1-8-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దైత్యసేవకై తరలెను దైవగణము”
(లేదా...)
“దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
1-8-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దైత్యసేవకై తరలెను దైవగణము”
(లేదా...)
“దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
31-7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిప్పుఁ ద్రొక్కి కోఁతి నిజముఁ బలికె”
(లేదా...)
“నిప్పును ద్రొక్కి వానరము నిష్ఠగఁ బల్కెను సత్యవాక్యముల్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
30-7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మహిమలఁ జూపఁడఁట యోగి మన్నన కొఱకున్”
(లేదా...)
“మహిమల్ సూపఁడు యోగి మన్ననఁ గనన్ మాత్సర్యసంలగ్నుఁడై”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
29-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఇనుఁడు రవికిఁ బేరిడెను దినేశుఁ డనుచు”
(లేదా...)
“ఇనుఁడు దినాధినాథునకు నిచ్చె సహస్రకరాభిధానమున్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధానంలో నేనిచ్చిన సమస్య)
28-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్మభవుని సతి యపర్ణ యంద్రు”
(లేదా...)
“పద్మసంభవు ధర్మపత్ని యపర్ణ యందురు పండితుల్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
27-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముని ఘాతమున మరణించెఁ బొలతిండి వనిన్”
(లేదా...)
“ముని ఘాతమ్మునఁ జచ్చె రాక్షసుఁడు సమ్మూఢమ్ముగాఁ గానలో”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
26-7-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్య కళ్యాణమూర్తియై కనెను సంతు”
(లేదా...)
“కన్యల్ వారలు సంతతిం గలిగియున్ గళ్యాణమూర్తుల్ గదా”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
25-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కూఁతురువొ కోడలివొ పౌత్రివో తెలుపుము”
(లేదా...)
“కూఁతురువయ్యెదో యనుఁగుఁ గోడలివయ్యెదొ పౌత్రివయ్యెదో”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
24-7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సన్యాసమె మేలు దొలఁగ సంక్లిష్టంబుల్”
(లేదా...)
“సన్యాసంబిఁక మేలు గాదె కలిలో సంక్లిష్టముల్ వీడఁగా”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
23-7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతి మురిసెఁ బల్లవాధరి ప్రల్లదమున”
(లేదా...)
“పల్లవాధరి ప్రల్లదంబది భర్తకెంతయొ హర్షమౌ”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
22-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దంష్ట్రాఘాతమునఁ గూలె ద్వైమాతురుఁడే”
(లేదా...)
“దంష్ట్రాఘాతము చేత నేలకొరిగెన్ ద్వైమాతురుం డాజిలోన్”
(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)
21-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“షండుఁడు గొడ్రాలిఁ గూడి సంతున్ బడసెన్”
(లేదా...)
“షండుండొక్కఁడు గొడ్డురాలిఁ గవసెన్ సంతానమందెన్ భళా”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
20-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విద్య నేర్పువారు వెఱ్ఱివారు”
(లేదా...)
“విద్యలు నేర్పువార లవివేకులు పామరు లజ్ఞు లీ భువిన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
19-7-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆలుమగల మధ్య గొడవ లాహ్లాదములే”
(లేదా...)
“ఆలుం బెన్మిటి మధ్య పోరు గనఁగా నాహ్లాదమిచ్చున్ గదా”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
18-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేఁడను జనులకె తీర్థాటనముల్”
(లేదా...)
“దేవుఁడు లేఁడటంచుఁ గడు దీక్ష నొనర్తురు తీర్థయాత్రలన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
17-7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జన్మించితిఁ జచ్చి మరల జన్మించితిటుల్”
(లేదా...)
“జన్మన్ బొందితిఁ జచ్చితిన్ మరల నీ జన్మమ్మునుం బొందితిన్”
(జులై 17 నా పుట్టినరోజు. 74 నిండి 75లో అడుగుపెడుతున్నాను)
16-7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అమ్మను సేవించువార లత్యంతఖలుల్”
(లేదా...)
“అమ్మన్ భక్తిని సేవఁ జేయు జను లత్యంతాఘముల్ వొందరే”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
15-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కోఁతుల జత పాఠ మొక్క కోఁతికిఁ జెప్పెన్”
(లేదా...)
“కోఁతులు రెండు గూడి యొక కోఁతికిఁ బాఠముఁ జెప్పుచుండెడిన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
14-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పతిని సేవించు సతి పొందు బాధలెన్నొ”
(లేదా...)
“భర్తకు సేవఁ జేసినను భార్యకు దక్కును కష్టనష్టముల్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
13-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విష్ణుదేవుఁడు సూపెను వినయమెంతొ”
(లేదా...)
“విష్ణుదేవుఁడు సూపె మిక్కిలి వింతగా వినయమ్మునే”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
12-7-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యజ్ఞమ్ములు దేశమునకు హానిం గూర్చున్”
(లేదా...)
“యజ్ఞములెల్ల దేశమున హానినిఁ గూర్చుటకోసమే కదా”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
11-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యద్వేషులను ధూళిపాళయె మెచ్చున్”
(లేదా...)
“పద్యద్వేషుల ధూళిపాళమణి యాహ్వానించు నాత్మీయతన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
10-7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గోవు పాలను పులి గ్రోలె వనిని”
(లేదా...)
“గోక్షీరమ్ములఁ ద్రావెఁ బెద్దపులియే ఘోరాటవిన్ దృప్తిగా”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
9-7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విఱ్ఱవీఁగిన నాయకుల్ వీడినారు”
(లేదా...)
“విఱ్ఱవీఁగిన నాయకాళికి వీడుకోలు నొసంగిరే”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
8-7-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేదవిదుఁడయ్యె నొక్కఁడు విద్య విడిచి”
(లేదా...)
“విద్యను వీడి యొక్కరుఁడు వేదవిశారదుఁడయ్యె నిద్ధరన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
7-7-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువలు వికసించెఁ బవలె కంటివె సుకవీ”
(లేదా...)
“కలువల్ పూఁచె వియత్తలంబునఁ బవల్ గన్గొంటివే సత్కవీ”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
6-7-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒక్క చంద్రుఁడు వొడమె వేఱొకఁడు గ్రుంకె”
(లేదా...)
“ఇద్దఱు చందమామ లుదయింపఁగ నొక్కఁడు గ్రుంకె నొక్కఁడున్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
5-7-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బకజపము లొనర్చి ముక్తిఁ బడఁయఁగ వచ్చున్”
(లేదా...)
“బకజప మాచరించుటయె ప్రాప్తమొనర్చును మోక్షమిద్ధరన్”
(కోటబొమ్మాళి శతావధాన సమస్య)
4-7-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూదులతోఁ గ్రుచ్చి చూపె సుతునకుఁ బ్రేమన్”
(లేదా...)
“సూదులతోడఁ గ్రుచ్చి సతి చూపెఁ గుమారునిపైనఁ బ్రేమనున్”
(రంప సాయికుమార్ గారి అష్టావధాన సమస్య)
3 -7-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాన్యులుండరు కోటబొమ్మాళిలోన”
(లేదా...)
“కోటబొమ్మాళి పురమ్ములో నకట మాన్యుఁ డొకండును గానరాఁడు పో”
(మొన్న కోటబొమ్మాళి శతావధానంలో నా సమస్య)
2 -7-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శివునిఁ దలఁచుట దొసఁగు కాశీపురమున”
(లేదా...)
“శివనామస్మరణమ్ము దోషమగుఁ గాశీక్షేత్రమం దెప్పుడున్”
(కాశీ అష్టావధానంలో నా సమస్య)