20-12-2024 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”(లేదా...)“హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)
వానవచ్చినమునుగునువైనమేదివరుస నిలచునురహదారి వాహనములుసహజ సంపద మృగ్యంబు శమము లేదుభాగ్యనగరమ్ము హైదరాబాదుగాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆదరహాసమేది జనయానమునందున యావయేగదాకైదువుతోడిసాముగద కమ్మనిజీవితమెందుఁజూచినన్మీఁదటగాలినీరుగన మేలునుఁజేయవు శంకరా! హరీహైదరాబాదు భాగ్యవగరాఖ్యనుఁబొందుట సత్యదూరమౌ
హైదర
తేటగీతిదర్శనీయ స్థలాలతో ధన్యతఁగనిప్రజకొక విహారనగరమై భాగ్యమందె!సర్వకలుషాలు నేడు ముసర, మునుపటిభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు!ఉత్పలమాలసోదర భావమున్ బ్రజలు చూప పరస్పరమున్ గతమ్మునందాదట దర్శనీయముగ నందరు మెచ్చెడు భాగ్యమందెనే!చీదరఁ గొల్పెడున్ కలుష జీవనమల్మగ నేడు నయ్యయో!హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పాలకులచట నివసించు ప్రజకు వలయుసకల వసతులు కల్పించి సాకుచుండి .విద్య యారోగ్యముల దృష్టి పెట్టు చుండుభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
మేదిని భాగ్యలక్ష్మి కడు మేలునుఁ గూర్చగ హైందవాళికిన్ మోదము నొంది తా వెలయ పుట్టెను భాగ్య పురంబు నామమేవాదనఁ జేయ భాగమతి పైగల ప్రేమకు నిల్చు చిహ్నమైహైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పలువిధమగు జిల్లాలతో పరిఢవిల్లువాసిగల రాష్ట్రమిదికాదె వలస లేల?యవని యందు తెలంగాణ మనిన యొక్కభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.ఖాదరు సత్యమున్ వదలి కయ్యము లాడకు వాస్తవమ్మిదే నాదగు భారతావని సనాతన ధర్మమటంచు నచ్చకన్ గాదుటె వీడిపోయితిరి కాంచగ నచ్చట నుండునట్టి యా హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ. *(పాకిస్తాన్ లో గల హైదరాబాదును భాగ్యనగరనిపిలువరాదు)*
Very nice and different sir!
కట్టెనట కుతుబ్‌షా తన గాదిలియగుభాగమతి పేరిడి నవీన భాగ్యనగరినగరమునకుఁ దొల్తనిడిన నామ మనగభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదుపేదలు జీవితమ్ములిట వేగిర పాటున వెళ్ళఁబెట్టగావేదన కానరాదనుచుఁ బేర్కొను చుందురు భాగ్యవంతులేబాదలు లేని జీవనము పౌరులలోఁ గనలేని భాగ్యమే హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
భాగ మతి పేర వెలసియు వాసి గాంచి పలు రకమ్ము ల సంస్కృతీ నిలయ మగుచు దక్షిణా దిన విఖ్యాత దర్శనీయభాగ్య నగ రమ్ము హైదరాబాదు కాదు
పరుగు పందెముల్ బ్రతుకున బవలు రేయిజీవనోపాధికోసమై పోవు జనులుశాంతి కనరాదు వెదకిన శ్రాంతిలేదుభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
తే.గీ:రెండు రాష్ట్రాల ప్రజలకు నిండు ధైర్యమిచ్చి యుద్యోగ,వృత్తుల నిచ్చు భాగ్యనగరమే హైదరబాదు వగపు నిడు నభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”(ఇది భాగ్య నగరం కానీ అభాగ్యనగరం కాదు.)
ఉ:హైదరబా దటంచు జగ మంతట పేరు గడించ, ముస్లిముల్మాదని నేటికిన్ బలుక ,మా చరితమ్ము స్మరింప జేయ మీకేదియు తోచనట్లు కలిపింతురె హిందు పదమ్ము పేరునన్?హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”(అనేది ఒక ముస్లిం ఆవేదన.)
