19, డిసెంబర్ 2024, గురువారం

సమస్య - 4977

20-12-2024 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”
(లేదా...)
“హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”
(గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలతో...)

27 కామెంట్‌లు:

  1. వానవచ్చినమునుగునువైనమేది
    వరుస నిలచునురహదారి వాహనములు
    సహజ సంపద మృగ్యంబు శమము లేదు
    భాగ్యనగరమ్ము హైదరాబాదుగాదు

    రిప్లయితొలగించండి
  2. ఆదరహాసమేది జనయానమునందున యావయేగదా
    కైదువుతోడిసాముగద కమ్మనిజీవితమెందుఁజూచినన్
    మీఁదటగాలినీరుగన మేలునుఁజేయవు శంకరా! హరీ
    హైదరాబాదు భాగ్యవగరాఖ్యనుఁబొందుట సత్యదూరమౌ

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    దర్శనీయ స్థలాలతో ధన్యతఁగని
    ప్రజకొక విహారనగరమై భాగ్యమందె!
    సర్వకలుషాలు నేడు ముసర, మునుపటి
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు!

    ఉత్పలమాల
    సోదర భావమున్ బ్రజలు చూప పరస్పరమున్ గతమ్మునం
    దాదట దర్శనీయముగ నందరు మెచ్చెడు భాగ్యమందెనే!
    చీదరఁ గొల్పెడున్ కలుష జీవనమల్మగ నేడు నయ్యయో!
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!

    రిప్లయితొలగించండి
  4. పాలకులచట నివసించు ప్రజకు వలయు
    సకల వసతులు కల్పించి సాకుచుండి .
    విద్య యారోగ్యముల దృష్టి పెట్టు చుండు
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు

    రిప్లయితొలగించండి
  5. మేదిని భాగ్యలక్ష్మి కడు మేలునుఁ గూర్చగ హైందవాళికిన్
    మోదము నొంది తా వెలయ పుట్టెను భాగ్య పురంబు నామమే
    వాదనఁ జేయ భాగమతి పైగల ప్రేమకు నిల్చు చిహ్నమై
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ!!

    రిప్లయితొలగించండి

  6. పలువిధమగు జిల్లాలతో పరిఢవిల్లు
    వాసిగల రాష్ట్రమిదికాదె వలస లేల?
    యవని యందు తెలంగాణ మనిన యొక్క
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు.


    ఖాదరు సత్యమున్ వదలి కయ్యము లాడకు వాస్తవమ్మిదే
    నాదగు భారతావని సనాతన ధర్మమటంచు నచ్చకన్
    గాదుటె వీడిపోయితిరి కాంచగ నచ్చట నుండునట్టి యా
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ.

    *(పాకిస్తాన్ లో గల హైదరాబాదును భాగ్యనగరనిపిలువరాదు)*

    రిప్లయితొలగించండి
  7. కట్టెనట కుతుబ్షా తన గాదిలియగు
    భాగమతి పేరిడి నవీన భాగ్యనగరి
    నగరమునకుఁ దొల్తనిడిన నామ మనగ
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు


    పేదలు జీవితమ్ములిట వేగిర పాటున వెళ్ళఁబెట్టగా
    వేదన కానరాదనుచుఁ బేర్కొను చుందురు భాగ్యవంతులే
    బాదలు లేని జీవనము పౌరులలోఁ గనలేని భాగ్యమే
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ

    రిప్లయితొలగించండి
  8. భాగ మతి పేర వెలసియు వాసి గాంచి
    పలు రకమ్ము ల సంస్కృతీ నిలయ మగుచు
    దక్షిణా దిన విఖ్యాత దర్శనీయ
    భాగ్య నగ రమ్ము హైదరాబాదు కాదు

    రిప్లయితొలగించండి
  9. పరుగు పందెముల్ బ్రతుకున బవలు రేయి
    జీవనోపాధికోసమై పోవు జనులు
    శాంతి కనరాదు వెదకిన శ్రాంతిలేదు
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:రెండు రాష్ట్రాల ప్రజలకు నిండు ధైర్య
    మిచ్చి యుద్యోగ,వృత్తుల నిచ్చు భాగ్య
    నగరమే హైదరబాదు వగపు నిడు న
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు”
    (ఇది భాగ్య నగరం కానీ అభాగ్యనగరం కాదు.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:హైదరబా దటంచు జగ మంతట పేరు గడించ, ముస్లిముల్
    మాదని నేటికిన్ బలుక ,మా చరితమ్ము స్మరింప జేయ మీ
    కేదియు తోచనట్లు కలిపింతురె హిందు పదమ్ము పేరునన్?
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ”
    (అనేది ఒక ముస్లిం ఆవేదన.)

    రిప్లయితొలగించండి
  12. తే॥ పబ్బులందు క్లబ్బులలోను మబ్బు విడక
    మత్తు నందు చిత్తగుచును మనఁగ జనులు
    భారతీయ సంస్కృతికిల వారధి గాక
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు

    ఉ॥ వేదనఁ బొందరే కనఁగ విజ్ఞులు నిచ్చటఁ గోడెకారులే
    మోదముఁ గాంచి దుర్వ్యసనముల్ పడయంగను నీతిఁ బాయిచున్
    గాదని గొప్ప సంస్కృతిని గర్హణఁ జేయుచు శీలవృత్తినిన్
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ

    శీలవృత్తి సదాచారము నిఘంటువు సహాయమండి
    ఈమధ్య ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి కదండి.

    రిప్లయితొలగించండి
  13. భాగమతిపేరిటవెలసివాసిగాంచె
    సకలకళలనిలయమని సన్నుతిగనె
    *“భాగ్యనగరమ్ము ,హైదరాబాదు కాదు”*
    పిదప నీనామమె నిలిచె విశ్వమందు

    రిప్లయితొలగించండి

  14. ఆదరబాదరా బ్రతుకు యాదట కానగరాదు సంతతం బూఁదరఁగొట్టు వ్యాపకము లుక్కిరిబిక్కిరి సేయ జీవనో
    పాధికి నిర్విరామముగ పర్గులుదీయు జనాళి సూడగన్
    హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ

    రిప్లయితొలగించండి
  15. పొంతనమ్ము లేని గిరల వంత నొసఁగు
    దేమి యెక్కడి దీ భాగ్య మెక్కడి దక
    టా నగర మెక్క డీ హైద రన్న మాట
    భాగ్యనగరమ్ము హైదరాబాదు కాదు


    ఏది యెడంద నిష్ట పడు నిమ్ముగ నయ్యది యొప్పు రీతిఁ దా
    నా దెస నల్లుఁ గట్టు కథ లంచిత రీతిని నమ్ము నట్లుగా
    వాదు లొనర్చు సంతతము వారక పంతము నూని కావునన్
    హైదరబాదు భాగ్యనగ రాఖ్యనుఁ బొందుట సత్య దూరమౌ

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నాటి పర్యాటక నెలవు మేటిగాను
    పారిశుద్ధ్యమె యలరిన పట్టణమ్ము
    నేడు కాలుష్య నిలయమై నిలువ, నాటి
    భాగ్య నగరమ్ము హైదరాబాదు కాదు.

    రిప్లయితొలగించండి