23, జూన్ 2024, ఆదివారం

సమస్య - 4800

24-6-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా”
(లేదా...)
“కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్”

19 కామెంట్‌లు:

  1. పూర్ణోత్సాహముతో రచించి జనులామోదమ్ము ప్రాప్తింపగా
    కర్ణాటాంధ్రులు వెల్వరించిరికదా కావ్యాలనేకంబులున్
    గర్ణాకర్ణిగ వింటినాడు తెలుగున్ గన్గొంటి నేడచ్చటన్
    గర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెన్నెల కురిపించి నటుల
      మిన్నగ వెలయించిరిగద మేలగు రచనల్
      కన్నడ తెలుగులు కృషితో
      కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా

      తొలగించండి
  2. కందం
    ఎన్నఁగ రాయలు తెలుగును
    దన్నుగ ఆముక్తమాల్యదన్ వ్రాయఁగ తా
    నున్నత కన్నడిగునిగన్
    కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా!

    శార్దూలవిక్రీడితము
    స్వర్ణాంధ్రన్ దన మేటి పాలనమునన్ భాసిల్లగాఁజేయుచున్
    పూర్ణానందమునొందఁగన్ దెనుగునాముక్తంపు మాలాకృతిన్
    వర్ణింపన్ గనఁ దానుకన్నడిగుడై వర్ధిల్లఁ సత్కీర్తిమై
    కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్!

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. శంకరా భరణం
      సమస్య
      "కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా!"
      నా పూరణ

      కన్నడ తెల్గని భేదము
      నెన్నడు సూపించినట్టు లెరుగము రాయల్
      మన్ననతో పోషించెను
      కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా!

      తొలగించండి
  4. మన్నీడుగరాయలుఘన
    మన్ననలందుచుకవితనుమనదిగజేసెన్
    విన్నాణమునాముక్తము
    కన్నడదేశమునఁదెలుగుఘనతఁగనెగదా

    రిప్లయితొలగించండి
  5. స్వర్ణబాయనవెల్గెకావ్యమదిసవ్యంబైనహారంబుతో
    వర్ణంబుల్వెలిముత్యముల్గనగనింపారంగసంగీతమై
    పూర్ణంబైనదిసాహితీవనముతాపుష్పంబుసౌగంధ్యమై
    కర్ణాటోర్వినిఁదేజరిల్లెదెలుగాకర్ణింపుమావేడుకన్

    రిప్లయితొలగించండి
  6. నన్నెన్ని మార్లడిగినను
    మున్ను తెలిపిన విధముగనె పుడమిని యుండన్
    వన్నె నొసగు మన భాషయె,
    కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా”

    రిప్లయితొలగించండి

  7. మిన్నగ శతావధానము
    చెన్నగు శృంగేరి యందు చేసిన విదుడౌ
    యున్నతుడాదిత్యునిచే
    కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా!



    జీర్ణావస్థన యున్న తెన్గుకచటన్ జీవమ్ము నందించె నా
    స్వర్ణాలంకృత రూపమై వెలుగు భాషాయోష సాన్నిధ్యమున్
    కర్ణానంద శతావధానమది సత్కార్యమ్ముగా సల్పగా
    కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్.

    రిప్లయితొలగించండి
  8. కం॥ మిన్నగను సోమనాథులు
    సన్నుతుఁడుననంత కృష్ణ శర్మయు నితరుల్
    చెన్నగు రచనల సేయఁగఁ
    గన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా

    శా॥ పూర్ణంబౌ కవితా సుమంబులను సంపూర్ణంబునౌ ఖ్యాతినిన్
    వర్ణింపంగ నమోఘమౌ పగిదినిన్ భాసిల్లిరే సత్కవుల్
    గర్ణాటోర్విని వ్రాసి యాంధ్రమున సత్కారమ్మునున్ బొందిరే
    కర్ణాటోర్వినిఁ దేజరిల్లె దెలుఁగాకర్ణింపుమా వేడుకన్

