22, నవంబర్ 2021, సోమవారం

సమస్య - 3909

 23-11-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్”
(లేదా...)
“గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్”

50 కామెంట్‌లు:

  1. వలువలనూడ్చుచుద్రౌపది
    గెలువగఁగౌరవులు, గాంచిక్రుష్ణుఁడుమురిసెన్
    కలనకుకార్యారంభము
    పలికెనుగాదావిధియనిభావించెమదిన్

    రిప్లయితొలగించండి
  2. అలుగులనస్త్రవిద్యలనుహాయనిపించెగకర్ణుడయ్యెడన్
    పలుకులవాడిబాణములపార్థుఁడుదూరెనుసూతపుత్రునిన్
    కలయగకామితార్ధమునుకాగలకార్యమునూహజేసితా
    గెలువఁగగౌరవుల్మురిసెఁగ్రుష్ణుఁడుసంతసమందెఁగుంతియున్

    రిప్లయితొలగించండి
  3. అలమాయాద్యూతంబున
    గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్
    విలువలుమరచినవారికి
    పలువిధములబుధ్ధితెల్పు పాండవులనుచున్

    రిప్లయితొలగించండి
  4. తొలుతను పాచికలాటను
    గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్
    నిలువగ లేరని రణమున
    బలమగు కౌరవుల సేన బలియగుననుచున్.

    రిప్లయితొలగించండి
  5. కల గంటి ననుచు నొక్కడు
    చెలి కాని గనియు పలికెను చిరు నగవున బా
    పు లధర్మ రణమొనర్చియు
    గెలువగ గౌరవులు గాంచి కృష్ణు డు మురిసెన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    పిలువరె 'కౌరవుల' నుచున్
    గలుగఁగ కురువంశమందు 'కౌంతేయుల'! ధూ
    ర్తుల ధార్తరాష్ట్రుల ననిన్
    గెలువఁగఁ 'గౌరవులు', గాంచి కృష్ణుఁడు మురిసెన్

    చంపకమాల
    పలుకరె కౌరవేయులని 'పాండు సుతుల్' గురువంశమందునన్
    గలుగఁగ, ధూర్తులై మిగుల కాంతకు ఘోరపరాభవంబులన్
    సలిపియు సంధికొప్పక విషాదము నింపిన ధార్తరాష్ట్రులన్
    గెలువఁగఁ 'గౌరవుల్ 'మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్!

    రిప్లయితొలగించండి
  7. చంపకమాల:
    కలియగ నూటయార్గురుగ కౌరవులందురు వారి పోరులో
    గెలిచినదెవ్వరైన ఘనకీర్తినిఁ బొందరుఁ ద్రుంచి తమ్ములన్
    ఫలితము ధర్మరక్షణకు పాల్పడునంచు మహా రణమ్మునన్
    “గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్”
    (101+5 అందరూ కురు వంశీయులేగా)
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  8. చం:

    పలికెను దాసు మత్తుగొని భారత గాథను రాత్రివేళలో
    నిలకడ లేని రీతి కడు నిద్దుర కమ్ము కొనంగ నివ్విధిన్
    మెలికొన యుద్ధ మందు బహు మెచ్చెడు వ్యూహము పన్ని నారలై
    గెలువగ గౌరవుల్ మురిసె గృష్ణుడు సంతసమందె కుంతియున్

    దాసు =హరిదాసు:

    నిద్రమత్తులో హరికథ గా ఈ ప్రయత్నము

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  9. కలియుగమారంభమునకు
    తొలియడుగే కౌరవులవిధూతము గానన్
    చలమున మాయాద్యూతము
    గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్


    కలవరమంది రెల్లరును క్రన్నన కౌరవ క్ష్మాతలంబునన్
    కలితొలి పాదమున్ నిలుపు కాలము చేరువకాగ ద్యూతమున్
    గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్
    ప్రలయమునన్ వినాశమగు పాపులు కౌరవులన్ తలంచుచున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరాలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'కౌరవ క్ష్మాల' మన్నపుడు 'వ' గురువై గణభంగం.

      తొలగించండి
    2. క్ష్మాతలము బదులు కంధరమ్మునన్ అని మారుస్తాను గురువుగారూ!

      కలవరమంది రెల్లరును క్రన్నన కౌరవ కంధరమ్మునన్
      కలితొలి పాదమున్ నిలుపు కాలము చేరువకాగ ద్యూతమున్
      గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్
      ప్రలయమునన్ వినాశమగు పాపులు కౌరవులన్ తలంచుచున్

      తొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    కులుకుచు మాయా పాళిని
    గెలువగ గౌరవులు గాంచి కృష్ణుడు మురిసెన్
    ఖలుల నణగార్చు సమయము
    చలనము నందుకొనె ననెడి స్మరణము తోడన్.

