16, జూన్ 2026, మంగళవారం

సమస్య - 5500

17-6-2026 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వేలకొలఁది సమస్యలు విసుగు రాదు”

(లేదా...)

“వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే”

17 కామెంట్‌లు:

  1. పూరణ సలుపుట కొరకు పుడుకు నట్టి
    వేలకొలఁది సమస్యలు ! ; విసుగు రాదు
    కవుల కేలన ! కాలము గడుపుటకయి
    యదియె యుత్తమమగు మార్గమనుచుదలచ

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    శంకరాభరణ సమూహమంకురించి
    మార్గనిర్దేశమొసఁగెడు మాన్యగురులు
    కందివంశ చంద్రులు నిత్యమందిరాగ
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు!

    ఉత్పలమాల
    తేలిక చేసి మర్మముల తీరును దెల్పుచు శిష్యకోటికిన్
    లీలగ పద్యముల్ మెరయు రీతిని నేరుపు కందిశంకరుల్
    మేలుగ 'శంకరాభరణ' మేటి సమూహము నడ్పుచుండగన్
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!

    రిప్లయితొలగించండి
  3. శంకరాభరణసమూహ సత్కవులను
    కందిశంకరయ్యగురువుగారునెపుడు
    ప్రోత్సహింతురు చక్కని బోధజేసి
    వేలకొలది సమస్యలు విసుగు రాదు

    చాలవుచాలవాకవికి సర్వవిభిన్నములైన ప్రశ్నలున్
    మేలగుమంచిముత్యమునుమించినశిల్పములైవెలుంగులే
    నేలకునింగికైనఘన నిచ్చెనవేయుసమర్థుడాతడే
    వేలసమస్యలిచ్చినను వేసరిలంగవిమిత్రులొప్పరే

    రిప్లయితొలగించండి

  4. మోజు గల కవుల కొరకు రోజు కొక స
    మస్య నిచ్చి కవివరుల మనసు దోచు
    శంకరా భరణమ్మున చక్క నైన
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు.



    చాల వవెన్ని వ్రాసినను సత్కవు లెల్లరు పాటవమ్ము తో
    మేలగు పద్య రాజములు మిక్కుట మందున వ్రాయ నేమిరా
    హాళిగ మారి వారికది వ్యాపక మయ్యె సమూహ మందునన్
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.

    రిప్లయితొలగించండి
  5. కాలము వెళ్ళఁబుచ్చుటకుఁ గల్పనఁ జేసితి నొక్క బ్లాగునున్
    వాలుగ శంకరాభరణ వైఖరి గాఁగ దినమ్ముఁ దప్పకే
    హేలగ నిచ్చుచుంటిఁ గద యెన్నియొ పూరణలన్ లిఖింతురే
    వేలసమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే.

    రిప్లయితొలగించండి
  6. వేలకొలఁది సమస్యల వెంటఁబడఁగ
    రయమునఁ దొలఁగునుగద కూర్పరి బడలిక
    ప్రాశ్నికుండకుఁ సంతృప్తి ప్రాప్తమగును
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు

    వేల కొలంది ప్రశ్నలిడ వేసట దవ్వగు కావ్యకర్తకున్
    లోలుపుడైన కూర్పరికి లొంగుసమస్యలు హాయిగూర్చగా
    మేలగు తత్పరత్వమిడు మెండుగ సౌఖ్యము ప్రాశ్నికుండకున్
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే

    రిప్లయితొలగించండి
  7. డా బల్లూరి ఉమాదేవి

    పద్య ములనువిడక వ్రాయ వాంఛయున్న
    కవులకీసమూహమొసంగె కమ్మనైన
    వేదికను కందిశంకరుల్ విడక మనకు
    వేలకొలది సమస్యలు విసుగురాదు

    కాలము మించ కుండగను గట్టి సమస్యల నెంచి యిచ్చినన్
    మాలిక లంచయాన కిట మానుగ నర్పణ చేసినంతనే
    జాలము చేయ కుండగను శంకరు లొప్పుగ గాంచ మెచ్చగన్
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవి మిత్రులొప్పరే

