24, నవంబర్ 2021, బుధవారం

సమస్య - 3911

 25-11-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు”
(లేదా...)
“తద్భవమౌను లక్ష్మి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్”

45 కామెంట్‌లు:

  1. వేదవిద్యలభాసిల్లువేల్పులవని
    చిన్నబోయెరిసంపదచెంతలేక
    మ్లేచ్ఛభాషలమర్యాదమెఱుపుఁజూపె
    తద్భవములక్ష్మిమఱిలచ్చితత్సమంబు

    రిప్లయితొలగించండి
  2. క్షీరసాగరమథనంబు చేయునాడు
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు
    నామమందున, వ్యాకరణంబునందు
    తత్సమము లక్ష్మి మఱి లచ్చితద్భవంబు

    రిప్లయితొలగించండి
  3. వ్యాకరణ బోధ జేయుచు ప్రశ్న వేయ
    బదు లొసఁ గెను విద్యార్థి బద్ద కముగ
    తద్భవ ము లక్ష్మి మఱి లచ్చి తత్సమ o బు
    ననగ ఫక్కున నవ్విరి యంద రపుడు

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    కలిమి గలుగ సంబోధింత్రు గౌరవమున
    లేనివారనంగ వికృతమౌనుగాదె
    చోద్యమగును సుబ్బారావు సుబ్బిగాడు
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు

    ఉత్పలమాల
    ఉద్భవమైనచో సిరులునొప్పెడు నింటను పిల్పు గారమౌ
    నుద్భవమైనచో సిరులునుండని గేమున వైకృతమ్మునౌ
    బుద్భుదమైన జీవితపు పోకడ రాముని రామిగాడనన్
    దద్భవమౌను లక్ష్మి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్

    సుబ్బారావు సుబ్బిగాడుగా
    రాముడు రామిగాడుగా అయినవిధంగ పుట్టినదే లక్ష్మికి వికృతముగా దాని సమమైనది లచ్చి యను భావముతో

    రిప్లయితొలగించండి
  5. ఉద్భవంబటుల చిత్రమై నుర్విపైన
    పాల సంద్రము చిలుకగా పడతి మెరిసి
    శ్రీహరికి సతిగ నిలిచె సిరుల దేవి
    తద్భవము లక్మి మఱి లచ్చి తత్సమంబు!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఉద్భవంబట్లు చిత్రమై యుర్విపైన..." అనండి.

      తొలగించండి
  6. అద్భుతమౌనునీజగతిహంగులుఁజూపిననల్పుడయ్యెడన్
    ఉద్భవమందినన్నరుడునున్నతవంశమునందునీచుడే
    సద్భవసాధుసంగతియుచాలగగల్గినలక్ష్మిలేకనే
    తద్భవమౌనులక్ష్మిమఱితత్సమమన్ననులచ్చియేయగున్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. సవరించిన పూరణ

      ఉ:

      బుద్భుద మైన జీవనము బుట్టగ బిల్చిరి భాగ్య లక్ష్మి గా
      యద్భుతరీతి లోకులిల నందిన మేరకు నుచ్చరింపనై
      తద్భవ తత్సమమ్ములకు తప్పుడు నర్థము దీయకుందురౌ
      తద్భవమౌను లక్ష్మి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్

      వై. చంద్రశేఖర్

      తొలగించండి
  8. బుద్భుద ప్రాయమౌ గతుల పూర్ణము జేసెడి శ్రీనివాసియై
    నద్భుత శోభలన్ కనగ నాశలు దీర్చెడి వైష్ణవీ యనన్
    ఉద్భవమైన తీరు,సిరి నుర్వియె మెచ్చగ శ్రీశు జంటయై
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమ మన్నను లచ్చియే యగున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శ్రీనివాసియై యద్భుత..." అనండి.

      తొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బెర్రీ, అమెరికా:

    తరచి జూడ లక్ష్మి పదము తత్సమంబు
    తద్భవమ్మేను లచ్చిమి తగవు లేక
    వ్యాకరణ మెంచగ నిదియె యనృత మగును
    తద్భవము లక్ష్మి మఱియు లచ్చి తత్సమంబు.

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "లక్ష్యమై యాత్రపడుచు..." అనండి.

      తొలగించండి
    2. పరమ గంభీరమైనదిపాలకడలి
      అమృత సాధన లక్ష్యమై యాత్ర పడుచు
      దేవ దానవుల్ చిలికిరి తృష్ణతోడ
      తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు

      తొలగించండి
  11. డబ్బు నితరుల కప్పిచ్చి నిబ్బరముగ
    వేచి కూర్చున్న వడ్డిగ; వెచ్చములను
    కొన క్రెడిట్కార్డొకటి కనుగొన, వరుసగ
    తద్భవము లక్ష్మి; మఱి లచ్చి తత్సమంబు.

