16, డిసెంబర్ 2024, సోమవారం

సమస్య - 4974

17-12-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్”
(లేదా...)
“స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్”

21 కామెంట్‌లు:

  1. స్వఃప్రాంతమ్మనఁ బుట్టినట్టి తలమే సందేహమేలేదురా
    స్వఃప్రాంతమ్మును వీడిపోయినపుడే సందేహ మొచ్చెన్ గదా
    స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్?
    స్వఃప్రాంతమ్మునఁ జీవనమ్మగునుగా స్వర్లోక సమ్మానమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. స్వఃప్రాంతమెపుడు మనదే
      స్వఃప్రాంతమ్మును విడుచుట సముపార్జనకే
      స్వఃప్రాంతము పాడుపడిన
      స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్

      తొలగించండి
  2. ఏప్రాంతమునకు వెళ్ళిన ,
    నాప్రాంతపు జనులుకూడి యాదుకొనిరిగా !
    నీ ప్రతిభను జూపుటకై
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  3. కందం
    స్వఃప్రాంతమె స్వర్గమగు ప
    రఃప్రాంతము స్వర్ణ లంక లక్ష్మణ! గొప్పే?
    స్వఃప్రాంతము స్త్యుత్యము నే
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      స్వఃప్రాంతమ్మన మించు స్వర్గమునదే ప్రాణప్రదమ్మౌచు దూ
      రఃప్రాంతమ్మగు లంక స్వర్ణమయమై రంజించినన్ గాని నా
      స్వఃప్రాంతమ్ము నయోధ్యయే సతము నా సంతోషతీరమ్ము నే
      స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్?

      తొలగించండి
  4. కందం.

    స్వఃప్రీతి బుద్ధుడు విడి శు
    భః ప్రదమనుచుహృదిలోన భావనతో అం
    తఃప్రాకారము విడిచెను
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్”

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి

  5. స్వఃప్రాంతము జ్ఞాతులకును
    స్వః ప్రాంతమె వారునీకు శాత్రువు లైనన్
    స్వః ప్రాంత మోజు విడి యా
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్.


    స్వః ప్రాంతమ్మున నాప్తులై సఖులు నీబాగోగులన్ గోరినన్
    స్వః ప్రాంతమ్మని పేర్మితోడనట వాసమ్ముండినన్ మేలు నా
    స్వః ప్రాంతీయులు గొంగలై సతము నీ సంహారమున్ గోరినన్
    స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్.

    రిప్లయితొలగించండి
  6. స్వఃప్రాంతమెన్నడేనియు
    స్వఃప్రాంతమె దానిమించి స్వర్గము గలదే
    స్వఃప్రాంతవాసికెట్టుల
    “స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్”?

    రిప్లయితొలగించండి
  7. స్వఃప్రాంతమ్మున నున్న నీకు మిగులున్ శాలూర భావంబు స
    ద్యః ప్రాప్తంబది గల్గు నిల్లు విడువన్ దారాసుతావ్రాతమం
    తః ప్రీతిన్ నిను గారవించు ధనమే దారిద్ర్య నాశంబగున్
    స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్!!

    శాలూరము = కప్ప

    రిప్లయితొలగించండి
  8. స్వఃప్రాంతమ్మన నెన్నడేనియదియేస్వర్గంబు జీవాళికిన్
    స్వఃప్రాంతాగమనమ్మునన్ మనమునన్ సంతోష మేపారు నా
    స్వఃప్రాంతంబున నున్నచో మనికికిన్ సంఘాతమే గల్గుచో
    స్వఃప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్

    రిప్లయితొలగించండి
  9. కం॥ హ్యః ప్రాంతముఁ దమదనుచును
    స్వఃప్రాంతమను తగులమునఁ బరఁగ జనులు స
    ద్యః ప్రాంతము భువి యని కని
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్

    శా॥ హ్యః ప్రాంతాదర భావమొప్ప మనుజుల్ హార్దమ్ముఁ గాంచంగ స
    ద్యః ప్రాతంబన ధాత్రియంచు మనుజుల్ ధ్యానించి వ్యాపించిరే
    శ్వః ప్రాంతంబనఁ జంద్రమండలమునే భావించినన్ జోద్యమే!
    స్వఃపాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్

    ధ్యానించు తలపోయు శ్వః రేపు హ్యః నిన్న

    రిప్లయితొలగించండి
  10. స్వః ప్రాంతమె మాతృ సమము
    స్వః ప్రాంతము వృద్ధి కొఱకు సర్వులు జగతిన్
    స్వః కృషి చేయ క నెట్టుల
    స్వః ప్రాంతము వీడి నపుడు సౌఖ్య ము దక్కున్?

    రిప్లయితొలగించండి
  11. శా:ఆహ్! ప్రాదిక్కున సూర్యుడేడి? ఎటు సంధ్యన్ జేతు హేమంత! "శై
    త్యః ప్రారంభతి" యంచు వీడదగునో! దర్శింపకే సూర్యు "త
    త్త్వః ప్రాప్త" మ్మని యిట్లు దల్చెదను మిత్రా! యింక "నోం భూర్భువ
    స్వః" ప్రాంతమ్మును వీడి యేగినపుడే సౌఖ్యంబు లభ్యంబగున్”
    (స్వ@+ప్రాంతము అన్నప్పుడు స్వప్రాంతము అని సంధి చెయ్యా లేమో అనే సందేహం కలిగింది.కనుక సంధి చేయకుండా ఇలా వాడాను.సూర్యుడే కనిపించటం లేదని హేమంతుడికి తెలిపి
    వేదాంతమే తలచి ఓం భూర్భువస్వః అనుకొని ముగించాడు. )

    రిప్లయితొలగించండి
  12. స్వః ప్రతిమా వసుమతిని న
    భఃప్రభువును మించ భూమి పతులుం గరుణన్
    స్వః ప్రాశస్త్య ము నెన్నక
    స్వఃప్రాంతము వీడి నపుడె సౌఖ్యము దక్కున్


    స్వః ప్రేమాతిశయమ్ము మానవులకుం బాటిల్లినం గల్గునే
    స్వః ప్రాప్తమ్ము రమాధి నాథునకుఁ బూజల్ భక్తి నీకున్నచో
    వాః ప్రక్షిప్త వసుంధరా తలమునున్, వాంఛించి డెందమ్ములన్
    స్వఃప్రాంతమ్మును, వీడి యేఁగి నపుడే సౌఖ్యంబు లభ్యం బగున్

    రిప్లయితొలగించండి
  13. ఇందు నొక చిన్న విశేషము కలదు. తన ప్రాంత మన్న యర్థమున స్వప్రాంతము సాధు వగును. స్వర్గ ప్రాంతము లేక సుఖప్రాంతము లేక కాంతివంత ప్రాంతము నన్న భావమున స్వః ప్రాంతము సాధు వగును. ఇది నా యభిప్రాయము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ, అన్ని పాదములలోనూ ప్రథమాక్షరమునకు విసర్గ తప్పని సరియా .. సందేహ నివృత్తి చేయగలరు.

      తొలగించండి
    2. అవునండి. విసర్గ తరువాత "ప్ర" సంయ క్తాక్షరముండ వలె నే యచ్చుతో నయినను.

      తొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్వఃప్రాంతముపై సతతము
    స్వఃప్రాంతపు ప్రేమ యుండు సాదరమొప్పన్
    స్వఃప్రాంతమె సుఖ; మెట్టుల
    స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్?

    రిప్లయితొలగించండి
  15. స్వఃప్రాంతమె స్వర్గమిలను
    స్వఃప్రాంతమె జనులకెల్ల జననియు కాదే
    స్వప్రజ్ఞను విడ నేరికి
    *“స్వఃప్రాంతము వీడినపుడె సౌఖ్యము దక్కున్

    రిప్లయితొలగించండి