13, మే 2025, మంగళవారం

సమస్య - 5122

14-5-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఒక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె”

(లేదా...)

“ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే”

22 కామెంట్‌లు:

  1. జీవులందరి హృదిలోన దేవుడుండు
    నదియె వేరొండు కాదు నీ యంతరాత్మ
    ఆత్మతో గూఁడి యుండఁగ నంతరాత్మ
    ఒక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    వత్సరమ్ముల పాటుగ వండివార్చి
    కథను మలచి ధారావాహిక యనఁ దీర్చ
    నక్కథానాయకుండహో! యవసరమున
    కొక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె!

    ఉత్పలమాల
    చక్కగ వత్సరాలు గన సాగెడు రీతిగ దర్శకుండహో!
    మక్కువ దూరదర్శనున మాయలవాహిక నల్ల ధారగన్
    బెక్కుగ మల్పులన్ మలచి వేడ్కగ నా కథలోన నాయకుం
    ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తేటగీతి
      బాలకృష్ణుడు మధురలో పాదమూని
      కంసుఁ గూల్చెడు వేళలో కల్పనలల్ల
      మాయఁ బ్రాణ భయమ్మున మామకల్లుఁ
      డొక్కఁ డిద్దఱై రిద్దఱునొక్కఁడయ్యె!

      నిక్కెడు కంసమామ పయి నీల కళేభరుఁడాగ్రహించి తా
      నుక్కడగించగన్ మధురనూనుచు పాదము సిక్కఁ బట్టగన్
      బిక్కున రేగు మామకట భీతిని ప్రాణ భయాన నల్లుడుం
      డొక్కఁడు నిద్దఱైరిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే!

      తొలగించండి

  3. తే॥ మంచిచెడ్డలను గణించ మనము నిడుచు
    నాత్మ బుద్ధికి సూక్ష్మత నవధరించి
    యధిగమించ సమస్యల ననవరతము
    నొక్కఁ డిద్దరై రిద్దరు నొక్కఁడయ్యె

    ఉ॥ దిక్కులు చూడడొక్కఁడటు దీనత నొందడు ధైర్యశాలియై
    నిక్కము మంచిచెడ్డలను నిత్యము నెంచెడు వేళ తానుగా
    నొక్కఁడు నిద్దఱై రివురు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే
    పెక్కు సమస్యలీపగిది వీడుటఁ గాంచెను యోచనాధృతిన్

    సొంతబుద్ధి వివేకముతో కూడుకున్నది గురువుల బుద్ధి ప్రయోజనకారి పరులబుద్ధి వినాశ కారి అని ఒక శ్లోకమండి. ఆవిధంగా సమస్యలలో ఒకడే ఇద్దరు లాగా మంచీ చెడు బేరీజు వేసుకుంటాడు తరువాత ఒకడై పనిచూసుకుంటాడు అని.

    రిప్లయితొలగించండి
  4. దిక్కెవరన్న జీవులకు దేవుఁడు యెల్లరి యాత్మలందునన్
    జక్కఁగ గూడియుండతఁడు జాగృతిలో నిదురించ కెన్నఁడున్
    నిక్కమునెంచి చూచినను నీరముఁ గూడిన క్షీరమట్లుతా
    నొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే

    రిప్లయితొలగించండి
  5. వేత నము దెచ్చు యువతిని వివహమాడి
    యొక్కఁ డిద్దఱై రి ; ద్దఱు నొక్కఁడయ్య
    వేరు వేరగు తావుల వృత్తి దొరక ;
    విధిని తప్పించ నెవరికి వీలు కాదు

    రిప్లయితొలగించండి
  6. కౌశలముతోడనలరారు గారడీడు
    వీధి చివరన నెలకొన్న వేదిపైన
    చక్కనైన ప్రదర్శన సల్పె చూడ
    నొక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె

    మిక్కుటమౌ ప్రదర్శనలఁ మిన్నగఁ జేసిన చిన్నవానిగా
    చక్కగ గారడీడొకడు సంభ్రమమొప్పెడు రీతినొంటిగా
    గ్రక్కున సల్పినట్టి కనికట్టును చూచిన వారు తెల్పిరే
    ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే

    రిప్లయితొలగించండి
  7. ఆగ్రహమ్మున భార్గవు డచట కేగి
    రమ్యచరితుడైనట్టి యా రాముని గని
    శాంతమున్ వహింప నపుడు వింతయేమి
    ఒక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె.


    ముక్కలు సేసిరెవ్వరిట ముక్కనుసామి ధనుస్సు నంచు తా
    నెక్కడి నుండియో యటకు నీరస మందున చేరనేమి యా
    చక్కని రామచంద్రు గని శాంతివహించెను భార్గవుండు తా
    నొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే.

