అను నిత్యం బిలలో స జ్జన రక్షకునకు నొనర్తుఁ జక్రికి నతులన్ వనజాక్షునకు మహాసుర జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
ఘన సంతాప మొసంగఁ బౌరులకు నాకాంక్షించి దుర్బుద్ధితో ననివార్యమ్ముగ నాక్రమింప విజయం బాశించి నిత్యాన్న పా న నికాయమ్ముల నాపి శత్రు దళ సేనానీ బృహద్వాహినీ జన విధ్వంసకుఁ డైన వానికి నమస్కారమ్ము లందించెదన్
మ:తన విద్వేషము జూపి ,హిందుమత నిందన్ జేయు వాడుగ్రుడై "మనకున్ మాంసము లేదు,గ్రుడ్లిడరు సేమం బెట్టు లిస్కాను భో జనమున్ జేయగ దీని మాన్ పు"డని ఘోషన్ దెచ్చె నా శుభ్ర భో జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారంబు లందించెదన్ (ప్రసాదం వంటి ఇస్కాన్ భోజనం మీద ఇంత గోల చేసారు.దాన్ని కొన్ని చోట్ల మాన్ పించారు.అలాంటి వాడికి ఒక నమస్కారం అని వ్యంగ్యం )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిఅనయము శిష్టులఁ గావఁగ
దనుజుల దండింపఁగ నవతారము లెత్తన్
మునిజనవందితునకు దు
ర్జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
మత్తేభవిక్రీడితము
వినుతుల్ సేయఁగ శిష్టులున్ శరణమన్ విశ్వాస మేపారఁగన్
దనుజానీకముఁ గూల్చఁగన్ దిగుచుఁ దా దండించు రూపమ్మునన్
మునిసంఘంబులు భక్తితోఁ గొలుచు నంభోజాక్షు సర్వేశు దు
ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్
జనులకు నండగ నిల్చియు
రిప్లయితొలగించండిమునుకొని కాపాడ దలచి భూరి మగటి మిన్
ఘన హిత కారి యు నౌ దు
ర్జ న నాశ కునకు నొ నర్త్రు సన్నుతు లెపు డున్
అనరు గలిగించు చుండగ
రిప్లయితొలగించండిమనకేమని విడువకుండ మరుసటి దినమే
ఘనముగ శిక్షించెడి కు
జన , నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
పనిగొనిరక్కసుడంతట
రిప్లయితొలగించండితనయునిబెట్టగనిడుములు ధరణినిగావన్
తునియలు జేసిన యైదు
రాజు నాశమునకు నొనర్తు సన్నుతులెపుడున్
తునియలుజేసినయాదు
రిప్లయితొలగించండిర్జననాశకునకునొనర్తుసన్నుతులెపుడున్
చెనఁటుల దుర్మార్గంబునుఁ
రిప్లయితొలగించండిజెనకుచు సజ్జనుల రక్ష సేయుచు నెలమిన్
జనహితమును గోరెడు దు
ర్జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
జనముల్బాంధవులంచుమానసములోజాతంపుభీతిన్వడిన్
రిప్లయితొలగించండిపెనుశోకంబున పార్థుడంతటను గాంభీర్యంబునే వీడును
తనియన్జేసెగకృష్ణుడాతఱిని నిత్యంబేదిలేదంచు, దు
ర్జన విధ్వంసకుకు డైన వానికి నమస్కారమ్ములందించెదన్
వీడెనే
రిప్లయితొలగించండిచెనఁటుల్ సల్ఫెడు దుష్కృతమ్ములెపుడున్ జెండాడుచున్ ధీరుడై
రిప్లయితొలగించండిజన బాహుళ్యఁపు రక్షనంచితముగా సల్పంగ సంసిద్ధుడై
జెనకన్ దుర్మతులన్ వ్యధార్తులకు సంక్షేమంబు గల్పింప దు
ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్
రిప్లయితొలగించండిముని యాగము రక్షింపగ
దనుజుల దునుమాడి సతము ధర్మమ్మును ధా
త్రినిలుప ధర్మవిరోధ కు
జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్”*
మనుజుండై ధర బుట్టి ధర్మమును సమ్మానించెడిన్ వాడెయై
జనకుండాడిన మాటకోసమయి రాజ్యమ్మున్ విడద్రోచుచున్
వనవాసమ్మున ధర్మదూరులగు కవ్యాదుండ్రె యైనట్టి దు
ర్జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్.
