3, ఆగస్టు 2026, సోమవారం

సమస్య - 5548

4-8-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రతి ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా”

(లేదా...)

“రతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో”

(ఛందోగోపనం)

(ఉప్పలధడియం భరతశర్మ శతావధానంలో కటకం వేంకటరామ శర్మ గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. కందం
    "నీరజనాభ! గిరిజకున్
    గూరిచి శంకరునిఁ బొందఁ గొమరున్ జగతిన్
    బేరుఁ గొనఁ బట్టిరి సురల్
    హారతి! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా!"


    ఉత్పలమాల
    చేరువ జేయువాడనఁగ స్త్రీపురుషాళిని, వింతశోభలన్
    గూరుచ సృష్టికిన్! గలిపె గోపతిఁ బార్వతిఁ బట్ట దేవతల్
    హారతి! ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో
    నీరజనాభుడౌ హరికి నేత్రికిఁ గల్గిన సుందరాంగునిన్?

    రిప్లయితొలగించండి

  2. జారుడు భోగపు వాడను
    జేరుచు నట నున్న యాట చేడియ తోడన్
    బేరుకొనె మైకమున తా
    రా! రతి ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా.


    జారిణి పొంద గోరి యదె సౌఖ్యమటంచును నమ్మి యచ్చటన్
    జేరిన వేళ నా గడనచేడియ కేనపు ప్రేమతో నటన్
    వారుణి నంద జేయగను పానము జేయుచు పల్కె నిట్లు తా
    రా! రతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న , విశేషమౌనొకో.

    రిప్లయితొలగించండి
  3. గౌరవమగు సంసృతులవి ,
    తారక రామునికి పౌత్రి దారక్రియకై
    యారయ నామె మదిని నా
    రారతి ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా

    నారారతి = నారావారి అనురాగము

    రిప్లయితొలగించండి
  4. చేరెను ప్రద్యుమ్నుండై
    మారుడు మరుజన్మమందు మాయావతినే
    తీరుగ సాకెను తానౌ
    రా!రతి ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా

    మారుడు పద్మనాభుని కుమారుడు చక్కెరవింటివాడు తా
    నే రతి ప్రాణనాథుడని నేరక యున్నవిశేషమే! జరా
    భీరువు పద్మినీసుతునిఁ విజ్ఞులు తామరకంటి యోగని
    ద్రారతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ నేరక భారతీయ ఘన నీతి పురాణ విశేషణమ్ములన్
    గోరిన రీతిఁ బల్కుటయుఁ గొందరు చేయుట నొప్పిఁ గూర్చదా
    మారుతి యెవ్వరో కనక మారునిఁ జేసెనొ యిట్లు త్రాగి సా
    రా! ”రతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో”

    నొప్పి బాధ

    రిప్లయితొలగించండి
  6. ఉ: భారతి తోడ భర్త యిటు బల్కెను "నీ సుతుడున్ రసజ్ఞుడే,
    చేరిన విద్యలన్ విడచి చేరుచు భామల చెంత వేయు శృం
    గారపు వేషముల్, భవిత గానడు భామలు మెచ్చు ప్రేమలీ
    లారతి ముద్దుబిడ్డ మకరధ్వజుఁడన్న విశేషమౌనొకో”
    (భారతి అనే ఆమె తో భర్త నీ కొడుకు ప్రేమ లీలలలో మన్మథుడే అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  7. మారుని స తి యే రతి యన
    మారుగ గల్పించు టిటు ల మాన్యం బగు నా?
    వేరుగ పలుకు టె టు ల నౌ
    రా! రతి ముద్దు సుతుడు మకర ధ్వ జు డె కదా!!

    రిప్లయితొలగించండి
  8. కం:చేరిన విద్యల నేర్వక
    చేరును భామలను చదువు శృంగారకథల్
    వీరుండే రసమయలీ
    లారతి ! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా”

    రిప్లయితొలగించండి
  9. ఔరా నీ పతి హరుచే
    నీ రయ్యె నఁట గద యొక్క నిమిషము నందున్
    నారాయణి రమకుఁ, బలుక
    రా రతి! ముద్దు సుతుఁడు మకరధ్వజుఁడె కదా


    రతి పతి సుందరాంగుఁడు లలాట విరాజిత నేత్ర దగ్ధుఁ డం
    చిత సుర కార్య మగ్నుఁడును జిత్తజుఁ డంగ విహీనుఁ డౌర స
    మ్మత మిది యెల్ల వారికి రమా సతి సంతత కేశ వార్చనా
    వ్రత రతి ముద్దు బిడ్డ మకరధ్వజుఁ డన్న విశేష మౌనొకో

    రిప్లయితొలగించండి
  10. శ్రీరతి వోలె భార్య దరిచేరగ చెన్నగు నవ్వు లొల్కుచున్
    తీరని కోర్కెలన్నియును తృప్తిగ తీర్చును, రక్తియుక్తమౌ
    పోరున మాధవీ సుతుడు పోడిగ జంటల చేర్చి, యెంచ హే
    లా రతి ముద్దుబిడ్డ మకరధ్వజుడన్న విశేషమౌ నొకో!

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సారా త్రాగిన వానిని
    యేరా!మకరధ్వజుండ నెవరని యడుగన్
    ఓరీ!యెందుకు తెలియదు
    రా!రతి ముద్దు సుతుడు మకరధ్వజుడె కదా?

    రిప్లయితొలగించండి
  12. మారునివలచినదెవరన?
    హీరకు నారాయణునకు నిమ్ముగజగతిన్
    తారకు దునుమంగనువిన
    రా రతి!,ముద్దుసుతుడు మకరధ్వజుడె గదా

    రిప్లయితొలగించండి