13-10-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”
(లేదా...)
“సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్”
గరిమనుమానసమందునఅరవిచ్చినపద్మమందునమరినమధువైకరమరుదుగకవితయనెడిసురధారనుగోరుచుండ్రుసుకవులుసతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అరయగ నేటి దివసములపురమున దొరకొనెడి గంగ మురికిగ నుండన్నురవడి విమలము తో భాసురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
కందంవరవీణామృదుపాణినిసరస్వతీ జననిఁ గొల్చి సదయ కవనమైదొరలెడు పండిత నుత భాసుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్మత్తేభవిక్రీడితమువరవీణామృదు పాణినిన్ జనని శ్రీవాణిన్ సువిద్యార్థులైకొరతల్ లేవన పాండితీ పటిమతోఁ గొంగ్రొత్త భావంబులన్దొరలంగన్ కవనమ్మదే మిగులనిర్దోషాన మెప్పొందు భాసుర ధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
సురలమృతము గోరుపగిదిసురుచిర కావ్యముల వ్రాయ సుందర ఫణితిన్సరవిని కవితలలో భాసుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
కరుణామయి పారాయణికరవీణాధరి విరించి కామిని వాగీశ్వరి భారతి కరుణా భాసురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్.కరవీణాధరి పాదసేవయదె సత్కార్యమ్ముగా నెంచుచున్ ధరణిన్ బ్రాకట మందివట్టి బుధులే ధ్యానింతురే నిత్యమున్ వరమున్ గోరుచు, శుక్ల తానొసగగా ప్రాప్తించు కారుణ్య భాసురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్.
సురలెల్లన్ సుధఁ గోరుచందమున నస్తోకంబుగా నీభువిన్పరిపాకంబుగ కావ్యమాధురులు భాస్వంతంబుగా చిందగన్విరతిన్ బొందక వారికావ్యములలో విస్తారమౌరీతి భాసురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'అనుభూతులిడన్' అని కదా ఉండాలి...
ధన్యవాదాలు గురూజీ🙏...సవరణతో....పరిపుష్టంబగు తలపులవిరచించిన కావ్యములను విబుధులు మెచ్చన్సరసపదాన్వితమౌ భాసుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్పరిపుష్టంబగు యోచనల్ పరువిడన్ బద్యాలనేకూర్చగాస్థిరగంభీరపు భావనల్ సృజనలై దీపింప సంతోషమున్సరసోదార పదాన్వితంబులగుచున్ సమ్మోదమున్ బొంద భాసుర ధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
కరుణా శాంత భయానకమ్ములను, శృంగారాద్భుతోత్ప్రేక్షలన్వెఱపుంబుట్టగ వీర రౌద్ర రసముల్, భీభత్స హాస్యంబులన్విరచించంగ ప్రబంధపద్య పటిమన్ పేరొంది నిల్వంగ భాసురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్!!
తిరమగు భావ పరంపర సరసుల మది దోచు నట్లు చక్కని కవితల్ వరలెదు రీతి రచన భా సుర ధార ను గోరు చుంద్రు సుకవులు సతమున్
కం:గురుతర సత్యముల దెలిపి,ధరణికి జ్ఞానమ్ము గూర్చు తత్త్వము నిడు చున్సరసత నొప్పెడు సుకవనసురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”
ధన్యవాదం సర్!
కం॥ ధరలోఁ గావ్యము వ్రాయుచుస్థిరమౌ కీర్తినిఁ బడయ రచించిన కృతులన్వరదాయని వాణి కృపనుసురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్మ॥ ధరలో కావ్యము వ్రాయువారలిటులన్ ధ్యానించరే కైతలన్స్థిరమౌ ప్రాభవ సంపదల్ పడయఁగన్ శ్రేష్ఠమ్ముగా వ్రాయఁగన్వరమున్ బొందఁగ మాత వాణి కృపకై ప్రార్థించుచున్ సర్వదాసురధారాపరిపాక మబ్బవలెనంచున్ గోరువారే కవుల్
సుర అమృతము
కం:వరమిడని వేల్పు బోలెడునరనాథుల కేల కవిత?నవరత్నములన్ధరియించెడు భోజసుభా సుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”(పనికి మాలిన రాజులకి కవిత్వం దేనికి వినిపించాలి?నవరత్నాలకు నిలయ మైన,భోజరాజు పరిపాలన లో భాసిస్తున్న ధారా నగరాన్ని సుకవులు కోరుకొనే వారు?)
