31, మే 2026, ఆదివారం

సమస్య - 5484

1-6-2026 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ”

(లేదా...)

“దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్”

(ఉప్పలధడియం భరత్ శర్మ ఏకదిన శతావధానం సమస్య)

19 కామెంట్‌లు:

  1. శ్రీహరినే భజియింపగ
    సాహసమేదైనగాని సాధ్యము గదరా
    శ్రీహరి రక్షణపై సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేహముఁ శక్తిమంతముగ తీరిచి దిద్దిన వాడు యోగ్యుడౌ
      శ్రీహరి లోకరక్షకుడు చిత్తములో భజియించు కొన్నచో
      సాహస కృత్యమేదయినఁ శౌర్యముతో లభియించు గెల్పు సం
      దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్

      తొలగించండి
  2. కందం
    వ్యూహము పన్నుటయందున
    సాహసమే కాదు మిగుల సమయస్ఫూర్తిన్
    గాహలము కాదనెడు సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ

    ఉత్పలమాల
    వ్యూహము పన్ను వేళలను బొంచిన పర్యవసానముల్ దగన్
    సాహసమందునందెదరి సాధ్యమునౌ సమయోచితమ్మునన్
    గాహలమన్నదే యెదుట కానక దూసుకు పోవుటందు సం
    దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    వ్యూహము పన్నుటయందున
    సాహసమే కాదు మిగుల సమయస్ఫూర్తిన్
    గాహలము కాదనెడు సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ

    ఉత్పలమాల
    వ్యూహము పన్ను వేళలను బొంచిన పర్యవసానముల్ దగన్
    సాహసమందునందెదరి సాధ్యమునౌ సమయోచితమ్మునన్
    గాహలమన్నదే యెదుట కానక దూసుకు పోవుటందు సం
    దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్

    రిప్లయితొలగించండి
  4. ఓహో ! సంశయమదియా !
    సాహసమొందుచునె నేను సాధించినదౌ
    సాహిత్యముపై యే సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ

    రిప్లయితొలగించండి
  5. ఆహవమందున వీరుఁడు
    దేహముపై యాశఁగొనక దెప్పరమైనన్
    మోహరమునఁ దలపడు, సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ

    రిప్లయితొలగించండి
  6. ఆహవమందు వీరుఁడు మహాద్భుత రీతిని విక్రమించుచున్
    దేహముపైన మోహమును ధీరతతో విడనాడి యొంటిగా
    మోహరమందు జిక్కినను పూనికతో గమకించు, నెట్టి సం
    దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్

    రిప్లయితొలగించండి
  7. కం॥
    మోహమునకుఁదావీయక
    దేహమజుని గేహమనెడి తెఱకువ తోడ
    న్నాహంకర్తని జయమం
    దే హము లేనట్టివాఁడె తేజోమయుడౌ!!

    (అజుడు: పరమాత్మ
    హము: సంతోషము)

    రిప్లయితొలగించండి

  8. దేహమ్ము పైన గల వ్యా
    మోహము విడుచుచు ఘనమగు మోక్షము కొరకై
    యా హంసుని పై నను సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ.


    దేహము నశ్వ రమ్మనుచు దేహిని యందున దీని పైన వ్యా
    మోహము వీడి యుక్కడపు మోక్ష మోసంగెడి వాడుగా చతు
    ర్వ్యూహుని నమ్మి కొల్చుటె మహోన్నత కార్య మటంచు నందు సం
    దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్.

    రిప్లయితొలగించండి
  9. -
    సోహం హంసోల నడుమ
    గేహంబగు జీవితమిది కేశునిదే యౌ
    నాహం కర్తా యని సం
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ


    https://youtube.com/shorts/8klfCNNklXM?si=PYybRrUdOl1xzgoD



    రిప్లయితొలగించండి
  10. మో హా తీ తు o డగు చున్
    శ్రీహరి పాదముల నమ్మి చిత్త o బలరన్
    స్నే హ ము గా మెలగు చు సం
    దేహము లేనట్టి వాడె తేజో మయు డౌ

    రిప్లయితొలగించండి
  11. ఉ॥ ఐహిక వాంఛలన్ గనుచు నన్నియు నేమము నిష్ఠ యొప్పఁగన్
    దైహిక కార్య సంచయపు దార నిబద్ధత తోడఁ దాల్చుచున్
    మోహము వీడి విద్యలను మోదము మీరఁగ నభ్యసించ సం
    దేహము లేని వాఁడె ఘన తేజమునంది వెలుంగు నంతటన్

