27, అక్టోబర్ 2024, ఆదివారం

సమస్య - 4925

28-10-2024 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”

(లేదా...)

“గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా”

12 కామెంట్‌లు:

  1. కూడికుజనసంగతమును
    గాఢముగా మద్యముఁగొని కవితలు వ్రాయన్
    జూడకు రసపరిణతికై
    గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్

    రిప్లయితొలగించండి
  2. వాడిన పదబంధములవి
    తోడుగకవితాహృదయముదోహదపడగా
    చూడరునవనాగరికులు
    గాడిదపదపూజయిడునుకావ్యరసమ్మున్

    రిప్లయితొలగించండి

  3. చేడియ యడిగిన ప్రశ్నకు
    వాడిగ నుత్తరము నిచ్చు వాడవు కావే
    వేడుము విద్వాంసుని హే
    గాడిద ! పదపూజ యిడును కావ్యరసమ్మున్.


    నాడవివేకివై చదువు నాకది యేలయటంచు నెంచుచున్
    మూఢుడవై చెలంగితివి మూర్ఖత వీడుచు కావ్య భావముల్
    నేడడగంగ జేరితివి, నీవిక పండితు నాశ్రయించి హే
    గాడిద ! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా.

    రిప్లయితొలగించండి
  4. నేడు వచించిన కవితలు
    చేతన కలిగించవనుచు చెప్పిన నేతన్
    వాడుక సామెత రీతిగ
    గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్

    రిప్లయితొలగించండి

  5. శిష్యుని ప్రశ్న, గురుదేవుల సమాధానముగ:


    కందం
    పాడెడు వానిని మెచ్చుచుఁ
    గూడెదరేలనొ? పదుగురు గొప్పేమిటొకో?
    చూడవె కవికోకిలతఁడె?
    గాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్!

    ఉత్పలమాల
    పాడెడు వానిమెచ్చి విను భాగ్యము గల్గెను జన్మధన్యమం
    చాడెదరేలనో? పదములందుననంతటి గొప్పయేమిటో?
    చూడవె? వారలే కవనశోభను బంచు కవీశ్వరుండిలన్
    గాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా!

    రిప్లయితొలగించండి
  6. గాడిదలోని గారవముఁ గానక జుల్కన సేయనేల నా
    గాడిద కాళ్ళు పట్టుకొనెఁగా వసుదేవుఁడు కార్యసిద్ధికై
    గాడిద యాది దైవతము కావ్యము వ్రాయగబూన సత్కవుల్
    గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా

    రిప్లయితొలగించండి
  7. కాడున చేసె హలధరుడు
    గాడిద పద పూజ యిడును కావ్యరసమ్మున్
    వేడిన శారద మాతయు
    తోడుగతానుండి కవికి తోషము కూర్చున్

    వేడగ మిత్రులున్ చనుచువెన్నునితోహలివేగచంపెతా
    *“గాడిద కాళ్ళు పట్టుకొని, కావ్యకథారసమున్ గ్రహింపుమా”*
    వేడుచువాణిమాతనిటు వేగమొసంగుమనంగతానిడున్
    పోడిమి తోవివేకమది భూరిగ హెచ్చగ నీకుమిత్రమా

    రిప్లయితొలగించండి
  8. వేడెను శిష్యుడు గురువును
    పోడిమి గా కవిత లల్లు బుద్ధి నొ సంగన్
    వేడుకగా బదు లి చ్చె ను
    "గాడిద పద పూజ యిడును కావ్య రస మ్ము న్ "

    రిప్లయితొలగించండి
  9. వాడనిచో మస్తిష్కము
    పాడుపడును నీదు పటిమ పండితపుత్రా
    వేడిన చాలును గురువును
    గాడిద! పదపూజ యిడును కావ్యరసమ్మున్

    వాడనిచో వివేకమును భావమెఱుంగుట సాధ్యమెట్లగున్
    వేడుక పుట్టు కావ్యమిది విచ్చిన కన్నుల వీక్షసేయుమా
    వేడిన మీదటన్ గృతికి విజ్ఞులు భావము తెల్పకుందురే
    గాడిద! కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా

    రిప్లయితొలగించండి
  10. నేఁ డట్టి పండిత కులం
    బేడ నయినఁ గాంచఁ గలమె యిద్ధరలో నీ
    వోడకు వారి నివాసపు
    గాడిద పదపూజ యిడును గావ్యరసమ్మున్


    వాడల వాడలం దిరిగి వారక పామర సంచయమ్ముతోఁ
    గూడి సతమ్ము నిక్కముగఁ గోల్పడి తీవు వివేక మక్కటా
    కూడదు పల్క నిప్పగిదిఁ గ్రూరత నేర్చితి తిట్టు కైత లే
    గాడిద కాళ్లు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా

    రిప్లయితొలగించండి
  11. కం:వాడొక మిత్రుడు నాకున్,
    వాడు కవన విద్య నేర్ప వచ్చును నీ,కా
    బూడిదగడ్డ ప్రభాకర్
    గాడిద పదపూజ యిడును కావ్యరసమ్మున్”
    (బూడిదగడ్డ ప్రభాకర్ గాడిద పదపూజ=బూడిద గడ్డ ప్రభాకర్ గాడి పదపూజ మాత్రమే.వాడు నా స్నేహితు డని చెప్పాను కనుక ప్రభాకర్ గాడు అన వచ్చు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:వా డొక పండితుండు సుమ! వానిది నీచపు బుద్ధియే యగున్
    చూడడు మైత్రి నెన్నడును,చూచును సొమ్మునె విద్య నేర్వగా
    చూడుము వాని కావ్యముల శోభను,చూడక వాని బుద్ధి నా
    గాడిద కాళ్ళు పట్టుకొని కావ్యకథారసమున్ గ్రహింపుమా
    (వాడు పండితుడే కానీ బుద్ధిలో ఒక గాడిద.ఏం చేస్తావ్? నువ్వు విద్య నేర్చుకోటానికి ఆ గాడిద కాళ్లు పట్టుకో. )

    రిప్లయితొలగించండి