    రిప్లయితొలగించండి
  12. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బెర్రీ, అమెరికా:

    ఎల్ల జగముల నేలెడు యేలికగుచు
    తలపు నందున నిరతమ్ము తనరు చుండు
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు
    అన్ని విభవమ్ములకు దానె యెన్నికగును.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ లో నా సవరణలు చూడండి.

      తొలగించండి
  13. తత్సమము లక్ష్మి మరి లచ్చి తద్భ వమని
    పలుకుటకు మారు తెలియక బాలు డొకడు
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు
    గ ననె శాస్త్రము పూర్తిగ క్షణనమొంద

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. కల్పన యది 'అంతర్జాల' గరిమ! చేరి
      రాత్రికే పెరుగునయథార్థ ఫలమదియు
      తద్భవము లక్ష్మి! మఱి లచ్చి తత్సమంబు
      చూడ మదుపిడ తనరిన స్థూలనిధులె


      (అయథార్థ ఫలము/లాభము: కాగితం మీద కనిపించే లాభము)

      తొలగించండి
    2. మీ పూరణ వైవిధ్యంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  15. అద్భుత మీ యనంతమహిమాంబుధి రత్నసమాశ్రయమ్ము నిం
    దుద్భవ మొంది దివ్యసుధ లొప్పె సురాళికి నోగిరమ్ములై,
    తద్భయముల్ దొలంగెను, సుధాకిరణుండు జనించె నిందు, నే
    తద్భవమౌను లక్ష్మి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  16. అద్భుతమైన ప్రక్రియ సుధాంబుధిఁ జిల్కగ కాశ్యపేయులే
    యుద్భవమయ్యె కంజము, మహోజ్యలమైన యపూర్వరూపముల్
    తద్భవమౌను లక్ష్మి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్
    సద్భవమైన నింతి గని సంతస మొంది వరించె శౌరియే

    రిప్లయితొలగించండి
  17. తద్భవము లక్ష్మి మఱిలచ్చి తత్సమంబు
    తారు మారుగ జెప్పిరి మీరు సామి!
    సరియగుపదమ్ము దెల్పుదు సరకు గొనుడు
    తత్సమము లక్ష్శి లచ్చియ తద్భవంబు

    రిప్లయితొలగించండి
  18. రెంటి యర్థ మొక్కటి యనిరి విపు లార్థ
    శాసనులు నిశ్చయమ్ముగ బాస యందు
    నడుగ వైయాకరణుల వా రనిరి కాదు
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు


    తద్భవ మౌను లచ్చి మఱి తత్సమ మన్నను లక్ష్మియే చుమీ
    యుద్భవ మయ్యెఁ బెక్కులు మహోదధి పంకజ నాభు రక్షతో
    నద్భుత రీతిఁ ద్రచ్చ ధవ ళాంబుధిఁ బూర్వము దేవ దానవుల్
    తద్భవ మౌను లక్ష్మి మఱి తత్సమ మన్నను లచ్చియే యగున్

    [తద్భవము = ధవళాంబుధి భవము; తత్సమము =లక్ష్మి సమము]

    రిప్లయితొలగించండి

  19. అంబుజాసన యతిచర యబ్ధిజ చల
    పద్మలాంచన జలధిజ పద్మవాస
    పాలమున్నీటి రాకన్య పైడిలెలత
    తద్భవము లక్ష్మి మఱి లచ్చి తత్సమంబు.

    రిప్లయితొలగించండి

  20. ఉద్భవమందె పద్మిని మహోదధి జిల్కగ దివ్యరూపియై
    విద్భవ సింధుకన్య చల వెన్నుమనోహరి స్వర్ణరత్న సం
    పద్భవ యంబుజాసని తృపత్తు సహోదరి లోకమాతయే
    తద్భవమౌను లక్ష్భి మఱి తత్సమమన్నను లచ్చియే యగున్.

    రిప్లయితొలగించండి
  21. తద్భవమౌను లక్ష్శీ మఱి తత్సమమన్నను లచ్చియే యగున్
    నద్భుతమాయె మీపలుకులారయ భిన్నముగ వచించిరే
    తద్భవమౌను తత్సమము ధార్మిక లోకము జెప్పు గావుతన్
    తద్భవమౌను లచ్చియిక తత్సమమౌనుగ లక్ష్శియేగదా

    రిప్లయితొలగించండి