17-11-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గరుడుఁడు వాహనము గాదె గరళగళునకున్”(లేదా...)“గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అరయగ విష్ణువు కునెపుడుగరుడుడు వాహనము గాదె,గరళ గళునకున్సరసముగ సర్ప రాజమమరె నాతని కంఠమందు మక్కువ తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సరిగాఁజూడగహరికినిగరుడుడువాహనముగాదెగరళకంఠునకున్సరిగనవ్రుషభముకుదిరెనెదిరికినిగూర్చగశుభమునుధీరుడుగాగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "గరళ గళునకున్... వృషభము..."
యెరిగినదే కద చక్రికిగరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్పరమ రథము నందియె కదశరణని కూర్చొను నిరతము శంకరు నెదుటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఎరిగినదే...' పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు.
ధన్యవాదాలు గురువుగారు! అలాగే మార్చాను.ఎరిగినదే కద చక్రికిగరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్పరమ రథము నందియె కదశరణని కూర్చొను నిరతము శంకరు నెదుటన్
అరసియె జూడగ హరికేగరుడుడు వాహనము గాదె; గరళ గళునకున్వరమంది సర్ప రాజమమరెగద,కంఠమును జుట్టి మమతలు మీరన్!!
కందం'హరి' బాలకృష్ణుఁడనఁగన్మురిపెమ్మున 'విషఁపుపాలఁ' బూతన యిడ నూపిరిఁ దీయుచుఁ గ్రోలెననఁగగరుడుఁడు వాహనము గాదె 'గగరళగళు'నకున్చంపకమాలధరణిని విష్ణుమూర్తి యవతారము దాల్చగ బాలకృష్ణుఁడైమురిపెము జూపుకోమలిగఁ బూతన చన్గుడుపన్ విషమ్ముఁ దాహరుఁడుగనా త్రినేత్రమున నంతయు దెల్సియుఁ బీల్చఁ బ్రాణముల్గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
వరదుడు రమా విభునికిన్ గరుడుడు వాహనము గాదె :గరళ గ ళుని కిన్ మురిపముగ నంది యయ్యెను తిరమగు సద్వా హనముగ దివిజులు మెచ్చ న్
విరియగవేషధారణమువెన్నుఁడువేగమయాత్రఁజేయగన్గరుడుఁడువాహనంబగునుగాదె, త్రినేత్రునకెల్లవేళలన్కరమునుధర్మబద్ధతనుకన్నులఁజూడగనెమ్మదించునావరకరుణాంతరంగుడునువాహనమయ్యెగయెద్దురూపమై
కరి వరదుండు భక్తులను గ్రన్ననరక్షణ చేయు విష్ణుకున్గరుడుడు వాహనంబగును గాదె,త్రినేత్రుని కెల్లవేళలన్సరసన నుండు నంది కడు సంతసమొప్పగ స్వామి భక్తుడైమురియుచు వాహనమ్ముగనుముద్దుగ నుండు నిర్మలాత్ముడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పురుదంశకమదియె కదాపరమేష్టికి వాహనమ్ము పరమాత్ముండౌసరసిజనాభికి జూడగగరుడుఁడు వాహనము, గాదె గరళగళునకున్.
పురిపులుగయ్యె కందునకు మూషికమేమొ గజాస్యుకయ్యె కాసరము పరేతరాట్టునకు శాబ్దికి ధోరణమయ్యె కాళికిన్ నెఱపరి, పద్మనాభుడగు నీరజనేత్రుడు శంకపాణికిన్ గరుడుఁడు వాహనంబగును, గాదె త్రినేత్రునకెళ్ళ వేళలన్ ద్విరదము, నందిగా బిలుచు విత్సన మంచును చెప్పుచుందురే.
చంపకమాల:ఉరగము క్షీరసాగరపు నుత్ప్లవ శయ్యగ సేదదీర్చు, శ్రీ ధరునకు నారదాది పద దాసులు కీర్తన లాలపించగా, “గరుడుఁడు వాహనం బగును గాదె !"త్రినేత్రున కెల్ల వేళలన్తరగని భక్తి జూపు గుణధాముడు" నచ్యుతు డెక్కి వెళ్ళగన్ -కటకం వేంకటరామశర్మ.
ధన్యవాదములార్యా
కందము:శరణన్న బ్రోచు హరికిని “గరుడుఁడు వాహనము గాదె! గరళగళునకున్”గిరిజా ధవునకు హరునకుపరమోత్తమ వాహనమ్ము వర వృషభమ్మౌ! -కటకం వేంకటరామశర్మ.
