21-11-2021 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు”(లేదా...)“పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై”
నూర్గురొక్కరనగనూకొట్టిగనగనుప్రతిభభాసిల్లగనుప్రాంగణమునభారతమ్మబిడ్డపాండిత్యగరిమనుతగునొకండెపృచ్ఛకుడవధానమందు
సరస సల్లాప సాహిత్య సమర మందు ధార ధారణ గల్గు వధాన వరుడు తగు నొకండె : పృచ్చకుడు వధాన మందు ప్రజ్ఞ జూపింప సభికులు ప్రస్తుతింత్రు
అచ్చతెనుంగు నందుగల యద్భుత క్రీడ వధాన మందునన్ చిచ్చర పిడ్గువంటి ఘన శిక్షకు డచ్చట పాటవమ్ము తో నిచ్చలు సూరియైన మహనీయ వధానిని యడ్డగించెడిన్ బృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
పండితాగ్రణులెందరొ పాల్గొనెడి వధానమందు పటిమతో వధాని నెల్లవేళ నడ్డుకొనగల విజ్ఞుడైనతగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు.
జరుప నవధాన మంతర జాలమందుపృచ్ఛకులతోడ పనియేమి పెక్కుమందిచాలునవధాని యొక్కఁడు చాలునింకతగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
వంద మంది కొకడు పందెమనగ నిల్చిప్రశ్న లెన్నొ వేయ ప్రతిభ మీరథెనుగు భాష కీర్తి ధీటుగ నెరిగించతగు నొకండె పృచ్ఛ కుడు వధానమందు!!
స్వచ్ఛతపాండితీపటిమసంగమమందునప్రశ్నలుగాఇచ్ఛనుపండితాగ్రణులునేమరకెప్పుడుతాల్మితోగనన్తుచ్ఛముగానిరీతిసమతుష్టినిసాగినభావశీలతన్పృచ్ఛకుడొక్కడున్నపుడెపేర్మినిగాంచుశతావధానమై
ప్రశ్నలుండగా
ఉ: చిచ్చర పిడ్గు మాదిరిని చేష్టలుడుంగగ బ్రశ్న లేయుచున్నొచ్చు కొనంగ జేసి కడు నొప్పగు రీతి బిగింప గోరగన్మెచ్చిరి ప్రేక్షకుల్ మిగుల మేధను గల్గిన పండితుండుగా పృచ్ఛకుడొక్కడున్నపుడె పేర్మిని గాంచు శతావధానమైవై. చంద్రశేఖర్3 చ్చ- 1 చ్ఛ =ప్రాస పోసుగునో లేదో తెలుపగలరు.
చ- చ్ఛ లకు ప్రాస పొసగని కారణంగా తే. గీ. గా ప్రయత్నము: తే. గీ.గొట్టు పదములు సంధించి గుబులు రేపిగోటి చుట్టూత రోకటి పోటు రీతికట్టి వేయగ పద్యము గట్ట నీకతగు నొకండె పృచ్ఛకుడు వధానమందువై. చంద్రశేఖర్
2 వ ప్రయత్నము: తే. గీ.చిచ్చు పెట్టెడు పదములు చేష్టలుడుగనొచ్చు కొనురీతి ప్రశ్నించి క్రుచ్చి గూర్చివికల మందగ జేసెడు వేద విదుడుతగు నొకండె పృచ్ఛకుడు వధానమందు వై. చంద్రశేఖర్
తేటగీతిపండితులుగ సప్తర్షుల వంటిమేధఁమెలకువలెఱుంగు వారల కలగలుపుగఁబాటవము వెలయింప నప్రస్తుతమునఁదగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందుఉత్పలమాలఅచ్చటి ప్రేక్షకాళి ముదమార ప్రశంసలు గుప్పుచుండగన్ముచ్చట వారి వారివగు పూరణలందెడు పృచ్ఛకాళితోవిచ్చగ పద్య సూనములు వేడుక మధ్యన కొంటె ప్రశ్నలన్పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై!
ప్రస్తుతంబవని విషయరాశితోడమాటిమాటికి ప్రశ్నలధాటి చూపిచిత్తమలరగ సభనురంజింపజేయతగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
పట్నమున నవధానిని పదటము పడునటులజేసి యధికముగ నరుసమొందదగు నొకండె , పృచ్ఛకుఁడ వధానమందుదత్తపది కొరకాంగ్ల పదముల నొసగ
ఖచ్చితమై ప్రమాణ నుడికారపు వ్యాకరణోచితంబు లైఅచ్చతెనుంగు పద్యముల నాంగ్లపదంబులె శోభ గూర్చగన్హెచ్చుగ నిల్చు భాషపటిమెంతయొ ప్రశ్నను జేర్చి కూర్చగన్పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతి: ఇతని సరిజోడి యనునట్లు నేడుగురును బుధులు యవధాని కెదురు సమూహమనగ వక్త చతురుడప్రస్తుత భాషణుండు“తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు”-కటకం వేంకటరామశర్మ.
