14, జనవరి 2025, మంగళవారం

సమస్య - 5003

15-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్”
(లేదా...)
“అడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్”

28 కామెంట్‌లు:


  1. కందం
    కుడుచుచు వారపు బత్యము
    నడలింపగఁ నూరివారి నాక్రోశమునన్
    గడసారి జని తునుమగా
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్

    (అడరు= పూను)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      కుడుచుచు రెండు దున్నలను గోరుచు మానవు, బండెడన్నమున్
      దుడుకుగ నేకచక్రపురి దుఃఖమునందగ జేయఁ గూల్చగన్
      గడపట నేగి నెమ్ముకల గాంచుచు రాశులు లిప్తకాలమే
      యడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్!

      (అడలి వడంకు= శోకముచే వణకు)

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. సడలనిదీక్ష నూరికిని శత్రువుఁ బట్టివధించు ధ్యేయమున్
    వడిగొని బండికట్టుకొని వైరినివాసము జేరినంత, ధూ
    ర్తుడు జనకోటినిన్ వెతలఁ ద్రోయుట జ్ఞప్తికి వచ్చి, యార్ద్రమై
    యడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్

    రిప్లయితొలగించండి

  3. అడిగిన కాదనననుచును
    కడు ప్రేమను భర్త నాటకమునకు సతితో
    వెడలిననేమి యధీరుం
    డడరెను భీముని యెడఁద, బకాసురుఁ జూడన్.


    కొడుకును వెంటతీసుకొని కోరెనటంచును నాటకమ్ముకై
    వెడలిన నేమిరా పరమ బీలుకుడైన సుపుత్రు డచ్చటన్
    బెడిదపు సన్నివేశమది భీరుక దృశ్యము గాంచినంతనే
    యడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్.

    బెడిదము=భయకరము బీరుక= వనము అడవి.

    రిప్లయితొలగించండి
  4. కడుదయనీయము దినముకొ‌
    కడుతనకాహారమగుట‌ కాంచినమగధీ
    రుడురక్షకుడౌచువెడలి
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్

    రిప్లయితొలగించండి
  5. అడిగిరని జెప్పెనిట్టుల
    అడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్
    మడియడయి యుండ వచ్చును
    కడు బలవంతుడగు భీమ కలవరపడునా

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బకాసురుండకున్' ?

      తొలగించండి
    2. సవరణతో....

      అడవిని బకాసురునితో
      నొడంబడిరచటి పురజనులోగిరమిడుచున్
      జిడిముడిపడి కుంతి యనుప
      నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్

      [అడరు = త్వరపడు]

      అడవిని శృంగిగహ్వరమునందు వసించు బకాసురున్ గనన్
      వడకిన నేకచక్రపురవాసులు చేసిరి సంధి వానితో
      కొడుకుని బంపగా దలచెఁ గుంతి పలాసిని రూపుమాపగా
      నడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్

      తొలగించండి
  7. కడు వడి గా జని వానిని
    కడ తేర్చ గ నెంచి నట్టి ఘనునికి మదిలో
    దృ ఢ సంకల్పు ని కెందుల
    కడ రెను భీముని యెడ ద బ కాసురు జూడ న్?

    రిప్లయితొలగించండి
  8. వడివడి భీముఁడు వెడలెను
    సడలని బింకమ్ము తోడ చంపగనసురున్
    కడుధీరత్వము పెనగొన
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్

    రిప్లయితొలగించండి
  9. వడివడి భీముడేగె మదిఁ పంతముబూని వధింప రక్కసున్
    వెడఁద యురంబుతోడనతి భీకరరూపుని, లిప్త కాలమే
    యడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్
    సడలని ధీమసమ్ముగొని చయ్యన గూల్చెను రాక్షసాధమున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! 🙏ప్రస్తుతం పూరీజగన్నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాం. నాలుగైదు రోజులుగా పూరణలలో పాల్గొనలేకపోయాను.

      తొలగించండి
  10. కం:పడియున్న కళేబరముల
    ,నెడ నెడ పడియున్న యట్టి యెముకల గుట్టల్
    తడిపించె భీము కన్నుల
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్”
    (భీముని ఎద యుద్ధానికి భయం తో అడర లేదు.ఆ ఎముకల గుట్టని, కళేబరాలని చూస్తే భీముడికే బాధగా అనిపించింది.)

    రిప్లయితొలగించండి
  11. చం:తడబడ డింతయైన పలు దైత్యుల జూచిన భీము,డంత లో
    నెడయెడ నున్న యస్థికల,హేయము దెచ్చెడు మాంసఖండముల్
    డద గలిగించె జూడగనె,తల్చగ తత్పుర దైన్యదృశ్యమే
    అడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్”

    రిప్లయితొలగించండి
  12. కం: కొడుకునకు భీముడని పే
    రిడి రమ్మయు నాన్న ,కాని ఎంత పిరికి ? యా
    కొడుకుకు సినిమా జూపగ
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్”

    రిప్లయితొలగించండి
  13. కం॥ తడబడి యసురుని రూపుకు
    నడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్
    నడయాడు గిరినిఁ గూల్చఁగ
    నడరెడు కృష్ణుని యనుగ్రహము నర్థించెన్

    చం॥ జడవకఁ దాను రాక్షసునిఁ జంపెదనంచును ముందుకేగినన్
    దడబడె పర్వతమ్ము వలెఁ దాల్చిన భీకర రూపు ప్రేలఁగా
    నడలి వడంకె భీముని హృదంతరసీమ బకాసురున్ గనన్
    మడియనిఁ జంపఁ గృష్ణుఁ గృప మానసమందునఁ దల్చి చొక్కిలెన్

    లిప్త కాలము పాటు భయపడినా కృష్ణుని ప్రార్థించి ముందుకు సాగినాడని యండి

    రిప్లయితొలగించండి
  14. కడుపార నారగింపఁగ
    బెడిదమ్ముగ బలము నంద వీత భయమునం
    దడఁబాటు లేక శౌర్యం
    బడరెను భీముని యెడఁద బకాసురుఁ జూడన్


    కుడువఁగ నీ వలెన్ బకుని కోసము బండెడు బోన మింకయుం
    దడయక దున్నలన్ నరు సతమ్మును ధర్మజు సోదరుండు వీ
    రుఁడు వడిఁ జేర రక్కసుని రోష రయమ్మునఁ, జూడ నైరృతుం
    డడలి, వడంకె భీముని హృదంతరసీమ బకాసురుం గనన్

    రిప్లయితొలగించండి