28-10-2024 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”
(లేదా...)
“గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా”
కూడికుజనసంగతమునుగాఢముగా మద్యముఁగొని కవితలు వ్రాయన్జూడకు రసపరిణతికైగాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్
వాడిన పదబంధములవితోడుగకవితాహృదయముదోహదపడగాచూడరునవనాగరికులుగాడిదపదపూజయిడునుకావ్యరసమ్మున్
చేడియ యడిగిన ప్రశ్నకువాడిగ నుత్తరము నిచ్చు వాడవు కావేవేడుము విద్వాంసుని హేగాడిద ! పదపూజ యిడును కావ్యరసమ్మున్.నాడవివేకివై చదువు నాకది యేలయటంచు నెంచుచున్ మూఢుడవై చెలంగితివి మూర్ఖత వీడుచు కావ్య భావముల్ నేడడగంగ జేరితివి, నీవిక పండితు నాశ్రయించి హేగాడిద ! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా.
నేడు వచించిన కవితలుచేతన కలిగించవనుచు చెప్పిన నేతన్వాడుక సామెత రీతిగగాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్
శిష్యుని ప్రశ్న, గురుదేవుల సమాధానముగ:కందంపాడెడు వానిని మెచ్చుచుఁగూడెదరేలనొ? పదుగురు గొప్పేమిటొకో?చూడవె కవికోకిలతఁడె? గాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్! ఉత్పలమాలపాడెడు వానిమెచ్చి విను భాగ్యము గల్గెను జన్మధన్యమంచాడెదరేలనో? పదములందుననంతటి గొప్పయేమిటో?చూడవె? వారలే కవనశోభను బంచు కవీశ్వరుండిలన్గాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా!
గాడిదలోని గారవముఁ గానక జుల్కన సేయనేల నాగాడిద కాళ్ళు పట్టుకొనెఁగా వసుదేవుఁడు కార్యసిద్ధికైగాడిద యాది దైవతము కావ్యము వ్రాయగబూన సత్కవుల్గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
కాడున చేసె హలధరుడుగాడిద పద పూజ యిడును కావ్యరసమ్మున్వేడిన శారద మాతయు తోడుగతానుండి కవికి తోషము కూర్చున్వేడగ మిత్రులున్ చనుచువెన్నునితోహలివేగచంపెతా*“గాడిద కాళ్ళు పట్టుకొని, కావ్యకథారసమున్ గ్రహింపుమా”*వేడుచువాణిమాతనిటు వేగమొసంగుమనంగతానిడున్ పోడిమి తోవివేకమది భూరిగ హెచ్చగ నీకుమిత్రమా
వేడెను శిష్యుడు గురువును పోడిమి గా కవిత లల్లు బుద్ధి నొ సంగన్ వేడుకగా బదు లి చ్చె ను "గాడిద పద పూజ యిడును కావ్య రస మ్ము న్ "
వాడనిచో మస్తిష్కముపాడుపడును నీదు పటిమ పండితపుత్రావేడిన చాలును గురువునుగాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్వాడనిచో వివేకమును భావమెఱుంగుట సాధ్యమెట్లగున్వేడుక పుట్టు కావ్యమిది విచ్చిన కన్నుల వీక్షసేయుమావేడిన మీదటన్ గృతికి విజ్ఞులు భావము తెల్పకుందురేగాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
నేఁ డట్టి పండిత కులంబేడ నయినఁ గాంచఁ గలమె యిద్ధరలో నీవోడకు వారి నివాసపు గాడిద పదపూజ యిడును గావ్యరసమ్మున్ వాడల వాడలం దిరిగి వారక పామర సంచయమ్ముతోఁ గూడి సతమ్ము నిక్కముగఁ గోల్పడి తీవు వివేక మక్కటా కూడదు పల్క నిప్పగిదిఁ గ్రూరత నేర్చితి తిట్టు కైత లే గాడిద కాళ్లు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
కం:వాడొక మిత్రుడు నాకున్,వాడు కవన విద్య నేర్ప వచ్చును నీ,కా బూడిదగడ్డ ప్రభాకర్గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”(బూడిదగడ్డ ప్రభాకర్ గాడిద పదపూజ=బూడిద గడ్డ ప్రభాకర్ గాడి పదపూజ మాత్రమే.వాడు నా స్నేహితు డని చెప్పాను కనుక ప్రభాకర్ గాడు అన వచ్చు.)
ఉ:వా డొక పండితుండు సుమ! వానిది నీచపు బుద్ధియే యగున్చూడడు మైత్రి నెన్నడును,చూచును సొమ్మునె విద్య నేర్వగాచూడుము వాని కావ్యముల శోభను,చూడక వాని బుద్ధి నాగాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా(వాడు పండితుడే కానీ బుద్ధిలో ఒక గాడిద.ఏం చేస్తావ్? నువ్వు విద్య నేర్చుకోటానికి ఆ గాడిద కాళ్లు పట్టుకో. )
కూడికుజనసంగతమును
రిప్లయితొలగించండిగాఢముగా మద్యముఁగొని కవితలు వ్రాయన్
జూడకు రసపరిణతికై
గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్
వాడిన పదబంధములవి
రిప్లయితొలగించండితోడుగకవితాహృదయముదోహదపడగా
చూడరునవనాగరికులు
గాడిదపదపూజయిడునుకావ్యరసమ్మున్
రిప్లయితొలగించండిచేడియ యడిగిన ప్రశ్నకు
వాడిగ నుత్తరము నిచ్చు వాడవు కావే
వేడుము విద్వాంసుని హే
గాడిద ! పదపూజ యిడును కావ్యరసమ్మున్.
