21-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”
(లేదా...)
“పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంవిరహమ్మోపగ లేనిటఁబరదేశమ్మునఁ గొలువని పరుగునఁ జనితే!త్వరనిటఁ జేరగ దయచూపర! భార్యాసంగమమును వద్దనఁ దగునా!మత్తేభవిక్రీడితముపరదేశమ్మున గొల్వుకేగితివె? సంపాదించు మైకమ్మునన్విరహమ్మోపగ లేనురా మగడ! నీవిన్నాళ్లు దూరమ్మనన్ద్వరితమ్మున్ మనదేశమందు కొలువందంగన్ ప్రయత్నమ్ము సూపర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
పొరపాటది పాపమనుచుమరుచివ్వను గూర్చి నీవు మాటాడెదవా?సరి యిక నీ మాటలనాపర, భార్యాసంగమమును వద్దనఁ దగునా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వరముగ యెఱుకనుగలిగియుసురగంగాఝరియుబోలు సాధనతోడన్పరమునుతానై పొందగపరభార్యాసంగమమును వద్దనదగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వరమున నెఱుకను.."
మరుపోరన్నను పాపకార్యమనుచున్ మాటా డుచున్ వానితోపొరపాటంచు వచించుచుంటివది నీ మూర్ఖత్వమున్ జాటెనేపరులీమాటల నాలకించుటది సంభావ్యమ్మె కాదందు, నాపర , భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
హరుజిజ్ఞాసనుమానసంబుననమేయానందుడైయూగుచున్దరిఁజేరంగనురానిభోగములతాదాత్మ్యంబులోనందుచున్వరుడాతాపసిసాధనన్హృదినినాపద్మంబుతాగోరగాపరభార్యన్గని పొందుగోరునరునిన్ వద్దంచువారింతురే
కం॥ సరియగు నీతినిఁ బడయుచుఁ బరఁగెడు సుజనుల నడుగఁగఁ బాడియగునొకోయరయఁగ దోషమడుగనిటు”పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”మ॥ పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురేపరభార్యన్ దన తల్లివోలెఁ గని సంభావించి పూజించుటేపరమోత్కృష్టమటంచుఁ గాంచెను గదా భాసిల్లు సంస్కారమీధరలో భారత దేశమెల్లెడల సద్భావాది సౌశీల్యతన్
విరహము తో బాధ పడుచు సరగున దేశమ్ము జేరు సంకల్ప ము తో త్వర పడ వద్ద న గా నా పర ' భార్యా సంగమమును వద్దన దగు నా?
పరమానందము కొఱకైపరసతులను కోరుకొనుట పాపము కాదాసరసము నీ గృహిణికి చూపర భార్యాసంగమమును వద్దనఁ దగునాపరమానందముఁ బొందగోరి పరులన్ వాంఛింతురే మూర్ఖులైపొరపాటేకద యంతరంగమెపుడున్ మోమీక కోపించదాసరసంబౌనిక సొంతభార్య మదికిన్ సంతృప్తి చేకూర్చి చూపర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
ధన్యవాదాలు గురూజీ 🙏
అరయగ కోరుట తప్పగుపరభార్యాసంగమమును ; వద్దనఁ దగునాదరి జేరిన నిజసతినేమురిపమును జూపి ముద్దులనిడకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. చివరి పాదంలో గణభంగం. "మురిపమ్మును జూపి మురిసి ముద్దుల నిడకన్" అందామా?
వరుడే విష్ణువు కన్నె లచ్చి యనుచున్ భావించి దానమ్ముఁ జే యరె వంశంబది వృద్ధిఁ జెందుటకునై యానంద సంభావనన్!స్థిరమై పుత్రుల పేర తాను సతమున్ జీవించి సాగన్ పరంపర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే!!
విరజాజుల ఘుమఘుమలకుసరసపు భావము విరియగ చలికాలమునన్కురియగ చిఱుజల్లుల తుంపర, భార్యాసంగమమును వద్దనఁ దగునా!!
చక్కని పూరణ. అభినందనలు.