అడుగడుగడుగునవధాని తడుము కొనగధారణ చెరచు నేర్పరి, తార్కికుండుతగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు,నవరసములూరి,సభికులు నచ్చి మెచ్చ.
అచ్చపుతెల్గు పద్యముల నాశువుగా రచియించి యెల్లరున్మెచ్చ వధానిచెప్ప చలమేమియుఁ జూపక నేకధాటిగానచ్చెరువందు రీతిజను లంతరజాల వధానమందునన్పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
మెచ్చగ ప్రేక్షకాళి విన,మేధను బెంచెడి ప్రశ్న లేసినన్అచ్చపు తెన్గు భాషనటు నారడి బెట్టుచు నాటలాడినన్హెచ్చిన పాటవమ్మునను హేలగ నుత్తర మిచ్చి గెల్చినన్ముచ్చట ఖేలన మ్మనగ,మూర్ఖముగాద?వధానియెట్లు,తాపృచ్ఛకు డొక్కడున్నపుడు పేర్మిని గాంచు శతావధానమై ?!!
ఉత్పలమాల:పుచ్ఛము దీర్ఘ మైననది ముచ్చటగా హరియౌనె కాకమే ?!కచ్ఛపమెంత గెంతినను గట్టును గుట్టను పోలగల్గునే?!తుచ్ఛపు బుద్ధిగాక, ఘనదోర్బల పండితు డైన నెట్లు తా“పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై”?-కటకం వేంకటరామశర్మ.
నచ్చెడి రీతిలో నడుగు నవ్య ప్రహేళికలన్నతండుగాఅచ్చెరు వొందుగా జనులె యాతని ప్రశ్నలధీటికిన్సదామెచ్చవధానవిద్యలను మీరడుహద్దులునట్టిగట్టియౌపృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
అడుగ నెల్లరు దిట్టలె యడుగఁ బడినఁ గూడఁ బాండిత్య మందెంచ గొప్ప వారె పెంపు గల వారి యందు గణింపఁగ రయితగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందుఇచ్ఛ చెలంగ డెందమున నింపుగ గెల్వ వధాని నత్తరిన్ స్వేచ్ఛగ వేయఁ బ్రశ్న లట నింపుగ ముల్కుల చంద మొప్పఁగన్ స్వచ్ఛపు టొక్క యంశమునఁ జక్కని వాఁ డొకఁ డన్న రీతినిం బృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
అడుగడుంగున నడ్డంకు లిడువ గలుగుతగునొకండెపృచ్ఛకుడు వధానమందుతగిన ధారణ లేనీచో దరము కాదుచెప్ప యవధాన మేరికి నిప్పుడమిని
స్వచ్ఛత లేని వాక్యములు సారములేనిప దంబులిచ్చు నాపృచ్ఛకు డొక్కడున్నపుడె పేర్మిని గాంచుశ తావధానమైపృచ్ఛక వర్యులేగదిల బేర్మిని గల్గగ జేయువారలౌయిచ్ఛను బూరణల్ నుడివి యింపుగ గెల్చువధాని యంతటన్
స్వచ్ఛపు ధారతోడుతను సాంద్ర పదమ్ముల మేళవింపుతోగుచ్ఛములన్ విరాళి మెయి గూర్చుచు ధారణలోన మించుచున్పృచ్ఛక వర్యులందరికి వేడుక నియ్య వధాని, వేద్యుడౌపృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
వేరువేరు అంశము లను వేరువేరుకవులు నిర్వహించుచునుం డ ఘనముగా నుప్రస్తుతముగానివిషయముల్ ప్రస్తుతించతగునొకండె పృచ్ఛకుడు వధానమందు
నూర్గురొక్కరనగనూకొట్టిగనగను
రిప్లయితొలగించండిప్రతిభభాసిల్లగనుప్రాంగణమున
భారతమ్మబిడ్డపాండిత్యగరిమను
తగునొకండెపృచ్ఛకుడవధానమందు
సరస సల్లాప సాహిత్య సమర మందు
రిప్లయితొలగించండిధార ధారణ గల్గు వధాన వరుడు
తగు నొకండె : పృచ్చకుడు వధాన మందు
ప్రజ్ఞ జూపింప సభికులు ప్రస్తుతింత్రు
రిప్లయితొలగించండిఅచ్చతెనుంగు నందుగల యద్భుత క్రీడ వధాన మందునన్
చిచ్చర పిడ్గువంటి ఘన శిక్షకు డచ్చట పాటవమ్ము తో
నిచ్చలు సూరియైన మహనీయ వధానిని యడ్డగించెడిన్
బృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
రిప్లయితొలగించండిపండితాగ్రణులెందరొ పాల్గొనెడి వ
ధానమందు పటిమతో వధాని నెల్ల
వేళ నడ్డుకొనగల విజ్ఞుడైన
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు.