తే॥ పబ్బులందు క్లబ్బులలోను మబ్బు విడకమత్తు నందు చిత్తగుచును మనఁగ జనులు భారతీయ సంస్కృతికిల వారధి గాకభాగ్యనగరమ్ము హైదరాబాదు కాదుఉ॥ వేదనఁ బొందరే కనఁగ విజ్ఞులు నిచ్చటఁ గోడెకారులేమోదముఁ గాంచి దుర్వ్యసనముల్ పడయంగను నీతిఁ బాయిచున్ గాదని గొప్ప సంస్కృతిని గర్హణఁ జేయుచు శీలవృత్తినిన్హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌశీలవృత్తి సదాచారము నిఘంటువు సహాయమండిఈమధ్య ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి కదండి.
భాగమతిపేరిటవెలసివాసిగాంచెసకలకళలనిలయమని సన్నుతిగనె*“భాగ్యనగరమ్ము ,హైదరాబాదు కాదు”* పిదప నీనామమె నిలిచె విశ్వమందు
ఆదరబాదరా బ్రతుకు యాదట కానగరాదు సంతతం బూఁదరఁగొట్టు వ్యాపకము లుక్కిరిబిక్కిరి సేయ జీవనోపాధికి నిర్విరామముగ పర్గులుదీయు జనాళి సూడగన్హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ
పొంతనమ్ము లేని గిరల వంత నొసఁగు దేమి యెక్కడి దీ భాగ్య మెక్కడి దకటా నగర మెక్క డీ హైద రన్న మాట భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు ఏది యెడంద నిష్ట పడు నిమ్ముగ నయ్యది యొప్పు రీతిఁ దానా దెస నల్లుఁ గట్టు కథ లంచిత రీతిని నమ్ము నట్లుగా వాదు లొనర్చు సంతతము వారక పంతము నూని కావునన్ హైదరబాదు భాగ్యనగ రాఖ్యనుఁ బొందుట సత్య దూరమౌ
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నాటి పర్యాటక నెలవు మేటిగానుపారిశుద్ధ్యమె యలరిన పట్టణమ్మునేడు కాలుష్య నిలయమై నిలువ, నాటిభాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు.
వానవచ్చినమునుగునువైనమేది
రిప్లయితొలగించండివరుస నిలచునురహదారి వాహనములు
సహజ సంపద మృగ్యంబు శమము లేదు
భాగ్యనగరమ్ము హైదరాబాదుగాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆదరహాసమేది జనయానమునందున యావయేగదా
రిప్లయితొలగించండికైదువుతోడిసాముగద కమ్మనిజీవితమెందుఁజూచినన్
మీఁదటగాలినీరుగన మేలునుఁజేయవు శంకరా! హరీ
హైదరాబాదు భాగ్యవగరాఖ్యనుఁబొందుట సత్యదూరమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహైదర
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిదర్శనీయ స్థలాలతో ధన్యతఁగని
ప్రజకొక విహారనగరమై భాగ్యమందె!
సర్వకలుషాలు నేడు ముసర, మునుపటి
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు!
ఉత్పలమాల
సోదర భావమున్ బ్రజలు చూప పరస్పరమున్ గతమ్మునం
దాదట దర్శనీయముగ నందరు మెచ్చెడు భాగ్యమందెనే!
చీదరఁ గొల్పెడున్ కలుష జీవనమల్మగ నేడు నయ్యయో!
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపాలకులచట నివసించు ప్రజకు వలయు
రిప్లయితొలగించండిసకల వసతులు కల్పించి సాకుచుండి .
విద్య యారోగ్యముల దృష్టి పెట్టు చుండు
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమేదిని భాగ్యలక్ష్మి కడు మేలునుఁ గూర్చగ హైందవాళికిన్
రిప్లయితొలగించండిమోదము నొంది తా వెలయ పుట్టెను భాగ్య పురంబు నామమే
వాదనఁ జేయ భాగమతి పైగల ప్రేమకు నిల్చు చిహ్నమై
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపలువిధమగు జిల్లాలతో పరిఢవిల్లు
వాసిగల రాష్ట్రమిదికాదె వలస లేల?
యవని యందు తెలంగాణ మనిన యొక్క
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.
ఖాదరు సత్యమున్ వదలి కయ్యము లాడకు వాస్తవమ్మిదే
నాదగు భారతావని సనాతన ధర్మమటంచు నచ్చకన్
గాదుటె వీడిపోయితిరి కాంచగ నచ్చట నుండునట్టి యా
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ.
