మందగా గెలిచిరి మననోడజేయుచున్ వందరోజులయ్యె పదవిదక్కి సందుచూచివారిఁ జక్కగాఁ దునుమాడి నిందఁ జేసెద విని నీవు మెచ్చ
మందగా గెలుపొందిరే వెసఁ మారిపోయె ప్రభుత్వమే వంద రోజులు దాటిపోయెను వారి పాలన కిప్పుడే సందు చిక్కిన చాలు వారిని చక్కగాఁ దును మాడుచున్ నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
[ పాలక పక్షాన్ని తిడితే ఆనందించే ప్రతిపక్ష నేతతో ఆ పార్టీ కార్యకర్త పలికిన మాటలు ]
ఇరుగు పొరుగున గల యిందీవరాక్షుల
రిప్లయితొలగించండినయము గాంచి నంత నా కొమరుడు
తప్పు జేసె ననుచు దబ్బితివిప్పుడు
నిందఁ జేసెద విని నీవు మెచ్చ
(విరహవేదన ననుభవిస్తున్న నాయికతో చెలికత్తె మాటలు...)
రిప్లయితొలగించండిసుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్
గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్
మందమారుతమున్ శశాంకుని మీరె బాధ్యు లటంచిదే
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
🙏
తొలగించండికురుక్షేత్ర సంగ్రామములో అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మ తో...
రిప్లయితొలగించండిఆటవెలది
మోహమందు జిక్కి సాహసము విడచి
విల్లువీడెదనన విశ్వరూప!
జ్ఞానమొలుక ప్రతిన సలిపి ననిన్, వీడ
నిందఁ, జేసెద విని నీవు మెచ్చ
మత్తకోకిల
కుందిపోవుచు మోహమందునఁ గూడనంచన వింటినే
చిందిగీతను విశ్వరూపము సృష్టినింపుచు చూపితే
నంది జ్ఞావము యుద్ధమెంచుచు నంబు బట్టియు, వీడగన్
నిందఁ, జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
ఎంద రెందరొ నిన్ను తిట్టను యింటికొచ్చిరి రాతిరిన్
రిప్లయితొలగించండికొంద రందున నిన్ను గట్టిగ కొట్ట బోవగ రాళ్ళతో
డెంద మందున బాధ కల్గగ యింటి కొచ్చిన వారినిన్
నింద జేయగ బూనుకుంటిని నీకు మోదము గల్గగన్
రిప్లయితొలగించండి*(దుస్ససేనుడు సుయోధనునితో పలికిన మాటలు గా)*
మాన్యుడ వగు నీకు మయసభ లో గాంచ
నొచ్చె మదియె గలుగ నోర్వ లేను
పగతురైన యట్టి పాండు సుతుల నిట
నిందఁ జేసెద విని నీవు మెచ్చ.
పొంద గోరుచు మత్తి కాడట పూజ్యురాలగు జానకిన్
బంది సేసె నటంచు శీఘ్రమె వార్ధి దాటుచు లంకలో
దండశూకుల మచ్చ మాపుచు దానవేంద్రుడు రావణున్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
మందగా గెలిచిరి మననోడజేయుచున్
రిప్లయితొలగించండివందరోజులయ్యె పదవిదక్కి
సందుచూచివారిఁ జక్కగాఁ దునుమాడి
నిందఁ జేసెద విని నీవు మెచ్చ
మందగా గెలుపొందిరే వెసఁ మారిపోయె ప్రభుత్వమే
వంద రోజులు దాటిపోయెను వారి పాలన కిప్పుడే
సందు చిక్కిన చాలు వారిని చక్కగాఁ దును మాడుచున్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
[ పాలక పక్షాన్ని తిడితే ఆనందించే ప్రతిపక్ష నేతతో ఆ పార్టీ కార్యకర్త పలికిన మాటలు ]
సమస్య : "నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్"
రిప్లయితొలగించండిసుందరీ నినుజూసినంతనె స్రొక్కిపోతిని ప్రేమలో
మందభాగ్యుడ నిన్నుబొందెడి మాన్యతెక్కడిదంటినీ
అందలమ్మున నుంచువానిని నందుకొమ్మనిగోరి నే
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్