24, అక్టోబర్ 2024, గురువారం

సమస్య - 4922

25-10-2024 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఉదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు”

(లేదా...)

“వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. శాంతగంభీరమయ్యుండె సంద్రమటుల
    రాజసైన్యంబుకురుభూమి రంజితముగ
    మెఱసిరాయోధులందరు మేలిరుచుల
    ఉదధిగర్భమ్ముననుఁదోచెనుడుగణంబు

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    పుడమిఁ జుట్టి సాగరమందు ముంచ, హరియె
    దంష్ట్రల వరాహరూపుఁడై ధరణిఁ గాచి
    యల హిరణ్యాక్షుఁ గ్రోధియై యలమినంత
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు!

    ఉత్పలమాల
    ధారుణిఁ జుట్టి చాపవలె దైత్యుడు సాగరమందు ముంచఁగన్
    జేరెను నీరజాక్షుడట శ్వేతవరాహమనంగ గావఁగన్
    బోరున దుష్టనిన్ గదిమి మోదుచు దంష్ట్రల గ్రుచ్చి త్రొక్కగన్
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్!

    రిప్లయితొలగించండి
  3. వేరొకసంద్రమాయనగ వేనకువేలుగ వీరులాయెడన్
    కోరికగెల్పునందునిడి కూడియునిల్చిరియుద్ధభూమిలో
    ధీరులుకౌరవాదులును దిట్టలుపాండవులద్భుతంబుగా
    వారిది గర్భమందు కను పట్టెను తారకలద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
  4. మీనముల పట్టుట కొరకై మిత్తతోడ
    వెన్నెల రెయిన పడవపై వెడలుచుండ
    కడలి యేమాత్ర మైనను కదలకుండె
    ఉదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు”

    రిప్లయితొలగించండి
  5. అరుణకిరణాలు జలధియం దలలపైన
    విస్తృతమ్ముగ వ్యాపించి వెలుగు నింపి
    మినుకుమనుచు తారలవలె మెరయుచుండ
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు

    రిప్లయితొలగించండి

  6. సంద్రతీరమందు చరించు సమయమందు
    కాంచితిన్ బ్రతి బింబమా క్షణిణి నేను
    చదలు లో కాంతు లీనెడు చందు తోడ
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు


    దారను వెంట దీసుకుని ధ్వాంతపు వేళ ప్రతుష్టి కోసమై
    చేరితి సంద్రతీరము బచేరము జేయగ నెంచి జ్యోత్స్నినిన్
    కైరవి కాంతులే విరియు కాలము నందున తుంగి తోడుగన్
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్.


    (మరొకటి)

    నేరక వచ్చితిన్ వలదు నెయ్యపు కాడ రణంబంచు నీ
    మారణ హోమమేల యిక మానెద నన్న నరుండు గాంచె కం
    సారి సమగ్రరూపమును, చక్రి, మురద్విషుడైన యా దయా
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్.

    రిప్లయితొలగించండి
  7. నీరమె యండ మీనులకు నిల్వవు నీరము లేక ప్రాణముల్
    వారినివాసులే బ్రతుకు భారము తీర్చును బెస్తవారికిన్
    వారిరథమ్ములెక్కి పెను పాశముఁ దాల్చి ప్రయాణమైననా
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్!!


    వారినివాసులు = చేపలు
    వారి రథములు = పడవలు
    తారకలు = పడవలు

    రిప్లయితొలగించండి
  8. సంద్రము కడలి జలనిధి సాగరమ్మె
    అంబుధి శరధి దానికే యన్ని పేర్లు
    సుంతయైనను లేదిందు వింతఁ జూడ
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు!!

    ఉడుగణంబు = జల సమూహము

    రిప్లయితొలగించండి
  9. దేవ దానవు లేకమై చేవగలిగి
    క్షీర సాగర మథనము చేసినారు
    ప్రాణభాస్వంతమునఁ బుట్టిరప్సరసలు
    ఉదధి గర్భమ్ము ననుఁ దోచె నుడుగ ణంబు

    కోరుచు మృత్యునాశనము కొండను కవ్వముజేసి చిల్కగా
    తోరపు వాసుకే యచట తోడుగ నిల్చెను మంథరజ్జవై
    వారధిఁ బుట్టిరప్సరలు బంగరు రంగుల తళ్కులీనుచున్
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
  10. నీరజ మచ్చరీని కమనీయఁపు చంద్రిక విస్తృతమ్ముగన్
    వారిధిలో తరంగములపై బడ వాయువు చాలనమ్మునన్
    నీరమునందు దోచినవి నేత్రయుగమ్ముకు మిన్కు తారలై
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్
    (మచ్చరీడు=శత్రువు)