    రిప్లయితొలగించండి
  8. తే॥ వేలకొలఁది సమస్యలు విసుగుఁ బెంచు
    బ్రదుకునఁ బరిణతఁ బడసి పద్య రచన
    వెలయు నభ్యాసమునఁ గడు ప్రీతి విరియు
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు

    ఉ॥ బాలలు వృద్ధులైనఁ దగు భావన నింపుచు వ్రాయఁ బద్యముల్
    చాల పరిశ్రమమ్ముఁ గన సాధ్యము పద్యము హృద్యమై చనన్
    మాలిమి శంకరాభరణ మాధ్యమమందునఁ బొంద నెంచిరో
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే

    మాలిమి వాత్సల్యము
    (ఈసమూహములో బాలలు నాలాగా ఇంక ఉద్యోగమెలాగూ రాదు వృద్ధాప్యంలో ఏదో ఒక సద్వ్యాపకముండనీ అనే వారు ఉంటారు కదండి)

    రిప్లయితొలగించండి
  9. కంది శంకరు లౌ స గెడి కమ్ర మైన
    వేల కొలది సమస్యలు విసుగు రాదు
    పూరణ లు జేయు కవు లెల్ల మోద మునను
    పద్య విద్యను పోషింప పాటు పడరె

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:నాదు భర్తకు నా బాధ నేది తెలుప
    విసుగు చెందు పరిష్కార మసలె యిడడు
    తనదు కార్యాలయము లోన దనను జుట్ట
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు”
    (అని ఎప్పుడూ ఉద్యోగం గూర్చే ఆలోచిస్తూ తనను నిర్లక్ష్యం చేసే భర్త గూర్చి భార్య బాధ.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఏలనొ ఇంటి కష్టముల నేవియు జూడరు కాని స్నానపా
    నాలను మాని యీ విధమునన్ జరవాణిని బూని,మున్ గుచున్
    దేలుచు నుంద్రు పూరణల దేనికొ? యా కవి శంకరార్యుడే
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే!

    రిప్లయితొలగించండి
  12. మూలము శంకరాభరణ పుణ్యము

    చేత గవీశ్వరోన్నతుల్

    మేలగు పూరణల్ సతము మెచ్చగ

    జేయుచు సంతసంబుగన్

    కాలము గడ్పుచుండ్రిగద కౌశల

    మున్ వెలయించుచున్, అహో!

    వేల సమస్యలిచ్చినను వేసరిలం గవి

    మిత్రులొప్పరే!





    రిప్లయితొలగించండి
  13. హేలగ శంకరాభరణ మెంతయునర్మిలి నిర్వహించుచున్
    చాల యశస్సు గైకొనిరి శంకర వర్యులు విశ్వమందు నే
    కాలమునందునైన నిజ కాయపు బాధల నెంచకుండ తా
    బాలునివోలె పాల్గొనగ పండిత కోటి సమాగమమ్ములన్
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవిమిత్రు లొప్పరే

    రిప్లయితొలగించండి
  14. జీవితము రణరంగము దేవుఁ డిచ్చి
    నట్టిది నరలోకమ్మున కవని లోనఁ
    బుట్టినది మొదలు సతము గిట్టు వఱకు
    వేలకొలఁది సమస్యలు విసుగు రాదు


    ఆలముగాఁ దలంచి మది హర్ష సమన్వితమై చెలంగ నొ
    డ్డోలగ మందు గౌరవము నొంద భృశమ్ము బుధాలి మెచ్చఁగా
    మేలి పరిష్కరింపు లిడ మేధ నవశ్యము ప్రోత్సహింపఁగా
    వేల సమస్య లిచ్చినను వేసరిలం గవి మిత్రు లొప్పరే

    రిప్లయితొలగించండి
  15. వేల కొలదిగఁబద్యాలు లీల పగిది
    వ్రాయు కవులకు నల్లేరు బండి విధము
    వేల కొలది సమస్యలు, విసుగురాదు
    వ్రాయ నేర్తురు సులభపు పద్ధతినిక

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కాపురమున సమస్యలు కానవచ్చు
    నెప్పటి సమస్య లపుడె పరిష్కరించ
    వచ్చు క్రొత్త సమస్యలు ప్రతి దినంబు
    వేలకొలది సమస్యలు విసుగు రాదు.

    రిప్లయితొలగించండి