    రిప్లయితొలగించండి
  8. మరొక వైవిధ్యమైన పూరణ అండి

    ఉ॥ చక్కఁగఁ జిత్రరాజమటు సాగఁగఁ దారక రాముఁడావిధిన్
    నిక్కును మారు వేషమున నిత్యము నవ్వఁగఁ బ్రేక్షకాళియున్
    సొక్కుచు ముగ్ధులై ఘనుఁడు శోభిలఁడే నటసార్వభౌముఁడై
    యొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే!

    నిక్కు వర్ధిల్లు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:డెబ్బ దొకటవ యేటను దెబ్బతినిన
    శత్రుదేశము రెండయ్యె, శైలి మారి
    నేడు మైత్రి కల్గె మరల , నాడు ,నేడు
    నొక్కఁ డిద్దఱై , రిద్దఱు నొక్కఁడయ్యె
    (1971 లో పాకిస్తాన్ రెండు ముక్క లైంది. ఇప్పుడు మళ్లీ ఆ రెండు ఒక టైంది
    . నాదు,నేడు-ఒక్క డిద్దరు కావటం,ఇద్ద రొక్కరు కావటం ఒక క్రమాలంకారము.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఒక్కడె యైన శంకరు డహో!తన దేహపు టర్థభాగమే
    మక్కువ నిచ్చె బార్వతికి,మంచి తనమ్మున లెక్క లుండునే ?
    ఒక్కొక మారు భిన్నముగ నుండును భక్తుల గాచు గాధలం,
    దొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే”
    (శివుడు అంబకు అర్థశరీరాన్ని ఇచ్చాడు కానీ కొన్ని కథలలో వేరు వేరుగా కూడా కనిపిస్తారు.)

    రిప్లయితొలగించండి
  12. చూపు మంద గించిన వాడు చోద్య ముగను
    గాంచె నొక చోట జనులను గన్ను లార
    నొక్క రిద్ద రై రిద్ద రు నొక్క డయ్యె
    ననుచు వైద్యునికి దెలిపె నబ్బు రముగ

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    దొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే”

    ఉ.మా :

    చిక్కును శంభుడంచు దన చిత్తమునందున ప్రేమతోడుతన్
    మిక్కిలి శ్రద్ధతోడ మది మీరిన ప్రేమ తపంబుసేయగా
    లెక్కకు తక్కువా యనుచు లేమను దెచ్చియు నెత్తి వెట్టగా
    ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే
    ఒక్కతె నెత్తినెక్కగ మరొక్కతె దేహమునందు నిల్చెలే

    రిప్లయితొలగించండి

  14. ధర్మ యుక్తమ్ము లైనట్టి కర్మములను
    నిత్య మాచరించుచు నుండ నెమ్మితోడ
    నదను గాంచి మిత్రామిత్రు లరయు చుండ
    నొక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె


    ఒక్క విధమ్ము మర్త్యు లెవ రుండరు మారుచు నుండు బుద్ధులే
    యెక్కడ కేఁగి చూచిన మహీ తల మందు నిరంతరమ్మునుం
    జక్కన యన్న వాఁడు మఱి సమ్మతి నీయని వార లింతలో
    నొక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే

    రిప్లయితొలగించండి
  15. సమస్య:
    ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే

    ఉ.మా

    చిక్కడు దొర్కడేలనయ శ్రీహరి మాయల వెన్నదొంగయై
    మక్కువ జూపు భార్యలను మాయను చేసి వనంబుకేగునే
    ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే
    చిక్కిన గోపకాంతలను చేరెను జంటగ వేల రూపులన్

    రిప్లయితొలగించండి

  16. మామ కంసుని మధురలో మట్టుబెట్ట
    నేగి తామల్ల యోధుల నిలువరింప
    గాంచి నంతనె కృష్ణుని కంసునికట
    నొక్క డిద్దరై యిద్దరు నొక్కడయ్యె


    చక్కగ వేణువూదుచును చానల మానస మందు నిల్వగన్
    మక్కువ తోడ చేరుచును మాధవు చెంతకు క్రీడ లాడగన్
    చిక్కెను గోపబా లుడని శీఘ్రమె పల్కిరి వారలి వ్విధిన్
    *“ఒక్కఁడు నిద్దఱై రిరువు రొక్కఁడె యయ్యెను వాస్తవమ్మిదే”*

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ప్రేమ నిచ్చి పుచ్చుకొనగ పెండ్లి జరిగె
    కాపురము చేయ నిర్వురు, కాలము గడు
    వగ జననమందె నొక బిడ్డ వారికపుడు
    ఒక్కఁ డిద్దఱై రిద్దఱు నొక్కఁడయ్యె.

    రిప్లయితొలగించండి