26-10-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”
(లేదా...)
“అర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా”
అభ్యుదయము న భారత మడుగువేయుతఱిని వాణిజ్య మందున్న దారిఁజూపివెలుగుతానౌచు రతనుడువెడలిపోయెఅర్థరాత్రిదివాకరుడస్తమించె
“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”పిచ్చి ప్రేలాపనయె యిది వెదకిజూడఅద్రి యస్తమించినపుడె యసుర మొదలుకొంత నిశ పిదప మరల క్రుంగెనట
శివుని గాంచగ కోవెలన్ జేరుకొనగపాళమియ్యది కాదురా బాలకుండకటిక చీకటి ముసిరెను గద యిది గననర్ధరాత్రి , దివాకరుఁ డస్తమించె.వార్ధి తీరము నందు గల్గిన వాసిగాంచిన క్షేత్రమందర్ధభాగము నాతికిచ్చుచు హారమే హరియైన చంద్రార్ధమౌళి ప్రతీక్షణమ్మిక దక్కదింకను నేడిదేనర్ధరాత్రి , దివాకరుండదె యస్తమించెను చూడుమా.
స్పర్ధ మీరగ యుద్దమందున పాండవేయుల పక్షమైవార్ధిఁ బోలు ఘటోత్కచుండు వివాదమందున హెచ్చగానర్ధరాత్రిన కర్ణు బాణమె యార్పె నాతని తేజమేయర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా!!
ఉత్త రార్ధపు గోళమందున్నవి కదరాత్రివేళల యందున రవి దృశించుదిషణములు యాత్రకైచని దిరిగి చూడ నర్ధ రాత్రి దివాకరుఁ డస్త మించెఅర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమాఅర్ధవంతపు వాక్యమే యిది హాయిగూర్చెడు దృశ్యమేఅర్దగోళము పైని దేశము నందు కాంచుట సాధ్యమేవర్ధనంబగు సూర్యబింబము వాస్తవంబుగ రాత్రమున్
పండుకుంటివి నీవిట పగటి వేళ!పోవలెను రాత్రి కొలువుకు ప్రొద్దు గ్రుంక!కనులు తెఱవవు! చూడగ కాలమిప్పుడర్ధరాత్రి! దివాకరుఁ డస్తమించె!!
దేశ స్వాతంత్ర్య సాధన దీక్ష బూనిద్యుమణి యస్తమించని తెల్ల దొరలపైనధీరవరులగు నేతల పోరు ఫలమెయర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తే॥ ఉత్తరధ్రువపు దరిలో నత్తఱిఁ గనగ్రీష్మ మందున భానుఁడు రెచ్చిపోయిమక్కువఁ గనచు నధిక సమయ మడరుచునర్ధరాత్రి దివాకరుఁ డస్తమించెమత్త॥ స్పర్ధఁ గాంచిరి మిత్రులిద్దరు చక్కగాఁ గని చెప్పగానర్ధరాత్రి దివాకరుండదె యస్తమించుట నెంచుచున్నిర్ధరించిరి గ్రీష్మమందున నించ నుత్తర హెచ్చుపైనర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమాహెచ్చు అగ్రము నించు చూచు పరికించు నిఘంటువు సహాయమండినేను దాదాపు రాత్రి 10గం॥ సమయములో అస్తమించేది చూసానండి
కాంతు వో నీవు సూర్యుని కాళ రాత్రి యనుచు ప్రశ్నింప బాలుం డప్పు డని యె నర్ధ రాత్రి దివాకరు డ స్తమించె ననుచు బలికెను బేలగా నతని తోడ
అయిదు కోట్లాంధ్ర ప్రజలందరాభిమానమ్ముఅడ్డు గోడగ ఉన్న ఆగలేదేఆగిపోయెను బాల గాత్రమే ఆఖరికిఅర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
వార్ధిలో బడబాగ్నులై జనపాళి పోరును సల్పఁగానర్ధరాత్రమునన్ స్వతంత్రము నందుకొంటిరి నేతలేయర్ధరాత్రి స్వతంత్ర సాధనయన్ననర్థమిదేసుమాఅర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా
ఉత్తముండు విఖ్యాత పరోపకారి పుణ్య చరితుండు విజ్ఞుండు పురుషు లందునరయ నధిక దేజస్వంతుఁ డవని లోన నర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె గర్ధ మాత్మ కనర్థ మిచ్చును గష్ట మైనను మర్మమే వర్ధిలం దగు మంతనమ్ముల ప్రాప్తి కెంచఁ బరస్పరస్పర్ధ లేల తొలంగు కాదిది భావ్య మిప్పుడె, రమ్ము నీవర్ధరాత్రి, దివాకరుం డదె యస్తమించెను జూడుమా
తేటగీతిమతమునకని నాసేతు హిమాచలమ్ముసంచరించి వెలుగునింపి శంకరుఁడన గమనమాపుచు జీవితకాలమందునర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె! మత్తకోకిలదుర్దినాల మతంపు వృధ్ధికి దొడ్డగాఁ గృషి సల్పుచున్వర్ధమానము శంరరార్యులు పాటిగన్ వెలుగొంద నిస్వార్థచిత్తుడు జాతిచింతిల నాయువల్పమునంది తానర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా!
శౌరి జన్మించె వసుధనే సమయ మందుప్రతిదినమ్మును తూర్పున ప్రభవమొందుపశ్చిమంబున సంధ్యలో వాసిగాను*“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”*
అభ్యుదయము న భారత మడుగువేయు
రిప్లయితొలగించండితఱిని వాణిజ్య మందున్న దారిఁజూపి
వెలుగుతానౌచు రతనుడువెడలిపోయె
అర్థరాత్రిదివాకరుడస్తమించె
“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”
రిప్లయితొలగించండిపిచ్చి ప్రేలాపనయె యిది వెదకిజూడ
అద్రి యస్తమించినపుడె యసుర మొదలు
కొంత నిశ పిదప మరల క్రుంగెనట
రిప్లయితొలగించండిశివుని గాంచగ కోవెలన్ జేరుకొనగ
పాళమియ్యది కాదురా బాలకుండ
కటిక చీకటి ముసిరెను గద యిది గన
నర్ధరాత్రి , దివాకరుఁ డస్తమించె.