ధన్యవాదం గురువు గారు!
మ:సురలోకాప్సర వర్ణన మ్మయిన,నీశున్ వేడగా నైన, భూసుర భ్రష్టున్ నిరసింప నైన,హరి కై శోధించు నా మాల దాసరినిన్ జూపుట నైన శ్రావ్యమగు భాషామాథురిన్ గల్గి,భాసురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్”(సురలోకాప్సరవర్ణన లో పెద్దన గారైనా, శివుని పై శతకం వ్రాసిన ధూర్జటి ఐన,భ్రష్టబ్రాహ్మణుడైన నిగమశర్మని వర్ణించిన రామకృష్ణుడైనా,మాలదాసరిని వర్ణించిన రాయల వారైనా సుకవులు మంచి ధారాపరిపాకం కోరుకుంటారు అని అన్యాపదేశం గా ఆ మహాకవులను స్మరింప జేసే ప్రయత్నం.)
మరలింప నెంచి మనసుల సురధారను గోరుదురు వసు జనులు సతమున్ధరలోఁ గవిత్వ నామకసురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్ పరమార్థ ప్రద లోక సత్కవి సుసంభావ్య ప్రమాణ ప్రభా చిర దీప్తాంచిత వృత్త సంయుత మహా శిల్పాఖ్య విఖ్యాత సత్వర సంతోషద సుంద రోన్నత కవిత్వ ప్రస్పు టాత్యంత భాసుర ధారా పరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.విరివిగ సాధన చేయుచునిరతము శారదను గొల్చి నియతిగ భక్తిన్తరగని రీతిగ రస భాసుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్.
కరములతో కుట్టితినని తరుణీమణితా ముదమున తనయకు వేయన్త్వరగా నడచిన పడునని బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్
గరిమనుమానసమందున
రిప్లయితొలగించండిఅరవిచ్చినపద్మమందునమరినమధువై
కరమరుదుగకవితయనెడి
సురధారనుగోరుచుండ్రుసుకవులుసతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరయగ నేటి దివసముల
రిప్లయితొలగించండిపురమున దొరకొనెడి గంగ మురికిగ నుండన్
నురవడి విమలము తో భా
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండివరవీణామృదుపాణిని
సరస్వతీ జననిఁ గొల్చి సదయ కవనమై
దొరలెడు పండిత నుత భా
సుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
మత్తేభవిక్రీడితము
వరవీణామృదు పాణినిన్ జనని శ్రీవాణిన్ సువిద్యార్థులై
కొరతల్ లేవన పాండితీ పటిమతోఁ గొంగ్రొత్త భావంబులన్
దొరలంగన్ కవనమ్మదే మిగులనిర్దోషాన మెప్పొందు భా
సుర ధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిసురలమృతము గోరుపగిది
రిప్లయితొలగించండిసురుచిర కావ్యముల వ్రాయ సుందర ఫణితిన్
సరవిని కవితలలో భా
సుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికరుణామయి పారాయణి
కరవీణాధరి విరించి కామిని వాగీ
శ్వరి భారతి కరుణా భా
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్.
కరవీణాధరి పాదసేవయదె సత్కార్యమ్ముగా నెంచుచున్
ధరణిన్ బ్రాకట మందివట్టి బుధులే ధ్యానింతురే నిత్యమున్
వరమున్ గోరుచు, శుక్ల తానొసగగా ప్రాప్తించు కారుణ్య భా
సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసురలెల్లన్ సుధఁ గోరుచందమున నస్తోకంబుగా నీభువిన్
రిప్లయితొలగించండిపరిపాకంబుగ కావ్యమాధురులు భాస్వంతంబుగా చిందగన్
విరతిన్ బొందక వారికావ్యములలో విస్తారమౌరీతి భా
సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'అనుభూతులిడన్' అని కదా ఉండాలి...
ధన్యవాదాలు గురూజీ🙏...సవరణతో....
తొలగించండిపరిపుష్టంబగు తలపుల
విరచించిన కావ్యములను విబుధులు మెచ్చన్
సరసపదాన్వితమౌ భా
సుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
పరిపుష్టంబగు యోచనల్ పరువిడన్ బద్యాలనేకూర్చగా
స్థిరగంభీరపు భావనల్ సృజనలై దీపింప సంతోషమున్
సరసోదార పదాన్వితంబులగుచున్ సమ్మోదమున్ బొంద భా
సుర ధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
కరుణా శాంత భయానకమ్ములను, శృంగారాద్భుతోత్ప్రేక్షలన్
రిప్లయితొలగించండివెఱపుంబుట్టగ వీర రౌద్ర రసముల్, భీభత్స హాస్యంబులన్
విరచించంగ ప్రబంధపద్య పటిమన్ పేరొంది నిల్వంగ భా
సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండితిరమగు భావ పరంపర
రిప్లయితొలగించండిసరసుల మది దోచు నట్లు చక్కని కవితల్
వరలెదు రీతి రచన భా
సుర ధార ను గోరు చుంద్రు సుకవులు సతమున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:గురుతర సత్యముల దెలిపి,
రిప్లయితొలగించండిధరణికి జ్ఞానమ్ము గూర్చు తత్త్వము నిడు చున్
సరసత నొప్పెడు సుకవన
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం సర్!
తొలగించండికం॥ ధరలోఁ గావ్యము వ్రాయుచు
రిప్లయితొలగించండిస్థిరమౌ కీర్తినిఁ బడయ రచించిన కృతులన్
వరదాయని వాణి కృపను
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
మ॥ ధరలో కావ్యము వ్రాయువారలిటులన్ ధ్యానించరే కైతలన్
స్థిరమౌ ప్రాభవ సంపదల్ పడయఁగన్ శ్రేష్ఠమ్ముగా వ్రాయఁగన్
వరమున్ బొందఁగ మాత వాణి కృపకై ప్రార్థించుచున్ సర్వదా
సురధారాపరిపాక మబ్బవలెనంచున్ గోరువారే కవుల్
సుర అమృతము
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండికం:వరమిడని వేల్పు బోలెడు
రిప్లయితొలగించండినరనాథుల కేల కవిత?నవరత్నములన్
ధరియించెడు భోజసుభా
సుర ధారను గోరుచుంద్రు సుకవులు సతమున్”
(పనికి మాలిన రాజులకి కవిత్వం దేనికి వినిపించాలి?నవరత్నాలకు నిలయ మైన,భోజరాజు పరిపాలన లో భాసిస్తున్న ధారా నగరాన్ని సుకవులు కోరుకొనే వారు?)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదం గురువు గారు!
తొలగించండిమ:సురలోకాప్సర వర్ణన మ్మయిన,నీశున్ వేడగా నైన, భూ
రిప్లయితొలగించండిసుర భ్రష్టున్ నిరసింప నైన,హరి కై శోధించు నా మాల దా
సరినిన్ జూపుట నైన శ్రావ్యమగు భాషామాథురిన్ గల్గి,భా
సురధారాపరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్”
(సురలోకాప్సరవర్ణన లో పెద్దన గారైనా, శివుని పై శతకం వ్రాసిన ధూర్జటి ఐన,భ్రష్టబ్రాహ్మణుడైన నిగమశర్మని వర్ణించిన రామకృష్ణుడైనా,మాలదాసరిని వర్ణించిన రాయల వారైనా సుకవులు మంచి ధారాపరిపాకం కోరుకుంటారు అని అన్యాపదేశం గా ఆ మహాకవులను స్మరింప జేసే ప్రయత్నం.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమరలింప నెంచి మనసుల
రిప్లయితొలగించండిసురధారను గోరుదురు వసు జనులు సతమున్
ధరలోఁ గవిత్వ నామక
సురధారను గోరుచుంద్రు సుకవులు సతమున్
పరమార్థ ప్రద లోక సత్కవి సుసంభావ్య ప్రమాణ ప్రభా
చిర దీప్తాంచిత వృత్త సంయుత మహా శిల్పాఖ్య విఖ్యాత స
త్వర సంతోషద సుంద రోన్నత కవిత్వ ప్రస్పు టాత్యంత భా
సుర ధారా పరిపాక మబ్బవలె నంచున్ గోరువారే కవుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విరివిగ సాధన చేయుచు
నిరతము శారదను గొల్చి నియతిగ భక్తిన్
తరగని రీతిగ రస భా
సుర ధారను గోరుచుంద్రు సుకవులు
సతమున్.
కరములతో కుట్టితినని
రిప్లయితొలగించండితరుణీమణితా ముదమున తనయకు వేయన్
త్వరగా నడచిన పడునని
బరువని వల్వలను విడుచు భామకు స్తవముల్