3, జూన్ 2024, సోమవారం

సమస్య - 4781

4-6-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”
(లేదా...)
“సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

30 కామెంట్‌లు:

  1. తేటగీతి
    జయ విజయులు శాప నివృత్తి శౌరిఁ జేర
    మూడురాక్షస జన్మల వేడుకొనఁగ
    వారికై యవతారాల వైరిగఁ గొన
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె!

    మత్తేభవిక్రీడితము
    పరమాత్మున్ హరి వేగ చేరు వరమున్ వాంఛించి దౌవారికుల్
    ధరపై నెంచఁగ మూడుజన్మలరులౌ దైతేయ దౌర్భాగ్యమున్
    దురితుల్ బంట్లను రాగమై తొడిగె సంతోషాన రూపాంతరాల్
    సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్

    రిప్లయితొలగించండి
  2. అరయన్దైత్యకులంబుశోభిలగతామూఢుండుమూడడ్గులన్
    తిరిపెంబీయగచక్రవర్తిబలితాతెచ్చెంగభృత్యుండునై
    అరికిన్పుత్రుడుదాపుజేరగనితానాలించిరక్షించెగా
    సురలోకైకశరణ్యుడైనహరిదాసుండయ్యెదైత్యాళికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తెచ్చెంగ' అనడం సాధువు కాదు.

      తొలగించండి
  3. సామజము మొరవిని చనె సాకుటకయి
    సురశరణ్యుఁడు ; దనుజదాసుఁడుగ నయ్యె
    భక్త సులభుడగు శివుడు వరమునొసగి
    ఎడరు నీగ మేలు వరములిడుటకఃటె

    రిప్లయితొలగించండి
  4. సురల శ్రేయము లక్ష్యమై స్మరగురుండు
    వామనుండయి దీనతన్ బలిని జేరె
    దానమిమ్మని కోరుచు దనుజపతిని
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె

    రిప్లయితొలగించండి
  5. శరణుకోరవిభీషణుశాంతుఁజేసి
    కాచిరక్షించినాడుగాకాంతకొఱకు
    దారినీరీతిదెలిపెగాతరుణమెంచి
    సురశరణ్యుడుదనుజదాసుడుగనయ్యె

    రిప్లయితొలగించండి
  6. తే॥ హరియే లోకపాలకుఁడు రజనీచ
    రులఁ దునిమి ధర్మము నిలిపి ప్రోచు చుండు
    సురశరణ్యుఁడు, దనుజదాసుఁడుగ నయ్యె
    హరుఁడు భక్తి నిలిపి కోర వరము లొసఁగి

    మ॥ ధరలో ధర్మము నిల్పు సజ్జనులకున్ ద్రాణంబు నావెన్నుఁడే
    సురలోకంబున కాపదల్ పొడవఁగన్ శూరుండుగన్ ద్రుంచడా
    సురలోకైకశరణ్యుఁడైన హరి, దాసుండయ్యె దైత్యాళికిన్
    హరుఁడే భక్కినిఁ గోరఁ గోర్కెలను సౌహార్ద్యమ్ముతోఁ దీర్చుచున్

    రిప్లయితొలగించండి

  7. అసుర సుతుడైన ప్రహ్లాదు డనవరతము
    తనదు నామమున్ జపియింప కినుక బూని
    తండ్రి సంహరింపగ బూను తరుణమందు
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె.


    అరియే విష్ణువు, వానినామమును ప్రహ్లాదుండు నిత్యమ్ము తా
    స్మరియింపంగ హిరణ్య కశ్యపుడె యామర్షమ్ము దండింపగా
    నిరతమ్మాతని రక్షజేయుటొకటే నేమమ్ముగా దాల్చుచున్
    సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్.

