*(తేటగీతి)* సహన శీలుండు మృదుభాషి సచ్చరితుని గాను పేరు గడించిన కర్మ శీలి యించు కైన పనియె లేక నెప్పు డేని కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును.
*(ధ్రువకోకిల /తరళ..)*
బడుగు జీవుల యాకలిన్ గని వారి కెప్పుడు సాయమున్ విడువ కుండగ జేయువాడని పేరు గాంచిన వాడిలన్ గుడులు జేరిన పుణ్యమంచును గోరి యాత్రల పేరుతో కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా.
తే.గీ:కడప లోన నుద్యోగము కష్ట మంచు భయ పడెద వెట్టి పోలీసు వాడ వయ్య? ఎన్ని ప్రతికూలతల్ గల్గ నెదురు తిరిగి కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును” (కదప ఒక కల్లోలప్రాంత మని భయపడే పోలీసు తో అతని పై అధికారి అన్నట్లు )
ధ్రువకోకిల "గదప దాటిన యాడుదే చెడు,కాళ్లు కట్టుక గూర్చొనన్ జెడును పో మగవా" డటంచు వచించగా మన పెద్దలే చెడెను కాలము గాదె భార్యలె చెందగా ననుమానముల్ గడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా” ("ఆడది తిరిగి చెడింది. మొగవాదు తిరక్క చెడ్డాడు"అనేది ఒక సామెత. కాలం మారిపోయింది భర్తలని అనుమానించి హద్దుల్లో పెట్టే భార్యలు తయారై ఇంట్లో నుంచి కదలని మగవాడు గొప్ప అయ్యాడు. కదప అంటే గడప. )
(3)ధ్రువకోకిల పడితి గష్టము లెన్నియో పలు ప్రాంతముల్ గని, వీనికిన్ దడయె వచ్చు సమస్యలన్ గన దాల్చుచుండె బదోన్నతుల్ కడప దాటని పూరుషుండగుఁ గాదె! తా ఘటికుండుగా బడక సిగ్గు వచించు గొప్పలు ప్రక్క వారలు నవ్వగా
(నేను అనేక ప్రాంతాల లో కష్ట పడి పని చేసాను.వీడు కడప దాటి ఎక్కడా పని చెయ్య లేదు.వీడికి పని చూస్తే దడ. ప్రమోషన్లు మాత్రం వస్తాయి.పైగా వీడు సిగ్గు లేకండా గొప్పలు చెప్పుకుంటాడు అని ఒక అధికారిని గూర్చి మరొక ఉద్యోగి ఎక్కిరింత.)
తేటగీతి
రిప్లయితొలగించండిరామచంద్రుని పోలిక రమణినంది
ధర్మసంరక్షణార్థము తపన పడుచు
నవని నేలుచు ధూర్తులనణచఁ దప్ప
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును!
ధ్రువకోకిల/తరళము
పడతి సీతను బోలు పత్నిని భాగ్యమంచన నొందియున్
నడతయందున ధర్మరక్షణ నర్మిలిన్ దగనెంచుచున్
బుడమి నేలుచు ముష్కరాళికి మూడినప్పుడు తప్ప, తా
కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా
గురుదేవులకు ధన్యవాదములతో..మూడవపాదముచివర తాన్
తొలగించండిగడప దాటని... అని సవరణ.
*(తేటగీతి)*
రిప్లయితొలగించండిసహన శీలుండు మృదుభాషి సచ్చరితుని
గాను పేరు గడించిన కర్మ శీలి
యించు కైన పనియె లేక నెప్పు డేని
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును.
*(ధ్రువకోకిల /తరళ..)*
బడుగు జీవుల యాకలిన్ గని వారి కెప్పుడు సాయమున్
విడువ కుండగ జేయువాడని పేరు గాంచిన వాడిలన్
గుడులు జేరిన పుణ్యమంచును గోరి యాత్రల పేరుతో
కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా.
ఇల్లు విడిచి బయటకేగ నెంతయైన
రిప్లయితొలగించండిఊరి విషయములె తెలియు , నునికి విడక
గూగులు నరసి జ్ఞానము గూడ బెట్టు
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
కడప దాటుట తెల్పునా కార్య దీక్ష
రిప్లయితొలగించండిచెడని నిర్ణయంబున నొందు శిక్షణమ్ము
విడువ కుండు ప్రయత్నమే విజయమొసగు
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
కడపదాటుట యెవ్విధంబున కార్యదక్షత చాటురా
చెడని నిర్ణయమైన చాలును శిక్షణే కద ముఖ్యమౌ
విడువకుండగ సల్పుయత్నము వేగమున్ ఫలియించురా
కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా
విడక నెన్నఁడు నాలినిన్ తన బిడ్డలన్గడు నర్మిలిన్
రిప్లయితొలగించండిచిడిముడిన్బడనీక వారల క్షేమమే ప్రముఖమ్ముగా
కడుపు నింపుచు కష్టబెట్టక కామితమ్ముల దీర్చకన్
కడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆలుబిడ్డల జూచుచు నాదరముగ
రిప్లయితొలగించండివారి క్షేమము నరయుచు బాధ్యతఁగొని
యింట గెలిచిన గాని తానెన్నడేని
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమరువకనెపుడు పెళ్లి ప్రమాణములను
రిప్లయితొలగించండిఅచల ఏకపత్నీ వ్రతమాచరించి
పరసతులఁ సోదరిగనెంచి పరగుచుండు
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
తే.గీ:కడప లోన నుద్యోగము కష్ట మంచు
రిప్లయితొలగించండిభయ పడెద వెట్టి పోలీసు వాడ వయ్య?
