23, నవంబర్ 2021, మంగళవారం

సమస్య - 3910

 24-11-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్”
(లేదా...)
“బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందఁగన్”

59 కామెంట్‌లు:

  1. సైద్ధాంతికభావంబున
    హద్దులుజెరుపగకరుణమహర్షులుకాగా
    పద్ధతివైశాల్యంబున
    బౌద్ధులుధరింతురుసిలువన్మెడలోన్

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. బద్ధులు నిత్యము శాంతికి
      బౌద్ధులు, ధరియింతురు సిలువన్ మెడలోనన్
      సిద్ధముగ క్రైస్తవులు,మరి
      సిద్ధులు జేతురు తపములు శిఖరాగ్రములన్

      తొలగించండి

  3. క్రుద్ధులయిరి జనులెల్లరు
    బుద్ధియె లేనట్టివాడు మూర్ఖత్వముతో
    పద్ధతివిడి పలుక నిటుల
    బౌద్ధులు ధరియింతురుసిలువన్ మెడలోనన్.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. బుద్దుననుసరింతురు గద
      బౌద్ధులు; ధరియింతురు సిలువన్ మెడలోనన్
      శుద్దక్రైస్తవులిలలో
      బుద్దినొసంగెడిమతములు పుడమిని యెన్నో

      తొలగించండి
  5. కందం
    ఇద్ధర మతమార్పిడులన్
    ముద్దకు కరువైన వారిఁ బురికొల్పంగన్
    సిద్ధమునై యన్యులతో
    బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్

    శార్దూలవిక్రీడితము
    రుద్దన్ పేదలపై ప్రలోభములతో ప్రోత్సాహమన్నట్లుగన్
    ముద్దన్ బొందఁగ మారనెంచమతముల్ మోదమ్ముతో నన్యులున్
    సిద్ధమ్మౌచును ప్రార్థనాలయములన్ జేరంగ హిందూజనుల్
    బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ద-ధ ప్రాస 3:1 నిష్పత్తిలో ప్రయోగించాలని పెద్దలంటారు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:

      శార్దూలవిక్రీడితము
      ఇద్ధాత్రిన్ సిరులన్ బ్రలోభములతో నేమార్చఁగాఁ జూడఁగన్
      ముద్దన్ బొందఁగ మారనెంచమతముల్ మోదమ్ముతో నన్యులున్
      సిద్ధమ్మౌచును ప్రార్థనాలయములన్ జేరంగ హిందూజనుల్,
      బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందఁగన్

      తొలగించండి
  6. సైద్ధాంతంబునధర్మచక్రమునుతాసారూప్యక్రీస్తున్గనన్
    బద్ధుల్గాకనురాగమందిలనుదంభాచారమార్గంబుకున్
    హద్దుల్నేర్పిరిమానవాళికినిబాయంగన్శోకంబులన్
    బౌద్ధుల్కంఠంబునన్ధరింత్రుసిలువన్భక్తిన్శుభంబందగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. గమనించలేదుక్షమించగలరు
      3వపాదం
      హద్దుల్న్నేర్పిరిమానవాళికినిబాయంగన్దురామోదముల్

      తొలగించండి
  7. బుద్ధుని జాడను నడతురు
    బౌద్ధులు : ధరియింతురు సిలువన్ మెడ లోనన్
    శుధ్ధపు క్రైస్తవులు సతము
    పద్దతి యని నెంతురు గద పావన మతులై

    రిప్లయితొలగించండి

  8. ఇద్ధాత్రిన్ గనినన్ మతమ్ములవియే యెన్నెన్నియో కాదుటే
    శుద్ధంబైన విభూతిరేఖల జటాజూటుండకున్ భక్తులున్
    తద్ధర్మంబని యెంచిగాదుటె కిరస్తానుల్, భువిన్ గాదురా
    బౌద్ధుల్, కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందగన్.

    రిప్లయితొలగించండి
  9. బౌద్ధము క్రైస్తవమైనను
    శ్రద్ధగపాటించు! తగదు రాద్ధాంతంబుల్
    బుద్ధుని బోధలు నమ్మిన
    బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    క్రుద్ధము వీడుదు రెప్పుడు
    బౌద్ధులు; ధరియింతురు సిలువన్ మెడలోనన్
    శ్రద్ధగ క్రైస్తవు లందరు
    పద్ధతిగ తిలకముదాల్చి వైష్ణవు లుండున్.