పరమ పవిత్రము భువిలోవరునకు వైవాహికమ్ము భావింపఁగ నెవ్వరు దెల్పిరినీకిటు జెప్పరభార్యాసంగమమును వద్దనఁ దగునా
పరమాత్ముండు విధించె మానవులకున్ వైవాహికంబీ భువిన్పరనారీమణులందు మోహమది సంభావింపఁగా దౌష్ట్యమౌవరుఁడున్ గేహినిఁ గూడి సంతుబడయన్ భావ్యంబు కాదొక్కొ చెప్పర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
కం:చరియించ పరస్త్రీ తోపరభార్యాసంగమమును వద్దనఁ దగు, నాసిరకపు వైరాగ్యము నాపర! భార్యాసంగమమును వద్దన దగునా!(పరభార్యా సంగమాన్నైతే వద్దని చెప్పాలి కానీ భార్యాసంగమం వద్దంటావే!నాసి రకం వైరాగ్యం బోధించకు.సమస్యని రెండు సార్లు ఉంచాను.)
మ:పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు, రేగురుమార్గమ్మున నైన,నర్హుడగుచో కోరంగ సన్యాసి యైచరియింపంగను జేతు రెల్లరకు నీ సన్యాస మిప్పించు టాపర! భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు రే!
నరపశు భేదమ్ము నిరంతరమ్ము పాటింపకున్న ధర్మమె చెపుమా ధర నిజ భార్యా ప్రణయము పరభా ర్యాసంగమమును వద్దనఁ దగునా [పర భార్యా + అసంగమము] పర లోకమ్మున నీకు శిక్ష పడు దౌర్బల్యమ్మునున్ వీడుమా నరలోకాధిప మిన్నకుంటి విట నన్యాయమ్ము వీక్షించుచున్ ధరలో దుష్టుని బుద్ధిమంతు లగు సద్ధర్మాత్ము లత్యుగ్రులై పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండికందం
తొలగించండివిరహమ్మోపగ లేనిటఁ
బరదేశమ్మునఁ గొలువని పరుగునఁ జనితే!
త్వరనిటఁ జేరగ దయచూ
పర! భార్యాసంగమమును వద్దనఁ దగునా!
మత్తేభవిక్రీడితము
పరదేశమ్మున గొల్వుకేగితివె? సంపాదించు మైకమ్మునన్
విరహమ్మోపగ లేనురా మగడ! నీవిన్నాళ్లు దూరమ్మనన్
ద్వరితమ్మున్ మనదేశమందు కొలువందంగన్ ప్రయత్నమ్ము సూ
పర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపొరపాటది పాపమనుచు
మరుచివ్వను గూర్చి నీవు మాటాడెదవా?
సరి యిక నీ మాటలనా
పర, భార్యాసంగమమును వద్దనఁ దగునా?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివరముగ యెఱుకనుగలిగియు
రిప్లయితొలగించండిసురగంగాఝరియుబోలు సాధనతోడన్
పరమునుతానై పొందగ
పరభార్యాసంగమమును వద్దనదగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వరమున నెఱుకను.."
