20-6-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిందఁ జేసెద విని నీవు మెచ్చ”
(లేదా...)
“నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్”
ఇరుగు పొరుగున గల యిందీవరాక్షుల నయము గాంచి నంత నా కొమరుడు తప్పు జేసె ననుచు దబ్బితివిప్పుడునిందఁ జేసెద విని నీవు మెచ్చ
(విరహవేదన ననుభవిస్తున్న నాయికతో చెలికత్తె మాటలు...)సుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్మందమారుతమున్ శశాంకుని మీరె బాధ్యు లటంచిదేనిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మ తో... ఆటవెలదిమోహమందు జిక్కి సాహసము విడచివిల్లువీడెదనన విశ్వరూప!జ్ఞానమొలుక ప్రతిన సలిపి ననిన్, వీడనిందఁ, జేసెద విని నీవు మెచ్చమత్తకోకిలకుందిపోవుచు మోహమందునఁ గూడనంచన వింటినేచిందిగీతను విశ్వరూపము సృష్టినింపుచు చూపితేనంది జ్ఞావము యుద్ధమెంచుచు నంబు బట్టియు, వీడగన్నిందఁ, జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
ఎంద రెందరొ నిన్ను తిట్టను యింటికొచ్చిరి రాతిరిన్కొంద రందున నిన్ను గట్టిగ కొట్ట బోవగ రాళ్ళతోడెంద మందున బాధ కల్గగ యింటి కొచ్చిన వారినిన్నింద జేయగ బూనుకుంటిని నీకు మోదము గల్గగన్
*(దుస్ససేనుడు సుయోధనునితో పలికిన మాటలు గా)*మాన్యుడ వగు నీకు మయసభ లో గాంచ నొచ్చె మదియె గలుగ నోర్వ లేను పగతురైన యట్టి పాండు సుతుల నిట నిందఁ జేసెద విని నీవు మెచ్చ. పొంద గోరుచు మత్తి కాడట పూజ్యురాలగు జానకిన్ బంది సేసె నటంచు శీఘ్రమె వార్ధి దాటుచు లంకలో దండశూకుల మచ్చ మాపుచు దానవేంద్రుడు రావణున్ నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
ఇరుగు పొరుగున గల యిందీవరాక్షుల
రిప్లయితొలగించండినయము గాంచి నంత నా కొమరుడు
తప్పు జేసె ననుచు దబ్బితివిప్పుడు
నిందఁ జేసెద విని నీవు మెచ్చ
(విరహవేదన ననుభవిస్తున్న నాయికతో చెలికత్తె మాటలు...)
రిప్లయితొలగించండిసుందరీ! ప్రియుఁ డేగె నిన్విడి, సోలితే విరహమ్మునన్
గుందఁ జేసెడి పుష్పశరములఁ గొట్టు మన్మథు దౌష్ట్యమున్
మందమారుతమున్ శశాంకుని మీరె బాధ్యు లటంచిదే
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.
కురుక్షేత్ర సంగ్రామములో అర్జునుఁడు శ్రీకృష్ణ పరమాత్మ తో...
రిప్లయితొలగించండిఆటవెలది
మోహమందు జిక్కి సాహసము విడచి
విల్లువీడెదనన విశ్వరూప!
జ్ఞానమొలుక ప్రతిన సలిపి ననిన్, వీడ
నిందఁ, జేసెద విని నీవు మెచ్చ
మత్తకోకిల
కుందిపోవుచు మోహమందునఁ గూడనంచన వింటినే
చిందిగీతను విశ్వరూపము సృష్టినింపుచు చూపితే
నంది జ్ఞావము యుద్ధమెంచుచు నంబు బట్టియు, వీడగన్
నిందఁ, జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్
ఎంద రెందరొ నిన్ను తిట్టను యింటికొచ్చిరి రాతిరిన్
రిప్లయితొలగించండికొంద రందున నిన్ను గట్టిగ కొట్ట బోవగ రాళ్ళతో
డెంద మందున బాధ కల్గగ యింటి కొచ్చిన వారినిన్
నింద జేయగ బూనుకుంటిని నీకు మోదము గల్గగన్
రిప్లయితొలగించండి*(దుస్ససేనుడు సుయోధనునితో పలికిన మాటలు గా)*
మాన్యుడ వగు నీకు మయసభ లో గాంచ
నొచ్చె మదియె గలుగ నోర్వ లేను
పగతురైన యట్టి పాండు సుతుల నిట
నిందఁ జేసెద విని నీవు మెచ్చ.
పొంద గోరుచు మత్తి కాడట పూజ్యురాలగు జానకిన్
బంది సేసె నటంచు శీఘ్రమె వార్ధి దాటుచు లంకలో
దండశూకుల మచ్చ మాపుచు దానవేంద్రుడు రావణున్
నిందఁ జేయఁగఁ బూనుకొంటిని నీకు మోదము గల్గఁగన్.