2, అక్టోబర్ 2024, బుధవారం

సమస్య - 4900

3-10-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్”

(లేదా...)

“నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా”

31 కామెంట్‌లు:

  1. కం॥ భువిలో మారఁగ యుగములు
    చవి కరువై పండుగలన సర్దుకొనఁదగున్
    నవయుగమునననిఁ బలికిరి
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్


    మ॥ నవ విద్యావిధి నేర్పు పాఠములు సన్మానించునో శాస్త్రమున్
    నవతా భావమటంచు శాస్త్రమును బోనాడన్ బురాయించునో
    పవనా యేమనిఁ దెల్పఁగా వలనెకో పల్కెన్ సఖుండిట్టులన్
    నవరాత్రోత్సవ మెన్ని నాళులనగా నాల్గే కదా మిత్రమా!

    (ఒక మిత్రుడు పవన అనే మిత్రునితో తన మిత్రుని ప్రతిభ తెలియజేయుటండి)
    పురాయించు పురిగొల్పు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి

  2. అవధానమ్ములు మరియును
    కవితాగానాలతోడ కళకళ లాడున్
    గవివరా! సప్తమి నుండియె
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.


    అవధానమ్ములు కావ్య గోష్ఠులను నేనారంభమున్ జేసెదన్
    నవరాత్రోత్సవ మందు సప్తమి తిథిన్ నామాట నాలింపుమా
    వివరంబయ్యది తెల్పుచుంటి వినుమా వేడ్కల్ ప్రధానమ్ముగా
    నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా.

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. బాగున్నవి. 'అయిదో' అనడం వ్యావహారికం.

      తొలగించండి
    2. సవరణతో....

      అవశేషంబెంతనగా
      వివరింపగనైదు గడిచె విభవపు రాత్రుల్
      లవలేశపు లెక్క గదా
      నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్

      భవుడే వర్తిలుగాన పూజ నిరతంబౌ దేవళంబందునన్
      శివలింగమ్మపురూపమన్న తలపే చేకూర్చె నైశ్వర్యమే
      లవలేశంబగు లెక్కచూడ నయిదే రాత్రుల్ గతించెన్ గదా
      నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా

      తొలగించండి
  4. నవరాత్రంబులు వేడ్కగా జరుపు సన్నాహంబులన్ మిన్నగా
    కవితాగోష్ఠులతోడ నాటకములన్ గావించి రానాడు నే
    డవి యెల్లన్ మటుమాయ మయ్యెనుగదా యత్యంత దైన్యంబుగా
    నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా

    రిప్లయితొలగించండి
  5. వివహంబయ్యిన క్రొత్త పెండ్లి కొడుకే ప్రీతిన్ విశాలాక్షికిన్
    ధవుడే తానయి డెందమందు మురియున్ తాపత్రయంబెక్కినన్
    భవితవ్యంబును గాన లేక మదిలో భావించి చూడంగనీ
    నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!!

    రిప్లయితొలగించండి
  6. "నవ"యన దెలియని పిల్లడు
    "నవ"నగల "న"కు యతి కలుప "నాల్గు" తగుననిన్
    వివరించుచు వదరెనిటుల
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  7. భువి లో వేడుక గ శర
    న్న వ రా త్రో త్స వ ములొ ప్పు :: నాలుగు దిన ముల్
    వివి ధా లంకా రము గన
    జవము న నేతె o త్రు జనులు జాతర వోలెన్

    రిప్లయితొలగించండి
  8. నవరాత్రులు వేడుకగా
    భవాని పూజలు జరుపుట పరిపాటిగదా
    యవిజరుపగ లేకున్నను
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్

    రిప్లయితొలగించండి
  9. కం:భువి యే కైలాసమ్మన
    నవరాత్రోత్సవము లొప్పు, నాలుగు దినముల్
    కవిసమ్మేళనములతో,
    యువకుల నృత్యాది కళల నొప్పు సరసమై

    రిప్లయితొలగించండి
  10. మ:భువి లో నెల్లరు జేయు పండుగ కదా పూర్వమ్ము చక్కంగ నీ
    నవరాత్రమ్ములు మొత్తమున్ సెలవ లే నా బిడ్డకున్ దక్కు నీ
    నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా
    యివియే యెక్కువ యంచు కొంద రనగా నే న్యాయమో చెప్పుమా!
    (పూర్వం ఉన్నన్ని సెలవలు ఇప్పుడు లేవు.)

    రిప్లయితొలగించండి
  11. భువి జను లానందింపఁగఁ
    బ్రవర్థమానము లయి వెసఁ బంచాహమ్ముల్
    దివిరి చని నంత నింకను
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్


    వివరింతుం దగ విన్మ పండుగను సంవేద్యమ్ము నింపారఁ దొ
    ల్దివ మందింపుగ భోగి పండుగయు నా రెండింట సంక్రాంతి నా
    దివమే వర్ధిల నా తివం బ్రభలతోఁ దీర్థంబు దీపింపఁగా
    నవులన్ నాల్గవ నాఁడు ముక్కనుమ యౌ నాంధ్రావనిం దచ్చతు
    ర్నవ రాత్రోత్సవ మెన్నినాళు లనఁగా నాల్గే కదా మిత్రమా

    [చతు ర్నవ రాత్రము = నాలుగు క్రొత్త రాత్రులతోఁ గూడునది]

    రిప్లయితొలగించండి
  12. యువలావణ్యమనోజ్ఞసుందరతరప్రోద్యత్తనూజృంభణ
    మ్మవనిన్ శాశ్వత ముండునేల! రమణీయంబైన శృంగారవై
    భవసౌఖ్యాంబుధి తేలు సంబరము సంభావింపుమా! మూఢమా
    నవ! రాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!

    (నాలుగు రోజుల ముచ్చట)

    కంజర్ల రామాచార్య
    కోరుట్ల

    రిప్లయితొలగించండి
  13. కందం
    నవదుర్గల పూజించఁగ
    నవశ్యమని రమ్మనంగ నా సుత, యుద్యో
    గ విధులఁ దడవై నాకిక
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్!


    మత్తేభవిక్రీడితము
    నవదుర్గల్ కొలువైరి మా గృహమునన్ నాన్నా! కుటుంబమ్ముగా
    జవమేరమ్మని నాదు పుత్రి పిలువన్ సంతోషమై జూడఁగన్
    శివ! యుద్యోగ విధిన్ విలంబమొనరన్ జేజారె కొన్నాళ్లికన్
    నవరాత్రోత్సవ మెన్నినాళులనగా నాల్గే కదా మిత్రమా!

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నవరాత్రికి లేక సెలవు
    దివసమ్ములు గడచె నైదు,తీరుగ వెడలన్
    చివరకు నే పాల్గొంటిని
    నవరాత్రోత్సవము లొప్పు నాలుగు దినముల్.

    రిప్లయితొలగించండి