    రిప్లయితొలగించండి
  11. అలరిరి జూదమున శకుని
    గెలువఁగఁ గౌరవులు ; గాంచి కృష్ణుఁడు మురిసెన్
    కలహమునకు నాందియనుచు ,
    విలపించె జరుగునదెంచి విదురుడు కలతన్

    రిప్లయితొలగించండి
  12. అలుపెరుగని పోరాటము
    సలుపుచు ధర్మంబునూని సహనముతోడన్
    తులువలు ధృతరాష్ట్రసుతుల
    గెలువగ గౌరవులు గాంచి కృష్ణుడు మురిసెన్

    మలినపు మానసంబునను మానిని వల్వల నూడ్చివేయగన్
    బిలుపును నిచ్చినట్టి యపవిత్రుని యూరువుజీల్చి వేయుచున్
    బలిమిని భండనంబునను బాపులనెల్లర ద్రుంచివేయుచున్
    గెలువగ గౌరవుల్ మురిసె గృష్ణుడు సంతసమందె గుంతియున్

    కౌరవులు = కురు వంశజులు (పాండవులు)

    రిప్లయితొలగించండి
  13. నిలువక గ్రుడ్డి రాజు తన నీతిని వీడుచు జూదమందునన్;
    తెలివిగ మచ్ఛ యంత్రమును,దిగ్గజ రాజుల గెల్చి ద్రౌపదీ
    కలికను తెచ్చి జూప, బలగంబులు పాండవు లందు చేరగా
    గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ ; గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మత్స్యయంత్రమును' అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు! చిన్ననాడు డెక్టేషన్ లో చేసిన ఇదే తప్పు నాన్న చెంపదెబ్బ గుర్తుకొచ్చాయి గురువు గారు.

      నిలువక గ్రుడ్డి రాజు తన నీతిని వీడుచు జూదమందునన్;
      తెలివిగ మత్స్య యంత్రమును,దిగ్గజ రాజుల గెల్చి ద్రౌపదీ
      కలికను తెచ్చి జూప, బలగంబులు పాండవు లందు చేరగా
      గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ ; గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్.

      తొలగించండి
  14. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడు పాదాలలో గణభంగం. సవరించండి.
      రెండవ పూరణలో "వీథిని" అనండి.

      తొలగించండి
  15. ఈ నాటి శంకరాభరణం వారి సమస్య


    గెలువగ కౌరవులు గాంచి కృష్ణుడు మురిసెన్

    ఇచ్చిన పాదము కందము నా
    పూరణ సీసములో



    పాచికలను వేసె పాండవా గ్రజుడుసం
    తసముగ మొదట నాతండు గెలిచె,


    శకుని మాయవలన జయము దూరంబాయె
    ధర్మరాజుకు పట్టుదల పెరుగగ


    సోదరుల ముఖముల్ శోభను కోల్పోయి
    రుసరుస లాడె వరుసగ పందె

    ములు గెలువగ కౌర వులు, గాంచి కృష్ణుడు
    మురిసెన్ మనమ్మున, ధరణము గని

    తెలిపె, శోకము‌ నాపుము‌, తీర్చ గలను

    నీదు బాధ త్వరితముగా, నిక్క మిదియె

    జరుగ గలదు మున్ముందున సంగరము, మ

    రణములు కలుగ తీరు భారమ్ము నీకు

    రిప్లయితొలగించండి
  16. కలిగిన రాగభావముల కన్నయ దల్చగ సంధివేళలన్
    తలపుల భావజాలముల తానటునూహల లూయలూగగన్
    చెలగియె యన్నదమ్ములటు జేరియె నిల్వగ,నైకమత్యమై
    గెలవగ గౌరవుల్,మురిసె గృష్ణుడు,సంతసమందె గుంతియున్!!
    తలచిన ధర్మస్థాపన
    కలలవి,తీరిన పగిదిన గాంచగ మదిలో
    చెలగిన యూహల వీధిన
    గెలువగ గౌరవులు ,గాంచి కృష్ణుడు మురిసెన్!!

    రిప్లయితొలగించండి
  17. కలగనలేదు నాడు కురు, గౌరవ రాజ్యమునందు బుత్రులే
    తలపడ రాజ్యదాహమున, ధర్మము వీడుచు ధార్తరాష్ట్రులున్,
    జెలగుచు ధర్మనందనుడు సేయగ బాలన నెట్టకేలకున్,
    *గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతసమందెఁ గుంతియున్.*

    పాండవులునూ కౌరవులేగదా!

    రిప్లయితొలగించండి
  18. నలిన నయనుండు ధరణీ
    తల భార వినాశ సూచిత శకునమే కాఁ
    గలుషిత కైతవ కేళిన్
    గెలువఁగఁ గౌరవులు గాంచి కృష్ణుఁడు మురిసెన్


    కలఁగెఁ దదాంబికేయుఁ డెదఁ గౌరవ సేన వినాశ మందఁగం
    దొలఁగెను భూమి భార మది తోరము హర్షము నంద ధాత్రియే
    గెలిచిరి ధార్తరాష్ట్రులను గృష్ణ దయోన్నతిఁ బాండవేయులే
    గెలువఁగఁ గౌరవుల్ మురిసెఁ గృష్ణుఁడు సంతస మందెఁ గుంతియున్

    [కౌరవులు = కురు సంతతి: ధార్తరాష్ట్రులు, పాండవేయులు]

    రిప్లయితొలగించండి
  19. లలనా! యేమని యంటివి
    గెలువగ గౌరవులు గాంచి కృష్ణుడుమురిసె?
    గెలుచుట సాధ్యమె వారికి
    నిలలో నది జరుగబోదు నెప్పటికైనన్

    రిప్లయితొలగించండి
  20. గెలువగ గౌరవుల్ మురిసె గృష్ణుడు సంతసమందె గుంతియున్
    కలనున నుంటివే కమల! కౌరవ సేనలు గెల్వనోపునే
    పలువురు నేకమైనను నవారిత తేజుడుపార్ధివుండునీ
    కలనిక తుస్సనంగను సకారణ మొప్పగ జేయు నోటమిన్

    రిప్లయితొలగించండి
  21. బలమున్నపాం డుతనయులు
    విలవిలలాడంగవేగ విజయునిగనుచున్
    కలుగును వారికి సుఖమని
    గెలువగ ,గౌరవులగాంచి కృష్ణుడు మురిసెన్.

    రిప్లయితొలగించండి