సరసిజనాభుండు హరికిగరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్సరిపడెనందీశ్వరుడేకరివదనుడికిన్ సరిపడె ఖనకము కదరా
పరగుటకయి కేశవునకుగరుడుఁడు వాహనము గాదె ; గరళగళునకున్దెరలగ నందీ శ్వరుడే ,పరుగిడి రక్షణ నొసంగ వాహన మేలా !
హరికిన్ వాహనముగదాగరుడుఁడు, వాహనము గాదె గరళగళునకున్సరవిని నందీశ్వరుఁడు వివరము దెలిసికొనుడు భక్త వరదులఁగొలువన్
కరివరదుండు శ్రీహరికి కామితదాయికి వైనతేయుడౌగరుడుఁడు వాహనం బగును గాదె, త్రినేత్రున కెల్ల వేళలన్వరముగ నందికేశ్వరుఁడు వాహనమై దనరారుచుండు శ్రీకరమగు వీరిఁగొల్వ మది కామితముల్ నెరవేరు నిచ్చలున్
హరిహర నాథుడై వెలుగు నాభగవంతుడు భక్తపాళినిన్ నిరతముఁ గాచుచుండు భువి నిర్మల భక్తి భజింప నిత్యమున్దరిసెన మెట్టిరూపమునఁ దల్చిన నిచ్చును, విష్ణు రూపమున్గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
సరదా పూరణ: చం: ఎరుకకు వచ్చె స్వర్గమున హెచ్చగు వాహన రాక పోకలైవరదుడు శంకరుండు దన వాహనముంగొన కాలయాపనల్పెరుగుననంగ, సమ్మతిని వేడుక విష్ణువొ సంగ యానమున్గరుడుడు వాహనం బగును గాదె త్రినేత్రుని కెల్ల వేళలన్చంద్రశేఖర్
పెరుగుననంగ / పెరుగు నటన్న గా చదువగలరు
గరుడుని సేవ గాంచగను కంచి పురంబున ప్రాభవమ్మనన్తరలగ భక్తులెల్లరును బారులు దీరుగ బంధు గోష్టితోగరుడుడు వాహనంబుగాదె, త్రినేత్రున కెల్లవేళలన్సరసన భక్తి మీరగను సాక్షిగ నిల్చెనునంది నీశుకే!!
అరయగ శ్రీకృష్ణునకిలగరుడుడు వాహనముగాదె,గరళగళునకున్ మురీపెముగానందీశుడుసరియగు వాహనము నయ్యె సర్వులు మెచ్చన్
గరుడం డగు వాహన మక్షరుఁ డరవింద నయనునకు సత్యములే నీ గిర లనుమానం బేలా గరుడుఁడు వాహనము గాదె గరళ గళునకున్హరిహర వాహనమ్ములు మహాండజ పాదచతుష్క రాజముల్ పరఁగుచు నుండ సంతతము వాహనమై వృషభమ్ము సంశయాకరముగ నడ్గఁగా నగును గాదె యనం దగ దిట్టు లెన్నఁడున్ గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
హరికి రమాధినాధునకు నాశ్రిత రక్షకుశంఖపాణికిన్ గరుడుడు వాహనంబగునుగాదె,త్రినేత్రునకెల్లవేళలన్ నురగము లాతనిన్ నొడిసి యుండుచు రక్షకువోలెజూడుమావిరిసిన మల్లివోలెను నవీనపు రీతిని వెల్గునోరమా!
కందంకరిరక్షజేసిన హరికిగరుడుడు వాహనము గాదె ,గరళగళునకున్దరి, ధర్మ రూపి నందీశ్వరుడు నిలిచియుండెగాదె వాహనమనగన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
మురహరునకుమోదంబునగరుడుడు వాహనముగాదెగరళగళునకున్గిరిరాజుకుమార్తెనొసగపరిపరివిధములకొలుచుచు పార్వతి మురిసెన్కరివరదునివిడకకొలుచుగరుడుడు వాహనముగాదెగరళగళునకున్మురిపెముతోవనమందునగిరిజయుతాతపమొనర్చికేలునుపట్టెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరయగ విష్ణువు కునెపుడు
తొలగించండిగరుడుడు వాహనము గాదె,గరళ గళునకున్
సరసముగ సర్ప రాజమ
మరె నాతని కంఠమందు మక్కువ తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరిగాఁజూడగహరికిని
రిప్లయితొలగించండిగరుడుడువాహనముగాదెగరళకంఠునకున్
సరిగనవ్రుషభముకుదిరెనె
దిరికినిగూర్చగశుభమునుధీరుడుగాగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గరళ గళునకున్... వృషభము..."
