7, జూన్ 2024, శుక్రవారం

సమస్య - 4785

8-6-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్”
(లేదా...)
“చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్”

30 కామెంట్‌లు:

  1. అంగాంగము ఒడలొదువుగ
    బంగారము గ్రప్పుకొనగ భాగ్యమ్మనుచున్
    ఇంగిత మెఱుగక నొకఁడనె
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్

    రిప్లయితొలగించండి
  2. వంగరులౌకికమునకును
    చెంగటశారదనిలబడిసేమముగనగా
    నింగికినిచ్చెనవేయగ
    శృంగేరికిబోవువారుచెనఁటుల్మూర్ఖుల్

    రిప్లయితొలగించండి
  3. చెనకన్జాలరుశంకరార్యులనువిన్నాణంబులోదిట్టలై
    వినతుల్జేయగలౌకికంబులవియేవేద్యంబుగావందురే
    తనియంజేయగముక్తిబోధలనువేదార్థంబుసంపూర్ణులై
    చెనటుల్మూర్ఖులుగూడిపోదురుగదాశృగేరిదర్శింపగన్

    రిప్లయితొలగించండి
  4. కం॥ రంగుల జీవితము వలచి
    యింగితముఁ గనకను భక్తి యిసుమంతయునున్
    బొంగించక విహరించఁగ
    శృంగేరికిఁ బోవు వారు చెనఁటుల్ మూర్ఖుల్

    మ॥ మనముల్ భక్తికి దూరమై పరఁగ సమ్మానంబు శూన్యంబునై
    వినయంబన్నది కాంచకుండఁగను వైవిధ్యంబునౌ యాత్రనిన్
    జనగన్ గుంపుగఁ జేర నందరునటుల్ సంసిద్ధులౌచున్ గనన్
    జెనటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్

    విహార యాత్రకైతే చిక్కమంగుళూరు జిల్లాలోనే ఉన్న కెమ్మనగుండి కుద్రేముఖ్ కువెళ్ళచ్చండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'యాత్రనిన్' ?

      తొలగించండి
    2. ధన్యవాదములండి. యాత్రకున్ అని సవరిస్తానండి. అలసట వలన చప్పున తోచడములేదండి

      తొలగించండి
  5. శృంగేరీ మఠమందున
    శృంగమిపుడు చెలగదనుచు జెప్పిన గూడన్
    నింగితము నొప్పకుండగ
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్

    రిప్లయితొలగించండి
  6. కందం
    పొంగక పాండిత్యమ్మది
    వెంగలులు కుటిల వధానిఁ బృచ్ఛించెదరే?
    రంగమ్మై తీరఁగ నే
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్?

    మత్తేభవిక్రీడితము
    ఘనమౌ క్షేత్రమహత్మ్యమున్ గలుఁగ ప్రఖ్యాతంబటంచెంచి వా
    రనుకోగంగనె వేదికై మెదలగా నష్టావధానానికిన్
    గణుతిన్ జేరఁగ నెన్న కోవిదులు ప్రజ్ఞన్గల్గు వారిన్, వినా
    చెనఁటుల్ మూర్ఖులు, గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురువర్యులకు ధన్యవాదములు.

      వృత్తం రెండవపాదాది అనుకున్నంతనె యని సవరణ.

      తొలగించండి
  7. సింగారించుకు మురిసెడి
    యంగనలు ధరించు తొడుగు లందించుటకై
    బంగారము కొనదలచుచు
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్.


    కనగన్ దక్షిణ భారతావనిని ముఖ్యక్షేత్రమే నాళికా
    సను ప్రోయాలట నిల్చి యుండెనని భాషాయోష నే గొల్చినన్
    ధనమున్ జ్ఞానము పొందనెంచుటదె సత్కార్యమ్ము గానెంచుచున్
    చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్.

