార్దూలవిక్రీడితమువర్షింతున్ గెలిపింప నన్ను వరముల్ వద్దన్నమీకంచు నాకర్షింపంగ విపక్షనేత మదితాకన్పాదయాత్రాదులన్స్పర్షించన్ బ్రజ నమ్మి మద్దతుగ కష్టాలన్ నివేదించినన్హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్!
మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
శార్దూలము:స్పర్షామాత్రముచేత మన్ను గరిమన్ బంగార మౌ రైతుచే వర్షంబాతని యాప్త మిత్రు డగుచో పండించు సస్యంబులన్వర్షంబుల్ ఋణమాఫి చేతుమనుచున్ వాగ్దానముల్ నమ్ముచో “హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్”--కటకం వేంకటరామశర్మ.
ధన్యవాదములు ఆర్యా!
కర్షకులొసగినభూమినిహర్షముతో వృధ్ధిపరచు నాలోచనకున్శీర్షాసనమేర్పరచెన్హర్షమిడును నేతకున్ జనాక్రందనలే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందము:హర్షమె మార్జాలమునకు శీర్షము క్షీరమునముంచి శీలము విడువన్ కర్షక కార్మికులేడ్వగ “హర్షమిడును నేతకున్ జనాక్రందనలే”!-కటకం వేంకటరామశర్మ.
తర్షణమే! జయమును విన,హర్షమిడును నేతకున్; జనాక్రందనలేశీర్షికలౌ పత్రికలనువర్షము వలనన్ క్రికెట్టు వరుసగ నోడన్
వర్షమున పంట మునుగఁగకర్షకసోదరులగుండె కలవలమొందెన్మర్షము కోల్పోవనెటులహర్షమిడును నేతకున్ జనాక్రందనలే
అమరావతి రాజధాని సందర్భం.కందంహర్షోల్లాస మనముతోకర్షకులిచ్చిరి పొలములు ,కడకది మారెన్ఘర్షణలమరావతిగాహర్షమిడును నేతకున్ జనాక్రందనలే.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
కర్షక జనులకు వర్షముహర్షమిడును,నేతకున్ జనాక్రందనలేఘర్షణ గలుగం జేయుచుహర్షా!చీకాకు పఱచు హృదినిన్ సుమ్మీ
వర్షంబుల్ గురియంగ రైతులకీకన్ పండంగ పంటల్ దగన్ హర్షంబున్ గలిగించు ,సర్వజనదీనాలాపముల్ నేతకున్ వర్షా!గుండెను వేగవంతముగ రఫ్ఫాడించి బాధించుచున్ హర్షంబించుక లేక యుంచుచు గదా యెవ్వేళయందైననున్
తర్షము మిక్కుట ముండఁగ కర్షకులకు సేద్య మందుఁ గలఁత చెలంగన్ శీర్షవ్యధతో ఖండిత హర్ష మిడును నేతకున్ జనాక్రందనలేమర్షం బూని యెడంద సాయమును సంరంభంబునం గూర్చి నిష్కర్షం బాపి కలంత లన్నిటినిఁ దాఁ జాతుర్య మేపారఁగం గర్షాంతఃకరణుండు నంత జన సత్కాంతుండు పడ్డం జెవిన్ హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్
వర్షించగ వాగ్వరములనుహర్షమిడును,నేతకున్ జనాక్రందనల్ఘర్షణను బెంచి నిలుపగశీర్షాసన ముప్పు లౌను చిత్తుగ నోడన్
వర్షోత్పాతము సంభవింపగ జనావాసంబులన్ మున్కతోతర్షంబున్ తలపించె నల్గడల నత్యంతవ్యథా పూరమైమర్షంబున్కలిగించు మార్గముల నామంత్రింపకే రీతిగాహర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్?
పర్షపు మాటలు యెక్కడహర్షమిడును? నేతకున్ జనాక్రందనలేపర్షీలించ వడివడిన్కుర్షీ నిల్చిపదవుండు కూర్మిని కల్గీ ...తోకల...
వర్షము లు గురియ రైతుకు
రిప్లయితొలగించండిహర్ష మిడు ను : నేతకున్ జనాక్రo దనలే
ఘర్షణ మనమున రేగియు
శీర్షము నొప్పించు గాదె సేమంబుడు గన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్షంబులుముంచెత్తగ
రిప్లయితొలగించండిశీర్షంబునువంచెచేనుచిత్తడియందున్
ఘర్షణపడగారైతులు
హర్షమిడునునేతలకుజనాక్రందనలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివర్షా! కారును తోలుచు
కర్షకులను చంపినట్టి ఖలులుండిన యీ
వర్షము నందున నిజమే
హర్షమిడున్ నేతకున్ జనాక్రందనలే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప్రస్తుత సమాజంలో నేతల గుణము గా ప్రయత్నము:
రిప్లయితొలగించండిశా:
వర్షింపంగదె రూప్యముల్ ప్రతిఫలంబాశింప నిస్సిగ్గుగా
శీర్షంబెత్తిన ముప్పు దప్పదనుచున్ శిక్షింప వెన్నాడు. సం
దర్శింపంగ జనాలనున్ దురుసుగా తాడించి పీడించనై
హర్షంబుం గలిగించుసర్వజన దీనాలాపముల్ నేతకున్
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివర్షాభావముకాంచినన్జనులివాపోదురెల్లప్పుడా
రిప్లయితొలగించండికర్షింపన్తమజీవితంబులికలేకన్కాంతులెప్పట్టునన్
ఘర్షణన్జనఱేఁడులేడుగదరాఘర్మంబుచిందించినన్
హర్షంబున్గలిగించుసర్వజనదీనాలాపముల్నేతకున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమొదటి, మూడవ పాదాలలో గణభంగం. సవరించండి.