యెరిగినదే కద చక్రికి
రిప్లయితొలగించండిగరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్
పరమ రథము నందియె కద
శరణని కూర్చొను నిరతము శంకరు నెదుటన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఎరిగినదే...' పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు.
ధన్యవాదాలు గురువుగారు! అలాగే మార్చాను.
తొలగించండిఎరిగినదే కద చక్రికి
గరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్
పరమ రథము నందియె కద
శరణని కూర్చొను నిరతము శంకరు నెదుటన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅరసియె జూడగ హరికే
రిప్లయితొలగించండిగరుడుడు వాహనము గాదె; గరళ గళునకున్
వరమంది సర్ప రాజమ
మరెగద,కంఠమును జుట్టి మమతలు మీరన్!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండి'హరి' బాలకృష్ణుఁడనఁగన్
మురిపెమ్మున 'విషఁపుపాలఁ' బూతన యిడ నూ
పిరిఁ దీయుచుఁ గ్రోలెననఁగ
గరుడుఁడు వాహనము గాదె 'గగరళగళు'నకున్
చంపకమాల
ధరణిని విష్ణుమూర్తి యవతారము దాల్చగ బాలకృష్ణుఁడై
మురిపెము జూపుకోమలిగఁ బూతన చన్గుడుపన్ విషమ్ముఁ దా
హరుఁడుగనా త్రినేత్రమున నంతయు దెల్సియుఁ బీల్చఁ బ్రాణముల్
గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండివరదుడు రమా విభునికిన్
రిప్లయితొలగించండిగరుడుడు వాహనము గాదె :గరళ గ ళుని కిన్
మురిపముగ నంది యయ్యెను
తిరమగు సద్వా హనముగ దివిజులు మెచ్చ న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివిరియగవేషధారణమువెన్నుఁడువేగమయాత్రఁజేయగన్
రిప్లయితొలగించండిగరుడుఁడువాహనంబగునుగాదె, త్రినేత్రునకెల్లవేళలన్
కరమునుధర్మబద్ధతనుకన్నులఁజూడగనెమ్మదించునా
వరకరుణాంతరంగుడునువాహనమయ్యెగయెద్దురూపమై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరి వరదుండు భక్తులను గ్రన్నన
రిప్లయితొలగించండిరక్షణ చేయు విష్ణుకున్
గరుడుడు వాహనంబగును గాదె,
త్రినేత్రుని కెల్లవేళలన్
సరసన నుండు నంది కడు సంతస
మొప్పగ స్వామి భక్తుడై
మురియుచు వాహనమ్ముగను
ముద్దుగ నుండు నిర్మలాత్ముడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపురుదంశకమదియె కదా
పరమేష్టికి వాహనమ్ము పరమాత్ముండౌ
సరసిజనాభికి జూడగ
గరుడుఁడు వాహనము, గాదె గరళగళునకున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపురిపులుగయ్యె కందునకు మూషికమేమొ గజాస్యుకయ్యె కా
సరము పరేతరాట్టునకు శాబ్దికి ధోరణమయ్యె కాళికిన్
నెఱపరి, పద్మనాభుడగు నీరజనేత్రుడు శంకపాణికిన్
గరుడుఁడు వాహనంబగును, గాదె త్రినేత్రునకెళ్ళ వేళలన్
ద్విరదము, నందిగా బిలుచు విత్సన మంచును చెప్పుచుందురే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల:
రిప్లయితొలగించండిఉరగము క్షీరసాగరపు నుత్ప్లవ శయ్యగ సేదదీర్చు, శ్రీ
ధరునకు నారదాది పద దాసులు కీర్తన లాలపించగా,
“గరుడుఁడు వాహనం బగును గాదె !"త్రినేత్రున కెల్ల వేళలన్
తరగని భక్తి జూపు గుణధాముడు" నచ్యుతు డెక్కి వెళ్ళగన్
-కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా
తొలగించండికందము:
రిప్లయితొలగించండిశరణన్న బ్రోచు హరికిని
“గరుడుఁడు వాహనము గాదె! గరళగళునకున్”
గిరిజా ధవునకు హరునకు
పరమోత్తమ వాహనమ్ము వర వృషభమ్మౌ!
-కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా
తొలగించండిసరసిజనాభుండు హరికి
రిప్లయితొలగించండిగరుడుఁడు వాహనము గాదె; గరళగళునకున్
సరిపడెనందీశ్వరుడే
కరివదనుడికిన్ సరిపడె ఖనకము కదరా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరగుటకయి కేశవునకు
రిప్లయితొలగించండిగరుడుఁడు వాహనము గాదె ; గరళగళునకున్
దెరలగ నందీ శ్వరుడే ,
పరుగిడి రక్షణ నొసంగ వాహన మేలా !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరికిన్ వాహనముగదా
రిప్లయితొలగించండిగరుడుఁడు, వాహనము గాదె గరళగళునకున్
సరవిని నందీశ్వరుఁడు వి
వరము దెలిసికొనుడు భక్త వరదులఁగొలువన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరివరదుండు శ్రీహరికి కామితదాయికి వైనతేయుడౌ
రిప్లయితొలగించండిగరుడుఁడు వాహనం బగును గాదె, త్రినేత్రున కెల్ల వేళలన్
వరముగ నందికేశ్వరుఁడు వాహనమై దనరారుచుండు శ్రీ
కరమగు వీరిఁగొల్వ మది కామితముల్ నెరవేరు నిచ్చలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరిహర నాథుడై వెలుగు నాభగవంతుడు భక్తపాళినిన్
రిప్లయితొలగించండినిరతముఁ గాచుచుండు భువి నిర్మల భక్తి భజింప నిత్యమున్
దరిసెన మెట్టిరూపమునఁ దల్చిన నిచ్చును, విష్ణు రూపమున్
గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసరదా పూరణ:
రిప్లయితొలగించండిచం:
ఎరుకకు వచ్చె స్వర్గమున హెచ్చగు వాహన రాక పోకలై
వరదుడు శంకరుండు దన వాహనముంగొన కాలయాపనల్
పెరుగుననంగ, సమ్మతిని వేడుక విష్ణువొ సంగ యానమున్
గరుడుడు వాహనం బగును గాదె త్రినేత్రుని కెల్ల వేళలన్
చంద్రశేఖర్
పెరుగుననంగ / పెరుగు నటన్న గా చదువగలరు
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగరుడుని సేవ గాంచగను కంచి పురంబున ప్రాభవమ్మనన్
రిప్లయితొలగించండితరలగ భక్తులెల్లరును బారులు దీరుగ బంధు గోష్టితో
గరుడుడు వాహనంబుగాదె, త్రినేత్రున కెల్లవేళలన్
సరసన భక్తి మీరగను సాక్షిగ నిల్చెనునంది నీశుకే!!
అరయగ శ్రీకృష్ణునకిల
రిప్లయితొలగించండిగరుడుడు వాహనముగాదె,గరళగళునకున్
మురీపెముగానందీశుడు
సరియగు వాహనము నయ్యె సర్వులు మెచ్చన్
గరుడం డగు వాహన మ
రిప్లయితొలగించండిక్షరుఁ డరవింద నయనునకు సత్యములే నీ
గిర లనుమానం బేలా
గరుడుఁడు వాహనము గాదె గరళ గళునకున్
హరిహర వాహనమ్ములు మహాండజ పాదచతుష్క రాజముల్
పరఁగుచు నుండ సంతతము వాహనమై వృషభమ్ము సంశయా
కరముగ నడ్గఁగా నగును గాదె యనం దగ దిట్టు లెన్నఁడున్
గరుడుఁడు వాహనం బగును గాదె త్రినేత్రున కెల్ల వేళలన్
హరికి రమాధినాధునకు నాశ్రిత రక్షకుశంఖపాణికిన్
రిప్లయితొలగించండిగరుడుడు వాహనంబగునుగాదె,త్రినేత్రునకెల్లవేళలన్
నురగము లాతనిన్ నొడిసి యుండుచు రక్షకువోలెజూడుమా
విరిసిన మల్లివోలెను నవీనపు రీతిని వెల్గునోరమా!
కందం
రిప్లయితొలగించండికరిరక్షజేసిన హరికి
గరుడుడు వాహనము గాదె ,గరళగళునకున్
దరి, ధర్మ రూపి నందీ
శ్వరుడు నిలిచియుండెగాదె వాహనమనగన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మురహరునకుమోదంబున
రిప్లయితొలగించండిగరుడుడు వాహనముగాదెగరళగళునకున్
గిరిరాజుకుమార్తెనొసగ
పరిపరివిధములకొలుచుచు పార్వతి మురిసెన్
కరివరదునివిడకకొలుచు
గరుడుడు వాహనముగాదెగరళగళునకున్
మురిపెముతోవనమందున
గిరిజయుతాతపమొనర్చికేలునుపట్టెన్