తన గళముననిల్పి గరము
రిప్లయితొలగించండిజనహితమును గోరు వాడు శంకరుడేగా
వినయంబుతోడ నే కం
జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
తనదేహంబుననర్థభాగమిడెగా దాక్షాయనీమాతకున్
జనసంక్షేమముకై కలాకులము నాస్వాదించె నిర్భీతిగా
తనపై వాడిశరంబులన్ విడువగా దండింపగానెంచి కం
జన విధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్
[కంజనుడు = మన్మథుడు]
రిప్లయితొలగించండికం॥ దనుజుని వోలెను ధ్వంసము
నొనర్చ పథకము రచించునుక్కివుఁ బోకన్
గనుచున్ దుష్టకుటిల యో
జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
మ॥ ధనమున్ బొందుటె లక్ష్యమై ధరను సంధానించి దుష్కృత్యముల్
చనెడిన్ దుష్టుఁడ నాకుతంత్రముల నాసాంతమ్ము విద్వత్తుతోఁ
గనుచున్ వెంటనె ప్రజ్ఞఁ జూపుచును దుష్కార్యమ్ముకై చేయు యో
జన విధ్వంసకుఁడైన వానికి నమస్కారమ్ము లందించెదన్
యోజన ఆలోచన ఉక్కివుడు దుష్టుడు
అను నిత్యం బిలలో స
రిప్లయితొలగించండిజ్జన రక్షకునకు నొనర్తుఁ జక్రికి నతులన్
వనజాక్షునకు మహాసుర
జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్
ఘన సంతాప మొసంగఁ బౌరులకు నాకాంక్షించి దుర్బుద్ధితో
ననివార్యమ్ముగ నాక్రమింప విజయం బాశించి నిత్యాన్న పా
న నికాయమ్ముల నాపి శత్రు దళ సేనానీ బృహద్వాహినీ
జన విధ్వంసకుఁ డైన వానికి నమస్కారమ్ము లందించెదన్
వినయము నోర్పును గలుగుచు
రిప్లయితొలగించండిననయము నుపకారబుధ్ధి నవనత ముఖుఁడై
జనులకు సంతస మిడు దు
ర్జననాశకునకు నొనర్తు సన్నుతులెపుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మునులు జరుపు యాగములను
వనమున నాశనము చేయ పగగొని దనుజుల్
దునుమాడె రాముడా దు
ర్జన నాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్.
మ:తన విద్వేషము జూపి ,హిందుమత నిందన్ జేయు వాడుగ్రుడై
రిప్లయితొలగించండి"మనకున్ మాంసము లేదు,గ్రుడ్లిడరు సేమం బెట్టు లిస్కాను భో
జనమున్ జేయగ దీని మాన్ పు"డని ఘోషన్ దెచ్చె నా శుభ్ర భో
జనవిధ్వంసకుఁడైన వానికి నమస్కారంబు లందించెదన్
(ప్రసాదం వంటి ఇస్కాన్ భోజనం మీద ఇంత గోల చేసారు.దాన్ని కొన్ని చోట్ల మాన్ పించారు.అలాంటి వాడికి ఒక నమస్కారం అని వ్యంగ్యం )
మునులట తపమును చేయుచు
రిప్లయితొలగించండివనముల నుండగ చెరచగ వచ్చిన ఖలులన్
దునుమిన యాశ్రీ శునకు కు
*“జననాశకునకు నొనర్తు సన్నుతు లెపుడున్”*