    సోమనాథులు శ్రీ పాల్కురికి సోమనాథులు (బసవ పురాణము, కన్నడ సంస్కృతములలోను గొప్ప విద్వాంసులు)
    అనంతకృష్ణ శర్మ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (తెలుగు, కన్నడ, సంస్కృత సంగీత విద్వాంసులు)
    శార్దూలములో అందరినీ కలిపేసానండి (అష్టదిగ్గజములతో సహా)
    పాల్కురికి వారు కన్నడ దేశములో ఉన్నట్టే ఏలూరు దగ్గరలోని వేంగీ దేశము (చినవేగి పెదవేగి) లో కన్నడ కవులుండేవారట (రాజమండ్రిలో మేము కువెంపు శతజయంత్యుత్సవం జరిపినపుడు తెలిపారండి)
    కన్నడలో నాకుతెలిసిన ఏకైక శతావధాని ఆర్ గణేశ్ గారు తెలుగు సంస్కృతములలోను అవధానములు చేసారట (వీరు MSc, in Metallurgy భారతీయ విజ్ఞాన సంస్థ (IISc)లో చేసారండి.

    క్షమించాలి మీరు కర్నాటక అన్నందుకు కొన్ని విషయాలు తెలిపాను.

    రిప్లయితొలగించండి
  9. కర్ణాటమ్మున నాంధ్రభోజుని సభన్ కాంతిల్లె నాంధ్రమ్ము సం
    పూర్ణమ్మౌకవితా వితానము వలెన్ పొంగారె విద్వత్సభల్
    కర్ణమ్ముల్ ౘవులూరు పద్యములతో కావ్యమ్ములొప్పారఁగా
    కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్

    రిప్లయితొలగించండి
  10. మన్నింపరు సుంతయినను
    జన్నే యిట్లుండఁ దెన్గు జనులకు నెల్లన్
    సన్నగిలెనె యాంధ్రమ్మునఁ
    గన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా


    స్వర్ణాభమ్ములు నీదు వాక్కు లివి యాశ్చర్యమ్ములౌ సత్యముల్
    కర్ణాకర్ణిక వింటి మిప్పగిది శంకా హీన మయ్యెం గదా
    వర్ణింపంగఁ గడింది ధైర్యమున సంభావింప నిబ్భంగినిం
    గర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్

    రిప్లయితొలగించండి
  11. కన్నడిగుఁడు రాయలు కడు
    మన్ననగా నాంధ్రమునభిమానముతోడన్
    మిన్నగ ప్రోత్సాహమునిడ
    కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా

    రిప్లయితొలగించండి
  12. కన్నడ రాజ్యము నందున
    మిన్న గ నొనరించె నొకడు మేటి వ ధా న మ్
    మన్నన నొంది యు నాడే
    కన్నడ దేశము న దెలుగు ఘనత గనె గదా

    రిప్లయితొలగించండి
  13. కం:తిన్నగ నేర్వక నాంధ్ర
    మ్మన్నింటిని మించు భాష యాంగ్లమ్మనుచున్
    ని న్నవమానించుకొనకు
    కన్నడ! దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా”
    (చిన్న పిల్లలని ముద్దుగా కన్నడా!అన్నట్టు. )

    రిప్లయితొలగించండి
  14. శా:వర్ణించెన్ గద "దేశభాషల ఘనత్వమ్మొందు తెల్"గంచు నా
    కర్ణాటమ్మున రాయలే ప్రభువునై , కావ్యమ్ము దా వ్రాసియున్,
    వర్ణింపంగ నసాధ్యమౌ నెలమి సంభావించె కావ్యమ్ములన్
    కర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్”


    రిప్లయితొలగించండి
  15. కన్నడ ప్రభువగు రాయలు
    తెన్నుగఁదాఁజేసె రచన తెనుగున యందున్
    వన్నెను దెచ్చెను గావ్యము
    కన్నడ దేశమునఁ దెలుఁగు ఘనతఁ గనెఁ గదా

    రిప్లయితొలగించండి
  16. పూర్ణా! యేమని జెప్పగావలయునీభూమండ లంబందునన్
    గర్ణాటోర్వినిఁ దేజరిల్లెఁ దెలుఁ గాకర్ణింపుమా వేడుకన్
    గర్ణాటాంధ్రులు మీదు మిక్కిలి ప్రజాకర్షంపు కావ్యంబులే
    పూర్ణోత్సాహము పిక్కటిల్లగ జనామోదంబు గావ్రాసిరే

    రిప్లయితొలగించండి