    రిప్లయితొలగించండి
  11. బౌద్ధ నియతి పాటింతురు
    బౌద్ధులు ; ధరియింతురు సిలువన్ మెడలోనన్
    బద్ధులయి క్రీస్తుమతమున ,
    బద్ధతి వేరైన దుదకు ఫలితం బొకటే

    రిప్లయితొలగించండి
  12. కందము:
    శుద్ధులు కారని త్రోయగ
    బుద్ధుని మతమే శరణని పోయిరభాగ్యుల్
    క్రుద్ధత బలహీనత యై
    “బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్”
    --కటకం వేంకటరామశర్మ

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. సవరించిన పూరణ

      శా:

      శుద్ధిన్ బొందితినంచు పాదజుడు తా శుద్ధాత్మ మార్గంబనన్
      బుద్ధిన్ తోచగ మార్పు చెంది బదులై ముద్దాడె బౌద్ధమ్ము నే
      బద్ధుండై మత విస్తృతంచు యెటులై పాటింప బోధించనై
      బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభం బందగన్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
    2. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ,అమెరికా:

    బుద్ధిగ శాంతి నరుగుదురు
    బౌద్ధులు, ధరియింతురు సిలువను మెడలోనన్
    పద్ధతిని క్రైస్తవులిల,
    ఇద్దరి మతముల హితములు యీడేరు నటుల్.

    రిప్లయితొలగించండి
  15. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

    క్రుద్ధమ్మున్ కడనుంచి నిశ్చలముగా కూర్మిన్ జనున్ లోకమున్
    బౌద్ధుల్,కంఠమున్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందగన్
    శ్రద్ధను గూడిన రీతి క్రైస్తవులు, నశ్రాంతమ్ము వైష్ణాదులున్
    శుధ్ధంబౌనగు నామమున్ నొసటయున్ చూపింత్రు నంకించుచున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రుద్ధమ్మున్ కడనుంచి నిశ్చలముగా కూర్మిన్ జనున్ లోకమున్
      బౌద్ధుల్,కంఠమున్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందగన్
      శ్రద్ధను గూడిన రీతి క్రైస్తవులు, నశ్రాంతమ్ము శ్రీవైష్ణవుల్
      శుధ్ధంబౌనగు నామమున్ నొసటపై చూపింత్రు నంకించుచున్.

      తొలగించండి
  16. కద్దది మతాంతర ప్రణయ
    సిద్ద వివాహంబున విడిచిన ధర్మమునన్
    హద్దులు తొలగిన కొందరు
    బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్

    రిప్లయితొలగించండి
  17. శ్రద్ధాసక్తత తో భజింతురెపుడున్ శాంతమ్మె మంత్రమ్ముగా
    బౌద్ధుల్, కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందఁగన్
    బద్ధుల్ క్రైస్తవమందు గావుత, సదభ్యాసంబులన్ హిందువుల్
    శుద్ధంబౌమదినిల్పి శ్రీహరిని సుస్తోత్రంబు లన్గొల్చెదర్

    రిప్లయితొలగించండి
  18. బుద్ధుని బాటను నడువఁగ
    బౌద్ధుల్, ధరియింతురు శిలువన్ మెడలోనన్
    బద్ధులగుచు క్రైస్తవులున్,
    బుద్ధిగ గొన హిందువులిల బొట్టును నుదుటన్!

    రిప్లయితొలగించండి
  19. బద్ధులునై నిజ మతమున
    కిద్ధర సద్భక్తి నెల్ల రెలమి సెలఁగ స
    ద్బుద్ధీ వారలు కారే
    బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడ లోనన్


    యద్ధర్మం బిడు శాంతి సౌఖ్య మిలలో నద్ధర్మమే భాసిలున్
    శ్రద్ధాసక్తుల మాట దేవుఁ డెఱుఁగున్ సత్యంబ చూపించుచున్
    విద్ధుల్ వేఁగఁగ మారినన్ మత మహో విత్తాశతో హైందవుల్
    బౌద్ధుల్ కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభం బందఁగన్

    [చూపించుచున్ భక్తిన్ (కఱ వైనను)]

    రిప్లయితొలగించండి
  20. శుద్ధత లేదని తలచగ
    బుద్ధిగ తనమతము లోని భోదన వినకన్
    ముద్దకు కరువైన దనుచు
    బౌద్ధులు ధరియింతురు సిలువన్ మెడలోనన్!!

    రిప్లయితొలగించండి
  21. బుద్ధుని నారాధింతురు
    బౌద్ధులు,ధరియింతురు సిలువన్ మెడలోనన్
    నిద్ధర నెక్కడ జూసిన
    బద్ధతిగా గ్రీస్తు జనము పావన రీతిన్

    రిప్లయితొలగించండి
  22. బుద్ధున్ బ్రేమను బూజజేతురు గదా మోహాను రాగంబుతో
    బౌద్ధుల్,కంఠమునన్ ధరింత్రు సిలువన్ భక్తిన్ శుభంబందగన్
    శుద్ధిన్ గ్రైస్తవు లందఱున్ దమినిశాస్త్రోక్తంబుగా నంతటన్
    శుద్ధంబౌనగు రీతి మానసమునన్ శోధించుమా క్రీస్తునిన్

    రిప్లయితొలగించండి
  23. బుద్దుని సతతము గొలుతురు
    బౌద్ధులు,ధరియింతురు సిలువను మెడలోనన్
    శ్రద్ధాభక్తులతోడను
    పద్ధతిగాక్రైస్తవులిల వదలకగనుమా

    రిప్లయితొలగించండి