(1)కం:పృథ్వికి పెట్టుబడి పథమె విధ్వంసక మంచు తర్క వివరణ తో మా ర్క్సే ధ్వజ మెత్తి యసమతన్ విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్” (సమస్యలకు మూలం పెట్టుబడిదారీ విధాన మని సిద్ధాంతీకరించి తిరుగుబాటు తెచ్చి అసమానతని రూపుమాపే విధం తెలుపగా విశ్వం కార్ల్ మార్క్స్ ని మెచ్చుకొన్నది. )
అధ్వాన్నంబొనరించ జన్నముల క్రవ్యాత్తుల్ వనంబందునన్
రిప్లయితొలగించండిపృధ్విన్ వీరులలోన నగ్రగుఁడుగా వెల్గొందు శ్రీరాముఁడే
యాధ్వర్యం బొనరించె రక్కసుల సంహారంబు గావింపఁగా
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఆ ధ్వాంతమ్మున నచ్చట
విధ్వంసము చేయ బూని విచ్చేసిన యా
విధ్వంస కరుల గుంపును
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్.
మధ్వా చార్యులు తెల్పె శిష్యులకు తా మౌనమ్ము నే వీడుచున్
విధ్వంసమ్మును జేయ లేడనుచు నా పృథ్వీ శుడా రామునిన్
సాధ్విన్ బంధిని సేయ దాశరథియే సంగ్రా మ మందా తనిన్
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్.
ఆ ధ్వజి , దనదగు నిశ రం
రిప్లయితొలగించండిగు ధ్వజమును జేతబట్టి , కూటమి యందున్
విధ్వంసమొప్పు పక్షపు
విధ్వంసముఁ జేయఁ , బొగడె విశ్వం బతనిన్
అధ్వగుఁడైవెలుగు నెపుడు
రిప్లయితొలగించండిసాధ్వసమే రాక్షసులకు సత్యుని గనినన్
విధ్వంసక కర్వరులన్
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
అధ్వాన్నంబగు రాక్షసాళి ననిలో నాకించె శ్రీరాముడే
విధ్వంసమ్మును జేయనెంచినపుడే విద్రోహులన్ ద్రుంచెలే
మాధ్వీకమ్మును గ్రోలి తాపసులఁ సంహారించు రక్షస్సులన్
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్
విధ్వంసకారు లసురులు
రిప్లయితొలగించండియధ్వరములు సేయు మునుల నారడి వెట్టన్
పృథ్వీశుఁడు రాముఁ డసుర
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
ఆధ్వరముకు నడ్డు దగిలి
రిప్లయితొలగించండివిధ్వ o సము జేయు న సురు పీమ మ డo చెన్
పృథ్వీ పతి య గు రాముడు
విధ్వంస ము జేయ పొగ డె విశ్వ o బ తనిన్
(1)కం:పృథ్వికి పెట్టుబడి పథమె
రిప్లయితొలగించండివిధ్వంసక మంచు తర్క వివరణ తో మా
ర్క్సే ధ్వజ మెత్తి యసమతన్
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్”
(సమస్యలకు మూలం పెట్టుబడిదారీ విధాన మని సిద్ధాంతీకరించి తిరుగుబాటు తెచ్చి అసమానతని రూపుమాపే విధం తెలుపగా విశ్వం కార్ల్ మార్క్స్ ని మెచ్చుకొన్నది. )
(2)శా: "సాధ్వుల్ ,మౌనులు తార లౌదు" రను విశ్వాసమ్ము జేబూను నా
యధ్వాన్నమ్నగు కాలమున్ విడి ఖగోళాసక్తి సంశోధన
మ్మధ్వ మ్మట్టుల జేసి, సత్య విదుడై యా నాటి యజ్ఞానమున్
విధ్వంసమ్మును జేసె మానవు డహో విశ్వమ్ము కీర్తించగన్.
కం॥ అధ్వానమగు క్రతువులచె
రిప్లయితొలగించండియధ్వాంతము భారతమ్మునందు విరియఁగన్
మధ్వాచార్య దురితమును
విధ్వంసముఁ జేయ బొగడె విశ్వంబతనిన్
శా॥ అధ్వాన్నమ్మగు రీతి మానవుల దుష్టాచారమే విచ్చఁగా
నధ్వాంతమ్మటు క్రమ్మ భారతమునందా తీరుగన్ సర్వత్రా
మధ్వాచార్య మహోపదేశముల సంప్రాప్తమ్మె దౌష్ట్యమ్మునున్
విధ్వంసమ్మును జేసె మానవుఁడహో విశ్వమ్ము గీర్తింపఁగన్
అధ్వాంతము సంజె చీకటి
క్రతువులను క్రతువులలో జంతు హింసను చూచి జైన బౌద్ధు మతాలవైపు తిరుగుతున్న సమయములో ద్వైతం బోధించినవారు మధ్వాచార్య
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి-
రిప్లయితొలగించండిఅధ్వానమ్ముగ ననుదిన
మా ధ్వాంక్షపు కావు కావు మనెడు విధముగా....
వ్యధ్వము బట్టిన వారిని...
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
https://youtube.com/shorts/xnMtDKBaerg?si=Jf-qS5GE-oI5CYKV
విధ్వంసకారి రణమున
రిప్లయితొలగించండివిధ్వంసక వీర రిపుల వీరత్వమునన్
విధ్వంస కాభిమన్యుఁడు
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
వ్యధ్వమ్ముల్ నశియించె బాల్యపు వివాహమ్ముల్ క్షయించెం గదా
సాధ్వీ రత్నము భర్తతోఁ జన దహో చావంగ జీవించు నేఁ
డధ్వర్యమ్ములఁ జంపరే నరుల మూఢాచార భావమ్ములన్
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్
కందం
రిప్లయితొలగించండిఅధ్వానంపునడతలం
దాధ్వర్యమ్ము వహియించి యలజడిరేపన్
సద్వృత్తి యోగిగ గతము
విధ్వంసముఁ జేయఁ బొగడె విశ్వం బతనిన్
శార్దూలవిక్రీడితము
అధ్వానంబగు కార్యముల్ సలిపి యన్యాయంపు దుష్కృత్యమం
దాధ్వర్యమ్ము వహించి మానసమునందాందోళనల్ మీరఁగన్
సద్వృత్తిన్ దగ ధ్యాన యోగములనే సంధించి లో చింతలన్
విధ్వంసమ్మును జేసె మానవుఁ డహో విశ్వమ్ము గీర్తింపఁగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
విధ్వంసము చేయ తగదు
విధ్వంసము సృష్టి చేయ విజ్ఞత లేకన్
విధ్వంసకారు లందరిఁ
విధ్వంసముఁ జేయ బొగడె విశ్వంబతనిన్.