14-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”
(లేదా...)
“సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
కోరికతో భర్త పిలువఁనారీమణి పడక చేరె నాలస్యముగన్సూరుడు క్రుంగిన తదుపరిసారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్[సారంగము = రాత్రి]
సారంగంబనెనా శకుంతలను దుష్యంతుండు సంప్రీతితోసారంగధ్వజుడే ప్రశాంత రుచులన్ భాసిల్లు వేళన్ గనన్సారంగాక్షి మనోవిపంచి పలికెన్ సంకోచమున్ వీడుచున్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్[మొదటి పాదములో : సారంగము = పద్మము] [నాల్గవ పాదములో : సారంగము = ఒక రాగము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంనీరజనయన శకుంతలవీరుఁడు దుష్యంతుఁడొల్క ప్రియవచనంబుల్!సారింప తూపు మన్మథసారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్!శార్దూలవిక్రీడితముఆరాటాన శకుంతలన్ గనుచు దుష్యంతుండు మోహంబునన్గారాబంబొలికించుచున్ మనువనన్ గాంధర్వ మేపారగన్!సారింపన్ విరితూపులన్ మరుడహో! సౌగంధ వ్యాప్తమ్మునౌసారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!
కం॥ వారాంతమ్మున కవులకుఁబూరించ సమస్య నొసఁగెఁ బోటీ పడఁగన్సారించి మేధ రయముగ”సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”శా॥ వారాంతమ్మునఁ బద్య ధారలసుధల్ భాసిల్లఁగన్ విజ్ఞులైబూరించంగ సమస్య నిచ్చెదఁ గవుల్ పోటీ పడంగాఁ దగున్సారంశమ్మును గాంచి మేధ విరియన్ సారించుచున్ వ్రాయరో”సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
పేరుగల యారటిని శృంగారియగుచు వెంటపడగ కాదన లేకన్ పేరిమి తో నా నటి వాసా! రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్.*(వాసు అను వానికి మిత్రుడు చెప్పినట్లుగ)*ఔరా యెంతటి సుందరాంగి యిట సన్యాసాశ్రమమ్మందు టంకారమ్మంచు దలంచినట్టి నృపుడా కామాంధ దుశ్యంతుడే చేరన్ కణ్వుని పుత్రి యా వనములో చెన్నొందెడందాల యాసారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్.
ఊరి చివరి కాననమునకోరలు లేనట్టి యాడు కుంజరమచటన్చేరువన నుండిన పురుషసారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్( ఆడ ఏనుగకు దంతములుండవు , ఉన్నా బహు చిన్నవి ఉంటాయట )
నీరంబేదియొ క్షీరమేదొ మనమున్ నేర్వంగ లేనట్టి కన్యారత్నంబు శకుంతలన్ ప్రభువు దుష్యంతుండె కాంక్షించగాసారంగాధిపయాన,కాంత, రజనీ సారంగ ధమ్మిల్ల దృక్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!!సారంగాధిపయాన = గజగామినిరజనీ సారంగ ధమ్మిల్ల = చీకటి వలె నల్లగా ఉన్న తుమ్మెదల వంటి కొప్పు కలిగినదిదృక్సారంగంబు = జింక వంటి చూపులు కలిగినది
మేరయ లేని విధంబునతోరపు కల్లలను బ ల్కు తుంటరి వాడై నేరు గ మిత్రు ని తో ననె " సారంగము రాజు గూడి సత్పుత్రు గనె న్ "
వీరునిఁగని లలనామణికోరిక మదినుప్పతిలఁగ కుసుమాస్త్రుడుతాసారింపఁగ పూశరములసారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
మారునకు వశుం డయి వెస రా రమ్మని పిలువ రాజు రయముగఁ దన దే వేరి తమినిఁ జింత ఫలము సా రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్ [ఫలము+ చారు+ అంగము = ఫలము సా రంగము ; అంగము = విధము]పారావార పరీత భూ వలయముం బాలింప సామర్థ్యునిం దారా నాథ సమాన సుందరుఁ గులోద్ధారున్ మహా వీరునిన్నారీ రత్న శకుంతలా రమణి స్వర్ణద్యోత రాజద్వపుస్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
కం:ఆ రంగసాని తన వేశ్యారంగము వీడి పెండ్లి యాడెను వలపేపొంగుటచే వాచా మనసా,రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”(భోగం వారిని రంగసానులు అంటారు.ఆమె రంగం రాజు అనే అతన్ని మనసా,వాచా ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకును కున్నది.)
ధీరోదాత్తుఁడు వీరవర్యుఁడటవిన్ దిర్గాడు దుష్యంతుఁడేచేరెన్ కణ్వమునీంద్రునాశ్రమము గాంచెన్ కన్యకా రత్నమున్మారుండంతటమార్గణమ్ముగొని సమ్మానంబుగానెక్కిడన్సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
శా:నా రాజ్యమ్మున నర్తకీమణివి యెన్నన్ లేడి కన్నుల్ కదా!ఆ రమ్యాంగియె నాదు రాణి యని ప్రేమావేశ మున్ బొందగానా రాజేంద్రుడు,మోజు పెంచి తనదౌ నందమ్ము జూపించి యా సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”(ఆ నర్తకివి లేడి కన్నులు అని రాజు మెచ్చుకొనే వాడు.ఆ లేడి రాజుని పెళ్లి చేసుకున్నది.)