జరుప నవధాన మంతర జాలమందు
రిప్లయితొలగించండిపృచ్ఛకులతోడ పనియేమి పెక్కుమంది
చాలునవధాని యొక్కఁడు చాలునింక
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
వంద మంది కొకడు పందెమనగ నిల్చి
రిప్లయితొలగించండిప్రశ్న లెన్నొ వేయ ప్రతిభ మీర
థెనుగు భాష కీర్తి ధీటుగ నెరిగించ
తగు నొకండె పృచ్ఛ కుడు వధానమందు!!
స్వచ్ఛతపాండితీపటిమసంగమమందునప్రశ్నలుగా
రిప్లయితొలగించండిఇచ్ఛనుపండితాగ్రణులునేమరకెప్పుడుతాల్మితోగనన్
తుచ్ఛముగానిరీతిసమతుష్టినిసాగినభావశీలతన్
పృచ్ఛకుడొక్కడున్నపుడెపేర్మినిగాంచుశతావధానమై
ప్రశ్నలుండగా
రిప్లయితొలగించండిఉ:
రిప్లయితొలగించండిచిచ్చర పిడ్గు మాదిరిని చేష్టలుడుంగగ బ్రశ్న లేయుచున్
నొచ్చు కొనంగ జేసి కడు నొప్పగు రీతి బిగింప గోరగన్
మెచ్చిరి ప్రేక్షకుల్ మిగుల మేధను గల్గిన పండితుండుగా
పృచ్ఛకుడొక్కడున్నపుడె పేర్మిని గాంచు శతావధానమై
వై. చంద్రశేఖర్
3 చ్చ- 1 చ్ఛ =ప్రాస పోసుగునో లేదో తెలుపగలరు.
చ- చ్ఛ లకు ప్రాస పొసగని కారణంగా తే. గీ. గా ప్రయత్నము:
తొలగించండితే. గీ.
గొట్టు పదములు సంధించి గుబులు రేపి
గోటి చుట్టూత రోకటి పోటు రీతి
కట్టి వేయగ పద్యము గట్ట నీక
తగు నొకండె పృచ్ఛకుడు వధానమందు
వై. చంద్రశేఖర్
2 వ ప్రయత్నము:
తొలగించండితే. గీ.
చిచ్చు పెట్టెడు పదములు చేష్టలుడుగ
నొచ్చు కొనురీతి ప్రశ్నించి క్రుచ్చి గూర్చి
వికల మందగ జేసెడు వేద విదుడు
తగు నొకండె పృచ్ఛకుడు వధానమందు
వై. చంద్రశేఖర్
తేటగీతి
రిప్లయితొలగించండిపండితులుగ సప్తర్షుల వంటిమేధఁ
మెలకువలెఱుంగు వారల కలగలుపుగఁ
బాటవము వెలయింప నప్రస్తుతమునఁ
దగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
ఉత్పలమాల
అచ్చటి ప్రేక్షకాళి ముదమార ప్రశంసలు గుప్పుచుండగన్
ముచ్చట వారి వారివగు పూరణలందెడు పృచ్ఛకాళితో
విచ్చగ పద్య సూనములు వేడుక మధ్యన కొంటె ప్రశ్నలన్
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై!
ప్రస్తుతంబవని విషయరాశితోడ
రిప్లయితొలగించండిమాటిమాటికి ప్రశ్నలధాటి చూపి
చిత్తమలరగ సభనురంజింపజేయ
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
పట్నమున నవధానిని పదటము పడు
రిప్లయితొలగించండినటులజేసి యధికముగ నరుసమొంద
దగు నొకండె , పృచ్ఛకుఁడ వధానమందు
దత్తపది కొరకాంగ్ల పదముల నొసగ
ఖచ్చితమై ప్రమాణ నుడికారపు వ్యాకరణోచితంబు లై
రిప్లయితొలగించండిఅచ్చతెనుంగు పద్యముల నాంగ్లపదంబులె శోభ గూర్చగన్
హెచ్చుగ నిల్చు భాషపటిమెంతయొ ప్రశ్నను జేర్చి కూర్చగన్
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిఇతని సరిజోడి యనునట్లు నేడుగురును
బుధులు యవధాని కెదురు సమూహమనగ
వక్త చతురుడప్రస్తుత భాషణుండు
“తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు”
-కటకం వేంకటరామశర్మ.
