22-7-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్”
(లేదా...)
“హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్”
(ఛందోగోపనం)
(న.చ. సాహిత్ అర్ధశతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)
స్నేహితులన్న క్షీరమును నీరము వోలె లయించువారు విద్రోహపు చింతనన్ విడచి తోషము గూర్చగ జూతు రొండొరుల్స్నేహమె యూపిరై మెలఁగి నిత్యము నాజత గోరువారలౌనాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
సాహిత్య సేద్య మొనరిం చు హాలికులుగ పచరించు సుముఖుల లోనన్ సహృదయము నొందిన కడు సన్నాహితు లర్థప్రియులనగ నమ్మరు విజ్ఞుల్
స్నేహితుడని యడుగగ పౌ రోహిత్యము జేయువాడు రొక్కము గొని యు ద్వాహముహుర్తము జెప్పెను నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.నరులిల స్వార్థ చిత్తులు ధనమ్మె ప్రధాన మటంచు నమ్ముచున్ ధరణి జరించు వారలుచితమ్ముగ సాయము జేయ రైరి నె య్యరి యని చెంత జేరుచు సహాయము గోరిన పేద యంచు కా నరు, హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
గేహము యాగనిలయమేదేహము నిరతము తరించు దేవుని సేవన్!ఆహవన నిరతులగు నగ్న్యాహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్గేహము నిత్యకర్మలకు కేంద్రము శ్రోత్రియులైనవారికిన్దేహము నీమనిష్ఠలకు దేవుని పూజకు సర్వసిద్ధమే!ఆహవనమ్ముకై సతతమగ్నులఁ బ్రోచెడి వేదవేత్త లగ్న్యాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్ [అగ్న్యాహితుఁడు = అగ్నిహోత్రి; నిత్యము అగ్నికార్యము చేయువాఁడు]
స్నేహితులన్న క్షీరమును నీరము వోలె లయించువారు వి
రిప్లయితొలగించండిద్రోహపు చింతనన్ విడచి తోషము గూర్చగ జూతు రొండొరుల్
స్నేహమె యూపిరై మెలఁగి నిత్యము నాజత గోరువారలౌ
నాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
సాహిత్య సేద్య మొనరిం
రిప్లయితొలగించండిచు హాలికులుగ పచరించు సుముఖుల లోనన్
సహృదయము నొందిన కడు స
న్నాహితు లర్థప్రియులనగ నమ్మరు విజ్ఞుల్
రిప్లయితొలగించండిస్నేహితుడని యడుగగ పౌ
రోహిత్యము జేయువాడు రొక్కము గొని యు
ద్వాహముహుర్తము జెప్పెను
నా హితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్.
నరులిల స్వార్థ చిత్తులు ధనమ్మె ప్రధాన మటంచు నమ్ముచున్
ధరణి జరించు వారలుచితమ్ముగ సాయము జేయ రైరి నె
య్యరి యని చెంత జేరుచు సహాయము గోరిన పేద యంచు కా
నరు, హితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్.
గేహము యాగనిలయమే
రిప్లయితొలగించండిదేహము నిరతము తరించు దేవుని సేవన్!
ఆహవన నిరతులగు న
గ్న్యాహితు లర్థప్రియులన నమ్మరు విజ్ఞుల్
గేహము నిత్యకర్మలకు కేంద్రము శ్రోత్రియులైనవారికిన్
దేహము నీమనిష్ఠలకు దేవుని పూజకు సర్వసిద్ధమే!
ఆహవనమ్ముకై సతతమగ్నులఁ బ్రోచెడి వేదవేత్త ల
గ్న్యాహితు లర్థకాములన నమ్మరు పండితు లెల్లవేళలన్
[అగ్న్యాహితుఁడు = అగ్నిహోత్రి; నిత్యము అగ్నికార్యము చేయువాఁడు]