6-11-2024 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”
(లేదా...)
“రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”
తేటగీతి'పేడి' వాడైన రచనలో వాడి చూపిజంట శృంగార కేళిని సరసమొప్పమీరి వ్రాయగ 'వాస్తవమెరుఁగదనఁగరసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె!చంపకమాలపసగల భావమున్ మిగుల భాషణమద్దుచు వ్రాయు 'పేడి'యేముసిరిన రాగమై సతిని పుల్కలముంచిన సన్నివేశమున్గుసగుసలాడు పోకడల గూర్చఁగ, 'వాస్తవమెర్గదంచనన్'రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!
ఇంట నొంటరిగ సమయమెటుల గడచుననుచు చింతించుచుండగ ననువుగ దనమందల జేరి సలుపుచుండు మాటలందురసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
విషమనేత్రంబులయ్యవి విందు గనవుభూతియుండినదేహంబు పొసగదెందువల్లకాడునవానికిపడకయుండురసికుడనిమెచ్చె షండుని రామయొకతె
పరమ దుర్మార్గుడైనట్టి పాలకుడను సద్గుణాభిరాముడటంచు శ్లాఘనమ్ముజేయ గాంచినట్టి కవియె చెప్పెనిట్లురసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె.అసురుని మించి లోకులకు హాని యొనర్చెడు కూళ్ళమారి గెల్చి సువిదుడైన చాలునిక చెంతన జేరిన వందిమాగధుల్ ధిషణను జేయ గాంచి నొక ధీరవరుండు వచించె నిట్టులన్ రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో.
ఉబుసు పోకకు మాటాడ యువతి కడకు వచ్చి ముచ్చట లాడుచు వనిత తోడ మరులు గొలుపుచు భాషించు మాట లందు రసికుడని మె చ్చె షండుని రామ యొ క తె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పసితనమద్ది పోక మరి బాలకవృత్తి చరించు వానికిన్మిసమిసలాడు కన్యకను మేలును గోరుచుఁ జేయ పెండిలిన్త్రసనమునొంద భార్యయన ధైర్యము నింప తలంచి వానినిన్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!!
మిసిమి గలజాణ చదివిన మేటి రచనరసభరితము కడుంగడు రమ్యమనుచుగుసగుసలను కవి లిఖించె కసినిబెంచరసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతెమిసమిసలాడు పద్మముఖి మీసరమీ కవనమ్మటంచు చాటి సరసమైన శబ్దముల టిప్పణి వెల్వడ జేసి తత్కవిన్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలోగుసగుసలాడు రీతి నహ! గొప్పగ పేర్కొనె నంచు తెల్పుచున్
షండుఁడైనను మిక్కిలి సరసుఁడతఁడునాట్య శాస్త్రము నెరిగిన నర్తకుండుభరతమునివోలె జూపించు భంగిమలనురసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
పసగల నాట్యకోవిదుడు భంగిమలందున సిద్ధహస్తుడేధిషణను జూపి నృత్యమును దీరుగ నేర్పెడు నొజ్జయాతఁడభ్యసనమునందు సంతమము నద్భుతరీతిని వెల్వరించు బల్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
తే.గీ:మంద భాగ్యుడై రతిసుఖ మ్మొంద లేనిషండు డయ్యు పత్రికలందు సరసకథల నూహ తో చక్కగా వ్రాసె నాహ! కథలరసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”(శారీరకం గా నపుంసకుడు కానీ ఊహలలో రసికుడు అని ఒక రచయితని ఒక స్త్రీ మెచ్చుకున్నది.అతను సరసమైన కథలు బాగా రాస్తాడు.)
చం:రసికత గోరునే గణిక ? రాల్చెడు కాసుల గాంచి మెచ్చు ,తావిసుగు భరించియున్ ,తనను బిల్చిన వాడు రమింప లేకయున్, నసగక హెచ్చు సొమ్మిడగ, నచ్చగ నాతని తోడి బేరమేరసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”(ఒక పేద వేశ్య కోరుకునేది విటుడి రసికతని కాదు.సొమ్ము మాత్రమే.అనుభవించటం చేత కాకున్నా ఆశపడి సొమ్ము వదిలించుకు పోయే వాడే ఆమెకి మంచి బేరం.వాణ్ని నువ్వే రసికుడి వని మెచ్చుకుంటే వాడు మళ్ళీ మళ్లీ వస్తా డని ఆమె వ్యాపారసూత్రం.)