నాడవివేకివై చదువు నాకది యేలయటంచు నెంచుచున్
మూఢుడవై చెలంగితివి మూర్ఖత వీడుచు కావ్య భావముల్
నేడడగంగ జేరితివి, నీవిక పండితు నాశ్రయించి హే
గాడిద ! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా.
నేడు వచించిన కవితలు
రిప్లయితొలగించండిచేతన కలిగించవనుచు చెప్పిన నేతన్
వాడుక సామెత రీతిగ
గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్
రిప్లయితొలగించండిశిష్యుని ప్రశ్న, గురుదేవుల సమాధానముగ:
కందం
పాడెడు వానిని మెచ్చుచుఁ
గూడెదరేలనొ? పదుగురు గొప్పేమిటొకో?
చూడవె కవికోకిలతఁడె?
గాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్!
ఉత్పలమాల
పాడెడు వానిమెచ్చి విను భాగ్యము గల్గెను జన్మధన్యమం
చాడెదరేలనో? పదములందుననంతటి గొప్పయేమిటో?
చూడవె? వారలే కవనశోభను బంచు కవీశ్వరుండిలన్
గాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా!
గాడిదలోని గారవముఁ గానక జుల్కన సేయనేల నా
రిప్లయితొలగించండిగాడిద కాళ్ళు పట్టుకొనెఁగా వసుదేవుఁడు కార్యసిద్ధికై
గాడిద యాది దైవతము కావ్యము వ్రాయగబూన సత్కవుల్
గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
కాడున చేసె హలధరుడు
రిప్లయితొలగించండిగాడిద పద పూజ యిడును కావ్యరసమ్మున్
వేడిన శారద మాతయు
తోడుగతానుండి కవికి తోషము కూర్చున్
వేడగ మిత్రులున్ చనుచువెన్నునితోహలివేగచంపెతా
*“గాడిద కాళ్ళు పట్టుకొని, కావ్యకథారసమున్ గ్రహింపుమా”*
వేడుచువాణిమాతనిటు వేగమొసంగుమనంగతానిడున్
పోడిమి తోవివేకమది భూరిగ హెచ్చగ నీకుమిత్రమా
వేడెను శిష్యుడు గురువును
రిప్లయితొలగించండిపోడిమి గా కవిత లల్లు బుద్ధి నొ సంగన్
వేడుకగా బదు లి చ్చె ను
"గాడిద పద పూజ యిడును కావ్య రస మ్ము న్ "
వాడనిచో మస్తిష్కము
రిప్లయితొలగించండిపాడుపడును నీదు పటిమ పండితపుత్రా
వేడిన చాలును గురువును
గాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్
వాడనిచో వివేకమును భావమెఱుంగుట సాధ్యమెట్లగున్
వేడుక పుట్టు కావ్యమిది విచ్చిన కన్నుల వీక్షసేయుమా
వేడిన మీదటన్ గృతికి విజ్ఞులు భావము తెల్పకుందురే
గాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
నేఁ డట్టి పండిత కులం
రిప్లయితొలగించండిబేడ నయినఁ గాంచఁ గలమె యిద్ధరలో నీ
వోడకు వారి నివాసపు
గాడిద పదపూజ యిడును గావ్యరసమ్మున్
వాడల వాడలం దిరిగి వారక పామర సంచయమ్ముతోఁ
గూడి సతమ్ము నిక్కముగఁ గోల్పడి తీవు వివేక మక్కటా
కూడదు పల్క నిప్పగిదిఁ గ్రూరత నేర్చితి తిట్టు కైత లే
గాడిద కాళ్లు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
కం:వాడొక మిత్రుడు నాకున్,
రిప్లయితొలగించండివాడు కవన విద్య నేర్ప వచ్చును నీ,కా
బూడిదగడ్డ ప్రభాకర్
గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”
(బూడిదగడ్డ ప్రభాకర్ గాడిద పదపూజ=బూడిద గడ్డ ప్రభాకర్ గాడి పదపూజ మాత్రమే.వాడు నా స్నేహితు డని చెప్పాను కనుక ప్రభాకర్ గాడు అన వచ్చు.)
ఉ:వా డొక పండితుండు సుమ! వానిది నీచపు బుద్ధియే యగున్
రిప్లయితొలగించండిచూడడు మైత్రి నెన్నడును,చూచును సొమ్మునె విద్య నేర్వగా
చూడుము వాని కావ్యముల శోభను,చూడక వాని బుద్ధి నా
గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
(వాడు పండితుడే కానీ బుద్ధిలో ఒక గాడిద.ఏం చేస్తావ్? నువ్వు విద్య నేర్చుకోటానికి ఆ గాడిద కాళ్లు పట్టుకో. )