కోరికతో భర్త పిలువఁ
రిప్లయితొలగించండినారీమణి పడక చేరె నాలస్యముగన్
సూరుడు క్రుంగిన తదుపరి
సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
[సారంగము = రాత్రి]
సారంగంబనెనా శకుంతలను దుష్యంతుండు సంప్రీతితో
తొలగించండిసారంగధ్వజుడే ప్రశాంత రుచులన్ భాసిల్లు వేళన్ గనన్
సారంగాక్షి మనోవిపంచి పలికెన్ సంకోచమున్ వీడుచున్
సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
[మొదటి పాదములో : సారంగము = పద్మము]
[నాల్గవ పాదములో : సారంగము = ఒక రాగము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండినీరజనయన శకుంతల
వీరుఁడు దుష్యంతుఁడొల్క ప్రియవచనంబుల్!
సారింప తూపు మన్మథ
సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్!
శార్దూలవిక్రీడితము
ఆరాటాన శకుంతలన్ గనుచు దుష్యంతుండు మోహంబునన్
గారాబంబొలికించుచున్ మనువనన్ గాంధర్వ మేపారగన్!
సారింపన్ విరితూపులన్ మరుడహో! సౌగంధ వ్యాప్తమ్మునౌ
సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!
కం॥ వారాంతమ్మున కవులకుఁ
రిప్లయితొలగించండిబూరించ సమస్య నొసఁగెఁ బోటీ పడఁగన్
సారించి మేధ రయముగ
”సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”
శా॥ వారాంతమ్మునఁ బద్య ధారలసుధల్ భాసిల్లఁగన్ విజ్ఞులై
బూరించంగ సమస్య నిచ్చెదఁ గవుల్ పోటీ పడంగాఁ దగున్
సారంశమ్మును గాంచి మేధ విరియన్ సారించుచున్ వ్రాయరో
”సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపేరుగల యారటిని శృం
గారియగుచు వెంటపడగ కాదన లేకన్
పేరిమి తో నా నటి వా
సా! రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్.
*(వాసు అను వానికి మిత్రుడు చెప్పినట్లుగ)*
ఔరా యెంతటి సుందరాంగి యిట సన్యాసాశ్రమమ్మందు టం
కారమ్మంచు దలంచినట్టి నృపుడా కామాంధ దుశ్యంతుడే
చేరన్ కణ్వుని పుత్రి యా వనములో చెన్నొందెడందాల యా
సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్.
ఊరి చివరి కాననమున
రిప్లయితొలగించండికోరలు లేనట్టి యాడు కుంజరమచటన్
చేరువన నుండిన పురుష
సారంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
( ఆడ ఏనుగకు దంతములుండవు , ఉన్నా బహు చిన్నవి ఉంటాయట )
నీరంబేదియొ క్షీరమేదొ మనమున్ నేర్వంగ లేనట్టి క
రిప్లయితొలగించండిన్యారత్నంబు శకుంతలన్ ప్రభువు దుష్యంతుండె కాంక్షించగా
సారంగాధిపయాన,కాంత, రజనీ సారంగ ధమ్మిల్ల దృ
క్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్!!
సారంగాధిపయాన = గజగామిని
రజనీ సారంగ ధమ్మిల్ల = చీకటి వలె నల్లగా ఉన్న తుమ్మెదల వంటి కొప్పు కలిగినది
దృక్సారంగంబు = జింక వంటి చూపులు కలిగినది
మేరయ లేని విధంబున
రిప్లయితొలగించండితోరపు కల్లలను బ ల్కు తుంటరి వాడై
నేరు గ మిత్రు ని తో ననె
" సారంగము రాజు గూడి సత్పుత్రు గనె న్ "
వీరునిఁగని లలనామణి
రిప్లయితొలగించండికోరిక మదినుప్పతిలఁగ కుసుమాస్త్రుడుతా
సారింపఁగ పూశరముల
సారంగము, రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
మారునకు వశుం డయి వెస
రిప్లయితొలగించండిరా రమ్మని పిలువ రాజు రయముగఁ దన దే
వేరి తమినిఁ జింత ఫలము
సా రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్
[ఫలము+ చారు+ అంగము = ఫలము సా రంగము ; అంగము = విధము]
పారావార పరీత భూ వలయముం బాలింప సామర్థ్యునిం
దారా నాథ సమాన సుందరుఁ గులోద్ధారున్ మహా వీరునిన్
నారీ రత్న శకుంతలా రమణి స్వర్ణద్యోత రాజద్వపు
స్సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
కం:ఆ రంగసాని తన వే
రిప్లయితొలగించండిశ్యారంగము వీడి పెండ్లి యాడెను వలపే
పొంగుటచే వాచా మన
సా,రంగము రాజుఁ గూడి సత్పుత్రుఁ గనెన్”
(భోగం వారిని రంగసానులు అంటారు.ఆమె రంగం రాజు అనే అతన్ని మనసా,వాచా ప్రేమించి పెళ్లి చేసుకొని కొడుకును కున్నది.)
ధీరోదాత్తుఁడు వీరవర్యుఁడటవిన్ దిర్గాడు దుష్యంతుఁడే
రిప్లయితొలగించండిచేరెన్ కణ్వమునీంద్రునాశ్రమము గాంచెన్ కన్యకా రత్నమున్
మారుండంతటమార్గణమ్ముగొని సమ్మానంబుగానెక్కిడన్
సారంగంబు, నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్
శా:నా రాజ్యమ్మున నర్తకీమణివి యెన్నన్ లేడి కన్నుల్ కదా!
రిప్లయితొలగించండిఆ రమ్యాంగియె నాదు రాణి యని ప్రేమావేశ మున్ బొందగా
నా రాజేంద్రుడు,మోజు పెంచి తనదౌ నందమ్ము జూపించి యా
సారంగంబు నరేంద్రుఁ గూడి కనియెన్ సత్పుత్రు లోకోత్తరున్”
(ఆ నర్తకివి లేడి కన్నులు అని రాజు మెచ్చుకొనే వాడు.ఆ లేడి రాజుని పెళ్లి చేసుకున్నది.)