31-10-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”
(లేదా...)
“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”
గుణవతియైన కన్నియ గుర్తు తెలసిపెండ్లి యాడియు యిర్వురు పేర్మతోడకలిసి మెలిసియుందురు వరకట్నమన్నవలకు జిక్కని వాడెపో వలపుకాడు
అతివల కలవాటగు రీతి , యామెపయిన తగులు జూపించుటందున దనగురించి చామ పక్కింటి వారితో సలుపు సొవసొవలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
కులుకుల్ సూపి విశేష వేదికలలోఁ గూర్మిన్ బిసాళించి, రాచిలకన్ బోలెడి తీయనైన పలుకుల్ చిందించి, గుప్పించినన్వలపున్; లొంగక యాలిపై నెనరుతో వాంఛల్ నిరోధించి యా*“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”* - విట్టుబాబు
తల్లి దండ్రుల విడనాడి ధవుడె తనకు సర్వ మనుచును తలచెడి సాధ్వి నెపుడు గౌర వించుచు నీచులౌ ఖలు వెలచెలు వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు.నెలగన్ బొందగ నెంచి వారవనితల్ నెయ్యంపు పేశస్సు తో కులుకుల్ జూపుచు కోడె కారులను సంకోచింప కన్ బిల్వ గా దిలినిన్ వంచన జేయ బోననుచు చిత్తేశుండు మేల్దాపరుల్ వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్.
ఎడదలో ప్రేమ భావనలొడిసిపట్టిచెలియ తలపులే మనసున చెలగు చుండవార కాంతలకున్ గోరి వచ్చిన యతివలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడువిలువైనట్టిది ప్రేమభావననుచున్ విస్పష్టమౌ రీతినిన్జెలికే మానసమంకితంబు నిడుచున్ జీవించు కుండీరుడైకలలోనైనను బ్రేయసిన్ విడిచి తత్కాలంబునన్ సాని సేవలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
"జెన్ సారు" బోర్డు వారెక్కడ వెంఠనే అడ్మిన్ శ్రీ కంది వారిని బ్లాగ్ ప్రాంగణమునకు రమ్మనండి :)అలకలకొలికి ఆలింగనా చతురపువలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు? గునిచి ముద్దుల తేలిచి కోర్చి కేలుకంఠ సీమని పెదవుల కచ్చుకొనెడువాడె పో వన్నె కాడు వివరములరయ
గొప్ప ధన వంతు నిన్ గాంచి కోర్కె తోడ మోస మొనరింప బూనె ను మోస గ త్తె తెలివి గల వాని గా తాను తెలిసి మాయ వలకు జిక్కని వాడె య వ్ వలపు గాడు
మత్తేభము:వలరాజా నెలరాజు తోడు వినునా ప్రాణంబె నీవంచు దావలపుం జూపుచు వన్నెచిన్నెలను పొల్పారన్ ప్రదర్శించుచున్వలవేయున్ ప్రియురాలినంచు గడు పుంభావమ్ముగా బల్కునావలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
తేటగీతి:మేనిలో నొంపుసొంపులు మించి చూపిభాగ్యముల కొల్లగొట్టెడు భామలయెడనప్రమత్తతతో నుండి యతివ వలపువలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
మ॥ వలపుల్ మానసమందుఁ బుట్టు గద సావాసమ్ముతో దగ్గరైతలఁపుల్ గోర్కెలు నొక్కటైనపుడు నుద్భవించెడిన్ స్పందనన్గలిమిన్ గోరుట కామవాంఛలును సంస్కారమ్ము క్షీణించు త్రోవలకుం జిక్కని వాఁడు ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
తే.గీ:ఎదను నొక స్త్రీకి స్థానమ్ము నిచ్చి నంతచిరు తగవు లేవొ కొన్ని వచ్చినను కానియామె మరచి, యన్యలు నచ్చి,నంతట నతి వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”(ఒక స్త్రీని ప్రేమిస్తే చిన్న తగవులు వచ్చినా సద్దుకు పోవాలి కానీ ఆ వెంటనే ఎవరో నచ్చితే వాళ్ల వెంట పడే వాడు ప్రేమికుడు కాదు.)
మ:లలనన్ డెందము నందు నిల్పి, తన యిల్లా లంచు ఘోషించియున్ కలహ మ్మొకటి వచ్చినంత వడిగా ఖండించి యా బంధమున్ ,వల వేయంగనె యన్య కాంత యదియే స్వర్గమ్ముగా నెంచి యావలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”
ధృతరాష్ట్రునితో విదురుడు సత్పురుషుని లక్షణాలు ఈవిధంగా వివరిస్తున్నాడు (1)సీ.శమదమస్తపశౌచ శాంతుండుధీరుండుధర్మమందునిలుచు దార్శనికుడుపరులహితముగోరు పరమభక్తిపరుడుసత్వగుణములున్న సజ్జనుండుద్రవ్యలోభమునొంది దారిదప్పడెపుడుకోరడుపరరాజ్య ,కోటలనధి ప! *వలకుం జిక్కనివాఁడె* *ప్రేమికుఁడుగా వర్ధిల్లు* *నెల్లప్పుడున్* , ధరణినగీ.మాయసేవింపకుండునామానధనుడుపాత్రతెరిగిదానమొనరించుపండితుండుశబ్ధజాలమునకులొంగజాలడెపుడు *వలకుజిక్కనివాడెయౌవలపుకాడు*(2)విలువల్గల్గినసజ్జనుండు సదసద్విజ్ఞుండు,ధీరుండు,నిర్మలుడున్,,వైదికధర్మనిష్ఠుడును సన్మార్గుండు సచ్ఛీలుడున్కలలోనైననుమోహమొందడెపుడున్ కర్మిష్ఠుడై బంధమౌ *వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్!*
కలి యుగమ్మునఁ గనరారు వలపుకాండ్రె యెంచి తనకు జోడి యని ప్రేమించి నట్టి యింతికిం దక్క తాను వరించని యతివలకుఁ జిక్కని వాఁడె యౌ వలపుకాఁడు తలఁపన్ వేఱగుఁ బ్రేమ మోహములు తథ్యం బెన్న గాఢమ్ముగాఁ గలకంఠిం గని యొక్క చేడియ నెదం గాంక్షింపఁ బెండ్లాడఁగా జలజాక్షుల్ తమి వైతురే వలల నీషన్మాత్ర మెన్నండు నే వలకుం జిక్కని వాఁడె ప్రేమి యని తా వర్ధిల్లు నెల్లప్పుడున్ [ప్రేమికుఁడు గ్రామ్యము; ప్రేమి సాధువు]
కలిమిన్ జూసియు తిన్నగా యువతులున్ గాక్షించి యాడబ్బులన్జెలిమిన్ జేతురు మెల్లగా యతనిపైచేతోముదంబొప్పగావలుపుల్ జల్లుదు రట్టివారలెపుడున్వంచింత్రు , వా రల్లెయేవలకుంజిక్కనివాడె ప్రేమికుడుగావర్ధిల్లు నెల్లప్పుడున్"
తేటగీతిఆలినగుదుననెడి వారినర్జునుండుగూడె యంకిత భావము గూరిమి గనిమోహమున నూర్వశి చెలఁగి పొందుఁగోరవలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు! మత్తేభవిక్రీడితము అలివేణిీలన యర్జునున్ వలచ తానందెన్ గదా పెక్కురిన్లలనారత్నములాదరమ్ముగనుచున్ రంజిల్లిరే భార్యలైవెలయాండ్రన్ దగ బోలి నూర్వశియె మోవిన్ బంచు పొందెంచగన్వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్!
కలతల్ లేని కుటుంబజీవితము సౌఖ్యమ్మైన మార్గమ్ము, గా దిలి ప్రేమమ్మున నిచ్చు చుండఁ గడు నుద్రేకించుచున్, వేఱు పైదలి ప్రేరేపణ బొంది కల్మష మతిన్ దారన్ విడంబించి యా వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పెండ్లి యైనదనుచును చెప్పినను గానిగాలమున్ వేసి యువకుల కాసు కొఱకువగలు పోవుచు నటియించు వనిత విసురువలకుఁ జిక్కని వాడెయౌ వలపు కాడు.
స్వార్థ చింతనతోడను వలపు చూపదాని నరసి మనంబున తగిన రీతిస్పందనమ్మును తెలుపక చాన విసురు*వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”*[
గుణవతియైన కన్నియ గుర్తు తెలసి
రిప్లయితొలగించండిపెండ్లి యాడియు యిర్వురు పేర్మతోడ
కలిసి మెలిసియుందురు వరకట్నమన్న
వలకు జిక్కని వాడెపో వలపుకాడు
అతివల కలవాటగు రీతి , యామెపయిన
రిప్లయితొలగించండితగులు జూపించుటందున దనగురించి
చామ పక్కింటి వారితో సలుపు సొవసొ
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
కులుకుల్ సూపి విశేష వేదికలలోఁ గూర్మిన్ బిసాళించి, రా
రిప్లయితొలగించండిచిలకన్ బోలెడి తీయనైన పలుకుల్ చిందించి, గుప్పించినన్
వలపున్; లొంగక యాలిపై నెనరుతో వాంఛల్ నిరోధించి యా
*“వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”*
- విట్టుబాబు
రిప్లయితొలగించండితల్లి దండ్రుల విడనాడి ధవుడె తనకు
సర్వ మనుచును తలచెడి సాధ్వి నెపుడు
గౌర వించుచు నీచులౌ ఖలు వెలచెలు
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు.
నెలగన్ బొందగ నెంచి వారవనితల్ నెయ్యంపు పేశస్సు తో
కులుకుల్ జూపుచు కోడె కారులను సంకోచింప కన్ బిల్వ గా
దిలినిన్ వంచన జేయ బోననుచు చిత్తేశుండు మేల్దాపరుల్
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్.
ఎడదలో ప్రేమ భావనలొడిసిపట్టి
రిప్లయితొలగించండిచెలియ తలపులే మనసున చెలగు చుండ
వార కాంతలకున్ గోరి వచ్చిన యతి
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
విలువైనట్టిది ప్రేమభావననుచున్ విస్పష్టమౌ రీతినిన్
జెలికే మానసమంకితంబు నిడుచున్ జీవించు కుండీరుడై
కలలోనైనను బ్రేయసిన్ విడిచి తత్కాలంబునన్ సాని సే
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
"జెన్ సారు" బోర్డు వారెక్కడ వెంఠనే అడ్మిన్ శ్రీ కంది వారిని బ్లాగ్ ప్రాంగణమునకు రమ్మనండి :)
రిప్లయితొలగించండిఅలకలకొలికి ఆలింగనా చతురపు
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు?
గునిచి ముద్దుల తేలిచి కోర్చి కేలు
కంఠ సీమని పెదవుల కచ్చుకొనెడు
వాడె పో వన్నె కాడు వివరములరయ
గొప్ప ధన వంతు నిన్ గాంచి కోర్కె తోడ
రిప్లయితొలగించండిమోస మొనరింప బూనె ను మోస గ త్తె
తెలివి గల వాని గా తాను తెలిసి మాయ
వలకు జిక్కని వాడె య వ్ వలపు గాడు
మత్తేభము:
రిప్లయితొలగించండివలరాజా నెలరాజు తోడు వినునా ప్రాణంబె నీవంచు దా
వలపుం జూపుచు వన్నెచిన్నెలను పొల్పారన్ ప్రదర్శించుచున్
వలవేయున్ ప్రియురాలినంచు గడు పుంభావమ్ముగా బల్కునా
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
తేటగీతి:
రిప్లయితొలగించండిమేనిలో నొంపుసొంపులు మించి చూపి
భాగ్యముల కొల్లగొట్టెడు భామలయెడ
నప్రమత్తతతో నుండి యతివ వలపు
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు
మ॥ వలపుల్ మానసమందుఁ బుట్టు గద సావాసమ్ముతో దగ్గరై
రిప్లయితొలగించండితలఁపుల్ గోర్కెలు నొక్కటైనపుడు నుద్భవించెడిన్ స్పందనన్
గలిమిన్ గోరుట కామవాంఛలును సంస్కారమ్ము క్షీణించు త్రో
వలకుం జిక్కని వాఁడు ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
తే.గీ:ఎదను నొక స్త్రీకి స్థానమ్ము నిచ్చి నంత
రిప్లయితొలగించండిచిరు తగవు లేవొ కొన్ని వచ్చినను కాని
యామె మరచి, యన్యలు నచ్చి,నంతట నతి
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”
(ఒక స్త్రీని ప్రేమిస్తే చిన్న తగవులు వచ్చినా సద్దుకు పోవాలి కానీ ఆ వెంటనే ఎవరో నచ్చితే వాళ్ల వెంట పడే వాడు ప్రేమికుడు కాదు.)
మ:లలనన్ డెందము నందు నిల్పి, తన యిల్లా లంచు ఘోషించియున్
రిప్లయితొలగించండికలహ మ్మొకటి వచ్చినంత వడిగా ఖండించి యా బంధమున్ ,
వల వేయంగనె యన్య కాంత యదియే స్వర్గమ్ముగా నెంచి యా
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్”
ధృతరాష్ట్రునితో విదురుడు సత్పురుషుని లక్షణాలు
రిప్లయితొలగించండిఈవిధంగా వివరిస్తున్నాడు
(1)
సీ.
శమదమస్తపశౌచ శాంతుండుధీరుండు
ధర్మమందునిలుచు దార్శనికుడు
పరులహితముగోరు పరమభక్తిపరుడు
సత్వగుణములున్న సజ్జనుండు
ద్రవ్యలోభమునొంది దారిదప్పడెపుడు
కోరడుపరరాజ్య ,కోటలనధి
ప! *వలకుం జిక్కనివాఁడె* *ప్రేమికుఁడుగా వర్ధిల్లు* *నెల్లప్పుడున్* , ధరణిన
గీ.
మాయసేవింపకుండునామానధనుడు
పాత్రతెరిగిదానమొనరించుపండితుండు
శబ్ధజాలమునకులొంగజాలడెపుడు
*వలకుజిక్కనివాడెయౌవలపుకాడు*
(2)
విలువల్గల్గినసజ్జనుండు సదసద్విజ్ఞుండు,ధీరుండు,ని
ర్మలుడున్,,వైదికధర్మనిష్ఠుడును సన్మార్గుండు సచ్ఛీలుడున్
కలలోనైననుమోహమొందడెపుడున్ కర్మిష్ఠుడై బంధమౌ
*వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్!*
కలి యుగమ్మునఁ గనరారు వలపుకాండ్రె
రిప్లయితొలగించండియెంచి తనకు జోడి యని ప్రేమించి నట్టి
యింతికిం దక్క తాను వరించని యతి
వలకుఁ జిక్కని వాఁడె యౌ వలపుకాఁడు
తలఁపన్ వేఱగుఁ బ్రేమ మోహములు తథ్యం బెన్న గాఢమ్ముగాఁ
గలకంఠిం గని యొక్క చేడియ నెదం గాంక్షింపఁ బెండ్లాడఁగా
జలజాక్షుల్ తమి వైతురే వలల నీషన్మాత్ర మెన్నండు నే
వలకుం జిక్కని వాఁడె ప్రేమి యని తా వర్ధిల్లు నెల్లప్పుడున్
[ప్రేమికుఁడు గ్రామ్యము; ప్రేమి సాధువు]
కలిమిన్ జూసియు తిన్నగా
రిప్లయితొలగించండియువతులున్ గాక్షించి యాడబ్బులన్
జెలిమిన్ జేతురు మెల్లగా యతనిపై
చేతోముదంబొప్పగా
వలుపుల్ జల్లుదు రట్టివారలెపుడున్
వంచింత్రు , వా రల్లెయే
వలకుంజిక్కనివాడె ప్రేమికుడుగా
వర్ధిల్లు నెల్లప్పుడున్"
తేటగీతి
రిప్లయితొలగించండిఆలినగుదుననెడి వారినర్జునుండు
గూడె యంకిత భావము గూరిమి గని
మోహమున నూర్వశి చెలఁగి పొందుఁగోర
వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు!
మత్తేభవిక్రీడితము
అలివేణిీలన యర్జునున్ వలచ తానందెన్ గదా పెక్కురిన్
లలనారత్నములాదరమ్ముగనుచున్ రంజిల్లిరే భార్యలై
వెలయాండ్రన్ దగ బోలి నూర్వశియె మోవిన్ బంచు పొందెంచగన్
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్!
కలతల్ లేని కుటుంబజీవితము సౌఖ్యమ్మైన మార్గమ్ము, గా
రిప్లయితొలగించండిదిలి ప్రేమమ్మున నిచ్చు చుండఁ గడు నుద్రేకించుచున్, వేఱు పై
దలి ప్రేరేపణ బొంది కల్మష మతిన్ దారన్ విడంబించి యా
వలకుం జిక్కనివాఁడె ప్రేమికుఁడుగా వర్ధిల్లు నెల్లప్పుడున్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెండ్లి యైనదనుచును చెప్పినను గాని
గాలమున్ వేసి యువకుల కాసు కొఱకు
వగలు పోవుచు నటియించు వనిత విసురు
వలకుఁ జిక్కని వాడెయౌ వలపు కాడు.
స్వార్థ చింతనతోడను వలపు చూప
రిప్లయితొలగించండిదాని నరసి మనంబున తగిన రీతి
స్పందనమ్మును తెలుపక చాన విసురు
*వలకుఁ జిక్కనివాఁడె యౌ వలపుకాఁడు”*
[