13, జనవరి 2025, సోమవారం

సమస్య - 5002

14-1-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాంద్రమానమున మకర సంక్రమణము”
(లేదా...)
“కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్”

13 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. తేటగీతి
      సూర్య చంద్ర గమనముల చూచివంత
      కాలమానమా పేర్లను కలిగియుండె
      మనకు పర్వమగుచు పుష్యమాసయుక్త
      చాంద్రమానమున మకర సంక్రమణము

      తొలగించండి
    2. మత్తేభవిక్రీడితము
      మనకామోదము చాంద్రమానము గనన్ మాసమ్ములారీతి వ
      చ్చును సాగున్ గద చైత్రమందు మొదలౌచున్ ఫాల్గుణమ్మందునన్
      వనముల్ గోల్పడ నాకులున్ ముగియుచున్ బంటల్ గొనన్ బుష్యమై
      కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్

      తొలగించండి
  2. తనరన్ కాలము సౌరమానము గనన్ తారీకులన్ దప్పునే
    ఘనమౌ మానము చంద్ర మానమధికంగంజేర్చి మాసంబులన్
    వెనువెంటన్ సరియౌను దానట
    తిథుల్ వేర్వేరు కాగా జనుల్
    కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్!!

    రిప్లయితొలగించండి

  3. సూర్యమానమున గణించి చూచి నంత
    సాలునకొకమారు మకర సంక్రమణము
    ప్రతినెల కొకమారు జరుగు వాసి గాను
    చాంద్రమానమున మకర సంక్రమణము.


    ధనురాశిన్ విడి పౌష్యమాసమున దీప్తాంశుండు తర్వాతి రా
    శినిజేరంగదలంచుచున్ మకరరాశిన్ జేరు నవ్వేళలో
    ఘనమౌ పర్వము నుత్తరాయణమదే కల్పంబు బ్రారంభమౌ
    కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్.

    రిప్లయితొలగించండి
  4. సూర్య చంద్రుల గమనము నార్యు లరసి
    కాల మానము లంచు ను గల్ప నముగ
    దెలుప జరుగు చుండు ను గదా దేశ మందు
    చాంద్ర మానము న మకర సంక్రమణము

    రిప్లయితొలగించండి
  5. కాలగణనకు మూలము గౌరుని గతి
    చాంద్రమానమున ; మకర సంక్రమణము
    సూరి మకర రాశిని చొచ్చు సూచనయేను
    వరుణ, శశుల మానములందు వాసిమెండు

    రిప్లయితొలగించండి
  6. మును పాటించిరి కాలమానములు సోముండున్ దినేంద్రుండు భ్రా
    మణముల్సేయుట లక్ష్యమౌచు, నయినన్ మాన్యంబులున్ బండఁ బ్రీ
    తిని క్షేత్రంకరులాచరించుటను వే దేశంబులన్ జేరుటన్
    గనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్

    రిప్లయితొలగించండి
  7. పూర్వకాలాన భారత భూమి పైన
    చాంద్రమానము వెలుగొందె సాధనముగ
    భారతావనిని గణింత్రు ప్రాజ్ఞులెపుడు
    చాంద్రమానమున మకర సంక్రమణము

    తనరారున్ గద సౌరమానమిటఁ బ్రాధాన్యంబు సంప్రాప్తమై
    మన పూర్వీకులు లెక్కబెట్టుటకు ప్రామాణ్యంబు శీతాంసుడే
    మన సమ్మానము చాంద్రమానమయినన్ మాసాలు లెక్కింపగా
    కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్

    రిప్లయితొలగించండి
  8. పూజచేయుచు పలుకునే పూర్వులంత
    చాంద్రమానమున మకర సంక్రమణము
    మకరరాశిన జేరు ప్రభాకరుండు
    సంచరించెడి భువినది సంభవించె

    రిప్లయితొలగించండి
  9. తే॥ భూమి సూర్యుని కక్షలోఁ బూని తిరుగ
    వర్షమొకటి నడచుఁ గద భ్రమణమునకు
    దక్షిణము దాటి యుత్తర కక్షఁ జనఁగఁ
    జాంద్ర మానమున మకర సంక్రమణము


    మ॥ వినుమా భూభ్రమణమ్ముఁ జూడ నినుఁడే పృథ్విన్ గనన్ దేటియై
    ఘనతన్ గాంచుచుఁ జుట్టు నట్లు తలపంగా వచ్చు నీరీతిగన్
    మనకున్ దగ్గర దూరమౌను కపి యేమానంబు నైనన్ గదా
    కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్

    కపి సూర్యుడు నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  10. చంద్ర సూర్యుల గమనమ్ముసాగు చుండు
    కాల గమన మనుసరించి గగనమందు
    వచ్చుపుష్యమాసమునందువాసిగాను
    *“చాంద్రమానమున మకర సంక్రమణము*

    ఘనమౌ పర్వము నియ్యదే గనుమికన్ కన్విం దుచేయించగా
    జనులాత్రమ్ముగచూచుచుండగనిలన్సంతోషమున్పంచగన్
    నినుడీరాశిని వీడుచున్ మకరిలోనెక్కంగ సాగన్ వడిన్
    కనగావచ్చునుచాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్

    రిప్లయితొలగించండి
  11. సౌరమానమున మకర సంక్రమణపు
    దినము వీక్షింపఁ బ్రతి యేఁడు స్థిర మయి చన
    మారు చుండు నేఁటేఁటను మానవేంద్ర!
    చాంద్రమానమున మకర సంక్రమణము


    జన సంఘాతము సంతసింప వఱలన్ సౌభాగ్య సందోహముల్
    తనరం బుణ్యపు టుత్తరాయణము వింతన్ ధాత్రి సూర్యుండు సొ
    చ్చిన నానందము తోడ నా మకర రాశిం బుష్య మాసమ్ములోఁ
    గనఁగా వచ్చును జాంద్రమానమున సంక్రాంతిన్ ముదం బందుచున్

    రిప్లయితొలగించండి