వార్ధి తీరము నందు గల్గిన వాసిగాంచిన క్షేత్రమం
దర్ధభాగము నాతికిచ్చుచు హారమే హరియైన చం
ద్రార్ధమౌళి ప్రతీక్షణమ్మిక దక్కదింకను నేడిదే
నర్ధరాత్రి , దివాకరుండదె యస్తమించెను చూడుమా.
స్పర్ధ మీరగ యుద్దమందున పాండవేయుల పక్షమై
రిప్లయితొలగించండివార్ధిఁ బోలు ఘటోత్కచుండు వివాదమందున హెచ్చగా
నర్ధరాత్రిన కర్ణు బాణమె యార్పె నాతని తేజమే
యర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా!!
ఉత్త రార్ధపు గోళమందున్నవి కద
రిప్లయితొలగించండిరాత్రివేళల యందున రవి దృశించు
దిషణములు యాత్రకైచని దిరిగి చూడ
నర్ధ రాత్రి దివాకరుఁ డస్త మించె
అర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా
అర్ధవంతపు వాక్యమే యిది హాయిగూర్చెడు దృశ్యమే
అర్దగోళము పైని దేశము నందు కాంచుట సాధ్యమే
వర్ధనంబగు సూర్యబింబము వాస్తవంబుగ రాత్రమున్
పండుకుంటివి నీవిట పగటి వేళ!
రిప్లయితొలగించండిపోవలెను రాత్రి కొలువుకు ప్రొద్దు గ్రుంక!
కనులు తెఱవవు! చూడగ కాలమిప్పు
డర్ధరాత్రి! దివాకరుఁ డస్తమించె!!
దేశ స్వాతంత్ర్య సాధన దీక్ష బూని
రిప్లయితొలగించండిద్యుమణి యస్తమించని తెల్ల దొరలపైన
ధీరవరులగు నేతల పోరు ఫలమె
యర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ ఉత్తరధ్రువపు దరిలో నత్తఱిఁ గన
తొలగించండిగ్రీష్మ మందున భానుఁడు రెచ్చిపోయి
మక్కువఁ గనచు నధిక సమయ మడరుచు
నర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
మత్త॥ స్పర్ధఁ గాంచిరి మిత్రులిద్దరు చక్కగాఁ గని చెప్పగా
నర్ధరాత్రి దివాకరుండదె యస్తమించుట నెంచుచున్
నిర్ధరించిరి గ్రీష్మమందున నించ నుత్తర హెచ్చుపై
నర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా
హెచ్చు అగ్రము నించు చూచు పరికించు నిఘంటువు సహాయమండి
నేను దాదాపు రాత్రి 10గం॥ సమయములో అస్తమించేది చూసానండి
కాంతు వో నీవు సూర్యుని కాళ రాత్రి
రిప్లయితొలగించండియనుచు ప్రశ్నింప బాలుం డప్పు డని యె
నర్ధ రాత్రి దివాకరు డ స్తమించె
ననుచు బలికెను బేలగా నతని తోడ
అయిదు కోట్లాంధ్ర ప్రజలందరాభిమానమ్ము
రిప్లయితొలగించండిఅడ్డు గోడగ ఉన్న ఆగలేదే
ఆగిపోయెను బాల గాత్రమే ఆఖరికి
అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
వార్ధిలో బడబాగ్నులై జనపాళి పోరును సల్పఁగా
రిప్లయితొలగించండినర్ధరాత్రమునన్ స్వతంత్రము నందుకొంటిరి నేతలే
యర్ధరాత్రి స్వతంత్ర సాధనయన్ననర్థమిదేసుమా
అర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా
ఉత్తముండు విఖ్యాత పరోపకారి
రిప్లయితొలగించండిపుణ్య చరితుండు విజ్ఞుండు పురుషు లందు
నరయ నధిక దేజస్వంతుఁ డవని లోన
నర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె
గర్ధ మాత్మ కనర్థ మిచ్చును గష్ట మైనను మర్మమే
వర్ధిలం దగు మంతనమ్ముల ప్రాప్తి కెంచఁ బరస్పర
స్పర్ధ లేల తొలంగు కాదిది భావ్య మిప్పుడె, రమ్ము నీ
వర్ధరాత్రి, దివాకరుం డదె యస్తమించెను జూడుమా
తేటగీతి
రిప్లయితొలగించండిమతమునకని నాసేతు హిమాచలమ్ము
సంచరించి వెలుగునింపి శంకరుఁడన
గమనమాపుచు జీవితకాలమందు
నర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె!
మత్తకోకిల
దుర్దినాల మతంపు వృధ్ధికి దొడ్డగాఁ గృషి సల్పుచున్
వర్ధమానము శంరరార్యులు పాటిగన్ వెలుగొంద ని
స్వార్థచిత్తుడు జాతిచింతిల నాయువల్పమునంది తా
నర్ధరాత్రి దివాకరుండదె యస్తమించెను చూడుమా!
రిప్లయితొలగించండిశౌరి జన్మించె వసుధనే సమయ మందు
ప్రతిదినమ్మును తూర్పున ప్రభవమొందు
పశ్చిమంబున సంధ్యలో వాసిగాను
*“అర్ధరాత్రి దివాకరుఁ డస్తమించె”*