తే॥ అందమున మిన్న సరసమునందు ఘనునిరసికుఁడని మెచ్చె షండుని రామ యొకతెవైద్యులు చికిత్స నొనరించ భవిత విరిసెపురుషుఁడుగ మార బ్రదుకున మోదమలరచం॥ మిసమిసలాడు యవ్వనము మేలిమి సాధు గుణమ్ముఁ జూడఁగన్రసికుఁడటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ, గంతుకేళిలోమసలఁ జికిత్స వైద్యులటు మానకఁ జేయఁగఁ బూరుషుండునైవసతిగఁ బొంద జీవనము భవ్యము రమ్యమునై చెలంగెనే!మి ని వి అనుకున్నానండి. నేటి శాస్త్ర విద్య చాలా లోపాలు సరిచేయగలదండి.శాస్త్రమును నేటి స్థితిగతులను పరిగణలోకి తీసుకొనవలయునని నా విన్నపము
సుస్వర గళుండు సకల జన స్వభావవేత్త సంగీత విద్యా వియత్తలైక భాసమానుఁడు నాట్య క ళాసమాన రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె పస గల కారణమ్ములను బల్కుచు నెల్లరు విశ్వసింపఁగాఁ గొసరుచు వేఁడుఁ గాలమును గోరినఁ గుందక తీర్పు మప్పు నా విసువక రేపు రే పనుచు వేఁడును నిత్యము రమ్య మర్మ వాగ్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో [కంతు= గడువు]
పేడి రూపము కలిగిన పేరిశాస్త్రి కాముకులగూర్చి చక్కని కధలు వ్రాయ చదివి వాటిని పూర్తిగా సంతసమునరసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
కసిగలుగంగచూపులను గాంచిన తోడనె మానసంబునన్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో రసికులనంగవారుపరివ్రాజకులౌదురు కేళిలేనిచో రసికత యంత గొప్పదిలరాజుల రాజ్యములేగతించెనే
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అందమైనవాడు చదువులందు మేటిసద్గుణమ్ములు కలిగిన సజ్జనుండుసరస సంభాషణమ్ములు జరుపుచుండరసికుడని మెచ్చె షండుని రామ యొకతె.
చదువు సంధ్యలు కలవని చక్కనైనసరస సంభాషణములందు చతురుడంచుసకల సుగుణాభిరాముడౌ సన్నిహితునిరసికుడని మెచ్చె షండుని రామయొకతె
తేటగీతి
రిప్లయితొలగించండి'పేడి' వాడైన రచనలో వాడి చూపి
జంట శృంగార కేళిని సరసమొప్ప
మీరి వ్రాయగ 'వాస్తవమెరుఁగదనఁగ
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె!
చంపకమాల
పసగల భావమున్ మిగుల భాషణమద్దుచు వ్రాయు 'పేడి'యే
ముసిరిన రాగమై సతిని పుల్కలముంచిన సన్నివేశమున్
గుసగుసలాడు పోకడల గూర్చఁగ, 'వాస్తవమెర్గదంచనన్'
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!
ఇంట నొంటరిగ సమయమెటుల గడచు
రిప్లయితొలగించండిననుచు చింతించుచుండగ ననువుగ దన
మందల జేరి సలుపుచుండు మాటలందు
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
విషమనేత్రంబులయ్యవి విందు గనవు
రిప్లయితొలగించండిభూతియుండినదేహంబు పొసగదెందు
వల్లకాడునవానికిపడకయుండు
రసికుడనిమెచ్చె షండుని రామయొకతె
రిప్లయితొలగించండిపరమ దుర్మార్గుడైనట్టి పాలకుడను
సద్గుణాభిరాముడటంచు శ్లాఘనమ్ము
జేయ గాంచినట్టి కవియె చెప్పెనిట్లు
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె.
అసురుని మించి లోకులకు హాని యొనర్చెడు కూళ్ళమారి గె
ల్చి సువిదుడైన చాలునిక చెంతన జేరిన వందిమాగధుల్
ధిషణను జేయ గాంచి నొక ధీరవరుండు వచించె నిట్టులన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో.
ఉబుసు పోకకు మాటాడ యువతి కడకు
రిప్లయితొలగించండివచ్చి ముచ్చట లాడుచు వనిత తోడ
మరులు గొలుపుచు భాషించు మాట లందు
రసికుడని మె చ్చె షండుని రామ యొ క తె
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపసితనమద్ది పోక మరి బాలకవృత్తి చరించు వానికిన్
తొలగించండిమిసమిసలాడు కన్యకను మేలును గోరుచుఁ జేయ పెండిలిన్
త్రసనమునొంద భార్యయన ధైర్యము నింప తలంచి వానినిన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో!!