    రిప్లయితొలగించండి
  8. శృంగేరీపురికేగియు
    తుంగాస్నానమొనరించితోషముతోడన్
    గంగాధరుగననెంచక
    *శృంగేరికిబోవువారుచెనటుల్ మూర్ఖుల్*

    రిప్లయితొలగించండి
  9. తుంగ సమీపాన గలరు
    శృంగేరి మఠమున భక్త చింతాపరులే
    శృంగారశిల్పములకై
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్

    ధనమున్ వెచ్చముసేసి యాత్రనడుమన్ దామొక్క ప్రాదేశముం
    జని వారేతలపోయుచున్ ఖజురహో సౌందర్య సారంబు గాం
    చిన భంగిన్ జవి చూడవచ్చుననుచున్ శృంగార శిల్పాలకై
    చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్

    రిప్లయితొలగించండి
  10. సంగతముగ సత్పురుషులు
    శృంగేరికిఁ బోవువారు, చెనఁటుల్ మూర్ఖుల్
    వెంగలులై గడసానుల
    అంగడులకుఁ బోయెడి దురితాత్ములు వారల్

    రిప్లయితొలగించండి
  11. అనయంబింద్రియ లాలసంబడుచు దుర్వ్యాపారముల్ సల్పగన్
    చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా, శృంగేరి దర్శింపఁగన్
    వినయంబున్ మృదుభాషణోత్సుకతయున్ పెంపార చిత్తమ్ములన్
    ఘనమౌ భక్తవరేణ్యులేగెదరు సంఘాతమ్ముగా నొక్కటై

    రిప్లయితొలగించండి
  12. బంగరు భవిత ను గోరుచు
    క్రుంగ క శారదను గొలిచి కోర్కె లు దీర్ప న్
    పొంగుచు పోవగ నె ట్టుల
    శృంగేరి కి పోవు వారు చెన టుల్ మూర్ఖుల్

    రిప్లయితొలగించండి
  13. కం:మంగళగిరి స్వామియె బ్రో
    వంగా నద్వైతు లట్లు వైష్ణవ భక్తిన్
    భంగము జేతురె?మీ లో
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్”
    (మంగళగిరి నరసింహుణ్ని వదిలి,వైష్ణవాన్ని వదలి అద్వైతుల్లాగా శృంగేరికి పోవట మేమిటి? అని ఒక వైష్ణవుడు, విశిష్టాద్వైతి బాధ పడుతున్నట్టు.)

    రిప్లయితొలగించండి
  14. మ:మనమున్ వీడక ధూమపాన మమితంబౌ ధ్యానముల్ జేసియున్,
    మునులున్, సాధువు లుండు పీఠమునకున్ బోవంగ నన్యాయమౌ
    నను న్యాయమ్ము నెరుంగ లేక యవధానాపేక్ష తో నెవ్వరో
    చెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్”
    (ఇది నా స్వంత సమస్యే. నాకు మంచి ఆధ్యాత్మిక సాధన ఉన్నా దురదృష్టం కొద్దీ ధూమపానం అనే అలవాటు ఉంది. దీనితోనే శృంగేరీ పీఠం లో మూడు రోజు లుండటం కష్ట మని ఆ పీఠదర్శనాన్ని, అవధానాన్ని కూడా వదులుకున్నాను.)

    రిప్లయితొలగించండి
  15. భంగ మొనరించి నీతికిఁ
    బింగాంబరములు ధరించి వీడక యెదలన్
    సంగము నించుక పీఠము
    శృంగేరికిఁ బోవువారు చెనఁటుల్ మూర్ఖుల్


    ధనదాహంబున నిత్య మెల్లర నిలం దర్జించుచున్ నిర్దయన్
    వినయమ్మున్ నటియించుచుం గరము నిర్భీతిం బ్రవర్తించుచున్
    జన సందోహము మోసపుచ్చఁ గుమతుల్ సంస్కారవంతుల్ వలెం
    జెనఁటుల్ మూర్ఖులు గూడి పోదురు గదా శృంగేరి దర్శింపఁగన్

    రిప్లయితొలగించండి