అడుగడుగడుగునవధాని తడుము కొనగ
రిప్లయితొలగించండిధారణ చెరచు నేర్పరి, తార్కికుండు
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు,
నవరసములూరి,సభికులు నచ్చి మెచ్చ.
అచ్చపుతెల్గు పద్యముల నాశువుగా రచియించి యెల్లరున్
రిప్లయితొలగించండిమెచ్చ వధానిచెప్ప చలమేమియుఁ జూపక నేకధాటిగా
నచ్చెరువందు రీతిజను లంతరజాల వధానమందునన్
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
మెచ్చగ ప్రేక్షకాళి విన,మేధను బెంచెడి ప్రశ్న లేసినన్
రిప్లయితొలగించండిఅచ్చపు తెన్గు భాషనటు నారడి బెట్టుచు నాటలాడినన్
హెచ్చిన పాటవమ్మునను హేలగ నుత్తర మిచ్చి గెల్చినన్
ముచ్చట ఖేలన మ్మనగ,మూర్ఖముగాద?వధానియెట్లు,తా
పృచ్ఛకు డొక్కడున్నపుడు పేర్మిని గాంచు శతావధానమై ?!!
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిపుచ్ఛము దీర్ఘ మైననది ముచ్చటగా హరియౌనె కాకమే ?!
కచ్ఛపమెంత గెంతినను గట్టును గుట్టను పోలగల్గునే?!
తుచ్ఛపు బుద్ధిగాక, ఘనదోర్బల పండితు డైన నెట్లు తా
“పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై”?
-కటకం వేంకటరామశర్మ.
నచ్చెడి రీతిలో నడుగు నవ్య ప్రహేళికలన్నతండుగా
రిప్లయితొలగించండిఅచ్చెరు వొందుగా జనులె యాతని ప్రశ్నలధీటికిన్సదా
మెచ్చవధానవిద్యలను మీరడుహద్దులునట్టిగట్టియౌ
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
అడుగ నెల్లరు దిట్టలె యడుగఁ బడినఁ
రిప్లయితొలగించండిగూడఁ బాండిత్య మందెంచ గొప్ప వారె
పెంపు గల వారి యందు గణింపఁగ రయి
తగు నొకండె పృచ్ఛకుఁడు వధానమందు
ఇచ్ఛ చెలంగ డెందమున నింపుగ గెల్వ వధాని నత్తరిన్
స్వేచ్ఛగ వేయఁ బ్రశ్న లట నింపుగ ముల్కుల చంద మొప్పఁగన్
స్వచ్ఛపు టొక్క యంశమునఁ జక్కని వాఁ డొకఁ డన్న రీతినిం
బృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
అడుగడుంగున నడ్డంకు లిడువ గలుగు
రిప్లయితొలగించండితగునొకండెపృచ్ఛకుడు వధానమందు
తగిన ధారణ లేనీచో దరము కాదు
చెప్ప యవధాన మేరికి నిప్పుడమిని
స్వచ్ఛత లేని వాక్యములు సారములేనిప దంబులిచ్చు నా
రిప్లయితొలగించండిపృచ్ఛకు డొక్కడున్నపుడె పేర్మిని గాంచుశ తావధానమై
పృచ్ఛక వర్యులేగదిల బేర్మిని గల్గగ జేయువారలౌ
యిచ్ఛను బూరణల్ నుడివి యింపుగ గెల్చువధాని యంతటన్
స్వచ్ఛపు ధారతోడుతను సాంద్ర పదమ్ముల మేళవింపుతో
రిప్లయితొలగించండిగుచ్ఛములన్ విరాళి మెయి గూర్చుచు ధారణలోన మించుచున్
పృచ్ఛక వర్యులందరికి వేడుక నియ్య వధాని, వేద్యుడౌ
పృచ్ఛకుఁ డొక్కఁ డున్నపుడె పేర్మినిఁ గాంచు శతావధానమై
వేరువేరు అంశము లను వేరువేరు
రిప్లయితొలగించండికవులు నిర్వహించుచునుం డ ఘనముగా ను
ప్రస్తుతముగానివిషయముల్ ప్రస్తుతించ
తగునొకండె పృచ్ఛకుడు వధానమందు