    రిప్లయితొలగించండి
  8. బ్రహ్మ మానస పుత్రుల రాకనరసి
    యడ్డ గించిరి ద్వారకుల్ హరిని చేర
    శాప హతులైన వారిని సంహరింప
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె

    హరికైవచ్చిరి బ్రహ్మమానస సుతుల్ హర్షాతిరేకంబునన్
    దరికేతెంచిన వారినడ్డుకొనిరే దౌవారికుల్ చూడగా
    మరి శాపంబును గొన్న పాలసులనే మ్రందించు వ్యావృత్తితో
    సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్

    రిప్లయితొలగించండి
  9. అసుర గణముల పరిమార్ప నవ త రించి
    ధర్మము ను నెల. కొల్పెను ధరణి యందు
    సురల పక్షము గా నుండు హరి యెటు లగు
    సుర శ ర ణ్యు డు ద నుజ దాసు డు గ నగు?

    రిప్లయితొలగించండి
  10. హరియే వామనమూర్తియై యమరులందాసక్తితో చెచ్చెరన్
    తిరిపమ్మెత్తెగ దానవేంద్రు కడకేతేరెన్ గదా దీనుడై
    సురలన్గావఁగ కూర్మరూపుఁడయితా సొక్కెన్ గదా వార్ధిలో
    సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుండయ్యె దైత్యాళికిన్

    రిప్లయితొలగించండి
  11. సమస్య : సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె

    ధర్మ ఘాతకుల్ చేసిన తప్పిదమున
    దనుజ సదృశులైనట్టి నేతలకు నేడు
    సిరుల దేవాలయమ్ములు జిక్కె గాన
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె


    నేడు దేవాలయాలు మరియు నిర్ణయాధికారం దనుజ సన్నిభులైన పాలకుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి ...."సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె"

    రిప్లయితొలగించండి
  12. తే.గీ:తపమునకు లొంగు పరమేష్టి దైత్యు నైన
    కనికరించు గజాసురు గర్భ మందె
    తాను బంధితుం డయ్యెను తపము మెచ్చి
    సురశరణ్యుఁడు దనుజదాసుఁడుగ నయ్యె”

    రిప్లయితొలగించండి
  13. మ:కరకౌ పల్కుల నింద్రజిత్తనియె,"లంకారాజ్య నిర్మాత సో
    దరుడై,యద్భుత వీరుడై,యమిత మేధాశక్తితో దేవతా
    సురలోకైకశరణ్యుఁడైన, హరి దాసుండయ్యె దైత్యాళికిన్
    పరువే దీయుచు పిన్నతండ్రి తలచన్ పాపమ్ము గా ఆతనిన్.
    ("మా నాయన ఐన రావణాసురుడే దేవతలకి, రాక్షసులకీ కూడా శరణ్యం. అలాంటి అన్నని వదిలి మా బాబాయి విభీషణుడు హరిదాసు లాగా తయారై రాక్షసుల పరువు తీసాడు. అతణ్ని తలుచుకొంటే పాపం"అని ఇంద్రజిత్ అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  14. కాతు రమరులు మర్త్య నికాయము నసు
    ర గణ తర్జనముల నుండి రమ్య రీతి
    వేఁడ శరణమ్ము సద్భక్తి తోడ వీత
    సుర శరణ్యుఁడు దనుజ దాసుఁడుగ నయ్యె

    అరి వీరోగ్రుఁడు మేఘనాదుఁడు దశాస్యాత్మోద్భవుం డుగ్ర సం
    గరమం దింద్రు జయింప వీర్యమున దుఃఖం బంది దైన్యమ్మునన్
    ధర లంకాపురి నిర్జరేశ్వరుఁడు సంతప్తాత్ముఁడై యక్కటా
    సురలోకైకశరణ్యుఁడైన హరి దాసుం డయ్యె దైత్యాళికిన్
    [హరి = ఇంద్రుఁడు]

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    హరిని జపియించ ప్రహ్లాదు డనవరతము
    తనదు నామము జపియించ మనుచు తండ్రి
    యెన్నొ యిడుముల పాల్జేయ వెన్నుడపుడు
    కాచి రక్షించ ప్రహ్లాదు కరుణ జూపి
    సురశరణ్యుడు దనుజ దాసుడుగ నయ్యె.

    రిప్లయితొలగించండి