17, జూన్ 2026, బుధవారం

సమస్య - 5501

18-6-2026 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజతోడన్”

(లేదా...)

“శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్”

21 కామెంట్‌లు:

  1. కందం
    శార్ఙ్గము, పినాకములలో
    శార్ఙ్గము హరిదౌ, పిదపది సాంబుని దైనన్
    శార్ఙ్గధరుడంద, నటుఁడై
    శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజతోడన్

    ఉత్పలమాల
    శార్ఙ్గ, పినాకముల్ గనఁగ సర్వులెరింగెడు విల్లులే సుమా!
    శార్ఙ్గము శౌరిదౌ, మరియు సాంబుడు దాల్చునదౌ పినాకమున్
    శార్ఙ్గధరుండు సేకొన, విశాల సభాంతర నాటకమ్మునన్
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్

    రిప్లయితొలగించండి
  2. కం.
    రణమున హరిగూల్చెనుయసు
    రుని* *శార్ఙ్గముఁ దాల్చి; శంకరుఁడు* **శైలజతోఁ*
    *జనుదెంచె** *వింతగన్* ”*వి
    ష్ణునిగనిసంతసముననిక స్తోత్రముజేసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యపాదాన్ని స్థానభ్రంశం చేసి, దుష్కరప్రాస క్లేశాన్ని తప్పించుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  3. శార్ఙ్గము విడి సుధ బంచగ
    శార్ఙ్గమును జినుడు మరచుట శంభువు గాంచన్
    శార్ఙ్గము నతనికొసగుటకు
    శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజతోడన్

    రిప్లయితొలగించండి


  4. శార్ఙ్గము శంఖువు చక్రము
    శార్ఙ్గధరుడు దాల్చు శివుని చాపము కాదో
    శార్ఙ్గవరా! తెలుపు మెపుడు
    శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజతోడన్?


    శార్ఙ్గము కాదు చంద్రిలుని చాపమటంచు నెరుంగవే కనన్
    శార్ఙ్గము శంఖు చక్రములు శౌరియె దాల్చును కావునన్ హరిన్
    శార్ఙ్గధరండటంచు కద సర్వ జనాళియె కొల్తు రెప్పుడా
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అధిక్షేపాత్మకమైన మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. శార్ఙ్గధరుడరిగె ననికిన్
    శార్ఙ్గముఁ గొని; శివుఁడు వచ్చె శైలజతోడన్
    శార్ఙ్గి జయించునని దలచి
    శార్ఙ్గధరుడొనర్చు పోరు సంలక్షించెన్


    శార్ఙ్గమనంగ మూలజము శార్ఙ్గమనందగు విష్ణుచాపమున్
    శార్ఙ్గి భరించెలే తరకసా నరకాసురునిన్ వధింపగా
    శార్ఙ్గముఁ దాల్చి; శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్
    శార్ఙ్గధరుండు నెగ్గునని స్కంథమునే గమనింపనెంచుచున్

    [మూలజము = అల్లము; తరకసా = అమ్ములపొది]

    రిప్లయితొలగించండి
  6. శార్ఙ్గి యొకానొకప్డు హిమశైలముఁ జేరె శివుం గనంగ, నా
    శార్ఙ్గము నొక్క ప్రక్క నిడె, సంతసమొప్పుఁగ మాటలాడి యా
    శార్ఙ్గము విస్మరించి చనెఁ, జక్కనిదానిని నప్పగించఁగా
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్.

    రిప్లయితొలగించండి
  7. కం:శార్జ్గధరు డైన శ్రీహరి
    శార్జ్గీ సఖు శివుని గనగ సతి తో రాగా
    శార్జ్గికి మ్రొక్క నలంకృత
    శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజతోడన్”
    (శృంగము కలది శార్జ్గి అనగా నంది.శివుడు అలంకరించబడిన నంది పై వచ్చాడు.)