ఎన్ని ప్రతికూలతల్ గల్గ నెదురు తిరిగి
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును”
(కదప ఒక కల్లోలప్రాంత మని భయపడే పోలీసు తో అతని పై అధికారి అన్నట్లు
)
ధ్రువకోకిల
రిప్లయితొలగించండి"గదప దాటిన యాడుదే చెడు,కాళ్లు కట్టుక గూర్చొనన్
జెడును పో మగవా" డటంచు వచించగా మన పెద్దలే
చెడెను కాలము గాదె భార్యలె చెందగా ననుమానముల్
గడప దాటని పూరుషుండగుఁ గాదె తా ఘటికుండుగా”
("ఆడది తిరిగి చెడింది. మొగవాదు తిరక్క చెడ్డాడు"అనేది ఒక సామెత. కాలం మారిపోయింది భర్తలని అనుమానించి హద్దుల్లో పెట్టే భార్యలు తయారై ఇంట్లో నుంచి కదలని మగవాడు గొప్ప అయ్యాడు. కదప అంటే గడప. )
(3)ధ్రువకోకిల
రిప్లయితొలగించండిపడితి గష్టము లెన్నియో పలు ప్రాంతముల్ గని, వీనికిన్
దడయె వచ్చు సమస్యలన్ గన దాల్చుచుండె బదోన్నతుల్
కడప దాటని పూరుషుండగుఁ గాదె! తా ఘటికుండుగా
బడక సిగ్గు వచించు గొప్పలు ప్రక్క వారలు నవ్వగా
(నేను అనేక ప్రాంతాల లో కష్ట పడి పని చేసాను.వీడు కడప దాటి ఎక్కడా పని చెయ్య లేదు.వీడికి పని చూస్తే దడ. ప్రమోషన్లు మాత్రం వస్తాయి.పైగా వీడు సిగ్గు లేకండా గొప్పలు చెప్పుకుంటాడు అని ఒక అధికారిని గూర్చి మరొక ఉద్యోగి ఎక్కిరింత.)
రాకేష్ ఝున్ ఝున్ వాలా కథ అండి
రిప్లయితొలగించండితే॥ ఇల్లు వీడక విపణిలో నెంచి ధనము
విజ్ఞుల సలహా లెన్నుచు తజ్ఞుఁ డగుచుఁ
బెట్టగఁ బడిసె లాభము విరివి గాను
గడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
తరళము
అడుగు వేయక నింట నుండి మహా మహుండటు లుంచఁగా
నడుగ విజ్ఞులు తెల్ప వర్తకమందు సంపద యెంతయో
విడక, వృద్ధినిఁ గాంచి హెచ్చుగఁ బ్రీతిఁ బొందెనె చూడఁగన్
గడప దాటని పూరుషుండగు గాదె తా ఘటికుండుగా
ఇక్కడ విపణి వర్తకము రెండు స్టాక్ మార్కెట్ అండి. సరియైన తెలుగు పదము లభించలేదు.
విపణి, వర్తకము లని కూడ వాడ వచ్చును. సంస్థల నెంచి; సంస్థల యందు - అని కూడ ననవచ్చునండి.
తొలగించండిబడసె ( పడయు - క్రియ)
స త్ప్ర వర్తన గల్గిన సజ్జ నుండు
రిప్లయితొలగించండిమంచి పనులను జేయుచు మాన్యు డ గుచు
పరుల హింసింప బూనగా మరులు తోడ
గడప దాటని పురు షుo డె ఘటి కు డ గును
వ్యర్థ కార్యము లవని ననర్థ దాయ
రిప్లయితొలగించండికములు సుమ్ము పనికి వచ్చు కర్జ మొకటి
లేక తనదు పురమ్మును, రిత్తగాను
గడప, దాటని పురుషుండె ఘటికుఁ డగును
[కడప = కడచు నట్లు చేయుటకు]
కడప పట్టణ ముర్విలో నర కాంత సంచయ యుక్తమై
పుడమి వర్ధిలు చుండ నిత్యము పూర్ణ వీరవరేణ్యమై
యడరు చుండఁగ భాగ్యరాశు లనంత రీతి నవార్యమై
కడప దాటని పూరుషుం డగుఁ గాదె తా ఘటికుండుగా
తేటగీతి॥
రిప్లయితొలగించండిఆలిని సగపాలనిమదినరయుచుండి-
వలవు గౌరవమ్ముఁదనకు కలుగ జేసి-
పలుచ తగవుల గొనకుండ,స్వాతిశయపు
కడప దాటని పురుషుండె ఘటికుఁ డగును
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇంటి యందవసరమైన నేది యైన
ఫోను చేసి తెప్పించగ పూనుకొనెను
సెల్లుతోనె యన్ని పనులు చేయుచుండి
కడప దాటని పురుషుండె ఘటికుడగును.