20, అక్టోబర్ 2024, ఆదివారం

సమస్య - 4918

21-10-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”

(లేదా...)

“పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే”

35 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కందం
      విరహమ్మోపగ లేనిటఁ
      బరదేశమ్మునఁ గొలువని పరుగునఁ జనితే!
      త్వరనిటఁ జేరగ దయచూ
      పర! భార్యాసంగమమును వద్దనఁ దగునా!

      మత్తేభవిక్రీడితము
      పరదేశమ్మున గొల్వుకేగితివె? సంపాదించు మైకమ్మునన్
      విరహమ్మోపగ లేనురా మగడ! నీవిన్నాళ్లు దూరమ్మనన్
      ద్వరితమ్మున్ మనదేశమందు కొలువందంగన్ ప్రయత్నమ్ము సూ
      పర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. పొరపాటది పాపమనుచు
    మరుచివ్వను గూర్చి నీవు మాటాడెదవా?
    సరి యిక నీ మాటలనా
    పర, భార్యాసంగమమును వద్దనఁ దగునా?

    రిప్లయితొలగించండి
  3. వరముగ యెఱుకనుగలిగియు
    సురగంగాఝరియుబోలు సాధనతోడన్
    పరమునుతానై పొందగ
    పరభార్యాసంగమమును వద్దనదగునా

    రిప్లయితొలగించండి

  4. మరుపోరన్నను పాపకార్యమనుచున్ మాటా డుచున్ వానితో
    పొరపాటంచు వచించుచుంటివది నీ మూర్ఖత్వమున్ జాటెనే
    పరులీమాటల నాలకించుటది సంభావ్యమ్మె కాదందు, నా
    పర , భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?

    రిప్లయితొలగించండి
  5. హరుజిజ్ఞాసనుమానసంబుననమేయానందుడైయూగుచున్
    దరిఁజేరంగనురానిభోగములతాదాత్మ్యంబులోనందుచున్
    వరుడాతాపసిసాధనన్హృదినినాపద్మంబుతాగోరగా
    పరభార్యన్గని పొందుగోరునరునిన్ వద్దంచువారింతురే

    రిప్లయితొలగించండి
  6. కం॥ సరియగు నీతినిఁ బడయుచుఁ
    బరఁగెడు సుజనుల నడుగఁగఁ బాడియగునొకో
    యరయఁగ దోషమడుగనిటు
    ”పరభార్యాసంగమమును వద్దనఁ దగునా”

    మ॥ పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే
    పరభార్యన్ దన తల్లివోలెఁ గని సంభావించి పూజించుటే
    పరమోత్కృష్టమటంచుఁ గాంచెను గదా భాసిల్లు సంస్కారమీ
    ధరలో భారత దేశమెల్లెడల సద్భావాది సౌశీల్యతన్

    రిప్లయితొలగించండి
  7. విరహము తో బాధ పడుచు
    సరగున దేశమ్ము జేరు సంకల్ప ము తో
    త్వర పడ వద్ద న గా నా
    పర ' భార్యా సంగమమును వద్దన దగు నా?

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు

    1. పరమానందము కొఱకై
      పరసతులను కోరుకొనుట పాపము కాదా
      సరసము నీ గృహిణికి చూ
      పర భార్యాసంగమమును వద్దనఁ దగునా

      పరమానందముఁ బొందగోరి పరులన్ వాంఛింతురే మూర్ఖులై
      పొరపాటేకద యంతరంగమెపుడున్ మోమీక కోపించదా
      సరసంబౌనిక సొంతభార్య మదికిన్ సంతృప్తి చేకూర్చి చూ
      పర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. అరయగ కోరుట తప్పగు
    పరభార్యాసంగమమును ; వద్దనఁ దగునా
    దరి జేరిన నిజసతినే
    మురిపమును జూపి ముద్దులనిడకన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో గణభంగం. "మురిపమ్మును జూపి మురిసి ముద్దుల నిడకన్" అందామా?

      తొలగించండి
  10. వరుడే విష్ణువు కన్నె లచ్చి యనుచున్ భావించి దానమ్ముఁ జే
    యరె వంశంబది వృద్ధిఁ జెందుటకునై యానంద సంభావనన్!
    స్థిరమై పుత్రుల పేర తాను సతమున్ జీవించి సాగన్ పరం
    పర, భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే!!

    రిప్లయితొలగించండి
  11. విరజాజుల ఘుమఘుమలకు
    సరసపు భావము విరియగ చలికాలమునన్
    కురియగ చిఱుజల్లుల తుం
    పర, భార్యాసంగమమును వద్దనఁ దగునా!!

    రిప్లయితొలగించండి
  12. పరమ పవిత్రము భువిలో
    వరునకు వైవాహికమ్ము భావింపఁగ నె
    వ్వరు దెల్పిరినీకిటు జె
    ప్పరభార్యాసంగమమును వద్దనఁ దగునా

    రిప్లయితొలగించండి
  13. పరమాత్ముండు విధించె మానవులకున్ వైవాహికంబీ భువిన్
    పరనారీమణులందు మోహమది సంభావింపఁగా దౌష్ట్యమౌ
    వరుఁడున్ గేహినిఁ గూడి సంతుబడయన్ భావ్యంబు కాదొక్కొ చె
    ప్పర భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే?

    రిప్లయితొలగించండి
  14. కం:చరియించ పరస్త్రీ తో
    పరభార్యాసంగమమును వద్దనఁ దగు, నా
    సిరకపు వైరాగ్యము నా
    పర! భార్యాసంగమమును వద్దన దగునా!
    (పరభార్యా సంగమాన్నైతే వద్దని చెప్పాలి కానీ భార్యాసంగమం వద్దంటావే!నాసి రకం వైరాగ్యం బోధించకు.సమస్యని రెండు సార్లు ఉంచాను.)

    రిప్లయితొలగించండి
  15. మ:పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు, రే
    గురుమార్గమ్మున నైన,నర్హుడగుచో కోరంగ సన్యాసి యై
    చరియింపంగను జేతు రెల్లరకు నీ సన్యాస మిప్పించు టా
    పర! భార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతు రే!





    రిప్లయితొలగించండి
  16. నరపశు భేదమ్ము నిరం
    తరమ్ము పాటింపకున్న ధర్మమె చెపుమా
    ధర నిజ భార్యా ప్రణయము
    పరభా ర్యాసంగమమును వద్దనఁ దగునా

    [పర భార్యా + అసంగమము]


    పర లోకమ్మున నీకు శిక్ష పడు దౌర్బల్యమ్మునున్ వీడుమా
    నరలోకాధిప మిన్నకుంటి విట నన్యాయమ్ము వీక్షించుచున్
    ధరలో దుష్టుని బుద్ధిమంతు లగు సద్ధర్మాత్ము లత్యుగ్రులై
    పరభార్యన్ గని పొందు గోరు నరునిన్ వద్దంచు వారింతురే

    రిప్లయితొలగించండి