    రిప్లయితొలగించండి
  8. ఉ:శార్జ్గధరున్ హరున్ దలచి జారితి నిద్రను స్వప్న మందు నా
    శార్జ్గియు శార్జ్గికాక, మరి శంభుడు శూలము తోడ రాకయున్
    శార్జి ధరించె శూలమును,చక్కగ శంఖము బట్టి,వీపునన్
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్”
    (విష్ణువుని, శివుణ్ని ఇద్దరినీ తలుచుకొని నిద్ర పోయాడు. స్వప్నం లో విష్ణువు ధనువుని శివుడు,శివుని శూలాన్ని విష్ణువు ధరించి కనుపించారు.)

    రిప్లయితొలగించండి
  9. ఉ॥ శార్ఙ్గముఁ బూని విష్ణువటు చక్ర గదా ధరుఁడౌచు నొప్పుటన్
    శార్ఙ్గి మహాత్మ్యమున్ వినుచు సంతసమొందుచు నిద్రఁ బోవఁగన్
    శార్ఙ్గము సోయగమ్ముఁగని చక్కగఁ దల్చుచు స్వప్నమందునన్
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్

    రిప్లయితొలగించండి
  10. శా ర్జ్గమ్మెందుకు శివునకు
    శా ర్జ్గము గా నేత్ర ముండ శత్రువు లను దా
    శా ర్జ్గమ్ము న పరిమార్చు గ
    శా ర్జ్గ ము గొని శివుడు వ చ్చె శైలజ తోడన్

    రిప్లయితొలగించండి
  11. శార్ఙ్గముఁ గొను మన శార్ఙ్గము
    గీర్ఙ్గము నాకేల యంచుఁ గినుక సెలంగన్
    శార్ఙ్గ సమానమ్ముఁ దనదు
    శార్ఙ్గముఁ గొని శివుఁడు వచ్చె శైలజ తోడన్


    శార్ఙ్గిణ మైన పట్టుదల శక్తిని మించెడు నట్టి వానినిన్
    శార్ఙ్గ ధరాత్మ మిత్రునిఁ ప్రశస్థ నిషంగిఁ బరీక్ష సేయఁగా
    భార్ఙ్గ కళా శరీరు నరుఁ బార్థునిఁ జిత్ర మహో పినాక మన్
    శార్ఙ్గముఁ దాల్చి శంకరుఁడు శైలజతోఁ జనుదెంచె వింతగన్

    [శృంగిణమునకు (పొట్టేలు) సంబంధించినది శార్ఙ్గిణము; భృంగమునకు సంబంధించినది భార్ఙ్గము; శృంగమునకు సంబంధించినది శార్ఙ్గము, విల్లు]

    రిప్లయితొలగించండి
  12. మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి
    మఱియు
    కవిమిత్రులందఱకు నమస్సులు!
    🙏🙏🙏

    చాల కాలము తరవాత నేనును సమస్యాపూరణము చేయవలెనని యెంచి, చేసిన పూరణము.

    (కిరాతార్జునీయ నేపథ్యము):

    ఉ.
    శార్ఙ్గమృగంపు వేఁటకయి సంరభుఁడౌచును సవ్యసాచియే
    శార్ఙ్గపుఁగొమ్మువిల్లుఁ గొని, చక్కఁగఁ జాఁగఁగఁ, వేగిరమ్ముగన్
    శార్ఙ్గి మఱంది క్రీడికిని సద్వరమీయ, వరాహమంపి, తా
    శార్ఙ్గముఁ దాల్చి, శంకరుఁడు శైలజతోఁ జనుఁదెంచె వింతగన్!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
  13. శార్జ్ఞధరుండేతెంచగ
    శార్జ్ఞము గొని , శివుడు వచ్చె శైలజ తోడన్
    శార్జ్ఞ ధరుంగన వడిగా
    శార్జ్ఞపుగరిమను తెలుపుచు సంరంభముతో

    శార్ఙ్గధరుండుదానవుల జంపెను శిష్టులరక్షకై వడిన్
    **శార్ఙ్గము దాల్చి, శంకరుడు శైలజ తోనరుదెంచె వింత గన్*
    శార్ఙ్గము తోడనే వనికి సాగిన స్వామిని ప్రస్తుతించుచున్
    శార్ఙ్గముదాల్చినట్టిగుణసాంద్రునినామముమేలుమేలనెన్

    రిప్లయితొలగించండి