కం:"నిస్సంగ"మనగ నెరుగక దుస్సందేహముల బాధ తో నొక డనియెన్ లెస్స యగును సత్సంగము "నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్” (సత్సంగం చాలా మందికి అర్థ మౌతుంది కానీ నిస్సంగం అర్థం కావటం కష్టం కనుక అలా అడుగుతారు.)
శా:దుస్సాంగత్యము లెన్నొ జేసితివి ,నీ దుర్బుద్ధులన్ బాసి తే జస్సున్ బొందగ ప్రస్తుతమ్మునకు సత్సంగమ్మె నీ కర్హమౌ దుస్సాధ్యమ్మని యెంచ లేక యెవడో తోచంగనే యొజ్జయై నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో” (దుస్సంగత్వం లో ఉన్న నీకు మొదట సత్వగుణం,సత్సంగం అవసరం.అది గ్రహించక ఎవడో గురువు ననుకొని నీకు నిస్సగత్వం బోధిస్తే నీ వెలా నమ్మావు?నిస్సంగత్వం తాత్త్వికం గా గొప్పదే ఐనా ప్రస్తుతం నీకు అర్హం కాదు.)
రిప్లయితొలగించండినిస్సందేహమటంచును
విస్సన్న వచించు మాట వెంగలి పలుకన్
నిస్సంకోచము కలుగునె?
నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్.?
విస్సన్నార్యునిమాటలంచు నొక సద్విద్యార్థి వాచించెనే
నిస్సంగత్వమె మోక్షమార్గమనుచున్, నేవింటి నామాటలన్
నిస్సంకోచమె తొల్గె ముక్తియదియే నీ కాంక్ష యైనప్పుడా
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా , నీవెట్టులన్ నమ్మితో.?
లెస్సంజూచినజనకుడు
రిప్లయితొలగించండినిస్సందేహిగవరలెను నేర్చెనుపరమున్
సస్యంబైనది రాజ్యము
నిస్సంగత్వమిడునొకొముక్తిన్
కందం
రిప్లయితొలగించండిదుస్సాంగత్యమహితమిడి
నిస్సారము సేయు బ్రతుకు నిజమని వింటిన్
తుస్సుమనెడు బూటకమగు
నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్?
శార్దూలవిక్రీడితము
దుస్సాంగత్యము సేమమున్ జెరుచదే దోషమ్మనన్ మారుచున్
నిస్సారమ్మొనరింపకే మనుగడన్ దేజమ్మునీవొందుచున్
గస్సంచున్ ప్రతివారిపైయురిమితే కాంక్షల్ ప్రకోపించెడున్
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో?
ఉస్సురనిపించు తపమున
రిప్లయితొలగించండినిస్సందేహముగ జలువ నెరపుచు నుండున్
తుస్సుమను సాధనముతో
నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్
కం॥ బుస్సని ఫణివలె దుష్టులు
రిప్లయితొలగించండినిస్సంకోచముగఁ గీడు నిత్యముఁ గనఁగన్
దుస్సు విడువఁగననె ధవుఁడు
నిస్సంగత్యమిడు నొక్కొ నిజముగ ముక్తిన్
శా॥ బుస్సంచున్ ఫణివోలెఁ గుత్సితులు సద్బుద్ధిన్ దిగద్రోచఁగన్
నిస్సంకోచముగా ధరన్ బ్రదుకునన్ నిత్యంబు నోర్పున్గనన్
దుస్సేయౌనని పోరు సల్పమని యుద్బోధించె నాకృష్ణఁడే!
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో
తుస్సు తుచ్ఛము నీచము
నిఘంటువు సహాయమండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికృష్ణుఁడే నండి typing error
తొలగించండినిస్సంధిగ్దపు వివరణ
రిప్లయితొలగించండినిస్సంగత్వపు ఫలితము నిర్మల భక్తే
నిస్సంశయంబుగ చెపుమ
నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్
నిస్సంకోచము సత్సమాగమమునన్ నిష్కామమే తత్వమై
నిస్సంధిగ్దపు చిత్తమందు కలుగున్ నిశ్శేషమౌ భక్తియే
నిస్సందేహపు చర్యలిచ్చు ఫలమున్ నిష్కర్షగా తెల్పకే
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో
కస్సున కోపము పొంగుచు
రిప్లయితొలగించండిబస్సున దురిత ములు జేయు మూర్ఖత్వము తో
లెస్సగ భక్తిని చూపని
నిస్సంగత్వ మి డు. నొక్కొ నిజముగ ముక్తిన్?
ఉస్సు రనుచుం బనులను మ
రిప్లయితొలగించండినస్సునఁ గృష్ణార్పితముగ నడపక యున్నన్
నిస్సందేహమ్ముగ నీ
నిస్సంగత్వ మిడు నొక్కొ నిజముగ ముక్తిన్
నిస్సందేహము లైన మాట లివి వానిం బల్క శ్రావ్యమ్ముగా
నిస్సంగత్వమె ముక్తి నిచ్చు ననఁగా నీ వెట్టులన్ నమ్మవో
యిస్సీ తల్పఁగ మంద చిత్తుఁడవు గావే నిత్య శాతోదరీ
నిస్సంగత్వమె ముక్తి నిచ్చు ననఁగా నీ వెట్టులన్ నమ్మితో
[నిః + సంగత్వము = 1. సాంగత్యము లేమి 2. నిశ్చయంపు సాంగత్యము]
నిస్సందియముగ దెల్పెద
రిప్లయితొలగించండినిస్సంగత్వమునముక్తి నిజముగ గలుగున్
నిస్సిగ్గుగ నుక్కివమౌ
నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్
నిస్సందేహము నిశ్చయమ్ముదెలుపన్ నిస్సంగమేపారగన్
నిస్సారమ్మగు కర్మబంధనములన్ నిర్జించఁగా శస్తమౌ
నిస్సంగత్వము నాత్మశుద్ధిఁగొనకన్ నిస్సిగ్గుగా కల్కమౌ
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో
కం:"నిస్సంగ"మనగ నెరుగక
రిప్లయితొలగించండిదుస్సందేహముల బాధ తో నొక డనియెన్
లెస్స యగును సత్సంగము
"నిస్సంగత్వ మిడునొక్కొ నిజముగ ముక్తిన్”
(సత్సంగం చాలా మందికి అర్థ మౌతుంది కానీ నిస్సంగం అర్థం కావటం కష్టం కనుక అలా అడుగుతారు.)
శా:దుస్సాంగత్యము లెన్నొ జేసితివి ,నీ దుర్బుద్ధులన్ బాసి తే
రిప్లయితొలగించండిజస్సున్ బొందగ ప్రస్తుతమ్మునకు సత్సంగమ్మె నీ కర్హమౌ
దుస్సాధ్యమ్మని యెంచ లేక యెవడో తోచంగనే యొజ్జయై
నిస్సంగత్వమె ముక్తినిచ్చు ననఁగా నీవెట్టులన్ నమ్మితో”
(దుస్సంగత్వం లో ఉన్న నీకు మొదట సత్వగుణం,సత్సంగం అవసరం.అది గ్రహించక ఎవడో గురువు ననుకొని నీకు నిస్సగత్వం బోధిస్తే నీ వెలా నమ్మావు?నిస్సంగత్వం తాత్త్వికం గా గొప్పదే ఐనా ప్రస్తుతం నీకు అర్హం కాదు.)