4, జూన్ 2024, మంగళవారం

సమస్య - 4782

5-6-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్”
(లేదా...)
“దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్”
(బందరు దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. సడిలేకయుజనముమదిని
    తడబడకుండగతలచుచుదారినికనగా
    వడిగాదైవముతలచెను
    కుడియెడమలుతారుమారగున్ధర్మముగన్

    రిప్లయితొలగించండి
  2. రక్షణసేయగాజగతిరాక్షసునంతటసంహరింపగన్
    పక్షికివాహనుండుపలుబాధలనందుచుమార్చెవేషమున్
    కక్షనులేనిపద్ధతినికావగలోకముసత్యసంధతన్
    దక్షిణవామపార్శ్వములుధర్ముదప్పకతారుమారగున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    తడబడకుండగ జెప్పెద
    నడిగితివన పృచ్ఛకునిగ నదె చరవాణిన్
    బడయంగ స్వీయ చిత్రము
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్

    ఉత్పలమాల
    దక్షతనొంది మంచి యవధానిగ శిష్యుడు ముందునిల్వఁగన్
    శిక్షణ సారమున్ దెలియ శీఘ్రమొసంగ సమస్య, పూరణా
    పక్షమునందుఁ జెప్పె, చరవాణినిఁ దీయఁగ స్వీయచిత్రమున్
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్

    రిప్లయితొలగించండి
  4. అడిగిన దానిని నేతకు
    వడిగ నొసగకుండు వాడు పాళము నంతన్
    గడపగ , జీవిత మందున
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్

    రిప్లయితొలగించండి
  5. తడబడ హేతువు కలదా
    కుడి యెడమలు తారుమారు గోచరమైనన్
    పొడగాంచినఁ దర్పణమున
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్

    వీక్షణమే కదా మనకు విస్తృత దృష్టినొసంగు మార్గమౌ
    చక్షువులున్నచో గనుట సాధ్యము దృశ్యము ప్రస్ఫుటంబుగన్
    దక్షత మాటలేల కనఁ దర్పణ మందున దృశ్యమొక్కటే
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్


    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. కం॥ కడవరకుఁ గలిసి బ్రదుకఁగ
      ముడివడి చన నాలుమగలు మోదము నరయన్
      నడకనపుడపు డిరువురకుఁ
      గుడియెడమలు తారుమారగున్ ధర్మముగన్

      ఉ॥ దక్షత తోడ జీవితపు దారిని యెంచి సతీపతుల్ జనన్
      శిక్షణ నొందగా వలయుఁ జేవగ నిర్వురు నన్నిటన్ భువిన్
      రక్షణఁ గాంచఁగా నపుడు ప్రాకటనమ్ముగ నక్కరన్ గనన్
      దక్షిణ వామపార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్

      ఇది నేటి ధర్మమండి. మా బెంగుళూరులో ఉద్యోగినులలో 10% వరకు వారి సంపాదన పైన కుటుంబము ఆధారపడిందటండి

      తొలగించండి

  7. బడిలో నొజ్జయె చెప్పెను
    బుడుగులతో నిట్లు తాను ముకురము నొకటిన్
    వడి దెప్పించుచు నందున
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్.


    లక్షలు పోసి కొన్న ముకురమ్మది కల్లలు జూపెనన్న శం
    పాక్షిని గాంచి భర్తయనె వాస్తవ మియ్యది యాలకింపు ప
    ద్మాక్షి వచింతు నీకిట యధార్థమిదే కురి విందమందునన్
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్.

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల
    దక్షతలేని పాలకులు దక్కిన గద్దెల నక్రమార్జనన్
    లక్షలకోట్ల రూప్యములు రాబడులట్లుగ దోచినంతటన్
    శిక్షగ నెన్నికందు ప్రజ శీఘ్రమె దించఁగ చట్టపున్ సభన్
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కందం
      మిడిమేలపు పాలకులై
      దడపుట్టగఁజేయ! జనులు దండింపంగన్
      పడఁ ద్రోయఁగ శాసన సభఁ
      గుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్

      తొలగించండి
  9. వడి వడి పత్రిక ను గొనియు
    గడ గడ చదువo గ బూన గంప ము తోడ న్
    ద డ బడు చు నుండ న య్య ది
    కుడి యె డ మల తారు మారగున్ ధ ర్మ ము గన్

    రిప్లయితొలగించండి
  10. వడివడిగా నుదయమ్మున
    సడి చేయక నిదురలేచి సరవిని కనులన్
    పరికింపఁగ ముకురములో
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్

    రిప్లయితొలగించండి
  11. రక్షణఁ గోరు భక్తవరుఁ గ్రన్ననఁ బ్రోవ దయా ప్లపూర్ణుడై
    తక్షణమే పరాత్పరుఁడు దర్శనమిచ్చెడు నాత్రమందునన్
    దక్షిణవామ హస్తముల దాల్చెను శంకును చక్రమత్తరిన్
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్

    రిప్లయితొలగించండి
  12. కం:కుడి చెంప జుక్క వెట్టుక
    కొడుకా!అద్దమున జూచుకొనగా దృశ్య
    మ్మెడమ వలె జూపకుండునె ?
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్”
    (అద్దం యొక్క ధర్మం అది. )

    రిప్లయితొలగించండి
  13. ఉ:దక్షిణపక్షమందు పతి, దారయె యాతని వామపక్ష మాం
    ధ్రక్షితి నున్న ధర్మ మగు,దాని విరుద్ధత చెన్నపట్నమే
    ఆ క్షితి లోన దక్షిణము నందు నిలంబడ భార్య ధర్మ మౌ
    దక్షిణ వామ పార్శ్వములు ధర్మము తప్పక తారుమారగున్
    (మన దగ్గర కార్యక్రమాలలొ భర్త కుడి వైపు.భార్య ఎడమ వైపు. తమిళనాడు లో కొన్ని దేవాలయాలలో భార్య కుడి వైపు, భర్త ఎడమ వైపు. )

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కుడికంటి దెబ్బఁ గని బా
    లుడద్దమున చూచుకొనుచు రోదించె నిటుల్
    ఎడ కంటికి దెబ్బ తగిలె
    కుడి యెడమలు తారుమారగున్ ధర్మముగన్.

    రిప్లయితొలగించండి