6, జూన్ 2024, గురువారం

సమస్య - 4784

7-6-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”
(లేదా...)
“పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్”

17 కామెంట్‌లు:

  1. సిరివీడంగనువిష్ణువేతుదకుతాతేజంబుగోల్పోయెగా
    వర శ్రీ లక్ష్మినిచూచుకైవెదకెగావేద్యుండుకాడెన్నడున్
    తిరువేంకన్నగశోభతోనిలచెలేశ్రీశుండుగాకొండపై
    పరతంత్రుండురహించుదీనజనకల్పద్రుప్రభావోన్నతిన్

    రిప్లయితొలగించండి
  2. అరయన్కర్ణుడుమిత్రుడు
    విరిసెన్సభలోతనదగుభేదములేకన్
    ఒరిగెన్కలననుపోరుచు
    పరతంత్రుడుదీనకల్పపాదపముగదా

    రిప్లయితొలగించండి
  3. కందం
    ధరపై కోదండపతియె
    నిరతము గని ధర్మరక్ష నృపుడై యేలన్
    వరమై సద్ధర్మమునకుఁ
    బరతంత్రుడు! దీనకల్పపాదపము గదా!


    మత్తేభవిక్రీడితము
    ధరపై హర్యవతారుడై వెలయ కోదండాన ధర్మాత్ముఁడై
    వర శ్రీరాముడు యాగరక్షనిడ విశ్వామిత్ర సన్మౌనికే
    నిరతమ్మార్తులఁ గావ రాజ్యమున సంధింపంగ ధర్మానికౌ
    పరతంత్రుండు! రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్!

    రిప్లయితొలగించండి
  4. నిరతము జీవిక కొరకై
    పరితాపమునొందు పేదవారల నెలమిన్
    పరిరక్షించెడు సేవా
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా

    రిప్లయితొలగించండి
  5. హరియే నిత్యము సత్యము
    నిరతము సేవించు వారి నెయ్యము వాడే
    సురవంద్యుండాశ్రిత జన
    పరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదా.


    హరియే సత్యము నిత్యమై దనుజ సంహారమ్ము నేజేయుచున్
    శరణంబంచును వేడు శిష్టులకిలన్ సర్వంబు తానౌచు నీ
    ధరణిన్ ధర్మము నిల్పు వాడతడె పద్మాక్షుండు, భక్తాళికిన్
    బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.

    రిప్లయితొలగించండి
  6. పరమోదాత్త గుణాఢ్యుడై నిరతమాపన్నుల్ ముదంబొందగా
    పరితాపోన్మథనమ్మొనర్చుటకు సంభాలించు పుణ్యాత్ముడై
    పరిరక్షించెడు సద్గుణాన్వితుఁడెపో భావింపగా నెమ్మికిన్
    పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్

    రిప్లయితొలగించండి
  7. పరుల కెటుల జేయగలుగు
    పరతంత్రుఁడు ; దీనకల్పపాదపము గదా
    జరుగగలదెచ్చ టైనను
    నిరంతరము సొంత శిష్టి నెరపుచునుండన్

    రిప్లయితొలగించండి
  8. సరియగు రీతిని సేవలు
    నిరతము ప్రజల దరిఁ జేర్చు నిస్వార్థుండే
    స్మరణీయుడు గాదె ప్రజా
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా

    సరియౌ రీతిని సేవకై తలపులే సంగ్రామమున్ సల్పగా
    కరుణాపూరిత మానసుండు మదిలో కర్తవ్యమున్ నిల్పగా
    నిరపేక్షుండు సదా సమాజ హితుడౌ నిస్వార్థ నేతే ప్రజా
    పరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్

    రిప్లయితొలగించండి
  9. హరి హరి హరి యనినంతనె
    సరగున నేతెంచి బ్రోచె సామోద్భవమున్
    కరివరదుండాశ్రితజన
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా

    రిప్లయితొలగించండి
  10. నిరతము ధర్మా త్ముండై
    తర తమ భేద ములు మాని తాత్విక వర్తుం
    డరుదగు రీతిగ సేవా
    పర తంత్రు డు దీన కల్ప పాద పము గదా

    రిప్లయితొలగించండి
  11. కం॥ నిరతము సాయముఁ గోరఁగఁ
    బరతంత్రుఁడు, దీనకల్పపాదపము గదా
    యరసి జనుల హితము సతతము
    పరిపాలనఁ గనుచుఁ జనెడి ప్రభువు ధరణిలో

    మ॥ అరయంగానటు సర్వదా పరుల సాహాయంబు నర్థించఁగన్
    బరతంత్రుండు, రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్
    గరుణా సాగరుఁ డౌచు సర్వజన రక్షాభావనా తప్తుఁడై
    ధరలో వర్తిలు పాలకుండిల యధార్థంబున్ నివేదించఁగన్

    రిప్లయితొలగించండి
  12. కం:దరి జేరక యధికార
    మ్మరులకు నెన్నికల దక్కె నహము విడచి యా
    పరులకె మ్రొక్కుము, కొన్నిట
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”
    (పరతంత్రుడు అంటే శత్రుపక్షం వాడు అనే అర్థం లో వాడాను.అధికారం పోయినప్పుడు అధికారంలో ఉన్నవాడికి శరణు అంటే కష్టాల నుంచి బైటపడవచ్చు.)

    రిప్లయితొలగించండి
  13. మ:"వరమో ?శాపమొ? జన్మ" మంచు మది విశ్వాసమ్ము గోల్పోయి, త
    త్త్వరహస్యమ్ము నెరుంగ లేని సఖుడా ప్రార్థింపుమా మ్రొక్కి మ
    ద్గురునిన్ !తత్కృప జ్ఞాన మిచ్చు వెతలన్ ద్రుంచున్,పరబ్రహ్మకున్
    బరతంత్రుండు రహించు దీనజనకల్పద్రుప్రభావోన్నతిన్.
    (జీవితలక్ష్యం, పరమార్థం తెలియక బాధపడే ఒక సాధకునికి మరొక సాధకుడు తన గురువుని ఆశ్రయించ మని చెపుతున్నట్లు.)

    రిప్లయితొలగించండి
  14. కరుణా రసార్ద్ర హృదయుఁడు
    నిరతామల చిత్తుఁడు ఘన నిష్ఠాత్ముండున్
    నరలోక నిత్య సేవా
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా


    కరుణాంతఃకరణైక మండితుఁడు నిష్కాముండు లోకోపకా
    రి రుజా హీనుఁడు దీన రక్షకుఁడు నై హృద్యంబుగా సంతతం
    బరవిందాక్ష విలోల మానసుఁడు సమ్యగ్దేవతా చింతనా
    పరతంత్రుండు రహించు దీన జన కల్పద్రుప్రభావోన్నతిన్

    రిప్లయితొలగించండి

  15. ధరణినహరువిల్విరుచుచ
    ధరణిజనువివాహమాడిదశరథసుతుడున్
    స్థిరముగు సద్ధర్మమునకు
    పరతంత్రుఁడు దీనకల్పపాదపము గదా”*

    రిప్లయితొలగించండి