22, జూన్ 2024, శనివారం

సమస్య - 4799

23-6-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్”
(లేదా...)
“అఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్”

20 కామెంట్‌లు:

  1. అఆల్ పరిశీలించితి
    అఆల్ నేర్వకయె; చేసి తవధానమ్మున్
    అఆ లటునిటు పేరిచి
    అఆ లేప్రాణముగద యవధానముకున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అఆలే పరికించినాను తమితో నాటాడు ప్రాయంబునన్
      అఆలే యవధాన విద్య యథవా నాయత్నమే సాధ్యమా
      అఆల్ నేర్వకయే; వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్
      అఆల్ పేర్చుటయే ప్రధానముగదా యత్యద్భుతంబౌనటుల్

      తొలగించండి
  2. మూడవ తరగతి వరకే చదివి పద్యరచనలో నైపుణ్యం సాధించి అవధానాలు చేయుచూ గురువర్యులు శ్రీకందిశంకరయ్య గారితో శ్రీబండికాడి అంజయ్యగారు...

    కందం
    ఎఏ ఛందపు నడకను
    నఆ విధముగ నడుపుచు నందరు భళిరా
    యుఊ! యనంగ పెద్దగ
    నఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్!!


    శార్దూలవిక్రీడితము
    ఎఏ ఛందపు కూనిరాగమెటులో నిష్టాన నేనేర్చి నే
    నఆ రీతిని పద్యముల్ మలచి విన్యాసింపగా నొజ్జలే
    యుఊ గొప్పగ చెప్పుచుంటివనుచున్ హోరెత్తగన్, బెద్దగా
    నఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్!

    రిప్లయితొలగించండి

  3. అఆల్ నేర్చిన మేలన
    యఆల్ నేర్పింపగ కవులాప్యాయతతో
    న ఆల్ నర్చితి నొకనా
    డఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్.


    అఆల్ నేర్వని తల్లిదండ్రులపుడభ్యర్థింపగా వెంటనే
    య ఆల్ నేర్వదలంచి పండితుడ నేనర్థింపగా నేర్పెనే
    యఆల్ కాక సమస్తమా పిదప విద్యావంతునై నొక్కనా
    డఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్.

    రిప్లయితొలగించండి
  4. ఒక సందేహం అండి. పెద్దలు నివృత్తి చేస్తారని భావిస్తాను : కందంకి నాలుగు మాత్రలు గల గణాలు ఉండాలనే నియమం లేదా ? "ఆ" కి ఏ అచ్చు తో నైనా ప్రాస చెల్లుతుందా ?
    లేదా , సమస్య "అక్షరాలు నేర్చుకోకుండా అవధానం చేసాను" అన్నందుకు ఔచిత్యం కోసం గణ, ప్రాస , యతి భంగం కావించి కూడా పూరించ వచ్చా?

    రిప్లయితొలగించండి
  5. అఆల్ నేర్చుట యరుదే
    అఆల్ వర్ణమ్ము లెల్ల నరసితి వయ్యా
    అఆల్ నేర వఱవమున
    అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్


    అఆల్ రా వని కిట్ట కంటి రది యత్యం తానృతం బౌ నయా
    అఆల్ కాదు సమస్త మైన వగు వర్ణౌఘమ్ములున్ వచ్చునే
    అఆల్ రా వఱవమ్ము నందు నిజ మయ్యా నమ్ము మో మిత్రమా
    అఆల్ నేర్వకయే వధానిగ యశం బార్జించితిన్ మిన్నగాన్

    [పద్యములలో వాక్యాంతమును బాదాంతము నయిన సంధి లేమి దోషము కాదు.]

    రిప్లయితొలగించండి
  6. అఆల్ అచ్చులనెదరా
    అఆల్ లను కూడి హల్లు అక్షర మగునా
    అఆల్ నేర్చుట యెందుకు
    అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్

    రిప్లయితొలగించండి
  7. కం:అ ఆ లా హిందీ లో
    నె ఏ వరకే తెలిసిన విక చాలని నే
    నొ ఓ ల వదలి పూర్తిగ
    నఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్”
    (ఇది నిజానికి సంప్రదాయవిరుద్ధ మైన సమస్య. కానీ ఉచ్చారణ రీత్యా హేతుబద్ధం.ప్రాస లో హల్లు సరిపోతే ఏ అచ్చైనా సరిపోతుంది కదా!అలాగే ప్రాస లో హల్లు లేకున్నా ఏ అచ్చు ఐనా పనికొస్తుందనేది నా తర్కం. తెలుగులో పండితుడే కానీ హిందీలో అ ఆ లు పూర్తిగా రావు.తెలుగు లో అవధానం చేసాడు.అచ్చులని అ ఆలు అంటారు.)


    రిప్లయితొలగించండి
  8. శా:"ఆ ఆల్ నేర్వుము దేవనాగరిన" నం చాచార్యుడే పల్కగా
    నె ఏ దాకనె నేర్చినాడ, నివి నా కేలంచు, నా పైన నే
    నొ ఓ లన్ విడి, తెల్గు చాలని, జనం బొప్పంగ గీర్వాణ మం
    దఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్”
    (సంస్కృతం లో ఆ ఆలు కూడా నేర్చుకోమని గురువు చెప్పాడు కానీ అవి వదిలేసాడు.తెలుగు అవధానానికి సంస్కృతం ఆ ఆ లు అవసరం లేదు కదా!)

    రిప్లయితొలగించండి
  9. అఆల్ తెనుగున నచ్చులు
    అఆల్ హల్లులఁగలసిన నగుపదములుగా
    అఆల్ నవ్వవె యిటులన
    అఆల్ నేర్వకయె చేసి తవధానమ్మున్?

    రిప్లయితొలగించండి
  10. ఏ ఆ లను దిద్దు కొనక
    నే ఆలను నేర్చుకొనని యెరుగని బాలుం
    డా యా శ పడక సలి పెన్
    ఆ ఆ ల్ నేర్వక యె చేసె యవ ధా న మ్ము న్

    రిప్లయితొలగించండి
  11. అఆల్ బ్రాణములాంధ్రభాషకవియే అచ్చుల్ గదా, హల్లులన్
    అఆల్ గూడిన నర్ధవంతమగు వాక్యమ్ముల్ తయారౌనునా
    అఆల్ లేక నసంభవమ్ముగద వ్రాయన్ ,యెట్టులీవందువో
    అఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్?

    రిప్లయితొలగించండి
  12. అఆల్ సారము నెఱిగితి
    అఆల్ నేర్వకయె, చేసి తవధానమ్మున్
    అఆల్ అటునిటు గూర్చుచు
    అఆల్ వాడుదు రనిశము హర్షంబొదవన్

    రిప్లయితొలగించండి
  13. అఆల్ తోఁబని లేదు సోదర! మదిన్ యాలోచనా శక్తియే
    యఆల్ గూర్చును సక్రమంబుగ నటన్ యాదృక్షి కం బొప్పగా
    నఆల్ రాకయె వ్రాయ గల్గుట యహా యాశ్చర్య ముంగొల్పగా
    అఆల్ నేర్వకయే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్

    రిప్లయితొలగించండి
  14. అఆల్రాకనె పద్దుఁ జెప్పు గదా ఆ రేవడెల్లప్పుడున్
    అఆల్నేర్వకనే కళాశులు నభోహర్మ్యమ్ములన్ కట్టరే
    అఆల్వంటివి నేర్వజాలని యొకండాలాగుఁ దర్కించనెన్
    అఆల్నేర్వకనే వధానిగ యశంబార్జించితిన్ మిన్నగాన్

    రిప్లయితొలగించండి