    దార క్రమము

    రిప్లయితొలగించండి
  12. కం:ఊహల కల గన భౌతిక
    దేహము స్తబ్ధమ్ము కాగ దేహి యితరమౌ
    దేహము దాల్చగ పార్థివ
    దేహము లేనట్టివాఁడె తేజోమయుఁడౌ”
    (ఆత్మ మూడు రకాల దేహాలను ధరిస్తుంది.భౌతిక దేహాన్ని ధరించిన ఆత్మను విశ్వుడు అని,సుషుప్తి లోని దేహాన్ని ధరించిన వాడిని ప్రాజ్ఞుడు అని,స్వప్న శరీతం దాల్చిన వాడిని తైజసుడు అనీ అంటారు.నేను తైజసుడు అనే పదాన్ని తేజోమయుడు అన్నాను.దేహి అంటే ఆత్మ.)

    రిప్లయితొలగించండి
  13. ఆహా దార కిడె నెడమ
    దేహము పంచాననుండు తృప్తుండై సం
    దేహము తగదయ్యా యర
    దేహము లేనట్టి వాఁడె తేజోమయుఁడౌ


    ఊహ కెఱుంగ రాక సకలోచ్చ చరాచర రమ్య జీవ సం
    దోహ నిజాంతరంగములఁ దూఱి వసించు సహస్ర మూర్ధుఁడే
    మోహ మొకింత లేక యెదఁ బుష్కర నాభుని యున్కి పైన సం
    దేహము లేని వాఁడె ఘన తేజము నంది వెలుంగు నంతటన్

    రిప్లయితొలగించండి
  14. ఉ:దేహము నశ్వరమ్ము కద! దేహము రామునిదో, భవానిదో
    యూహల నిల్పు ధ్యానమున నొందునె ముక్తిని? బ్రహ్మతత్త్వమున్
    సోహ మటంచు నెంచ నతి సూక్ష్మపు దృష్టిని,జిత్త మందు నే
    దేహము లేనివాఁడె ఘనతేజమునంది వెలుంగు నంతటన్”
    (దేవతారూపాలతో సహా దేహాలన్నీ అశాశ్వతాలే . నామరూపాలకు అతీత మైన బ్రహ్మతత్త్వాన్ని గ్రహించటమే ముక్తి. కాబట్టి దాన్ని దాల్చి చిత్తం లో ఏ దేహమూ లేని వాడే సర్వవ్యాప్త బ్రహ్మం గా వెలుగుతాడు.)

    రిప్లయితొలగించండి

  15. స్నేహము పేరుతో‌ తగదు‌ చేయుట‌ మోసము‌ ఘాతుకంబులన్‌
    మోహము‌‌ మీరినంతటను‌ ముంచును‌ ముప్పుల‌ గోతులందునన్‌
    దేహము కాదు శాశ్వతము‌ దివ్య గుణాత్మయె‌‌ కోరుకుంటు‌ ,సం‌
    దేహము లేనివాఁడె ఘన తేజమునంది వెలుంగు నంతటన్”

    రిప్లయితొలగించండి
  16. ఊహలలోన చేరి మది నూయల లూపుచు వేగ కామినీ
    గేహము నందు చేరిచి సుఖింపగ జేయును కోడె కాండ్ర, సం
    దేహము లేదు జంటలను తీరుగ నేకము జేసి మించు నా
    దేహము లేనివాడె ఘనతేజము నంది వెలుంగునంతటన్

    రిప్లయితొలగించండి
  17. సమస్య:
    దేహము లేని వాడె ఘన తేజము నంది వెలుంగు నంతటన్.

    ఉ.మా :

    తాహతులేని వాని సతి తానుగ కోరుట పాడిగాదనే
    మోహము నంది కాదు హర మోయును భారము యర్ధదేహుడై
    సాహసమేమొ జూపి తను సాయము సేయఁగ నెంచు మారునిన్
    మోహము రేపె దాననుచు,మూడవ కన్నున గాల్చివేసినన్
    దేహము లేని వాడె ఘన తేజము నంది వెలుంగు నంతటన్.

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ద్రోహపు చింతన లేకయె
    మోహము లేక నిహలోకపు సుఖములందున్
    దేహ మశాశ్వతమని సం
    దేహము లేనట్టి వాడె తోజోమయుడౌ.

    రిప్లయితొలగించండి