కాంచినన్జనులే1వపాదం
తొలగించండికర్షంబంందగఱేడులేడుగదరా3వపాదం
రిప్లయితొలగించండివర్షా! స్వార్థము నిండినట్టి ప్రభువుల్ పాపాత్ములే హెచ్చుగా
వర్షంబందున నేడు పాలకులుగా ప్రఖ్యాతులై వారలే
శీర్షంబెత్తుకు తిర్గువారలు ప్రజాక్షేమంబు నే కోరరే
హర్షంబున్ గలిగించు సర్వజనదీనాలాపముల్ నేతకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండివర్షింతు వరములన నా
కర్షణఁ బ్రతిపక్షనేత గద్దెనుఁ గన ని
ష్కర్షగ మునుపు నలిగిరన
హర్షమిడును నేతకున్ జనాక్రందనలే
శార్దూలవిక్రీడితము
వర్షింతున్ గెలిపింప నన్ను వరముల్ వద్దన్నమీకంచు నా
కర్షింపంగ విపక్షనేత మదితాకన్పాదయాత్రాదులన్
స్పర్షించన్ బ్రజ నమ్మి మద్దతుగ కష్టాలన్ నివేదించినన్
హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్!
మి రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిశార్దూలము:
రిప్లయితొలగించండిస్పర్షామాత్రముచేత మన్ను గరిమన్ బంగార మౌ రైతుచే
వర్షంబాతని యాప్త మిత్రు డగుచో పండించు సస్యంబులన్
వర్షంబుల్ ఋణమాఫి చేతుమనుచున్ వాగ్దానముల్ నమ్ముచో
“హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్”
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు ఆర్యా!
తొలగించండికర్షకులొసగినభూమిని
రిప్లయితొలగించండిహర్షముతో వృధ్ధిపరచు నాలోచనకున్
శీర్షాసనమేర్పరచెన్
హర్షమిడును నేతకున్ జనాక్రందనలే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందము:
రిప్లయితొలగించండిహర్షమె మార్జాలమునకు
శీర్షము క్షీరమునముంచి శీలము విడువన్
కర్షక కార్మికులేడ్వగ
“హర్షమిడును నేతకున్ జనాక్రందనలే”!
-కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితర్షణమే! జయమును విన,
రిప్లయితొలగించండిహర్షమిడును నేతకున్; జనాక్రందనలే
శీర్షికలౌ పత్రికలను
వర్షము వలనన్ క్రికెట్టు వరుసగ నోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివర్షమున పంట మునుగఁగ
రిప్లయితొలగించండికర్షకసోదరులగుండె కలవలమొందెన్
మర్షము కోల్పోవనెటుల
హర్షమిడును నేతకున్ జనాక్రందనలే
అమరావతి రాజధాని సందర్భం.
రిప్లయితొలగించండికందం
హర్షోల్లాస మనముతో
కర్షకులిచ్చిరి పొలములు ,కడకది మారెన్
ఘర్షణలమరావతిగా
హర్షమిడును నేతకున్ జనాక్రందనలే.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికర్షక జనులకు వర్షము
రిప్లయితొలగించండిహర్షమిడును,నేతకున్ జనాక్రందనలే
ఘర్షణ గలుగం జేయుచు
హర్షా!చీకాకు పఱచు హృదినిన్ సుమ్మీ
వర్షంబుల్ గురియంగ రైతులకీకన్ పండంగ పంటల్ దగన్
రిప్లయితొలగించండిహర్షంబున్ గలిగించు ,సర్వజనదీనాలాపముల్ నేతకున్
వర్షా!గుండెను వేగవంతముగ రఫ్ఫాడించి బాధించుచున్
హర్షంబించుక లేక యుంచుచు గదా యెవ్వేళయందైననున్
తర్షము మిక్కుట ముండఁగ
రిప్లయితొలగించండికర్షకులకు సేద్య మందుఁ గలఁత చెలంగన్
శీర్షవ్యధతో ఖండిత
హర్ష మిడును నేతకున్ జనాక్రందనలే
మర్షం బూని యెడంద సాయమును సంరంభంబునం గూర్చి ని
ష్కర్షం బాపి కలంత లన్నిటినిఁ దాఁ జాతుర్య మేపారఁగం
గర్షాంతఃకరణుండు నంత జన సత్కాంతుండు పడ్డం జెవిన్
హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్
వర్షించగ వాగ్వరములను
రిప్లయితొలగించండిహర్షమిడును,నేతకున్ జనాక్రందనల్
ఘర్షణను బెంచి నిలుపగ
శీర్షాసన ముప్పు లౌను చిత్తుగ నోడన్
వర్షోత్పాతము సంభవింపగ జనావాసంబులన్ మున్కతో
రిప్లయితొలగించండితర్షంబున్ తలపించె నల్గడల నత్యంతవ్యథా పూరమై
మర్షంబున్కలిగించు మార్గముల నామంత్రింపకే రీతిగా
హర్షంబుం గలిగించు సర్వజన దీనాలాపముల్ నేతకున్?
పర్షపు మాటలు యెక్కడ
రిప్లయితొలగించండిహర్షమిడును? నేతకున్ జనాక్రందనలే
పర్షీలించ వడివడిన్
కుర్షీ నిల్చిపదవుండు కూర్మిని కల్గీ
...తోకల...