రిప్లయితొలగించండిమరుపోరన్నను పాపకార్యమనుచున్ మాటా డుచున్ వానితో
పొరపాటంచు వచించుచుంటివది నీ మూర్ఖత్వమున్ జాటెనే
పరులీమాటల నాలకించుటది సంభావ్యమ్మె కాదందు, నా
పర , భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిహరుజిజ్ఞాసనుమానసంబుననమేయానందుడైయూగుచున్
రిప్లయితొలగించండిదరిఁజేరంగనురానిభోగములతాదాత్మ్యంబులోనందుచున్
వరుడాతాపసిసాధనన్హృదినినాపద్మంబుతాగోరగా
పరభార్యన్గని పొందుగోరునరునిన్ వద్దంచువారింతురే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం॥ సరియగు నీతినిఁ బడయుచుఁ
రిప్లయితొలగించండిబరఁగెడు సుజనుల నడుగఁగఁ బాడియగునొకో
యరయఁగ దోషమడుగనిటు
”పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”
మ॥ పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
పరభార్యన్ దన తల్లివోలెఁ గని సంభావించి పూజించుటే
పరమోత్కృష్టమటంచుఁ గాంచెను గదా భాసిల్లు సంస్కారమీ
ధరలో భారత దేశమెల్లెడల సద్భావాది సౌశీల్యతన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండివిరహము తో బాధ పడుచు
రిప్లయితొలగించండిసరగున దేశమ్ము జేరు సంకల్ప ము తో
త్వర పడ వద్ద న గా నా
పర ' భార్యా సంగమమును వద్దన దగు నా?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిపరమానందము కొఱకై
పరసతులను కోరుకొనుట పాపము కాదా
సరసము నీ గృహిణికి చూ
పర భార్యాసంగమమును వద్దనఁ దగునా
పరమానందముఁ బొందగోరి పరులన్ వాంఛింతురే మూర్ఖులై
పొరపాటేకద యంతరంగమెపుడున్ మోమీక కోపించదా
సరసంబౌనిక సొంతభార్య మదికిన్ సంతృప్తి చేకూర్చి చూ
పర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఅరయగ కోరుట తప్పగు
రిప్లయితొలగించండిపరభార్యాసంగమమును ; వద్దనఁ దగునా
దరి జేరిన నిజసతినే
మురిపమును జూపి ముద్దులనిడకన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో గణభంగం. "మురిపమ్మును జూపి మురిసి ముద్దుల నిడకన్" అందామా?
వరుడే విష్ణువు కన్నె లచ్చి యనుచున్ భావించి దానమ్ముఁ జే
రిప్లయితొలగించండియరె వంశంబది వృద్ధిఁ జెందుటకునై యానంద సంభావనన్!
స్థిరమై పుత్రుల పేర తాను సతమున్ జీవించి సాగన్ పరం
పర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివిరజాజుల ఘుమఘుమలకు
రిప్లయితొలగించండిసరసపు భావము విరియగ చలికాలమునన్
కురియగ చిఱుజల్లుల తుం
పర, భార్యాసంగమమును వద్దనఁ దగునా!!
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిపరమ పవిత్రము భువిలో
రిప్లయితొలగించండివరునకు వైవాహికమ్ము భావింపఁగ నె
వ్వరు దెల్పిరినీకిటు జె
ప్పరభార్యాసంగమమును వద్దనఁ దగునా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరమాత్ముండు విధించె మానవులకున్ వైవాహికంబీ భువిన్
రిప్లయితొలగించండిపరనారీమణులందు మోహమది సంభావింపఁగా దౌష్ట్యమౌ
వరుఁడున్ గేహినిఁ గూడి సంతుబడయన్ భావ్యంబు కాదొక్కొ చె
ప్పర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:చరియించ పరస్త్రీ తో
రిప్లయితొలగించండిపరభార్యాసంగమమును వద్దనఁ దగు, నా
సిరకపు వైరాగ్యము నా
పర! భార్యాసంగమమును వద్దన దగునా!
(పరభార్యా సంగమాన్నైతే వద్దని చెప్పాలి కానీ భార్యాసంగమం వద్దంటావే!నాసి రకం వైరాగ్యం బోధించకు.సమస్యని రెండు సార్లు ఉంచాను.)
మ:పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు, రే
రిప్లయితొలగించండిగురుమార్గమ్మున నైన,నర్హుడగుచో కోరంగ సన్యాసి యై
చరియింపంగను జేతు రెల్లరకు నీ సన్యాస మిప్పించు టా
పర! భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు రే!
నరపశు భేదమ్ము నిరం
రిప్లయితొలగించండితరమ్ము పాటింపకున్న ధర్మమె చెపుమా
ధర నిజ భార్యా ప్రణయము
పరభా ర్యాసంగమమును వద్దనఁ దగునా
[పర భార్యా + అసంగమము]
పర లోకమ్మున నీకు శిక్ష పడు దౌర్బల్యమ్మునున్ వీడుమా
నరలోకాధిప మిన్నకుంటి విట నన్యాయమ్ము వీక్షించుచున్
ధరలో దుష్టుని బుద్ధిమంతు లగు సద్ధర్మాత్ము లత్యుగ్రులై
పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి