30-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్”
(లేదా...)
“కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్”
కందంనీమంబుగ తపమెంచినసోముఁడపర్ణన్ గన నిడ సుమబాణములన్వేమరని, త్ర్యంబకుని నిష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
ఉత్పలమాల నీమము తప్పకే తపము నిర్మలరీతినొనర్చుచుండగన్ సోముఁడపర్ణనే కనఁ బ్రసూనపు బాణములేసినంతటన్ వేమరకుండగన్ రగిలి విప్పియుఁ జూడగ తీక్ష్ణమొప్ప నిష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
సోముడు శివనొలయునటులకాముడు యత్నించినట్టి కారణమందున్తామసులను శిక్షించకాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో గణభంగం. సవరించండి.
తామర సాదుల వేసిన కాముని పై నాగ్రహించి ఖట్వాంగధరుం డా ముక్కన్ను తెరువ ని ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్.ప్రేముని యానతిన్ గొని రవీషువు భర్గుని మానసమ్మునన్ ప్రేమ జనింప జేయగను వేసెను తామర సాదు లంతటన్ తామాస మందినట్టి నెలదారియె విప్పగ వెట్టకన్ను, ని ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'తామసమంది' టైపాటు.
సోమునిఁ విరిశరములతోకాముడు బాధింప మనసు కందినవాడైగాములదొర చూడగ నిష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్సోముని యంతరంగమున చొక్కిల జేయగ ప్రేమభావనల్కాముడు వాడిబాణముల కల్మషకంఠుని కొట్టినంతటన్దామసుడై విషాంతకుడు తత్క్షణమాతనిఁ జూచినంత నిష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
ప్రేమ దలిర్ప హైమవతి భీషణుకై తపియింప నంతటన్దీమసమొప్ప మన్మథుడు దిగ్గననేసెను పూలబాణమున్వాముడు కృద్ధుడై గనగ ఫాలమునందలి చిచ్చుకంటితోకాముని, కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
దీమసముగ పూశరమునువామునిపై మరుడువేయ, ఫాలాక్షముతోసోముడు కినుకన్ జూడఁగకాముని, నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
నీమము గ తప మొన ర్ప గ కాముడు వేసిన శరముకు కనలుచు గనగా తామసు తక్షణమే ని ష్కా ముని నేత్రా నలమ్ము కంతుని గా ల్చె న్
కోమలి రతీసతి వగపునేమని వర్ణింప నింక నేరికిఁ దరమౌసోముని చంద్రధరుని నిష్కాముని నేత్రానలమ్ము కంతునిఁ గాల్చెన్ భీముని తోడ నాటలను బేలతనమ్మున నాడ నెంచి తానీమము తప్పి మన్మథుఁడు నేరక యాపద మ్రగ్గె నక్కటా హైమవతీ సమక్షమున నంచిత శీత నగమ్మునం దపః కాముని కంటి మంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
నేమముతోడ శంకరుడు నిచ్చలమైన తపస్సు నుండగా ప్రేముని యానతో చెలగి వెన్నుని పుత్రుడు కోలలేయ నా తామసి పాణి పీడనము తల్చి మనమ్మున, నిష్ఠ భగ్న ని ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
భీమముగ తపసు జేసెటిచాముండీ భర్తపైన శరమును వేసెన్కాముని దుర్నయమే నిష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నీమమున తపము చేసెడుసోమునిపై వేయ మరుడు సుమ బాణములన్కాముని కోపించగ నిష్కాముని నేత్రానలమ్ము గంతుని గాల్చెన్.
స్వామిగదల్చిసేవలనువాసిగచేయుచునుండకానలోశ్యామల,కోరగా సురలుశంభునిపైకుసుమాస్త్రముల్ విడన్కాముడు, కోపగించుచును గాంచగమూడవకంటితోడని*"ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్”*డా బల్లూరి ఉమాదేవి చామయు మృతి నొంద కనలిసోముడు హిమగిరి నచేయుచుండ తపమ్మున్కాముని శరమ్ము లాని*“ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్”*
కందం
రిప్లయితొలగించండినీమంబుగ తపమెంచిన
సోముఁడపర్ణన్ గన నిడ సుమబాణములన్
వేమరని, త్ర్యంబకుని ని
ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
ఉత్పలమాల
తొలగించండినీమము తప్పకే తపము నిర్మలరీతినొనర్చుచుండగన్
సోముఁడపర్ణనే కనఁ బ్రసూనపు బాణములేసినంతటన్
వేమరకుండగన్ రగిలి విప్పియుఁ జూడగ తీక్ష్ణమొప్ప ని
ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిసోముడు శివనొలయునటుల
రిప్లయితొలగించండికాముడు యత్నించినట్టి కారణమందున్
తామసులను శిక్షించ
కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. సవరించండి.
రిప్లయితొలగించండితామర సాదుల వేసిన
కాముని పై నాగ్రహించి ఖట్వాంగధరుం
డా ముక్కన్ను తెరువ ని
ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్.
ప్రేముని యానతిన్ గొని రవీషువు భర్గుని మానసమ్మునన్
ప్రేమ జనింప జేయగను వేసెను తామర సాదు లంతటన్
తామాస మందినట్టి నెలదారియె విప్పగ వెట్టకన్ను, ని
ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'తామసమంది' టైపాటు.
సోమునిఁ విరిశరములతో
రిప్లయితొలగించండికాముడు బాధింప మనసు కందినవాడై
గాములదొర చూడగ ని
ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
సోముని యంతరంగమున చొక్కిల జేయగ ప్రేమభావనల్
కాముడు వాడిబాణముల కల్మషకంఠుని కొట్టినంతటన్
దామసుడై విషాంతకుడు తత్క్షణమాతనిఁ జూచినంత ని
ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిప్రేమ దలిర్ప హైమవతి భీషణుకై తపియింప నంతటన్
రిప్లయితొలగించండిదీమసమొప్ప మన్మథుడు దిగ్గననేసెను పూలబాణమున్
వాముడు కృద్ధుడై గనగ ఫాలమునందలి చిచ్చుకంటితో
కాముని, కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
దీమసముగ పూశరమును
రిప్లయితొలగించండివామునిపై మరుడువేయ, ఫాలాక్షముతో
సోముడు కినుకన్ జూడఁగ
కాముని, నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
నీమము గ తప మొన ర్ప గ
రిప్లయితొలగించండికాముడు వేసిన శరముకు కనలుచు గనగా
తామసు తక్షణమే ని
ష్కా ముని నేత్రా నలమ్ము కంతుని గా ల్చె న్
కోమలి రతీసతి వగపు
రిప్లయితొలగించండినేమని వర్ణింప నింక నేరికిఁ దరమౌ
సోముని చంద్రధరుని ని
ష్కాముని నేత్రానలమ్ము కంతునిఁ గాల్చెన్
భీముని తోడ నాటలను బేలతనమ్మున నాడ నెంచి తా
నీమము తప్పి మన్మథుఁడు నేరక యాపద మ్రగ్గె నక్కటా
హైమవతీ సమక్షమున నంచిత శీత నగమ్మునం దపః
కాముని కంటి మంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
నేమముతోడ శంకరుడు నిచ్చలమైన తపస్సు నుండగా
రిప్లయితొలగించండిప్రేముని యానతో చెలగి వెన్నుని పుత్రుడు కోలలేయ నా
తామసి పాణి పీడనము తల్చి మనమ్మున, నిష్ఠ భగ్న ని
ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్
భీమముగ తపసు జేసెటి
రిప్లయితొలగించండిచాముండీ భర్తపైన శరమును వేసెన్
కాముని దుర్నయమే ని
ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నీమమున తపము చేసెడు
సోమునిపై వేయ మరుడు సుమ
బాణములన్
కాముని కోపించగ ని
ష్కాముని నేత్రానలమ్ము గంతుని గాల్చెన్.
స్వామిగదల్చిసేవలనువాసిగచేయుచునుండకానలో
రిప్లయితొలగించండిశ్యామల,కోరగా సురలుశంభునిపైకుసుమాస్త్రముల్ విడన్
కాముడు, కోపగించుచును గాంచగమూడవకంటితోడని
*"ష్కాముని కంటిమంటలకుఁ గంతుఁడు మారెను భస్మరాశిగన్”*
డా బల్లూరి ఉమాదేవి
చామయు మృతి నొంద కనలి
సోముడు హిమగిరి నచేయుచుండ తపమ్మున్
కాముని శరమ్ము లాని
*“ష్కాముని నేత్రానలమ్ము గంతునిఁ గాల్చెన్”*