మిసిమి గలజాణ చదివిన మేటి రచన
రిప్లయితొలగించండిరసభరితము కడుంగడు రమ్యమనుచు
గుసగుసలను కవి లిఖించె కసినిబెంచ
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
మిసమిసలాడు పద్మముఖి మీసరమీ కవనమ్మటంచు చా
టి సరసమైన శబ్దముల టిప్పణి వెల్వడ జేసి తత్కవిన్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
గుసగుసలాడు రీతి నహ! గొప్పగ పేర్కొనె నంచు తెల్పుచున్
షండుఁడైనను మిక్కిలి సరసుఁడతఁడు
రిప్లయితొలగించండినాట్య శాస్త్రము నెరిగిన నర్తకుండు
భరతమునివోలె జూపించు భంగిమలను
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
పసగల నాట్యకోవిదుడు భంగిమలందున సిద్ధహస్తుడే
రిప్లయితొలగించండిధిషణను జూపి నృత్యమును దీరుగ నేర్పెడు నొజ్జయాతఁడ
భ్యసనమునందు సంతమము నద్భుతరీతిని వెల్వరించు బల్
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
తే.గీ:మంద భాగ్యుడై రతిసుఖ మ్మొంద లేని
రిప్లయితొలగించండిషండు డయ్యు పత్రికలందు సరసకథల
నూహ తో చక్కగా వ్రాసె నాహ! కథల
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె”
(శారీరకం గా నపుంసకుడు కానీ ఊహలలో రసికుడు అని ఒక రచయితని ఒక స్త్రీ మెచ్చుకున్నది.అతను సరసమైన కథలు బాగా రాస్తాడు.)
చం:రసికత గోరునే గణిక ? రాల్చెడు కాసుల గాంచి మెచ్చు ,తా
రిప్లయితొలగించండివిసుగు భరించియున్ ,తనను బిల్చిన వాడు రమింప లేకయున్,
నసగక హెచ్చు సొమ్మిడగ, నచ్చగ నాతని తోడి బేరమే
రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో”
(ఒక పేద వేశ్య కోరుకునేది విటుడి రసికతని కాదు.సొమ్ము మాత్రమే.అనుభవించటం చేత కాకున్నా ఆశపడి సొమ్ము వదిలించుకు పోయే వాడే ఆమెకి మంచి బేరం.వాణ్ని నువ్వే రసికుడి వని మెచ్చుకుంటే వాడు మళ్ళీ మళ్లీ వస్తా డని ఆమె వ్యాపారసూత్రం.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితే॥ అందమున మిన్న సరసమునందు ఘనుని
తొలగించండిరసికుఁడని మెచ్చె షండుని రామ యొకతె
వైద్యులు చికిత్స నొనరించ భవిత విరిసె
పురుషుఁడుగ మార బ్రదుకున మోదమలర
చం॥ మిసమిసలాడు యవ్వనము మేలిమి సాధు గుణమ్ముఁ జూడఁగన్
రసికుఁడటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ, గంతుకేళిలో
మసలఁ జికిత్స వైద్యులటు మానకఁ జేయఁగఁ బూరుషుండునై
వసతిగఁ బొంద జీవనము భవ్యము రమ్యమునై చెలంగెనే!
మి ని వి అనుకున్నానండి.
నేటి శాస్త్ర విద్య చాలా లోపాలు సరిచేయగలదండి.
శాస్త్రమును నేటి స్థితిగతులను పరిగణలోకి తీసుకొనవలయునని నా విన్నపము
సుస్వర గళుండు సకల జన స్వభావ
రిప్లయితొలగించండివేత్త సంగీత విద్యా వియత్తలైక
భాసమానుఁడు నాట్య క ళాసమాన
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
పస గల కారణమ్ములను బల్కుచు నెల్లరు విశ్వసింపఁగాఁ
గొసరుచు వేఁడుఁ గాలమును గోరినఁ గుందక తీర్పు మప్పు నా
విసువక రేపు రే పనుచు వేఁడును నిత్యము రమ్య మర్మ వా
గ్రసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
[కంతు= గడువు]
పేడి రూపము కలిగిన పేరిశాస్త్రి
రిప్లయితొలగించండికాముకులగూర్చి చక్కని కధలు వ్రాయ
చదివి వాటిని పూర్తిగా సంతసమున
రసికుఁ డని మెచ్చె షండుని రామ యొకతె
కసిగలుగంగచూపులను గాంచిన తోడనె మానసంబునన్
రిప్లయితొలగించండిరసికుఁ డటంచు మెచ్చె నొక రామ నపుంసకుఁ గంతుకేళిలో
రసికులనంగవారుపరివ్రాజకులౌదురు కేళిలేనిచో
రసికత యంత గొప్పదిలరాజుల రాజ్యములేగతించెనే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అందమైనవాడు చదువులందు మేటి
సద్గుణమ్ములు కలిగిన సజ్జనుండు
సరస సంభాషణమ్ములు జరుపుచుండ
రసికుడని మెచ్చె షండుని రామ యొకతె.
చదువు సంధ్యలు కలవని చక్కనైన
రిప్లయితొలగించండిసరస సంభాషణములందు చతురుడంచు
సకల సుగుణాభిరాముడౌ సన్నిహితుని
రసికుడని మెచ్చె షండుని రామయొకతె