    రిప్లయితొలగించండి
  11. క్షీర సాగర మధనమ్ము సేయు నపుడు
    గిరిని ధరి యించె కూర్మ మై కే శ వుండు
    నాడు వింత గ నతనికి వేడుకలర
    యుధ ది గ ర్భమ్ము నను దో చె నుడు గ ణ o బు

    రిప్లయితొలగించండి
  12. తే॥ జలధి మధ్యవాసముఁ గాంచు సమయమందు
    రాత్రి వెన్నెలకారున రమ్యముగను
    జూడఁ బర్వణి దినమున శోభలలర
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నడుగణంబు

    ఉ॥ వారిధి మధ్య వాసమును భవ్యపు రీతిగ నొప్పుచుండఁగన్
    బేరిమి మీర కాంచఁగను వెన్నెలకారున రాత్రియందునన్
    గోరుచు సేదతీరుటను గొంతగ నిర్మలమైన పర్వణిన్
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్

    వెన్నెలకారు శరత్కాలము పర్వణి అమావాస్య నిఘంటువు సహాయమండి

    సముద్రము మధ్యలో బ్రతికిన వారికి ఇది అనుభవమేనండి. రాత్రి చంద్రుడుండకూడదు. ఆకాశము నిర్మలంగా ఉండాలి. అలలు సముద్రము మధ్యలో తక్కువగా ఉంటాయండి. మరీ నిర్మలంగా కూడ ఉంటుంది. అప్పుడు మనకీ అనుభవమౌతుందండి. పౌర్ణిమ రోజున వెన్నెల తివాచీ పరచినట్టుంటుంది

    రిప్లయితొలగించండి
  13. తే.గీ:నింగి విడి సంద్ర మందున మున్ గి నట్టి
    యొక్క రాకెట్టు కనుగొన నుద్యమించ
    నుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు
    నందు వింతల నరసెడు యంత్ర మొకటి.
    (రాకెట్ ఏదో లోపం తో సముద్రం లో పడిపోయింది.దాన్ని సముద్రం లో వెతుకుతుండగా నక్షత్రాల వింతలు కనుగొనే యంత్రం ఒకటి సముద్రం లో కనిపించింది.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:వారిథి లోని కేగి కను పట్టెడు వింతల జూచుచుండు న
    వ్వారిన చేప లిష్ట మగు వానికి గన్ పడ తార మత్స్యముల్
    మీరిన సంతసాన నది మెచ్చుచు నిట్లు వచించె "కొల్లగా
    వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్”
    (తారమత్స్యములు=స్టార్ ఫిష్.సముద్రం లో వింతలు చూడటానికి బయలు దేరగా వారిలో చేపలు బాగా ఇష్ట మైన వాడికి స్టాప్ ఫిషెస్ కనిపించి సంతోషం పట్ట లేక అరిచాడు.)

    రిప్లయితొలగించండి
  15. రంగు రంగుల మేనుల దొంగిలింప
    మర్త్య మానసమ్ముల నెల్ల మత్స్య సంచ
    యమ్ము లందందుఁ దిరుగాడి యలల తోడ
    నుదధి గర్భమ్ముననుఁ దోఁచె నుడుగణంబు


    వారిజ లోచనాననలు భారకు చాప్త కృశావలగ్నలుం
    దారక సన్నిభజ్వలిత తారక యుగ్మలు మర్త్యసంచ యా
    క్షీ రమణీయ తచ్చలన చిత్ర వరిష్ఠ తరంగిణీ మిల
    ద్వారిధి గర్భ మందుఁ గనుపట్టెను దారక లద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి
  16. సంధ్య వేళలు సక్కని సమయ మగుట
    యుదధి తీరాన నిలబడి యుదక మరయ
    యుదధి గర్భమ్ముననుఁ దోచె నుడుగణంబు
    తళుకు లీనుచు కెరటాల ధగల తోడ

    రిప్లయితొలగించండి
  17. పౌర్ణమీదినమందున వరుసగాను
    కాని పించుచునుండగ గగనమందు
    చందమామయు తానట జతకుచేర
    *నుదధి గర్భమ్ముననుదోచె నుడు గణంబు*

    డా బల్లూరి ఉమాదేవి

    కోరుచుమన్నుతింటివట కూరిమి తోడను పాలువెన్నలన్
    కోరిన యంతయిచ్చదనుకుక్షికినిండుగనీపనేలరా
    నోరునుతీసిచూపుమననోటనుగాంచుచునెల్లలోకముల్
    *“వారిధి గర్భమందు కనుపట్టెను తారక లద్భుతంబుగన్

    రిప్లయితొలగించండి