*(పాకిస్తాన్ లో గల హైదరాబాదును భాగ్యనగరనిపిలువరాదు)*
Very nice and different sir!
తొలగించండికట్టెనట కుతుబ్‌షా తన గాదిలియగు
రిప్లయితొలగించండిభాగమతి పేరిడి నవీన భాగ్యనగరి
నగరమునకుఁ దొల్తనిడిన నామ మనగ
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
పేదలు జీవితమ్ములిట వేగిర పాటున వెళ్ళఁబెట్టగా
వేదన కానరాదనుచుఁ బేర్కొను చుందురు భాగ్యవంతులే
బాదలు లేని జీవనము పౌరులలోఁ గనలేని భాగ్యమే
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిభాగ మతి పేర వెలసియు వాసి గాంచి
రిప్లయితొలగించండిపలు రకమ్ము ల సంస్కృతీ నిలయ మగుచు
దక్షిణా దిన విఖ్యాత దర్శనీయ
భాగ్య నగ రమ్ము హైదరాబాదు కాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరుగు పందెముల్ బ్రతుకున బవలు రేయి
రిప్లయితొలగించండిజీవనోపాధికోసమై పోవు జనులు
శాంతి కనరాదు వెదకిన శ్రాంతిలేదు
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:రెండు రాష్ట్రాల ప్రజలకు నిండు ధైర్య
రిప్లయితొలగించండిమిచ్చి యుద్యోగ,వృత్తుల నిచ్చు భాగ్య
నగరమే హైదరబాదు వగపు నిడు న
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”
(ఇది భాగ్య నగరం కానీ అభాగ్యనగరం కాదు.)
ఉ:హైదరబా దటంచు జగ మంతట పేరు గడించ, ముస్లిముల్
రిప్లయితొలగించండిమాదని నేటికిన్ బలుక ,మా చరితమ్ము స్మరింప జేయ మీ
కేదియు తోచనట్లు కలిపింతురె హిందు పదమ్ము పేరునన్?
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”
(అనేది ఒక ముస్లిం ఆవేదన.)
తే॥ పబ్బులందు క్లబ్బులలోను మబ్బు విడక
రిప్లయితొలగించండిమత్తు నందు చిత్తగుచును మనఁగ జనులు
భారతీయ సంస్కృతికిల వారధి గాక
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
ఉ॥ వేదనఁ బొందరే కనఁగ విజ్ఞులు నిచ్చటఁ గోడెకారులే
మోదముఁ గాంచి దుర్వ్యసనముల్ పడయంగను నీతిఁ బాయిచున్
గాదని గొప్ప సంస్కృతిని గర్హణఁ జేయుచు శీలవృత్తినిన్
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ
శీలవృత్తి సదాచారము నిఘంటువు సహాయమండి
ఈమధ్య ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి కదండి.
భాగమతిపేరిటవెలసివాసిగాంచె
రిప్లయితొలగించండిసకలకళలనిలయమని సన్నుతిగనె
*“భాగ్యనగరమ్ము ,హైదరాబాదు కాదు”*
పిదప నీనామమె నిలిచె విశ్వమందు
రిప్లయితొలగించండిఆదరబాదరా బ్రతుకు యాదట కానగరాదు సంతతం బూఁదరఁగొట్టు వ్యాపకము లుక్కిరిబిక్కిరి సేయ జీవనో
పాధికి నిర్విరామముగ పర్గులుదీయు జనాళి సూడగన్
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ
పొంతనమ్ము లేని గిరల వంత నొసఁగు
రిప్లయితొలగించండిదేమి యెక్కడి దీ భాగ్య మెక్కడి దక
టా నగర మెక్క డీ హైద రన్న మాట
భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు
ఏది యెడంద నిష్ట పడు నిమ్ముగ నయ్యది యొప్పు రీతిఁ దా
నా దెస నల్లుఁ గట్టు కథ లంచిత రీతిని నమ్ము నట్లుగా
వాదు లొనర్చు సంతతము వారక పంతము నూని కావునన్
హైదరబాదు భాగ్యనగ రాఖ్యనుఁ బొందుట సత్య దూరమౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నాటి పర్యాటక నెలవు మేటిగాను
పారిశుద్ధ్యమె యలరిన పట్టణమ్ము
నేడు కాలుష్య నిలయమై నిలువ, నాటి
భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు.